30-3-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్”(లేదా...)“గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:నీమము తప్పకే మిగుల నేరుపు మీరగ వింతవింతగాభీముని పుత్రుడాదటను బింకము వీడుచు పెండ్లి పందిరిన్గోముగ చుట్టి కౌరవుల గొప్పగ చిత్రమునందు కూడి సం గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
__/\__
సం ---- గ్రామమునన్ విరుపు బాగుంది. పద్యం సరళంగా సాగింది.
పామరుఁడు నాటకమ్మున ధీమాగా వేష మందు తేకువ తోడన్ దా మీసము దువ్వుచు నొక గ్రామ ము న ఘటోత్కచుండు గ్రౌర్యము జూపెన్
సామమువెక్కసమాయెనుకామందులదౌష్ట్యమదియుఘనమయ్యెనుగాభూమికిరక్షణలేదేగ్రామమునఘటోత్కచుడుఁగ్రౌర్యముఁజూపెన్
నీమము లిప్పుడు విడచెదయామిని వేళన రిపులకు హానిని చేతున్,మామా !కృష్ణా! యని సంగ్రామమున ఘటోత్కచుండు క్రౌర్యము జూపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వేళను... హాని నొనర్తున్" అనండి.
గ్రామస్థులవాసమ్మో ?భీముని పుత్రుండెవరు గుభిల్లుమనంగాసామాన్యులపై యసురుడు?గ్రామమున; ఘటోత్కచుండు; గ్రౌర్యముఁ జూపెన్!జిలేబి
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
నీమముదప్పియలంబసుడున్ మాయలజూపి పోరడుసమయములనన్భీమునకు తోడుగను సం గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో ప్రాస తప్పింది. "...యలంబసు। డే మాయల... పోరడే సమయమునన్" అందామా?
ధన్యవాదములండీఅట్లే కానిచ్చెదమండీ
ఏమని చెప్పను కర్ణా!భీముని పుత్రుండు జేరి వీరత్వముతో నామృత్యువు వోలెను సంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యము జూపెన్ ఏమని చెప్పగా వలె సుహృత్తువటంచు వచించు చుంటి నాభీముని పుత్రుడంట కడు భుకరరూపము తోడజేరి తాగాములమేటివోలెను జిఘత్సత గొన్న మృగేంద్రు నట్లు సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యము జూపె దయాహీనుడై.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
సమస్య : గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యము జూపె దయావిహీనుడై ( భీముని పుత్రుని పేరు పెట్టుకొని దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ఉండవలసిన గ్రామాధికారి ప్రవర్తన )ఉత్పలమాల ....................నీమముతోడ నెల్లరును నిత్యము నీతిగ మెల్గుచుందురే !సేమము గోరి యొండొరులు జెన్నుగ జుట్టము లట్టులుందురే !భీమకుమారు నామమును బేరిమి దాల్చియు ధూర్తవర్తనన్ గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యము జూపె దయావిహీనుడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
భీముని కిరాత తనయుడుభాముని పుత్రుని శరమును భగ్నముజేయన్సామీరిని మించుచు సంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యము జూపెన్భాముని పుత్రుడు =కర్ణుడు శరము = శక్త్యాయుధము
కామము కన్నుగప్ప కను గానక కౌరవ జ్యేష్ఠుడున్మహాక్రామపు కార్యమున్ నెరప కయ్యము తథ్యము గాగ జ్ఞాతులాస్తోమమునన్ బలంబుకయి దోడ్తొ హిడింబిక సూను బిల్వ సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడైక్రామము = నీచము
అందరికీ నమస్సులు🙏నీమము దప్పగన్ బుధులు, నిగ్రహ మోపక పాండునందనుల్క్షేమము నెంచినన్ సుతుని చేవను చూపగ నిర్ణయించగన్భీముని పుత్రుడౌ నసుర భీకర వర్తన తోడ ఘోర సం*గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్య ము జూపె దయావిహీనుడై**వాణిశ్రీ నైనాల*
ఉదయపు సూర్యుని వేడియొసొద గ్రామమునన్! ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై ఆకదనంబందు దునిమాడె కౌరవుల వెసన్!జిలేబి
క్రొవ్విడి వెంకట రాజారావు: సోమునివలె శౌర్యముతో సోమించుచు కౌరవులట చుక్కలు కనగన్ భీముని పుత్రుడు కురు సం గ్రామమున ఘటోత్కచుడు గ్రౌర్యము జూపెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు: సోమునితీరు శౌర్యమును జూపుచు కౌరవ మూర్ఖవీరులన్ యామిని నందున న్నడరి నంతము జేయగ బూని రౌద్రుడై భీముని నాత్మసంభవుడు భీతిని గొల్పెడి రూపుతోడ సం గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యము జూపె దయాహీనుడై.
నీమము దప్పి కౌరవులు నీచులు పోరున తాళలేక తేజోమయ మూర్తియైన పురుషోత్తముఁ జెల్లెలి ముద్దుబిడ్డయా సోమునియంశచే వెలుగు శూరుని దుష్కృతిచే వధింప సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
ఉ: క్షామమటంచు బత్తెమును కట్టడిసేయగ నైకమత్యమున్నీమము లొక్కటొక్కటిగ నెంచుచు సమ్మతి గూర్చు చుండగన్సీమ నెఱుంగ జేయునను శీర్షిక తిండికి మెచ్చకుండగన్గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యము జూపె దయా విహీనుడైవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
కె.వి.యస్. లక్ష్మి: భీమర మూపుగ సాగగ నీమము వీడి చనెడి కురునేతల పైనన్ భీముని వారసుడా సం గ్రామమున ఘటోత్కచుడు గ్రౌర్యము జూపెన్.
ఆమిగ కురుపాండవ సంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్యామిని సమయమునందునగాములఱేని సుతుని శరఘాతము జంపెన్
నీమము దప్పి సుభద్రజు నా మలినాత్ములు వధింప నరిసేనను నాభీమబలుడెదిర్చగ సంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
నామము ఘటోత్కచుండటనీమము దప్పిన విడువడు నిర్లిప్తముగాక్షేమమరసిసత్పురుషులగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
క్షేమముగోరి పాండవుల, కీడొనరించిన ధార్తరాష్ట్రులన్భీమసుతుండుదా చెలఁగె భీకర కౌరవ సంగరంబునన్ధీమసమొప్ప శత్రువులు దిక్కులు బారగ ఘోరమైన సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
భీముని యన్నదమ్ములును భీష్ముని పౌత్రుల తోడు నీడగన్రాముని బంటు నీడనను రాగము తోడను పోరు సల్పె సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు :; గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడైభీమునియన్న కర్ణుడును భీకర శక్తిని వైచి చంపెనే...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ధన్యవాదములండీ
శ్రీ గురుభ్యోనమఃభీమకుమారు డంత నరి వీరభయంకర పోరు సల్పి యాజామున మేటి కౌరవుల స్థైర్యము గూల్చి ప్రచండమైన సౌదామిని వోలె భీకరుడు తానట నిల్చి పరాక్రమించి సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
కందంలేమ కవమానమున్ వినిభీమ సుతుఁడు రుద్రతేజ విక్రముఁడుగ నయ్యామిని వైరులపై సంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్ఉత్పలమాలలేమకు వల్వలూడ్చి సభఁ బ్రేల మదంబున ధార్తరాష్టులున్భీముని పుత్రుఁడై మిగుల వేదన జెంది నిషీధివేళలోసేమముఁ గూర్చఁ దండ్రులకుఁ జిద్దున వైరుల గూల్చు ఘోర సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సోమము జూప మహా సంగ్రామమున ఘటోత్కచుండు, గ్రౌర్యముఁ జూపెన్తామసి దుర్యోధనుడికనేమించెను గర్ణుఁ శక్తి నించుమటంచున్
భీమునిసూనుడాయెడనుభీకరుడయ్యెనుశత్రుచెంగటన్కామునితండ్రికేదెలియుఖండితరీతిహిడింబిశోకమున్కామననింద్రజాలికుడుకర్ణునిఢీయనఘోరమైనసంగ్రామమునన్ఘటోత్కచుడుఁగ్రౌర్యముఁజూపెదయావిహీనుడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'శత్రు చెంగటన్' దుష్టసమాసం. "వైరి చెంగటన్' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గ్రామ జనులు బెగడఁగ నవిరామము దూషించుచు సమరపు భంగి నటన్ నీమమ్ములఁ బాటింపక గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్ [ఘట + ఉత్కచుఁడు = ఘటోత్కచుఁడు: తలయందు జుట్టులేని వాఁడు(బోడి గుండు వాఁడు); ఘటము = తల; ఉత్కచము = కేశ హీనము] సామము చెల్ల కున్న నిఁక సంయుగమే గతి జ్ఞాతి దుర్జనగ్రామము ధార్త రాష్ట్ర జన కాయము భీతినిఁ దల్లడిల్లఁగన్ భీమ పరాక్రమ ప్రవర భీమ సుతుం డట శత్రు రాజ సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
~~~~~~~~~~~~~~~~~భీమ పరాక్రవంతుడును భీకర రూపుడు ధైర్యశాలియున్భీముని నందనుండు నతి భీకర కాయుడు పాలివారి సంగ్రామమునను గటోత్కచుడు క్రౌర్యము జూపె, దయా విహీనుడైయేమరు పాటులేక వధియించెన నేకుల బంధు మిత్రులన్.~~~~~~~~~~~~~~~~~~
భీముని తోబాటుగసంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముజూపెన్సామీరినిమించువిధమునీమముతోజేసెరణము నిర్జరులలరన్
భీముని సూనుడున్ మిగుల భీకర రూపము దాల్చిదానుసంగ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యముజూపె దయావిహీనుడైసామముజేయ నొప్పుకొన సైనీకులెవ్వరు నిచ్చగింపనౌభీమరమయ్యెగా నచట భీకరమైన వీధంబుగారవీ!
సోమము జూపి తండ్రులట చూచుచు నుండగ కామరూపియైభీమ బలమ్మునన్ బెనగి భీకర మౌగతి నుద్యమించుచున్తామసులైన కౌరవుల దర్పము ఖర్వము చేయనెంచి సంగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మిత్రులందఱకు నమస్సులు!(కురుపాండవ సంగ్రామమున ఘటోత్కవుఁడు పరాక్రమించిన సందర్భము)భీముని యానచేఁ జెలఁగి, భీకర జన్యమునందు నందఱంబాములఁ ద్రోయనెంచి, తన ప్రజ్ఞయు, దిష్ణ్యము, శాంబరిం దగన్మోమునఁ జూపుచు న్మిగులఁ బోటరియై, యటనున్న శాత్రవగ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁజూపె దయావిహీనుఁడై!
సందర్భములో టైపాటును... "ఘటోత్కచుఁడు" అని పఠించఁగలరు.
భీముని కోరికమేరకుధీమతియై కౌరవులను తెగటార్చుటకైభూమిని గగనములో సంగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యము చూపెన్.
మఱొక పూరణము:వేమఱు గాంధి పల్కె నిటు... "వేడ్క స్వరాజ్యమదేడ రావలెన్?"భీమునకున్ హిడింబికినిఁ బృథ్విని నెవ్వఁడు పుట్టెనో గదా?కామముతోడఁ గీచకుడు గ్రక్కున మాలిని కేమి చూపెనో?గ్రామమునన్, ఘటోత్కచుడు, క్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
నీమము తప్పకే మిగుల నేరుపు మీరగ వింతవింతగా
భీముని పుత్రుడాదటను బింకము వీడుచు పెండ్లి పందిరిన్
గోముగ చుట్టి కౌరవుల గొప్పగ చిత్రమునందు కూడి సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి__/\__
తొలగించండిసం ---- గ్రామమునన్
తొలగించండివిరుపు బాగుంది. పద్యం సరళంగా సాగింది.
పామరుఁడు నాటకమ్మున
రిప్లయితొలగించండిధీమాగా వేష మందు తేకువ తోడన్
దా మీసము దువ్వుచు నొక
గ్రామ ము న ఘటోత్కచుండు గ్రౌర్యము జూపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసామమువెక్కసమాయెను
రిప్లయితొలగించండికామందులదౌష్ట్యమదియుఘనమయ్యెనుగా
భూమికిరక్షణలేదే
గ్రామమునఘటోత్కచుడుఁగ్రౌర్యముఁజూపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీమము లిప్పుడు విడచెద
రిప్లయితొలగించండియామిని వేళన రిపులకు హానిని చేతున్,
మామా !కృష్ణా! యని సం
గ్రామమున ఘటోత్కచుండు క్రౌర్యము జూపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వేళను... హాని నొనర్తున్" అనండి.
రిప్లయితొలగించండిగ్రామస్థులవాసమ్మో ?
భీముని పుత్రుండెవరు గుభిల్లుమనంగా
సామాన్యులపై యసురుడు?
గ్రామమున; ఘటోత్కచుండు; గ్రౌర్యముఁ జూపెన్!
జిలేబి
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీమముదప్పియలంబసు
రిప్లయితొలగించండిడున్
మాయలజూపి పోరడుసమయములనన్
భీమునకు తోడుగను సం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో ప్రాస తప్పింది. "...యలంబసు। డే మాయల... పోరడే సమయమునన్" అందామా?
ధన్యవాదములండీ
తొలగించండిఅట్లే కానిచ్చెదమండీ
ఏమని చెప్పను కర్ణా!
రిప్లయితొలగించండిభీముని పుత్రుండు జేరి వీరత్వముతో
నామృత్యువు వోలెను సం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యము జూపెన్
ఏమని చెప్పగా వలె సుహృత్తువటంచు వచించు చుంటి నా
భీముని పుత్రుడంట కడు భుకరరూపము తోడజేరి తా
గాములమేటివోలెను జిఘత్సత గొన్న మృగేంద్రు నట్లు సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యము జూపె దయాహీనుడై.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిగ్రామమునన్ ఘటోత్కచుడు
గ్రౌర్యము జూపె దయావిహీనుడై
( భీముని పుత్రుని పేరు పెట్టుకొని దుష్టులను శిక్షిస్తూ
శిష్టులను రక్షిస్తూ ఉండవలసిన గ్రామాధికారి ప్రవర్తన )
ఉత్పలమాల
....................
నీమముతోడ నెల్లరును
నిత్యము నీతిగ మెల్గుచుందురే !
సేమము గోరి యొండొరులు
జెన్నుగ జుట్టము లట్టులుందురే !
భీమకుమారు నామమును
బేరిమి దాల్చియు ధూర్తవర్తనన్
గ్రామమునన్ ఘటోత్కచుడు
గ్రౌర్యము జూపె దయావిహీనుడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభీముని కిరాత తనయుడు
రిప్లయితొలగించండిభాముని పుత్రుని శరమును భగ్నముజేయన్
సామీరిని మించుచు సం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యము జూపెన్
భాముని పుత్రుడు =కర్ణుడు
శరము = శక్త్యాయుధము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికామము కన్నుగప్ప కను గానక కౌరవ జ్యేష్ఠుడున్మహా
రిప్లయితొలగించండిక్రామపు కార్యమున్ నెరప కయ్యము తథ్యము గాగ జ్ఞాతులా
స్తోమమునన్ బలంబుకయి దోడ్తొ హిడింబిక సూను బిల్వ సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
క్రామము = నీచము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండినీమము దప్పగన్ బుధులు, నిగ్రహ మోపక పాండునందనుల్
క్షేమము నెంచినన్ సుతుని చేవను చూపగ నిర్ణయించగన్
భీముని పుత్రుడౌ నసుర భీకర వర్తన తోడ ఘోర సం
*గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్య ము జూపె దయావిహీనుడై*
*వాణిశ్రీ నైనాల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఉదయపు సూర్యుని వేడియొ
సొద గ్రామమునన్! ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూ
పె దయావిహీనుఁడై ఆ
కదనంబందు దునిమాడె కౌరవుల వెసన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసోమునివలె శౌర్యముతో
సోమించుచు కౌరవులట చుక్కలు కనగన్
భీముని పుత్రుడు కురు సం
గ్రామమున ఘటోత్కచుడు గ్రౌర్యము జూపెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసోమునితీరు శౌర్యమును జూపుచు కౌరవ మూర్ఖవీరులన్
యామిని నందున న్నడరి నంతము జేయగ బూని రౌద్రుడై
భీముని నాత్మసంభవుడు భీతిని గొల్పెడి రూపుతోడ సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యము జూపె దయాహీనుడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీమము దప్పి కౌరవులు నీచులు పోరున తాళలేక తే
రిప్లయితొలగించండిజోమయ మూర్తియైన పురుషోత్తముఁ జెల్లెలి ముద్దుబిడ్డయా
సోమునియంశచే వెలుగు శూరుని దుష్కృతిచే వధింప సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిక్షామమటంచు బత్తెమును కట్టడిసేయగ నైకమత్యమున్
నీమము లొక్కటొక్కటిగ నెంచుచు సమ్మతి గూర్చు చుండగన్
సీమ నెఱుంగ జేయునను శీర్షిక తిండికి మెచ్చకుండగన్
గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యము జూపె దయా విహీనుడై
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిభీమర మూపుగ సాగగ
నీమము వీడి చనెడి కురునేతల పైనన్
భీముని వారసుడా సం
గ్రామమున ఘటోత్కచుడు గ్రౌర్యము జూపెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆమిగ కురుపాండవ సం
రిప్లయితొలగించండిగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
యామిని సమయమునందున
గాములఱేని సుతుని శరఘాతము జంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీమము దప్పి సుభద్రజు
రిప్లయితొలగించండినా మలినాత్ములు వధింప నరిసేనను నా
భీమబలుడెదిర్చగ సం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినామము ఘటోత్కచుండట
రిప్లయితొలగించండినీమము దప్పిన విడువడు నిర్లిప్తముగా
క్షేమమరసిసత్పురుషుల
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షేమముగోరి పాండవుల, కీడొనరించిన ధార్తరాష్ట్రులన్
రిప్లయితొలగించండిభీమసుతుండుదా చెలఁగె భీకర కౌరవ సంగరంబునన్
ధీమసమొప్ప శత్రువులు దిక్కులు బారగ ఘోరమైన సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభీముని యన్నదమ్ములును భీష్ముని పౌత్రుల తోడు నీడగన్
రాముని బంటు నీడనను రాగము తోడను పోరు సల్పె సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు :; గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
భీమునియన్న కర్ణుడును భీకర శక్తిని వైచి చంపెనే
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిశ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండిభీమకుమారు డంత నరి వీరభయంకర పోరు సల్పి యా
జామున మేటి కౌరవుల స్థైర్యము గూల్చి ప్రచండమైన సౌ
దామిని వోలె భీకరుడు తానట నిల్చి పరాక్రమించి సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిలేమ కవమానమున్ విని
భీమ సుతుఁడు రుద్రతేజ విక్రముఁడుగ న
య్యామిని వైరులపై సం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
ఉత్పలమాల
లేమకు వల్వలూడ్చి సభఁ బ్రేల మదంబున ధార్తరాష్టులున్
భీముని పుత్రుఁడై మిగుల వేదన జెంది నిషీధివేళలో
సేమముఁ గూర్చఁ దండ్రులకుఁ జిద్దున వైరుల గూల్చు ఘోర సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిసోమము జూప మహా సం
రిప్లయితొలగించండిగ్రామమున ఘటోత్కచుండు, గ్రౌర్యముఁ జూపెన్
తామసి దుర్యోధనుడిక
నేమించెను గర్ణుఁ శక్తి నించుమటంచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభీమునిసూనుడాయెడనుభీకరుడయ్యెనుశత్రుచెంగటన్
రిప్లయితొలగించండికామునితండ్రికేదెలియుఖండితరీతిహిడింబిశోకమున్
కామననింద్రజాలికుడుకర్ణునిఢీయనఘోరమైనసం
గ్రామమునన్ఘటోత్కచుడుఁగ్రౌర్యముఁజూపెదయావిహీనుడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శత్రు చెంగటన్' దుష్టసమాసం. "వైరి చెంగటన్' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగ్రామ జనులు బెగడఁగ నవి
రిప్లయితొలగించండిరామము దూషించుచు సమరపు భంగి నటన్
నీమమ్ములఁ బాటింపక
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్
[ఘట + ఉత్కచుఁడు = ఘటోత్కచుఁడు: తలయందు జుట్టులేని వాఁడు(బోడి గుండు వాఁడు); ఘటము = తల; ఉత్కచము = కేశ హీనము]
సామము చెల్ల కున్న నిఁక సంయుగమే గతి జ్ఞాతి దుర్జన
గ్రామము ధార్త రాష్ట్ర జన కాయము భీతినిఁ దల్లడిల్లఁగన్
భీమ పరాక్రమ ప్రవర భీమ సుతుం డట శత్రు రాజ సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండి~~~~~~~~~~~~~~~~~
భీమ పరాక్రవంతుడును భీక
ర రూపుడు ధైర్యశాలియున్
భీముని నందనుండు నతి భీ
కర కాయుడు పాలివారి సం
గ్రామమునను గటోత్కచుడు క్రౌ
ర్యము జూపె, దయా విహీనుడై
యేమరు పాటులేక వధియించె
న నేకుల బంధు మిత్రులన్.
~~~~~~~~~~~~~~~~~~
భీముని తోబాటుగసం
రిప్లయితొలగించండిగ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముజూపెన్
సామీరినిమించువిధము
నీమముతోజేసెరణము నిర్జరులలరన్
భీముని సూనుడున్ మిగుల భీకర రూపము దాల్చిదానుసం
రిప్లయితొలగించండిగ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యముజూపె దయావిహీనుడై
సామముజేయ నొప్పుకొన సైనీకులెవ్వరు నిచ్చగింపనౌ
భీమరమయ్యెగా నచట భీకరమైన వీధంబుగారవీ!
సోమము జూపి తండ్రులట చూచుచు నుండగ కామరూపియై
రిప్లయితొలగించండిభీమ బలమ్మునన్ బెనగి భీకర మౌగతి నుద్యమించుచున్
తామసులైన కౌరవుల దర్పము ఖర్వము చేయనెంచి సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(కురుపాండవ సంగ్రామమున ఘటోత్కవుఁడు పరాక్రమించిన సందర్భము)
భీముని యానచేఁ జెలఁగి, భీకర జన్యమునందు నందఱం
బాములఁ ద్రోయనెంచి, తన ప్రజ్ఞయు, దిష్ణ్యము, శాంబరిం దగన్
మోమునఁ జూపుచు న్మిగులఁ బోటరియై, యటనున్న శాత్రవ
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁజూపె దయావిహీనుఁడై!
సందర్భములో టైపాటును... "ఘటోత్కచుఁడు" అని పఠించఁగలరు.
తొలగించండిభీముని కోరికమేరకు
రిప్లయితొలగించండిధీమతియై కౌరవులను తెగటార్చుటకై
భూమిని గగనములో సం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యము చూపెన్.
మఱొక పూరణము:
రిప్లయితొలగించండివేమఱు గాంధి పల్కె నిటు... "వేడ్క స్వరాజ్యమదేడ రావలెన్?"
భీమునకున్ హిడింబికినిఁ బృథ్విని నెవ్వఁడు పుట్టెనో గదా?
కామముతోడఁ గీచకుడు గ్రక్కున మాలిని కేమి చూపెనో?
గ్రామమునన్, ఘటోత్కచుడు, క్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై!