3-3-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్”(లేదా...)“ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:కుదురుగ నుండజాలకయె కుత్సిత బుద్ధిని వీడియాదటన్చదువులు మాని దీదియట చక్కగ నేర్వగ రాజకీయమున్పదుగురు పల్కగా నిటుల భాజప కాంగ్రెసు కమ్యునిష్టు తోనిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
సదమల చిత్తము గల్గియు పదుగురితో కలసి మెలసి బాగుగ మెలఁగన్ విదితము నౌ గద నయ్యెడ నిది యది కానట్టి దే దొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విదితముకానిదికవితానందముతెలిసినకవియునునక్కజమోందున్పదిలముగాగనుతిరమగుఇదియదికానట్టిదేదోయిడుమోదమ్మున్
ఇదిగో భువి సంతోషముఅదిగో స్వర్గపు సుఖముల యవ్వన కాంతుల్యెది కావలెనరయంగాఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కాంతుల్+ఎది' అన్నపుడు యడాగమం రాదు. "యౌవనరుచులే" అనండి.
ధన్యవాదములండీ సవరణలు పాటిస్తానండీ
అదవద చెందకు సఖుడా చదువులు వ్యర్థంబయె, వెవసాయమ్మది నీ యుదరము నింపక పోయిన నిదియది కానట్టిదేదొ యిడు మోదమ్మున్ . . . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అయె' అన్న క్రియారూపం సాధువు కాదు. "చదువులు వ్యర్థంబులె వ్యవసాయమ్మది.." అనండి.
సదమలచిత్తవ్రుత్తినినిస్సంగుడునైతిరమాసనంబునన్కదలనిమానసంబుననుకాంచగదివ్యముదీపమన్నిటన్కుదురుగశోభనిచ్చునదికూర్చునుశాంతినిసాధనంబునన్ఇదియదికానిదేదియోయదేయిడుచుండునుమోదమెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. "సదమల చిత్తవృత్తి చ్యుతసంగుడునై స్థిరమాసనంబునన్" అనండి.
సవరించివ్రాస్తానండి
సమస్య :ఇది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్( పారిజాతకుసుమాన్ని రుక్మిణీదేవి వేణిలో అలంకరించి సాత్రాజితి మందిరంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుని అంతరంగతరంగాలు )మది నిది కొల్లగొట్టినది మంజులభాషిణి సత్యభామయే ;కదలిక నాట్యమా ? విసుర ?కన్నుల బ్రేమయ ? నల్క చిందులా ?పెదవుల కంపమా ? విసుగు విర్పుల ? ముగ్ధమనోహరాంగిలో నిది యది కాని దేదియొ య దే యిడుచుండును మోద మెప్పుడున్ .
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
చదువులు వ్యర్థమయ్యె వెవసాయము నష్టము తెచ్చెనంచు నీవదవద చెందబోకుము సహాయము చేసెడు వాడొకండె నీసదమల చిత్తమందు గిరిజాయతిఁ గొల్చిన చాలు నేస్తమా!యిదియది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్ . . . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వ్యవసాయము" అనండి.
కందంపొదవుకొన కౌగిటన్ దా'వదలు' వదలని ప్రియురాలు వట్టి బిగింపన్బెదవుల నద్దిన ముద్దుననిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్చంపకమాలఎదురుగ ప్రేయసిన్ గనుచు నింపొనరింపగ నూసులాడుచున్జెదరిన పైటతో హొయల బిత్తర చూపుల నుండ గౌగిటన్బొదవుకొనంగఁ దా 'వదలు' ముచ్చట గాదన రేగు ముద్దులోనిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ రెండు పూరణలు రసవత్తరంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
చెదిరెను కన్ను లోకమున చిందిన బంగరు కాంతి కాంచగన్అదిరెను మానసమ్ము సుర రాజును చూసిన కళ్ళు కాంతులన్ఇది యది కానిదొక్కటల ఈశుని వాసమె మోక్ష మార్గమౌఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ధన్యవాదములండీ
మైలవరపు వారి పూరణ ఇది యనగా శరీరమిది యెప్పుడొ నాశనమందు.,నట్టులేయది యన నల్లదే జగము.,నద్దియు శాశ్వతమౌనె., యెంచగానెదొ గలదద్ది బ్రహ్మము., రహించును నిత్యమనంగ., సత్కవీ!ఇది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్!! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ.
అది యిది యని యననేటికిమదికి ముదము గలుగ జేయుమదియే చాలున్సదమలమగు హృదయముతోనిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గురువర్యులకు నమస్సులు, నిన్న మీరిచ్చిన సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.ఉత్సాహము:కూర్చుకుంటి సొమ్ము వేల కొలదిగా చికిత్సనున్ నేర్చి యుంటి రనుచు నమ్మి నీతి పరులటంచు నే దూర్చినాడను తల! దమరి దుష్ట బుద్ధి నెంచగా జేర్చును పరలోకము దమ చేతి మాత్ర యయ్యయో!
వదనము జూడ చంద్రముఖి పాణిని బట్టిన ప్రాణనాయకేమది మథనంబు జేయుచును మానస వీధిని శాసనంబు తావదలక జేయుచుండ బలు పాటులు తప్పవు రాసకేళిలోనిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
సదనము ఖేద మోదముల సంకుల సంగమ సారమేగదావదలని రాగ బంధములు వారణ సేయగ లేని మృత్యువున్సదమల చిత్తుడై తెలిసి సాగగ మర్త్యుడు ధన్యుడౌ సుధీయిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.'నాయకి+ఏ' అన్నపుడు సంధి లేదు.
చం: ఎదురుగ నిల్చినంతయునె యెక్కడ లేని యనన్య గారమున్ప్రదరము వోలు చందమున ప్రాకుచు చేరిన పట్టిపట్టి తావదలక దెబ్బలాడినను వాదన జేయుచు వంక బెట్టినన్యిది యది కాని దేదియొ యదే యిడు చుండును మోద మెప్పుడున్పట్టి పట్టి =మనుమరాలువై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "నిల్చినంతటనె..." అనండి. 'అనన్య గారము' వైరి సమాసం.
సవరణ లతో..:చం: ఎదురుగ నిల్చినంతటనె యెల్లలు లేని యనంత గారమున్ప్రదరము వోలు చందమున ప్రాకుచు చేరిన పట్టిపట్టి తావదలక దెబ్బలాడినను వాదన జేయుచు వంక బెట్టినన్యిది యది కాని దేదియొ యదే యిడు చుండును మోద మెప్పుడున్పట్టిపట్టి=మనుమరాలువై. చంద్రశేఖర్
వదలక మది హరి పదములకుదురుగ ధ్యానింప సతము కొదవయె లేకన్సదమలమౌ హృత్కమలమునిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
పదిచీరలుచూసితినిగసదరుగ, కానబడలేదు, చమకుల తణుకుల్మది కోరు క్రొత్త పుంతలుఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
పదవియు విత్తము నొకదెసగుదురుగ నిల్చి యలవడిన గూడ నిరతమున్మది యేల దృప్తిగనదో !యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
ఇది పాత డిజైను గదా,యెద దోచెడి శోభలేదు ఇందున, అకటామది కోరు క్రొత్త పుంతలు,ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'లేదు+ఇందున' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "శోభ గాంచ నిందున నకటా.." అనండి.
నదియా! జిలేబి ! పూర్ణిమఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్మదిలో గిలిగింతలతోకదలిక తెచ్చును తెలియగ కాముని కృపయే!జిలేబి
చదునుగజేసి హలముతోపదునుగ జేయంగపట్టె పదిరోజులకున్వదలగ నిదియును నిపుడున్ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
వదలుకొనలేను తల్లినిబదులుగమాటాడలేక భార్యతొ నుంటిన్కుదురుగ నుండగ, దేవాఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'భార్యతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
సదమలవృత్తిమాధవునిసన్నుతిజేసితిడెందమందునన్సదనముగట్టితిన్స్మరణసల్పితినిల్పితినాల్కనామమున్వ్యథలనుగట్టివైచితిజయంబునుగోరితికర్మపాశమే*యిది, యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”* పొదలనుమాటువేసితినిబోడులజేరితిమందయానలన్మదినిదలంచిగొల్చితిసమాదరణీయుడనైతిభోగముల్ముదిమిమరీచికల్హృదయమోదడియారెనునేడుమాధవా*యిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హృదయము పొంగిపోవు కడు నింపగు ప్రేమము సోకి నంతటన్ సదమల వృత్తి వీనులకు చక్కని గానము సేద తీర్చగా కొదవ యొకింత లేక చవి గూర్చుచు నా హరి ధ్యానమొక్కటే ఇది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్-మాచవోలు శ్రీధరరావు
చక్కని పూరణ. అభినందనలు.
పదపడి జీవనమ్ము క్షణభంగురమై స్థిరసౌఖ్యమేగతిన్?సదమలసాధువృత్తిఁ గను స్వర్గఫలమ్ము లవెంతొ యంతయే,తదితరశాశ్వతాప్తసుఖదాయకముక్తనివేశ మెయ్యదో!ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్.కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఇది యని తెలియని భావనమెదిలెను మది ముద్దరాలు మెయిమరపింపన్అది మరుశరమో వరమోఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
చదువులు బాగుగ జదివినబదవులుదానుండునైన బహుళముగాగన్ నెదనాబొందగ దనివినియిదియది కానట్టీ దేదొ యిడు మోదమున్
మోదమ్మున్ గాచదువ వలసినది
కుదురుగ నుండు మెల్లపుడుగోరకు మందని కోర్కులేవియున్పదెపదె చింత జేసినను వల్సినదేదియు నంద బోదు నీమదినిది గుర్తు పెట్టుకొని మానవ నడ్వుము కల్గు శాంతియున్ఇదియది కానిదేదియొ యదే యిడు చుండును మోదమెప్పుడున్"~~~~~~~~~~~~~~~~~
ఇది యని కాదు కాదు అదియేనని మానసమందు నిత్యమున్సదమదమౌచు నాత్మభవు శాశ్వతు మాయ నెరుంగ లేక నాకిదె పరమార్థమంచు నిహమీదుచు నీతి చరించు వారికిన్ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చదువుల తల్లియెప్పుడును సాదయనిండుగనీయవిద్యనున్ బదవులె నేరుగా గలిగిప్రాఙ్ఞుని జేసిన నైననెంతయున్ మదిగలవారందఱును మాన్యత తోడను మెల్గుచుండుటన్ నిదియదికానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వారలందఱును... వెల్గుచుండగా । నిది యది..." అనండి.
అదనున పెండ్లాడమనుచువదలక వెంటాడు జనులు; ఫలిత మదేమన్బదులుగ గుదిబండ యనునుయిది యది కానట్టిదేదొ యిడుమోదమ్మున్ముదమున బెండ్లియాడుమని ముద్దుగజెప్పెదరెందరెందరోఇదిమన సంప్రదాయమని యిల్లునుగట్టుచు పోరువీనులన్బదులుగ నేమిలాభమన బాధ్యత బర్వులమోతలే యనున్అదియిది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
ఇదియది కాదు కాదనుచు నింద్రియ, ప్రాణసమూహ మంతయున్వెదకుచు నిత్యమైన మయి వెల్గెడు నాత్మను ధ్యానమందునన్ఇదియని చెప్పలేనిదగు నీశ్వరభూతిని మున్గినంతనేఅదియిది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'ఫలితమదేమన్'?
తుదిఁ గాంచ విత్త గృహముల్ సదువులు భార్యా తనయులు శకట క్షోణుల్ పదిలమ్ముగ నీ నేరవె యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్ చదలున నున్న భావము భృశమ్ముగఁ గల్గును దూది మాదిరిం బదపడి చేయ నీయదు విపన్నునిఁ జేసి పరంబు నెద్ది యేనెద వడి దూఱి యూహ లవి యింతలు నింతలుఁ బెర్గి వింతగా నిది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
హృదయము నందున సతతముకదలెడి దైవంబు నేడు కన్నుల యెదుటన్సదయుండై యగుపింపగనిది యది కానట్టి దేదొనిడు మోదమ్మున్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
కుదురుగ నుండజాలకయె కుత్సిత బుద్ధిని వీడియాదటన్
చదువులు మాని దీదియట చక్కగ నేర్వగ రాజకీయమున్
పదుగురు పల్కగా నిటుల భాజప కాంగ్రెసు కమ్యునిష్టు తో
నిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసదమల చిత్తము గల్గియు
రిప్లయితొలగించండిపదుగురితో కలసి మెలసి బాగుగ మెలఁగన్
విదితము నౌ గద నయ్యెడ
నిది యది కానట్టి దే దొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిదితముకానిదికవితా
రిప్లయితొలగించండినందముతెలిసినకవియునునక్కజమోందున్
పదిలముగాగనుతిరమగు
ఇదియదికానట్టిదేదోయిడుమోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇదిగో భువి సంతోషము
రిప్లయితొలగించండిఅదిగో స్వర్గపు సుఖముల యవ్వన కాంతుల్
యెది కావలెనరయంగా
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కాంతుల్+ఎది' అన్నపుడు యడాగమం రాదు. "యౌవనరుచులే" అనండి.
ధన్యవాదములండీ
తొలగించండిసవరణలు పాటిస్తానండీ
అదవద చెందకు సఖుడా
రిప్లయితొలగించండిచదువులు వ్యర్థంబయె, వెవసాయమ్మది నీ
యుదరము నింపక పోయిన
నిదియది కానట్టిదేదొ యిడు మోదమ్మున్ .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అయె' అన్న క్రియారూపం సాధువు కాదు. "చదువులు వ్యర్థంబులె వ్యవసాయమ్మది.." అనండి.
సదమలచిత్తవ్రుత్తినినిస్సంగుడునైతిరమాసనంబునన్
రిప్లయితొలగించండికదలనిమానసంబుననుకాంచగదివ్యముదీపమన్నిటన్
కుదురుగశోభనిచ్చునదికూర్చునుశాంతినిసాధనంబునన్
ఇదియదికానిదేదియోయదేయిడుచుండునుమోదమెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "సదమల చిత్తవృత్తి చ్యుతసంగుడునై స్థిరమాసనంబునన్" అనండి.
సవరించివ్రాస్తానండి
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఇది యది కాని దేదియొ య
దే యిడుచుండును మోద మెప్పుడున్
( పారిజాతకుసుమాన్ని రుక్మిణీదేవి వేణిలో అలంకరించి సాత్రాజితి మందిరంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుని అంతరంగతరంగాలు )
మది నిది కొల్లగొట్టినది
మంజులభాషిణి సత్యభామయే ;
కదలిక నాట్యమా ? విసుర ?
కన్నుల బ్రేమయ ? నల్క చిందులా ?
పెదవుల కంపమా ? విసుగు
విర్పుల ? ముగ్ధమనోహరాంగిలో
నిది యది కాని దేదియొ య
దే యిడుచుండును మోద మెప్పుడున్ .
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచదువులు వ్యర్థమయ్యె వెవసాయము నష్టము తెచ్చెనంచు నీ
రిప్లయితొలగించండివదవద చెందబోకుము సహాయము చేసెడు వాడొకండె నీ
సదమల చిత్తమందు గిరిజాయతిఁ గొల్చిన చాలు నేస్తమా!
యిదియది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్ .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వ్యవసాయము" అనండి.
కందం
రిప్లయితొలగించండిపొదవుకొన కౌగిటన్ దా
'వదలు' వదలని ప్రియురాలు వట్టి బిగింపన్
బెదవుల నద్దిన ముద్దున
నిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
చంపకమాల
ఎదురుగ ప్రేయసిన్ గనుచు నింపొనరింపగ నూసులాడుచున్
జెదరిన పైటతో హొయల బిత్తర చూపుల నుండ గౌగిటన్
బొదవుకొనంగఁ దా 'వదలు' ముచ్చట గాదన రేగు ముద్దులో
నిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ రెండు పూరణలు రసవత్తరంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిచెదిరెను కన్ను లోకమున చిందిన బంగరు కాంతి కాంచగన్
రిప్లయితొలగించండిఅదిరెను మానసమ్ము సుర రాజును చూసిన కళ్ళు కాంతులన్
ఇది యది కానిదొక్కటల ఈశుని వాసమె మోక్ష మార్గమౌ
ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఇది యనగా శరీరమిది యెప్పుడొ నాశనమందు.,నట్టులే
యది యన నల్లదే జగము.,నద్దియు శాశ్వతమౌనె., యెంచగా
నెదొ గలదద్ది బ్రహ్మము., రహించును నిత్యమనంగ., సత్కవీ!
ఇది యది కాని దేదియొ య
దే యిడుచుండును మోద మెప్పుడున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ.
తొలగించండిఅది యిది యని యననేటికి
రిప్లయితొలగించండిమదికి ముదము గలుగ జేయుమదియే చాలున్
సదమలమగు హృదయముతో
నిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిగురువర్యులకు నమస్సులు, నిన్న మీరిచ్చిన సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.
ఉత్సాహము:
కూర్చుకుంటి సొమ్ము వేల కొలదిగా చికిత్సనున్
నేర్చి యుంటి రనుచు నమ్మి నీతి పరులటంచు నే
దూర్చినాడను తల! దమరి దుష్ట బుద్ధి నెంచగా
జేర్చును పరలోకము దమ చేతి మాత్ర యయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివదనము జూడ చంద్రముఖి పాణిని బట్టిన ప్రాణనాయకే
రిప్లయితొలగించండిమది మథనంబు జేయుచును మానస వీధిని శాసనంబు తా
వదలక జేయుచుండ బలు పాటులు తప్పవు రాసకేళిలో
నిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
సదనము ఖేద మోదముల సంకుల సంగమ సారమేగదా
తొలగించండివదలని రాగ బంధములు వారణ సేయగ లేని మృత్యువున్
సదమల చిత్తుడై తెలిసి సాగగ మర్త్యుడు ధన్యుడౌ సుధీ
యిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'నాయకి+ఏ' అన్నపుడు సంధి లేదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం:
రిప్లయితొలగించండిఎదురుగ నిల్చినంతయునె యెక్కడ లేని యనన్య గారమున్
ప్రదరము వోలు చందమున ప్రాకుచు చేరిన పట్టిపట్టి తా
వదలక దెబ్బలాడినను వాదన జేయుచు వంక బెట్టినన్
యిది యది కాని దేదియొ యదే యిడు చుండును మోద మెప్పుడున్
పట్టి పట్టి =మనుమరాలు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నిల్చినంతటనె..." అనండి. 'అనన్య గారము' వైరి సమాసం.
సవరణ లతో..:
తొలగించండిచం:
ఎదురుగ నిల్చినంతటనె యెల్లలు లేని యనంత గారమున్
ప్రదరము వోలు చందమున ప్రాకుచు చేరిన పట్టిపట్టి తా
వదలక దెబ్బలాడినను వాదన జేయుచు వంక బెట్టినన్
యిది యది కాని దేదియొ యదే యిడు చుండును మోద మెప్పుడున్
పట్టిపట్టి=మనుమరాలు
వై. చంద్రశేఖర్
వదలక మది హరి పదముల
రిప్లయితొలగించండికుదురుగ ధ్యానింప సతము కొదవయె లేకన్
సదమలమౌ హృత్కమలము
నిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపదిచీరలుచూసితినిగ
రిప్లయితొలగించండిసదరుగ, కానబడలేదు, చమకుల తణుకుల్
మది కోరు క్రొత్త పుంతలు
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపదవియు విత్తము నొకదెస
రిప్లయితొలగించండిగుదురుగ నిల్చి యలవడిన గూడ నిరతమున్
మది యేల దృప్తిగనదో !
యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇది పాత డిజైను గదా,
రిప్లయితొలగించండియెద దోచెడి శోభలేదు ఇందున, అకటా
మది కోరు క్రొత్త పుంతలు,
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లేదు+ఇందున' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "శోభ గాంచ నిందున నకటా.." అనండి.
రిప్లయితొలగించండినదియా! జిలేబి ! పూర్ణిమ
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మదిలో గిలిగింతలతో
కదలిక తెచ్చును తెలియగ కాముని కృపయే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచదునుగజేసి హలముతో
రిప్లయితొలగించండిపదునుగ జేయంగపట్టె పదిరోజులకున్
వదలగ నిదియును నిపుడున్
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివదలుకొనలేను తల్లిని
రిప్లయితొలగించండిబదులుగమాటాడలేక భార్యతొ నుంటిన్
కుదురుగ నుండగ, దేవా
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భార్యతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
సదమలవృత్తిమాధవునిసన్నుతిజేసితిడెందమందునన్
రిప్లయితొలగించండిసదనముగట్టితిన్స్మరణసల్పితినిల్పితినాల్కనామమున్
వ్యథలనుగట్టివైచితిజయంబునుగోరితికర్మపాశమే
*యిది, యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”*
పొదలనుమాటువేసితినిబోడులజేరితిమందయానలన్
మదినిదలంచిగొల్చితిసమాదరణీయుడనైతిభోగముల్
ముదిమిమరీచికల్హృదయమోదడియారెనునేడుమాధవా
*యిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిహృదయము పొంగిపోవు కడు నింపగు ప్రేమము సోకి నంతటన్
రిప్లయితొలగించండిసదమల వృత్తి వీనులకు చక్కని గానము సేద తీర్చగా
కొదవ యొకింత లేక చవి గూర్చుచు నా హరి ధ్యానమొక్కటే
ఇది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
-మాచవోలు శ్రీధరరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిపదపడి జీవనమ్ము క్షణభంగురమై స్థిరసౌఖ్యమేగతిన్?
రిప్లయితొలగించండిసదమలసాధువృత్తిఁ గను స్వర్గఫలమ్ము లవెంతొ యంతయే,
తదితరశాశ్వతాప్తసుఖదాయకముక్తనివేశ మెయ్యదో!
ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఇది యని తెలియని భావన
రిప్లయితొలగించండిమెదిలెను మది ముద్దరాలు మెయిమరపింపన్
అది మరుశరమో వరమో
ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచదువులు బాగుగ జదివిన
రిప్లయితొలగించండిబదవులుదానుండునైన బహుళముగాగన్
నెదనాబొందగ దనివిని
యిదియది కానట్టీ దేదొ యిడు మోదమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోదమ్మున్
రిప్లయితొలగించండిగాచదువ వలసినది
కుదురుగ నుండు మెల్లపుడు
రిప్లయితొలగించండిగోరకు మందని కోర్కులేవియున్
పదెపదె చింత జేసినను వల్సిన
దేదియు నంద బోదు నీ
మదినిది గుర్తు పెట్టుకొని మాన
వ నడ్వుము కల్గు శాంతియున్
ఇదియది కానిదేదియొ యదే యి
డు చుండును మోదమెప్పుడున్"
~~~~~~~~~~~~~~~~~
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇది యని కాదు కాదు అదియేనని మానసమందు నిత్యమున్
రిప్లయితొలగించండిసదమదమౌచు నాత్మభవు శాశ్వతు మాయ నెరుంగ లేక నా
కిదె పరమార్థమంచు నిహమీదుచు నీతి చరించు వారికిన్
ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచదువుల తల్లియెప్పుడును సాదయనిండుగనీయవిద్యనున్
రిప్లయితొలగించండిబదవులె నేరుగా గలిగిప్రాఙ్ఞుని జేసిన నైననెంతయున్
మదిగలవారందఱును మాన్యత తోడను మెల్గుచుండుటన్
నిదియదికానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వారలందఱును... వెల్గుచుండగా । నిది యది..." అనండి.
అదనున పెండ్లాడమనుచు
రిప్లయితొలగించండివదలక వెంటాడు జనులు; ఫలిత మదేమన్
బదులుగ గుదిబండ యనును
యిది యది కానట్టిదేదొ యిడుమోదమ్మున్
ముదమున బెండ్లియాడుమని ముద్దుగజెప్పెద
రెందరెందరో
ఇదిమన సంప్రదాయమని యిల్లునుగట్టుచు పోరు
వీనులన్
బదులుగ నేమిలాభమన బాధ్యత బర్వుల
మోతలే యనున్
అదియిది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
ఇదియది కాదు కాదనుచు నింద్రియ, ప్రాణసమూహ మంతయున్
తొలగించండివెదకుచు నిత్యమైన మయి వెల్గెడు నాత్మను ధ్యానమందునన్
ఇదియని చెప్పలేనిదగు నీశ్వరభూతిని మున్గినంతనే
అదియిది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో 'ఫలితమదేమన్'?
తుదిఁ గాంచ విత్త గృహముల్
రిప్లయితొలగించండిసదువులు భార్యా తనయులు శకట క్షోణుల్
పదిలమ్ముగ నీ నేరవె
యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
చదలున నున్న భావము భృశమ్ముగఁ గల్గును దూది మాదిరిం
బదపడి చేయ నీయదు విపన్నునిఁ జేసి పరంబు నెద్ది యే
నెద వడి దూఱి యూహ లవి యింతలు నింతలుఁ బెర్గి వింతగా
నిది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిహృదయము నందున సతతము
రిప్లయితొలగించండికదలెడి దైవంబు నేడు కన్నుల యెదుటన్
సదయుండై యగుపింపగ
నిది యది కానట్టి దేదొనిడు మోదమ్మున్