10-3-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కల సహింపవలయుఁ గాపురమున”(లేదా...)“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:కులుకుచు భార్య భర్తలహ కూరిమి మీరగ కాపురమ్మునన్నలువురు ముగ్గురన్ దలచి నందము నొందుచు నాపివేయకేచిలుకల బోలుచున్ తనరు చిన్నరి పిల్లల నాటపాట మూ కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
స్నేహబంధమంతచివురించుగ్రుహమందుఆలుమగలమధ్యనలుకలేమిఓకరుభోగిగాగనోకరునుత్యాగియేకలసహింపవలయుకాపురమున
చెవులు హోరులెత్తు చెడ్డమాట పలుకుపలుక రాని మాట పలుకునయ్యతిట్టు కవితలందు గట్టివారలనెన్నికల సహింపవలయుఁగా పురమున...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఇలఁ గన సంఘజీవి నరుఁ డెల్లరతో సహజీవనంబునన్కలతలు లేని తీరున సుఖంబుగ నుండుటె మేలు గాన నెచ్చెలి యగు భార్య పక్షపు విశిష్టుల బంధుల యొక్క రాకపోకలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.
చాలా బాగుందండీ
గురువుగారికిఅభినందనలుమనోహరమైనపూరణండి
క్రొవ్విడి వెంకట రాజారావు: చాకచక్యముగల చక్కని పిల్లలు తనదు బ్రతుకునంత తనియ జేసి మురువు గూర్చు ననెడి ముచ్చటైనట్టిదౌ కల సహింపవలయు కావురమున.
కల గనుమోయి జీవన వికాస తరంగ శ్రుతీ విభావరిన్!కల గనువారె కోరికలగాంచి వరించి విహార మందు, నాకలయె నిజంబొ గాదొ! యొక కల్పనయై నడయాడు నట్టిదో!కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్!
కలికి చూడ పరమ గయ్యాళి యగుచునుతరచు భర్తపైన నరవనేమి యామె తత్వ మెరగి యర్థాంగి వేయు కే కల సహింప వలయు గాపురమున . . . . విరించి.
సమస్య :కలను సహింపగావలయు గాపురమం దభివృద్ధి గోరినన్ ( మగవాని జీవితానికి మహత్తరవరమైన మగువను మణిలా చూచుకొంటూవంకరవంకలు మానుకొంటే సంసారం సారవంతమే కదా !)చంపకమాల ....................అలికులవేణియై, సుమధు రాధరనిర్గతమంజువాణియై,చెలుముల బెంచు బ్రేముడిని చెంతనె వెల్గెడి భూషణంబునై,కలుముల లేములన్ విడని కాంతకు మోదము బంచి, యల్పశం కలను సహింపగావలయు గాపురమం దభివృద్ధి గోరినన్ .
కలగుటసాజమేయగునుకామితముల్నెరవేరకుండినన్విలువలనేర్చెనావిభుఁడువిష్ణుఁడుక్రిష్ణుఁడుసత్యముంగిటన్చలువలపందిరేయగునుచాలగనోర్చినబాధలయ్యెడన్కలనుసహింపగావలయుఁగాపురమందభివ్రుద్ధిఁగోరినన్
భార్య చూడ లేదు, భర్త నడువ లేడు,వినగ లేడు సుతుడు, వెతలు కలవువారి జీవితమున కూరిమి నంగవికల సహింప వలయు కాపు రమున
కల=భాగము
శిలలను తెచ్చి శిల్పముగ చెక్కితి ముద్దుల భార్య బొమ్మయున్సలలితమైన మౌనము ప్రశాంతపు మోమున చిందె వేడుకల్ములకలు వేసె భ్రాంతినను ముద్దుగ నిద్దుర వీడి కాంచనాకలను , సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
జీవితమ్ము నందు చీకు చింతలు వచ్చుఁ బెదరి పోక నిలిచి విజయమంది సాగ దలచి యట్టి జగతి కష్టముల రా కల సహింప వలయు కాపు రమున
కలతలేని కుటుంబము గావలెననగృహిణి సంతోషపడుటయె కిటుకు గానపతికి వలను గాకున్నను పత్నియడుగుకౌతుకల సహింపవలయుఁ గాపురమున
కొత్తగా పెండ్లియైన జంటకు ఆత్మీయుల సలహాలు!😃కలికి! సమాదరించవలె కాంతుడు యాడ వినోదమెంచి పేకలు, పతి! నీవు కూర్చవలె కాంతకు కోరిన పట్టువైనకోకలను, చిరాకునన్ గలుగు కాదను యౌననుచిన్న చిన్న కాకలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్
వలపుల ధర్మపత్నికిని భాగ్యవశమ్మున వత్సరమ్మునే తొలితొలి గర్భమాయెనని తోషమునందగ కాంతుడంతలో పిలుచుకు పోవగా దనదు పెద్దలు కాన్పునకైవియోగ తంకలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్
సవరించిన మొదటి పూరణకొత్తగా పెండ్లియైన జంటకు ఆత్మీయుల సలహాలు!😃కలికి! సమాదరించవలె కాంతుడు వేడుక నెంచి యాడ పేకలు, పతి! నీవు కూర్చవలె కాంతకు కోరిన పట్టువైనకోకలను, చిరాకునన్ దొరలు ఘాటగు మాటలచిన్న చిన్న కాకలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్
అందరికీ నమస్సులు🙏పిలిచిన బల్కుచూ విమల ప్రేమను బంచగ సేవచేసినన్,వలచి వరించెనం దలచి వైభవ మొప్పగ నోర్మిచూపినన్,వెలితిని జూపుచున్ బురుష వీరము నిండిన భర్త పెట్టు వం*“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”**వాణిశ్రీ నైనాల*
క్రొవ్విడి వెంకట రాజారావు: తెలివియు నోర్పు గల్గి సరితీరు కుటుంబము నంతటిన్ సదా కలతలు లేని చందమున కాంతిల జేసెడి ధర్మ మెంచుచున్ పొలుపును గూర్చి గాఢమగు పొంగు నొసంగెడి మేటి పిల్లమూ కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.
పలువురు కూడదంచనిన పంతముతో నెదురించి ప్రేమతో వలచి వివాహమాడిన శుభాంగియె నచ్చని కార్యమున్ గనన్ గలతయె చెంది కోపమున కాంతుని దూరుచు నామె వేయు కేకలను సహింపగా వలయుఁ గాపురమందభివృద్ధి గోరినన్ . . . . విరించి.
విలయము సృష్టి జేయగలవీరులు వేషము లెన్నియో యిటన్యెలమిన వేయుచుందురల యీతరమందున తోషమందుచున్ సదాప్రళయము నేల గోరుదురు బ్రాతల మధ్యన తెల్యరాని మూకలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చం:పలుచన చేయరాదు కడుపారగ బెంచిన తల్లిదండ్రులన్కలతలు లేపి, భారమని కానక చేర్చగరాదు సత్రమున్బలమును గూర్చరే బ్రతుకు, వంచన బాపగ, కూడి యుండి వంకలను సహింపగా వలయు గాపురమందభివృద్ధి గోరినన్వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అటు పెనిమిటి తరపువారిటు తమ వారువెనుక దెప్పి పోటు వెతల యశ్రుకల సహింపవలయుఁ గాపురమునగదాపడతు లెల్లపుడు సవాలు వోలె!జిలేబి
సలలిత రాగ బంధములు సంతులు పల్కెడి ముద్దుపల్కులున్కులమున గొప్ప గౌరవము కూరిమి గల్గిన భార్యయుండినన్కలతలు లేక సాగుచునుకష్టసుఖాలను వీని రాక పోకలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్
కె.వి.యస్. లక్ష్మి: పెండ్లియైన నాటి ప్రేమాభిమానమ్ము కాల మనుసరించి కట్టు దప్పి వలపు మాసిపోవ వల్లభు జూపు వం కల సహింప వలయు కాపురమున.
క్రొవ్విడి వెంకట రాజారావు: జూద మాడు చుండి సొత్తు పోగొట్టుచు నాలి మాట వినక ననవరతము నాగ్ర హించు నట్టి నార్యుని పొలికే కల సహింప వలయు కాపురమున.
జూద మాడు చుండి సొత్తు పోగొట్టుచునాలి మాట వినక ననవరతమునాగ్ర హించు నట్టి యార్యునిది పొలికేకల సహింప వలయు కాపురమున
సమస్య:*కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*ప్రయత్నం:చం.చిలిపిగ మాటలాడి తెగఁజేరువ యైన నవీనయుగ్మమున్వలపులవింటివాడు వసి వాడిగ బాణము వేసినంతనే,కలుపుచు పెండ్లి జేసి, తమ గారపు పట్టికి సెప్పిరిట్లు, "వంకలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్."నవీనయుగ్మము-కొత్తజంట,వలపులవింటివాడు-మన్మథుడు,తెగ,వసి-మిక్కిలి.
సొలుపును గూర్చనట్టిదగు జూదము నాడుచు సొమ్ములందెడిన్మెలకువలేక నష్టములె మీఱగ కోపమునొంది భార్యపైయలుగుచు నింద జేయుచు నహంతను భర్త వేయునట్టి కేకలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్
సొలుపును గూర్చనట్టిదగు జూదము నాడుచు సొమ్ములందెడిన్మెలకువలేక నష్టములె మీఱగ కోపమునొంది భార్యపైయలుగుచు నింద జేయుచు నహంతను భర్తయె వేయునట్టి కేకలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్
కోరు కొనము కాని, కొన్నికలహములుకాపురమున వచ్చు కలతలు గనుతప్పదెవరికైన, దంపతులెపుడలకల సహింపవలయుఁ గాపురమున
ఆ.వె.సంతు లేనివారి సంగతి యేమందుమందుమాకులన్ని మాయలాయెకలసి వచ్చినపుడు పిల్లలు వేయు కేకల సహింపవలయుఁ గాపురమున
అలఘుతరాచ్ఛభావమున, హర్షమునిండినమానసంబునన్సలలితవాక్సుధారసము సవ్యవిధంబున బంచుకొంచు తామలిగిననైన నొండొరులు నాలుమగల్ తమయందు గల్గు శంకలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”
సరదాగా... చంపకమాలవలచిన భామ ప్రేమఁ గని భార్యగ కోరగ కంచి పట్టు కోకలను సహింపగా వలయుఁ, గ్రన్నన మగ్గపు నేతఁ గోర రైకలను సహింపగా వలయుఁ, గాంచన భూషల, చిన్ని చిన్ని కాన్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
ఆటవెలదికలతఁ జెంది సత్య కలహమ్ములాడఁగఁబంకజాక్షుఁడపుడు పాదమంటెచీరలు నగలంచుఁ గోరెడు పత్ని కిన్కల సహింపవలయుఁ గాపురమునచంపకమాలచులకనఁ జేయఁ బోకు నిను సొంతముగాఁ గొన భర్త, నత్త మామలఁ దగు సేవలన్ దనర మన్నన జూడుము పుత్రికామణీ!మెలకువ తోడ మర్దులను మేళములాడక నాడబిడ్డ కిన్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
మర్దులను బదులు 'దేవరుల' గా చదువుకొన మనవి
పొలతుక లల్గుచోఁ దనరుఁ పొందు లెసంగు బ్రసన్నులౌ తరిన్,చెలియల మోము నందు నల చిర్నగవుల్ బ్రసరించు మేలి వెన్నెల బువి సోకినట్లుఁ, దగ నీవిధి నాగ్రహనిగ్రహప్రతీ కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.కంజర్ల రామాచార్య.
కాపురంబునందు కలతలు సహజముయెప్పుడైన వచ్చు తప్పు కాదుపతికి సతికి నడుమ వచ్చెడునా యలకల సహింపవలయుఁ గాపురమున
అలుకను బూని కోపమున నాలిని బంపక పుట్టినింటికిన్ కలతల పాలు జేయ నిక కాపురమెట్టుల సాగు చక్కగాపొలుపుగ నామె కోర్కెరిగి పుట్టిన వారిని జూడ రాకపోకలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
సతి పతులును కూర్మి సంసారమున పెక్కుబరువు బాధ్యతలెల్ల పైబడంగనోర్మి సాగ వలయు నొద్దిక తోడ,శంకల సహింప వలయు గాపురమున.
సూటిపోటు లుగల మాటల,శత్రుమూకలసహింపవలయు గాపురమునచేయిచేయి గలుప చేటుగలుగుగదమౌనమయది మేలు మౌని వలెను
అలిగిన సతులు గతు లరయరు నాథులు లలనలకుఁ దొడవుల వలువల రతి కట్టిన వసనమ్ము గట్టరె యిట్టి పో కల సహింపవలయుఁ గాపురమున విలవిల లాడ నేల గత భీతి మనోరధ పూర్ణ సిద్ధికై నిలువుమ వేచి వత్సరము నీ పుర మౌ నమరావతీ గతిన్ సలలిత తుంగ శైల నిభ సౌధ వరావళిఁ గట్టఁ గూల్పఁ బా కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్ [కాపురము = చెడ్డ పురము]
కోమలి యలుకలకు కోపించుట తగదు.అలుగని సతి గలదె అవని లోన?చెలియ మనసు నెరిగి చెలిమితో తన నలుకల సహింప వలయు గాపురమున.
కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూకలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్ గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్ గలనున సైతమున్ వలదు కర్కశరూపము మానవాళికిన్
కలలు కనండి గుండియల కశ్మలమెల్లను నూడ్చివేయగాకలలుమనోవికాసమునకండయుదండయుకాపురంబునన్కలతలచిచ్చునార్పగనుకాంతలచింతలమాన్పరంగుకో*“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”*
ములుకులె యత్తమామలహొ పూరుషుడక్కట బండరాయి కుక్కలు మరదళ్ళు బావలు ప్రకాండులు రామ!పరాన్నభుక్కులా!నలకలు దున్నపోతులు వినమ్రతలేని కుటుంబమందు *తి**క్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
వలపుల పంటలీనగను భార్యవిధేయుడు భర్తగావలెన్కలహము కాలుదువ్వినను కాన్కలు వే కురిపించగా వలెన్నిలువుగ దోపిడీలు సతి నిర్దయజేయ వరించు *రైకకో**కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
కులుకుచు భార్య భర్తలహ కూరిమి మీరగ కాపురమ్మునన్
నలువురు ముగ్గురన్ దలచి నందము నొందుచు నాపివేయకే
చిలుకల బోలుచున్ తనరు చిన్నరి పిల్లల నాటపాట మూ
కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
స్నేహబంధమంతచివురించుగ్రుహమందు
రిప్లయితొలగించండిఆలుమగలమధ్యనలుకలేమి
ఓకరుభోగిగాగనోకరునుత్యాగియే
కలసహింపవలయుకాపురమున
చెవులు హోరులెత్తు చెడ్డమాట పలుకు
రిప్లయితొలగించండిపలుక రాని మాట పలుకునయ్య
తిట్టు కవితలందు గట్టివారలనెన్ని
కల
సహింపవలయుఁగా పురమున
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఇలఁ గన సంఘజీవి నరుఁ డెల్లరతో సహజీవనంబునన్
రిప్లయితొలగించండికలతలు లేని తీరున సుఖంబుగ నుండుటె మేలు గాన నె
చ్చెలి యగు భార్య పక్షపు విశిష్టుల బంధుల యొక్క రాకపో
కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.
చాలా బాగుందండీ
తొలగించండిగురువుగారికిఅభినందనలుమనోహరమైనపూరణండి
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచాకచక్యముగల చక్కని పిల్లలు
తనదు బ్రతుకునంత తనియ జేసి
మురువు గూర్చు ననెడి ముచ్చటైనట్టిదౌ
కల సహింపవలయు కావురమున.
రిప్లయితొలగించండికల గనుమోయి జీవన వి
కాస తరంగ శ్రుతీ విభావరిన్!
కల గనువారె కోరికల
గాంచి వరించి విహార మందు, నా
కలయె నిజంబొ గాదొ! యొక
కల్పనయై నడయాడు నట్టిదో!
కలను సహింపగా వలయుఁ
గాపురమం దభివృద్ధిఁ గోరినన్!
కలికి చూడ పరమ గయ్యాళి యగుచును
రిప్లయితొలగించండితరచు భర్తపైన నరవనేమి
యామె తత్వ మెరగి యర్థాంగి వేయు కే
కల సహింప వలయు గాపురమున .
. . . విరించి.
సమస్య :
రిప్లయితొలగించండికలను సహింపగావలయు
గాపురమం దభివృద్ధి గోరినన్
( మగవాని జీవితానికి మహత్తరవరమైన మగువను మణిలా చూచుకొంటూవంకరవంకలు మానుకొంటే సంసారం సారవంతమే కదా !)
చంపకమాల
....................
అలికులవేణియై, సుమధు
రాధరనిర్గతమంజువాణియై,
చెలుముల బెంచు బ్రేముడిని
చెంతనె వెల్గెడి భూషణంబునై,
కలుముల లేములన్ విడని
కాంతకు మోదము బంచి, యల్పశం
కలను సహింపగావలయు
గాపురమం దభివృద్ధి గోరినన్ .
కలగుటసాజమేయగునుకామితముల్నెరవేరకుండినన్
రిప్లయితొలగించండివిలువలనేర్చెనావిభుఁడువిష్ణుఁడుక్రిష్ణుఁడుసత్యముంగిటన్
చలువలపందిరేయగునుచాలగనోర్చినబాధలయ్యెడన్
కలనుసహింపగావలయుఁగాపురమందభివ్రుద్ధిఁగోరినన్
భార్య చూడ లేదు, భర్త నడువ లేడు,
రిప్లయితొలగించండివినగ లేడు సుతుడు, వెతలు కలవు
వారి జీవితమున కూరిమి నంగవి
కల సహింప వలయు కాపు రమున
కల=భాగము
రిప్లయితొలగించండిశిలలను తెచ్చి శిల్పముగ చెక్కితి ముద్దుల భార్య బొమ్మయున్
రిప్లయితొలగించండిసలలితమైన మౌనము ప్రశాంతపు మోమున చిందె వేడుకల్
ములకలు వేసె భ్రాంతినను ముద్దుగ నిద్దుర వీడి కాంచనా
కలను , సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
జీవితమ్ము నందు చీకు చింతలు వచ్చుఁ
రిప్లయితొలగించండిబెదరి పోక నిలిచి విజయమంది
సాగ దలచి యట్టి జగతి కష్టముల రా
కల సహింప వలయు కాపు రమున
కలతలేని కుటుంబము గావలెనన
రిప్లయితొలగించండిగృహిణి సంతోషపడుటయె కిటుకు గాన
పతికి వలను గాకున్నను పత్నియడుగు
కౌతుకల సహింపవలయుఁ గాపురమున
కొత్తగా పెండ్లియైన జంటకు ఆత్మీయుల సలహాలు!😃
రిప్లయితొలగించండికలికి! సమాదరించవలె కాంతుడు యాడ వినోదమెంచి పే
కలు, పతి! నీవు కూర్చవలె కాంతకు కోరిన పట్టువైన
కో
కలను, చిరాకునన్ గలుగు కాదను యౌనను
చిన్న చిన్న కా
కలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్
వలపుల ధర్మపత్నికిని భాగ్యవశమ్మున వత్సరమ్మునే
తొలగించండితొలితొలి గర్భమాయెనని తోషమునందగ కాంతు
డంతలో
పిలుచుకు పోవగా దనదు పెద్దలు కాన్పునకై
వియోగ తం
కలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్
సవరించిన మొదటి పూరణ
తొలగించండికొత్తగా పెండ్లియైన జంటకు ఆత్మీయుల సలహాలు!😃
కలికి! సమాదరించవలె కాంతుడు వేడుక నెంచి యాడ పే
కలు, పతి! నీవు కూర్చవలె కాంతకు కోరిన పట్టువైన
కో
కలను, చిరాకునన్ దొరలు ఘాటగు మాటల
చిన్న చిన్న కా
కలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్
అందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండిపిలిచిన బల్కుచూ విమల ప్రేమను బంచగ సేవచేసినన్,
వలచి వరించెనం దలచి వైభవ మొప్పగ నోర్మిచూపినన్,
వెలితిని జూపుచున్ బురుష వీరము నిండిన భర్త పెట్టు వం
*“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”*
*వాణిశ్రీ నైనాల*
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితెలివియు నోర్పు గల్గి సరితీరు కుటుంబము నంతటిన్ సదా
కలతలు లేని చందమున కాంతిల జేసెడి ధర్మ మెంచుచున్
పొలుపును గూర్చి గాఢమగు పొంగు నొసంగెడి మేటి పిల్లమూ
కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.
పలువురు కూడదంచనిన పంతముతో నెదురించి ప్రేమతో
రిప్లయితొలగించండివలచి వివాహమాడిన శుభాంగియె నచ్చని కార్యమున్ గనన్
గలతయె చెంది కోపమున కాంతుని దూరుచు నామె వేయు కే
కలను సహింపగా వలయుఁ గాపురమందభివృద్ధి గోరినన్ .
. . . విరించి.
విలయము సృష్టి జేయగలవీరులు వేషము లెన్నియో యిటన్
రిప్లయితొలగించండియెలమిన వేయుచుందురల యీతరమందున తోషమందుచున్ సదా
ప్రళయము నేల గోరుదురు బ్రాతల మధ్యన తెల్యరాని మూ
కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం:
తొలగించండిపలుచన చేయరాదు కడుపారగ బెంచిన తల్లిదండ్రులన్
కలతలు లేపి, భారమని కానక చేర్చగరాదు సత్రమున్
బలమును గూర్చరే బ్రతుకు, వంచన బాపగ, కూడి యుండి వం
కలను సహింపగా వలయు గాపురమందభివృద్ధి గోరినన్
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅటు పెనిమిటి తరపువారిటు తమ వారు
వెనుక దెప్పి పోటు వెతల యశ్రు
కల సహింపవలయుఁ గాపురమునగదా
పడతు లెల్లపుడు సవాలు వోలె!
జిలేబి
సలలిత రాగ బంధములు సంతులు పల్కెడి ముద్దుపల్కులున్
రిప్లయితొలగించండికులమున గొప్ప గౌరవము కూరిమి గల్గిన భార్యయుండినన్
కలతలు లేక సాగుచును
కష్టసుఖాలను వీని రాక పో
కలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిపెండ్లియైన నాటి ప్రేమాభిమానమ్ము
కాల మనుసరించి కట్టు దప్పి
వలపు మాసిపోవ వల్లభు జూపు వం
కల సహింప వలయు కాపురమున.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిజూద మాడు చుండి సొత్తు పోగొట్టుచు
నాలి మాట వినక ననవరతము
నాగ్ర హించు నట్టి నార్యుని పొలికే
కల సహింప వలయు కాపురమున.
జూద మాడు చుండి సొత్తు పోగొట్టుచు
తొలగించండినాలి మాట వినక ననవరతము
నాగ్ర హించు నట్టి యార్యునిది పొలికే
కల సహింప వలయు కాపురమున
సమస్య:
రిప్లయితొలగించండి*కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*
ప్రయత్నం:
చం.
చిలిపిగ మాటలాడి తెగఁజేరువ యైన నవీనయుగ్మమున్
వలపులవింటివాడు వసి వాడిగ బాణము వేసినంతనే,
కలుపుచు పెండ్లి జేసి, తమ గారపు పట్టికి సెప్పిరిట్లు, "వం
కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్."
నవీనయుగ్మము-కొత్తజంట,
వలపులవింటివాడు-మన్మథుడు,
తెగ,వసి-మిక్కిలి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసొలుపును గూర్చనట్టిదగు జూదము నాడుచు సొమ్ములందెడిన్
రిప్లయితొలగించండిమెలకువలేక నష్టములె మీఱగ కోపమునొంది భార్యపై
యలుగుచు నింద జేయుచు నహంతను భర్త వేయునట్టి కే
కలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్
సొలుపును గూర్చనట్టిదగు జూదము నాడుచు సొమ్ములందెడిన్
తొలగించండిమెలకువలేక నష్టములె మీఱగ కోపమునొంది భార్యపై
యలుగుచు నింద జేయుచు నహంతను భర్తయె వేయునట్టి కే
కలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్
కోరు కొనము కాని, కొన్నికలహములు
రిప్లయితొలగించండికాపురమున వచ్చు కలతలు గను
తప్పదెవరికైన, దంపతులెపుడల
కల సహింపవలయుఁ గాపురమున
ఆ.వె.
రిప్లయితొలగించండిసంతు లేనివారి సంగతి యేమందు
మందుమాకులన్ని మాయలాయె
కలసి వచ్చినపుడు పిల్లలు వేయు కే
కల సహింపవలయుఁ గాపురమున
అలఘుతరాచ్ఛభావమున, హర్షమునిండినమానసంబునన్
రిప్లయితొలగించండిసలలితవాక్సుధారసము సవ్యవిధంబున బంచుకొంచు తా
మలిగిననైన నొండొరులు నాలుమగల్ తమయందు గల్గు శం
కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసరదాగా...
తొలగించండిచంపకమాల
వలచిన భామ ప్రేమఁ గని భార్యగ కోరగ కంచి పట్టు కో
కలను సహింపగా వలయుఁ, గ్రన్నన మగ్గపు నేతఁ గోర రై
కలను సహింపగా వలయుఁ, గాంచన భూషల, చిన్ని చిన్ని కా
న్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
ఆటవెలది
తొలగించండికలతఁ జెంది సత్య కలహమ్ములాడఁగఁ
బంకజాక్షుఁడపుడు పాదమంటె
చీరలు నగలంచుఁ గోరెడు పత్ని కి
న్కల సహింపవలయుఁ గాపురమున
చంపకమాల
చులకనఁ జేయఁ బోకు నిను సొంతముగాఁ గొన భర్త, నత్త మా
మలఁ దగు సేవలన్ దనర మన్నన జూడుము పుత్రికామణీ!
మెలకువ తోడ మర్దులను మేళములాడక నాడబిడ్డ కి
న్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
మర్దులను బదులు 'దేవరుల' గా చదువుకొన మనవి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపొలతుక లల్గుచోఁ దనరుఁ పొందు లెసంగు బ్రసన్నులౌ తరిన్,
తొలగించండిచెలియల మోము నందు నల చిర్నగవుల్ బ్రసరించు మేలి వె
న్నెల బువి సోకినట్లుఁ, దగ నీవిధి నాగ్రహనిగ్రహప్రతీ
కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.
కంజర్ల రామాచార్య.
కాపురంబునందు కలతలు సహజము
రిప్లయితొలగించండియెప్పుడైన వచ్చు తప్పు కాదు
పతికి సతికి నడుమ వచ్చెడునా యల
కల సహింపవలయుఁ గాపురమున
అలుకను బూని కోపమున నాలిని బంపక పుట్టినింటికిన్
రిప్లయితొలగించండికలతల పాలు జేయ నిక కాపురమెట్టుల సాగు చక్కగా
పొలుపుగ నామె కోర్కెరిగి పుట్టిన వారిని జూడ రాకపో
కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
సతి పతులును కూర్మి సంసారమున పెక్కు
రిప్లయితొలగించండిబరువు బాధ్యతలెల్ల పైబడంగ
నోర్మి సాగ వలయు నొద్దిక తోడ,శం
కల సహింప వలయు గాపురమున.
సూటిపోటు లుగల మాటల,శత్రుమూ
రిప్లయితొలగించండికలసహింపవలయు గాపురమున
చేయిచేయి గలుప చేటుగలుగుగద
మౌనమయది మేలు మౌని వలెను
అలిగిన సతులు గతు లరయరు నాథులు
రిప్లయితొలగించండిలలనలకుఁ దొడవుల వలువల రతి
కట్టిన వసనమ్ము గట్టరె యిట్టి పో
కల సహింపవలయుఁ గాపురమున
విలవిల లాడ నేల గత భీతి మనోరధ పూర్ణ సిద్ధికై
నిలువుమ వేచి వత్సరము నీ పుర మౌ నమరావతీ గతిన్
సలలిత తుంగ శైల నిభ సౌధ వరావళిఁ గట్టఁ గూల్పఁ బా
కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్
[కాపురము = చెడ్డ పురము]
కోమలి యలుకలకు కోపించుట తగదు.
రిప్లయితొలగించండిఅలుగని సతి గలదె అవని లోన?
చెలియ మనసు నెరిగి చెలిమితో తన నలు
కల సహింప వలయు గాపురమున.
కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూ
రిప్లయితొలగించండికలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్
గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్
గలనున సైతమున్ వలదు కర్కశరూపము మానవాళికిన్
కలలు కనండి గుండియల కశ్మలమెల్లను నూడ్చివేయగా
రిప్లయితొలగించండికలలుమనోవికాసమునకండయుదండయుకాపురంబునన్
కలతలచిచ్చునార్పగనుకాంతలచింతలమాన్పరంగుకో
*“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”*
ములుకులె యత్తమామలహొ పూరుషుడక్కట బండరాయి కు
రిప్లయితొలగించండిక్కలు మరదళ్ళు బావలు ప్రకాండులు రామ!పరాన్నభుక్కులా!
నలకలు దున్నపోతులు వినమ్రతలేని కుటుంబమందు *తి*
*క్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
వలపుల పంటలీనగను భార్యవిధేయుడు భర్తగావలెన్
రిప్లయితొలగించండికలహము కాలుదువ్వినను కాన్కలు వే కురిపించగా వలెన్
నిలువుగ దోపిడీలు సతి నిర్దయజేయ వరించు *రైకకో*
*కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష