చిన్న రాజు ఒకడు తన కుమారుడు పరశు రాముని గూర్చి మాట్లాడు తుంటే పరశు రాముడు కొన్ని వేలమంది క్షత్రియ వధ తన గొడ్డలి తో చేశాడు అందువల్ల మిగిలన క్షత్రియులకు అతను అంటే కోపము అసహ్యం మరియు అది బూతు పదము అని చెప్పు సందర్భము
[“మొదటి పూరణ కూడ బాగున్నది. కాకుంటే పద్య ప్రారంభం లోని పదం అశ్లీలార్థాన్ని సూచిస్తుంది కదా!” యను 2021 మార్చి 5 నాటి గురువు గారి మొట్టికాయ గుర్తునకు రాఁగఁ జేసిన పూరణము.]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
తొలగించండి(క్రొత్తగా రాజకీయముల లోనికి వచ్చెడి రామచంద్రుఁడను వానితో విశేషరాజకీయానుభవముగల యొక వృద్ధ నేత పలుకుచున్న వచనములు)
నేత విశిష్ట భావ సువినీత సుభాషణ లెన్నొ చేసినన్,
బాతకులౌటచేతఁ బ్రతిపక్షపు నేతల కట్టి భాషణల్
బూతగు రామచంద్ర! యనఁబోకు! సుహృజ్జనులున్నతావులన్
నేతయె యట్టి భాషితమునే పలుకందగు సాధులౌటచే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తాతల నాటి గొప్పలను త్రవ్వుచు బైటకు లాగి పల్కుచున్
మూతులు నాకి నాయకుల మూర్ఖుడ! రూకలు మెండు జేర్చుచున్
నీతులు జెప్పి త్రాగుచును నివ్వెర పోవక హైద్రబాదునన్
బూతగు "రామచంద్ర!" యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచదువు సంధ్య లవియ చక్కగా నేర్వని
ద్రాబలు తిరుగాడు తావు లందు
మంచి మాట లెల్ల వంచింపబడు వేళ
రామ యనిన బూతురా! యనకుము.
(పాండవుల పట్ల కౌరవుల ప్రవర్తన నెంచిన నాటి వ్యక్తి వ్యక్తీకరణ:)
తొలగించండిరీతుల నెన్నియో నుదహరించి నటుల్ సరిధర్మ మెంచుచున్
బాతిగ రాజ్యభాగమును పాండు తనూజులకీయ మన్నదౌ
ఖ్యాతిని బెంచు వాక్యమది కౌరవ కొల్వున నెప్పుడెనియున్
బూతగు "రామచంద్ర!" యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరాజకీయమయ్యెరామన్నగుడియును
రిప్లయితొలగించండిదానిమాటనెవరుతలపరాదు
నీతిమంతులెవరునేరమ్ముఁజేయరు
రామయనినబూతురాయనకుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకల దోషములు తొలగు సకల గుణాభి
రిప్లయితొలగించండిరామ యనిన:; బూతురా యనకుము”
మంచికాలవాలమనుచును రాముని
వైరిని కలనయిన వెరపునయిన
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
తండ్రి మాట నిలిపి ధర్మమ్ము పాటించి
రిప్లయితొలగించండిపూజ నీయు డయ్యె పుణ్య శాలి
యట్టి వాని మరచి యన రాద దెవ్వరు
రామ యనిన బూతు రా యనకుము !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండిరోతగు బుద్దులన్ గడన రూకలు మొత్తము ఖర్చు చేయుచున్
నీతులు చెప్ప బూననిక నిగ్రహ మోపక కయ్యమాడగన్
భూతల మందునన్ సదరు బోధలు మెచ్చెక తప్పులెంచగన్
*“బూతగు రామచంద్ర యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్”*
*వాణిశ్రీ నైనాల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాతగమాటలాడుచునుపావనురామునితల్చబోకురా
రిప్లయితొలగించండినేతలమాటగుట్టునికనేరుపుమీరగనాకళింపుమా
చేతమురాముపెండ్లియనిచేరకుభద్రగిరీశుసన్నిధిన్
బూతగురాచంద్రయనబోకుసుహ్రుజ్జనులున్నతావులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేమము విడి యిటుల నీతిమాలిన మాట
రిప్లయితొలగించండిలనకు మతివతోడ నట్టి మాట
విజ్ఞత విడి నీవు పెద్దల సభలో
రామ, యనిన బూతురా! యనకుము.
నీతిని వీడినట్టి పలు నెత్తురు బొత్తుల సాహచర్యమున్
భీతిని వీడి నీవిటుల భీరువు జాతిని కించపర్చుచున్
చేతులనూపి రాతిరికి చెంతకు రమ్మని పిల్చుటన్నదే
బూతగు రామచంద్ర, యనబోకు సుహృజ్జనులున్న తావులన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికంకుభట్టుతో విరటుడు
రిప్లయితొలగించండిఆతత కౌరవాన్వయము నంతయు నుత్తరుడే
జయింపగా
నాతులకీయెడన్ సరసనాట్యము నేర్పు బృహన్నలన్ దగన్
త్రాతవు నీవెయేయనుచు దక్షుడవంచును నింగికెత్తగా
బూతగు "రామచంద్ర!" యనబోకు సుహృజ్జను లున్నచోటులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములాచార్యా! నమోనమః!🙏🙏🙏
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిరాముడన్న పేర రసిక శిఖామణి
యందగత్తెలన్న బొందు గోర
వ్యంగమునకునైన నవ్వాని పిలువ సు
త్రామ యనిన బూతురా యనకుము
తొలగించండిఉత్పలమాల
కూతలు పెక్కు గూయ ప్రజ గొప్పగ నమ్మియు మద్దతీయఁగన్
నేతగ గెల్చియున్ విడువనేరడు నిత్యము వారకాంతలన్
చేతలు మృగ్యమౌనతని చేష్టలెరుంగగఁ బోల్చఁ ధర్మమే?
బూతగు! రామచంద్ర యనఁ బోకు సుహృజ్జనులున్న తావులన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఉ:
రిప్లయితొలగించండితీతువు పిట్ట మాదిరిని తేరగ బల్కెడి వాని దూరమౌ
రీతిని బెట్ట నెల్లరును లేకిడి మాటలు మానుమంచనన్
లోతుగ నెంచి నేర్పిరట లోకపు సూక్తిని యొంటబట్టగన్
బూతగు రామచంద్ర యనబోకు సృహృజ్జనులున్న తావునన్
*ర ఱ ల ళ లకు గల పరస్పర యతి మైత్రి ననుసరించి యతి గూర్చినాను.*
తీతువు పిట్ట =అపశకున పక్షి
లేకిడి=తక్కువతనము
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సూక్తిని+ఒంట' అన్నపుడు యడాగమం రాదు. "సూక్తిని/సూక్తుల నొంటబట్టగన్" అనండి.
ధన్యవాదములు; సూచన ననుసరించి సవరిస్తాను
తొలగించండిగొడ్డలినిచేత బట్టుచు కోసె వేల
రిప్లయితొలగించండిక్షత్రియుల గొంతుల నతడు క్షమయె లేక
రాజ్య ప్రజలు నేడు పరశు రామయనిన
బూతురా యనకుమనుచు భూమి జాని
పలికె తనదు సుతునితోడ భయము కలిగి
చిన్న రాజు ఒకడు తన కుమారుడు పరశు రాముని గూర్చి మాట్లాడు తుంటే పరశు రాముడు కొన్ని వేలమంది క్షత్రియ వధ తన గొడ్డలి తో చేశాడు అందువల్ల మిగిలన క్షత్రియులకు అతను అంటే కోపము అసహ్యం మరియు అది బూతు పదము అని చెప్పు సందర్భము
ఆటవెలది సమస్యకు మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాటి కాల మందు నలుగురి యెదుటన
రిప్లయితొలగించండిరామ యనిన యెడల రక్తి కలుగు
నేటి కాల మందు నేతల యెదుటన
రామ యనిన బూతురా యనకుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"..యెదుటను" అనండి.
మందు మాన్ప వాని మంచి కోరితి నేను
రిప్లయితొలగించండిచెప్ప మందు లోని చెడుపు నంత
తిట్ల దండకంబు తెరిచె వాడు ఇటుల
రామ యనిన బూతు రా యనకుము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వాడు+ఇటుల' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. "వా డీరీతి" అనండి.
బూతగు రామచంద్ర యన
రిప్లయితొలగించండిబోకు సుహృజ్జనులున్న తావులన్
( విశ్వామిత్రమహర్షి శ్రీరామచంద్రునితో )
ఉత్పలమాల
.....................
నీ తలిదండ్రు లిర్వురకు
నిత్యపు గీరితి దెచ్చిపెట్టుమా !
కాతరమందకన్ బలుక
కమ్మని తావుల పచ్చకప్రపుం
బూతగు రామచంద్ర ! యన
బోకు సుహృజ్జనులున్న తావులన్
జేతము భిన్నభిన్నమయి
చింతల ముంచెడి పల్కులెన్నడున్ .
( కాతరము - భయము ; పూత - అలదుట )
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"కాతరమందకే" అనండి. 'అందక' కళ కదా!
స్నేహితుడు రామచంద్రుణ్ణి ఉద్దేశించి
రిప్లయితొలగించండిభూతల పుణ్యవంతులును భూరి వదాన్యులు మీరలేయనన్
రోతగు నేతలందరిని మ్రోలను భేషని వంతపాడుటల్
నీతిని వీడి సాగుటయు నేడిదె యందరి మంత్రమౌ యిదే
బూతగు ! రామచంద్ర ! యనబోకు సుహృజ్జనులున్న తావులన్
బూతగు = బట్రాజు పని
చేత కలంబుబూని శశిశేఖరు విష్ణుని వాణినాథునిన్
తొలగించండిభాతిని గూర్ప వేడి యతి బద్ధము సేసి కవిత్వమల్ల మ
జ్బూతగు రామచంద్ర ! యనబోకు సుహృజ్జనులున్న తావులన్
రీతుల మార్తునన్చు పరీక్షకు నైనను, కందిశంకరుల్
నేతగ నిల్చిరిచ్చటను నీ తరమా మరి వారిగెల్వగన్ !
మజ్ బూత్ = బలము (తెలంగాణ మాండలికంలో)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో "మంత్రమౌ నిదే" అనండి.
రెండవ పూరణలో నాల్గవ పాదంలో గణభంగం. సవరించండి.
సీతను తెచ్చితీవు కడు చేటగు నిక్కమటంచు తమ్ముడే
రిప్లయితొలగించండినీతిగ రామచంద్రునికి నెయ్యము నర్పణ సేయు మంచు దాఁ
నీతులు వల్క రావణుడు నేరము నెంచి వచించెనుగ్రుడై
బూతగు రామచంద్ర యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్
నీతము వల్క రావణుడు నేరము నెంచి వచించెనుగ్రుడై
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్వామీ నమస్కారము
రిప్లయితొలగించండిమీ వాట్సప్ గుణము నందు నా ఖాతాను జేర్చుటకు అవకాశమివ్వగలరని నా వేడుకోలు 🙏
కరవాణి సంఖ్య 98855 90520
తొలగించండిమూతికి బట్ట కట్టకను మూరడు దూరము నుండకుండియున్
రిప్లయితొలగించండివేతన తీర్చడయ్య రఘు వేల్పు కరోనను త్రుంచ లేడనన్
బూతగు రామచంద్ర :; యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్
కోతికి తండ్రి దాపులను క్రుంగిన దీపము బాధ్యతేరిదో
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
తండ్రి గౌతముడు శతానందునకు జెప్పె
రిప్లయితొలగించండిమాయనాశ్రయించి మాతశీల
మపహరించె గాన మరువకు మతని సు
త్రామ యనిన బూతురా యనకుము
పాతక! నీతిమాలి కడు పాప
రిప్లయితొలగించండిము లెన్నియొ చేయుచున్ సదా
భూతలమందు దైవమును
బూని భజించెడు వాని తీరుగన్
కోతలు మాటిమాటికిని కోసెడు
వాడవు రామనామమే
బూతగు, 'రామచంద్ర' యన బో
కు సుహృజ్జనులున్న చోటునన్
నేతల దీరు మారెననునిత్యమసత్యములాడుచుందురే
రిప్లయితొలగించండిరోతగ దోచు వారి యవరూప విచేష్టలు వారి సన్నిధిన్
బూతగు రామచంద్ర యనఁబోకు; సుహృజ్జనులున్న తావులన్
నీతియె రీతియై చెలఁగు నిక్కపు సంస్మృతి రామ నామమే
మంచిమాట చేదు మాత్రగా నెంచును
రిప్లయితొలగించండినిజము పలుక నెపుఁడు నిష్ఠురంబె
కుమతి హితవు వినడు కుత్సితుండతనితో
రామ యనిన బూతురా యనకుము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూర్వకాల మందు పురుష వర్యు లకట
రిప్లయితొలగించండిమూరు చుంద్రు సతము మూఢ భక్తి
వీర శైవు లున్న వీడురా యియ్యది
రామ యనిన బూతురా యనకుము
నాతులు చూచు చుండఁగ ననంత యశస్వి చువర్ణ దుగ్దకా
రాతిశయమ్ము కల్గిన మహాశయ! పండితవంశ సంభవా
ప్రీతిని శబ్దశాస్త్రమునఁ బెంపును జూపఁగ నిట్లు పల్కినన్
బూతగు రామచంద్ర! యనఁబోకు సుహృజ్జను లున్న తావులన్
[“మొదటి పూరణ కూడ బాగున్నది. కాకుంటే పద్య ప్రారంభం లోని పదం అశ్లీలార్థాన్ని సూచిస్తుంది కదా!” యను 2021 మార్చి 5 నాటి గురువు గారి మొట్టికాయ గుర్తునకు రాఁగఁ జేసిన పూరణము.]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాతికి వన్నె తెచ్చు వనజాక్షుల పొంతన చెడ్డమాట యున్
రిప్లయితొలగించండిజ్ఞాతిని రాజు చేయుచెడు జ్ఞానపు కైకకు ముందునన్ సదా
పాతక వర్త నంబు మరి పాడియు కాదు కదా సభా స్థలిన్
బూతగు, రామచంద్రయనబోకు,సుహృజ్జనులున్న తావులన్
పుణ్య మబ్బు నెపుడు పుడమి లో జనులకు
రిప్లయితొలగించండిరామ యనిన బూతురా యనకుము
పనికిమాలినట్టి పలుకులవి నిజమ
టంచు నమ్ము మయ్య యనవరతము.
పుణ్య మబ్బు నెపుడు పుడమి లో జనులకు
రిప్లయితొలగించండిరామ యనిన బూతురా యనకుము
పనికిమాలినట్టి పలుకులవి నిజమ
టంచు నమ్ము మయ్య యనవరతము.