8, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4846

9-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్”

(లేదా...)

“విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్”

(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

35 కామెంట్‌లు:

  1. అధ్వంబేదియుగానక
    విధ్వంసమొనర్చెనరుడు, విశ్వముమెచ్చన్
    అధ్వంబాతడెకనియెని
    శాధ్వాంతమునందువెలుగుశాంతినిబొందన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    సాధ్వికి వస్త్రాపహరణ
    పృధ్విని పంచంగఁజూపు విముఖతఁ గొలిపే
    యాధ్వాంతము దొలఁగననిని
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్!

    శార్దూలవిక్రీడితము
    సాధ్వీరత్నము ద్రౌపదిన్ సభను వస్త్రాలూడ్చియున్ దుష్టులై
    పృధ్వీభాగము నీయనొప్పకయె శ్రీకృష్ణున్ విభేదించుచున్
    విద్వేషమ్మున రాజరాజు చెలఁగన్ వెన్నుండు తోడై యనిన్
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పూరణలు:

      కందం
      సాధ్వికి వస్త్రాపహరణ
      పృధ్విని పంచంగఁజూపు విముఖతలనఁగా
      నా ధ్వాంతము దొలఁగననిని
      విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్!

      శార్దూలవిక్రీడితము
      సాధ్వీరత్నము ద్రౌపదిన్ సభను వస్త్రాలూడ్చియున్ దుష్టులై
      పృథ్వీభాగము నీయనొప్పకయె శ్రీకృష్ణున్ విభేదించుచున్
      విధ్వస్తమ్మున రాజరాజు చెలఁగన్ వెన్నుండు తోడై యనిన్
      విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్!

      తొలగించండి
  3. అధ్వంబేమియుగానకేభువినిమాయన్గూడిమూఢుండునై
    విధ్వంసంబొనరింపబూనెనరుఁడే, విశ్వమ్ముకీర్తింపగన్
    మధ్వంశంబునవిజ్ఞుడైవెలిగెనావిష్ణుండునాచార్యుడై
    ఆధ్వాంతంబునుమాసిపోయెజగతిలోహంసల్సదాశిష్యులే

    రిప్లయితొలగించండి
  4. అధ్వాన్నంబొనరించి జీవనము వ్యత్యస్తమ్ము గావింపఁగన్
    పృధ్విన్ కోవిడునామ కీటకము తా సృష్టించె నుత్పాతమున్
    విద్వత్తంతయు ప్రోదిచేసుకొని సంభేదించియా కోవిడున్
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. దధ లకు ధథ లకు ప్రాస చెల్లుతుంది. ద/ధ/థ లకు ఒకే పద్యములో ప్రసగా వేయరాదను కుంటాను. పృథ్వి అనే పదం పృధ్వి అన్నారు

      తొలగించండి
  5. విధ్వంసమయ్యెదేశము
    విధ్వంసులకుట్రచేత విశ్వమునందున్
    విధ్వంసకారులనణచ
    *“విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్”*



    విద్వేషమ్మునుపూనిదుష్టులగుచావేళన్విషాదమ్ముతో
    పృధ్వీశుల్గనుచుండగానచటయారేడైనదుర్యోధనుం
    డధ్వానంబగురీతినాతినచటన్ యారళ్ళిడన్ వేగతా
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్”*

    రిప్లయితొలగించండి
  6. కం॥ మధ్విజను గ్రోలి దుష్టులు
    సాధ్వినిఁ జొఱపుచ్చ నటుల సంతాపముతో
    సాధ్వి ప్రతిక్రియఁ గోరఁగ
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్

    శా॥ మాధ్విన్ గ్రోలిన దుష్ట కౌరవులు సమ్మానించి మన్నించకన్
    సాధ్విన్ దల్లడపెట్టగాఁ గుటిలులై సంతాపమొందంగ నా
    సాధ్వీరత్నపు ఘోర దుఃఖమును శస్త్రాస్త్రమ్ములన్ బాపఁగన్
    విధ్వంసంబొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్

    మధ్విజ మాధ్వి మద్యము
    చొఱపుచ్చు తల్లడపెట్టు బాధించు
    నరుడు అర్జునుడు
    నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  7. పృథ్వీశుడంప , దమ్ముడు
    సాధ్వి కుజను జుట్టు బట్టి సభకీడ్చెననిన్
    సాధ్వసమును విడి పగతుల
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్

    రిప్లయితొలగించండి

  8. సాధ్విన్ పరాభవించుచు
    విద్వేషమ్ములను బెంచ విగ్రహమున తా
    నా ధ్వాంతారాతి యగుచు
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్.


    సాధ్వంతుండవు కావు నీవుటుల శస్త్రాస్త్రమ్ములన్ వీడగా
    సాధ్విన్ వంచనచేసినట్టి ఖలులన్ సంహారమున్ సేయ నీ
    విద్వత్తంతయు జూపుమంచనగ పెంపేపారుచున్ యుద్ధమున్
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్.

    రిప్లయితొలగించండి
  9. అధ్వాన్నంబొనరించుచు
    పృధ్విన్ కోవిడను పురుగు విషమును జిమ్మన్
    పృధ్విజనుల గాపాడగ
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్

    రిప్లయితొలగించండి
  10. అధ్వాన్నపు కౌరవతతి
    సాధ్వీమణి వలువలూడ్చి సంతసపడినన్
    విద్వేషముతో రణమున
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్

    అధ్వాన్నంబగుపట్టు నీకు తగునా? ఐదూళ్ళు కాదంటివా?
    విద్వేషాగ్నికిఁ రాజరాజ! ప్రజలన్ విచ్చిల్లగాజేతువా?
    విధ్వస్తమ్మగునోర్పు పాండవులకున్ విస్పష్టమీ యంశమే!
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్!


    రిప్లయితొలగించండి
  11. సాధ్వాలోచన మన్న న
    సాధ్వాలోచన మనిన విచారం బేలన్
    జ్యా ధ్వానము భీతి గొలుప
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్


    అధ్వానమ్మునఁ బాఱ భీతు లయి యత్యంతమ్ము భీమమ్ము లా
    హా ధ్వానమ్ములు పిక్కటిల్లఁగను గట్టా భార తాభిగ్రహై
    కాధ్వభ్రాజిత ధార్త రాష్ట్ర వశ ఘోరైకాద శాక్షోహిణీ
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము కీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి
  12. విద్వేషంబున గురుపతి
    య ధ్వా న్న ము జేయ నెంచ నావే శము తో
    విధ్వంసుల సమరంబు న
    విధ్వంస మొ న ర్చె నరుడు విశ్వము మెచ్చ న్

    రిప్లయితొలగించండి
  13. కం:సాధ్విన్ ద్రౌపది బట్టి దు
    రధ్వమ్మును బూని జ్ఞాతు లవమానింపన్
    పృథ్వాస్త్రమ్ముల కౌరవ
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్”

    రిప్లయితొలగించండి
  14. శా:"సాధ్విన్ ద్రౌపది బట్టితెచ్చిరి,మహాస్వార్థమ్ముతో దుష్టమా
    యాధ్వమ్మున్ గ్రహియించి ద్యూతమున రాజ్యమ్మెల్ల వా రొంద మో
    హధ్వాంతమ్మున సైతువో? యనెడు గీతాచార్యు నుద్బోధ చే
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్”
    (మోహధ్వాంతమ్మున సైతువో=మోహం అనే చీకటి తో సహిస్తావా?)

    రిప్లయితొలగించండి
  15. మధ్యంతర యెన్నికలకు
    నాద్యముగా బాడుపనుల నారంభించన్
    వేద్యులు పలికిరి యిట్లుగ
    విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్

    రిప్లయితొలగించండి
  16. అధ్వాన్నంబుగ నుండ నేత లిక హాహాకార రావంబుతో
    విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే, విశ్వమ్ము గీర్తింపఁగన్
    గద్వాలందున పండితోత్తములు వేగంజేసియాగాదులన్
    సాధ్యంబొప్పెడు శాంతిఁగూర్చిరి మహిన్ జాముండి యాశీసు తోన్

    రిప్లయితొలగించండి
  17. సమస్య: విధ్వంసము నెక్కె నరుడు విశ్వము మెచ్చన్
    క: సాధ్వంతులు నిశ్చయమున
    నధ్వరమును జలిపి నట్టు లవిరళ కృషితో
    పృథ్విని పరిశోధనతో
    విధ్వంసము నెక్కె నరుడు విశ్వము మెచ్చన్

    రిప్లయితొలగించండి