16, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3665

17-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంచవటిలో వసించిరి పాండుసుతులు”
(లేదా...)
“లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్”

52 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మేకుల బోలు ముక్కులను మేయుచు నక్షయపాత్రలన్నమున్
    పీకుచు దోసె ముక్కలను ప్రీతిని చేరుచు చెట్లమీదనున్
    కాకులు రచ్చజేయగను కానన మందున నాటకమ్మునన్
    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్

    రిప్లయితొలగించండి
  2. రాముడున్ సీత తో‌గూడి రమ్య‌ మైన

    పంచవటిలో వసించిరి, పాండు‌ సుతులు

    తల్లి కుంతితో కూడి సంతసముగ నివ

    సించె నేకచక్ర పురిలో చెలిమి‌ బడసి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నివసించి రేకచక్రపురిలో...' అనండి.

      తొలగించండి
  3. మాతకుంతికియిచ్చినమాటనరసి
    తగవులేకనుధర్మంపుతరుణినీడ
    మనసుపండంగమరియాదమరులువిరియ
    పంచవటిలోవసించిరిపాండుసుతులు

    రిప్లయితొలగించండి
  4. తండ్రి మాట కొరకు కాననుండిరయ్య

    లక్ష్మణాగ్రజుండును సీత లక్షణముగ

    పంచవటిలో ; వసించిరి పాండుసుతులు

    మత్స్య నగరున పందెపు మాట మేర

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'కాననుండ్రి గాదె/సుమ్ము' అనండి.

      తొలగించండి
  5. వాకిటసూర్యుడుండుగదవాసిగచంద్రునివంతువచ్చుగా
    తాకగమేనినంతటినిదాపుననుండునుపంచభూతముల్
    ఆకలిఁదీర్పగాఫలములారునుదక్కునుదేవభూమిలో
    లోకులుమెచ్చపంచవటిలోనవసించిరిపాండునందనుల్

    రిప్లయితొలగించండి
  6. సాకులు భిన్నమైన నిల సత్యము ధర్మము నాదరించగా,
    తేకువ జూపుచున్ మునుల దీక్షనుసాగిరి రామలక్ష్మణుల్
    లోకులు మెచ్చ పంచవటిలోన ;వసించిరి పాండునందనుల్
    కాకులు దూరలేనివగు కానలలోనను కష్టమెంచకన్

    రిప్లయితొలగించండి
  7. క్రమాలంకారం లో ----
    వాస మెచట రాముని కయ్యె వనము నందు?
    జూదము న నోడి యెవ్వరు శోభ తరిగి
    బాధ లందిరి వనమున వసుధ యందు?
    పంచ వటి లో వసించిరి : పాండు సుతులు

    రిప్లయితొలగించండి
  8. నియమనిష్టలరాముడునిలన తనకు

    సీతతోడుగనివసించిచిక్కునపడె

    పంచవటిలో, వసించిరి పాండుసుతులు

    మత్శ్యదేశమునఙ్ఞాతమై,విధివిప

    రీతముగ,తెలియుటనెవరితరమగును?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిష్ఠల శ్రీరాము డిలను.. మత్స్యభూమి నజ్ఞాతమై..' అనండి.

      తొలగించండి
  9. పాండవులు వనవాస సమయం లో సరస్వతీ నదీ తీరాన , పంచవటి ని వోలు ప్రదేశంలో ఉన్నారని తెలిసి లోకులు / కృష్ణుడు మెచ్చారనే భావన ఆధారంగా నా ప్రయత్నము :

    ఉ:

    భీకర మైన కాననము వెన్నెల కారు ఝరీ సరస్వతీ
    సైకత మెంచి తామరల సౌరభ మంతయు గ్రోలు చుండగన్
    పీకల దాక మెక్కుచును పేరిమి సిద్ధుల పెంపు గోరుచున్
    లోకులు మెచ్చ పంచవటి లోన వసించిరి పాండు నందనుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. రామగాథలో గనదగు రమ్యరీతి
    భారతకథలో వినిపించు భావదీప్తి
    చెవులబడినను మందుడు జెప్పెనిటుల
    పంచవటిలో వసించిరి పాండుసుతులు

    రిప్లయితొలగించండి
  11. సమస్య :
    లోకులు మెచ్చ బంచవటి
    లోన వసించిరి పాండునందనుల్

    ( అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు - అజ్ఞాతవాసంలో ద్రౌపదీధర్మజభీమార్జుననకులసహదేవులు )

    ఉత్పలమాల
    ....................

    శ్రీకమనీయమూర్తి యగు
    సీతమ , లక్ష్మణు లిర్వురుండగా
    నా కమలాయతాక్షుడగు
    నచ్యుతరూపుడు రాముడుండెలే
    లోకులు మెచ్చ బంచవటి
    లోన ; వసించిరి పాండునందనుల్
    దేకువ ద్రౌపదిన్ గొనుచు
    దిన్నగ మత్స్యపురంబునందునన్ .

    ( తేకువ- సాహసము ; మత్స్యపురము - విరాటనగరము )

    రిప్లయితొలగించండి
  12. శ్రీకరమై యరణ్య మిట క్షేమము గూర్చును భారతంబునన్
    జేకొని దీక్ష నాయెడల సీతయు, రాముడు, లక్ష్మణుండు నీ
    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్
    ప్రాకటమైనరీతి వనవాసము చేసిరి సంతసమ్మునన్.

    రిప్లయితొలగించండి
  13. ( పంచవటి ప్రాశస్త్యము )


    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందను

    ల్వేకువ జామునస్మరణ వీడక కొల్చెడు, రామ చంద్రుడు

    న్శోకుల ముక్కు చెవ్వులను శూర్ఫణకిచ్చటె కోలు పోయెనే

    న్నాకపు లోక వైరియట నాతిని సీతను పట్టె మోసమున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జామునన్ స్మరణ...చంద్రుడున్ సోకుల ముక్కు కర్ణముల (చెవ్వుల అనడం సాధువు కాదు)..పోయెనే నాకపు..' అనండి.

      తొలగించండి


  14. దాశరథియు మా సీతమ్మ తల్లి యకట
    పంచవటిలో వసించిరి; పాండుసుతులు
    కష్ట పడిరకట జిలేబి కాననమున !
    తాత తలరాత యెవరికిన్ తప్పదాయె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. ధవుని యాజ్ఞను తలదాల్చ తరలివెళ్ళి
    రామ లక్ష్మణ సీతలరణ్య మందు
    పంచవటిలో వసించిరి ; పాండుసుతులు
    జూదమున శిక్షగ వనము జొచ్చిరిగద

    రిప్లయితొలగించండి


  16. అరె! సీతారాములు దే
    వర! లోకులు మెచ్చఁ బంచవటిలోన వసిం
    చిరి, పాండునందనుల్ దా
    చిరి తలలను కాననమున చింతయు తొలగన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    కాలవశమునఁ గానల పాల వడుచు
    నట నివాస యోగ్యమ్మగు నంకమంద
    నలసి యొకరేయి విశ్రాంతి నలరనెంచి
    పంచవటిలో వసించిరి పాండుసుతులు

    పంచవటి = ఐదు మఱ్ఱిచెట్లుగల ప్రదేశము

    చీకటి గ్రమ్మి జీవితము చిక్కులపాలయి కాననమ్ములన్
    శ్రీకరమైన రామకథఁ జెప్పఁగ మౌనులు నాలకించుచున్
    ప్రాకటమైన రీతి వనవాసము జేయుచు స్వప్నమందునన్
    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్

    రిప్లయితొలగించండి
  18. తే.గీ//
    రామ,లక్ష్మణాదులు,సీత రాజ్యమొదలి
    పంచవటిలో వసించిరి, పాండుసుతులు l
    కౌశలముగ దీక్షవహించి కౌరవులను
    మట్టుబెట్టియు దుఃఖ్ఖించె గుట్టుగాను ll

    రిప్లయితొలగించండి
  19. పంచ తీర్థములందు సద్భక్తి మునిగి
    సంచితంబుల పాప సంక్షయముఁగాగ
    పంచఁజేరిరి విరటు;సౌభాగ్యమనుచు
    పంచవటిలో వసించిరి పాండు సుతులు.

    రిప్లయితొలగించండి
  20. కైకవరానరాఘవుడుకానలకేగెనుసీత‌లక్ష్మణుల్
    భీకరమైనదండకమువెచ్చనిపచ్చనిపర్ణశాలలో
    **లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి;; పాండునందనుల్”*
    దేకువజూదమందుననుదేజముగోల్పడిజేరిరాటవిన్

    రిప్లయితొలగించండి
  21. తరుణి కైకేయి కోరగా దాశరథియె
    జానకీలక్ష్మ ణులతోడ కాన కుజని
    పంచవటిలో వసించిరి, పాండుసుతులు
    పలువిధమ్ముల కష్టముల్ బడసిరైరి .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  22. కైకయె కోరినంతట సుగాత్రుడు రాముడయోధ్యవీడి తా
    నా కనకాంగి సీతయు ప్రియానుజు డైన సుమిత్రనందనుం
    జేకొని దండకాటవిని జేరి యటన్ శిఫ గౌతమీ తటిన్
    లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి, పాండు నందనుల్
    ధూకరు డై సుయోధనుని దుశ్చరితమ్ముల గాంచి రోసిరే . విరించి.

    రిప్లయితొలగించండి
  23. కైకయె కోరినంతట సుగాత్రుడు రాముడయోధ్యవీడి తా
    నా కనకాంగి సీతయు ప్రియానుజు డైన సుమిత్రనందనుల్
    లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి, పాండు నందనుల్
    ధూకరు డై సుయోధనుని దుశ్చరితమ్ముల గాంచి రోసిరే . విరించి.

    రిప్లయితొలగించండి
  24. పాండవులు వట వృక్షమ్ము వంటి వారె
    కదర! యేవురు కలరంచు నదియె పంచ
    వటిగ దలపోయ నది పొరపాటు కాదు
    పంచ వటిలో వసించిరి పాండుసుతులు .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  25. ధర్మ పరిరక్షణార్థము దావమందు
    రామచంద్రుడు జానకి లక్ష్మణుండు
    పంచవటిలో వసించిరి, పాండుసుతులు
    కానలంబడి బొందిరి కష్టములను

    రిప్లయితొలగించండి
  26. రామ లక్ష్మణులును సీత రమ్యమలర
    పంచవటిలో వసించిరి,పాండుసుతులు
    మీదుమిక్కిలి తేజస్సు నొదవి భువిని
    పాలనంబును జేసిరి బాహుబలిని

    రిప్లయితొలగించండి
  27. పంచియల్ గట్టి యెల్లరు నంచితముగ
    నంచె లంచెలుగా సంచరించు చొక్క
    మంచి దినమెంచి కొంచెము మంచు ముంచఁ
    బంచవటిలో వసించిరి పాండుసుతులు


    నా కనిపించె నివ్విధి వనమ్ముల వారలు తిర్గు నప్పుడే
    వీఁకఁ జరించుచుం బుడమి విస్తృత కానన పంక్తి నింపుగా
    నేక దినంబ యా రఘు వరేంద్రునిఁ దల్చుచు సంతసమ్మునన్
    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్

    రిప్లయితొలగించండి
  28. చీకును జింతయున్ వదలి సిగ్గును గల్గగ బల్కుచుంటె?యే
    లోకులు మెచ్చ పంచవటిలోన వసించిరి పాండునందనుల్?
    లోకులు గాకులందురిల లోకులమాటలు గడ్డిపోచలే
    యీకలి పూరుషున్ మహిమ లేయివి వీటిని నమ్మబోకుడీ

    రిప్లయితొలగించండి
  29. లోకమునందు ధర్మమును లోగొని రక్షణ జేయు దీక్షతో
    శ్రీకరుడైన రాముడును సీతయు తమ్ముడు లక్ష్మణుండునున్
    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్
    జేకొని ద్రౌపదిన్ వనముజేరిరి ధర్మనిబద్ధులై భువిన్

    రిప్లయితొలగించండి