29-8-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే”
(లేదా...)
“రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్”
(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)
కం॥ శోధన విద్యార్థిని కన బాధలు మిగుల కఠినమని వరదాయనియైబోధను జేయఁ జన సఖియరాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభను గంటేఉ॥ శోధనఁ జేయఁ జేరఁగను శోధన కష్టము గాఁగ క్రుంగఁగన్బాధలు హెచ్చి త్రోవఁగను పద్ధతి తోఁచని పాళమందునన్బోధను జేయుదంచు సఖి మోదము తోడఁ జనంగ నెమ్మితోరాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్శోధన విద్యర్థులందరికి ఇది సామాన్యమండి. ఏదో ఒక సమయములో చాలా కష్టపడడము.
శిశుపాలుడు ధర్మరాజుతో....కందంశోధింప వెన్నదొంగకుమాధవునకు నగ్రపూజ మాముందరనా?వేధనమొనర్ప కునుకఁగరాధిక, కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే!ఉత్పలమాలశోధన జేయు వెన్నకని చోరుని రీతిగ గొల్లలిండ్లలోమాధవుడగ్రపూజఁగొన మాన్యుఁడటందువె ధర్మనందనా!వేధనమెందగన్ విటునివిన్ననువందునదోచి చిక్కగన్రాధిక, పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్!(రంభ= ఒక గోపిక పేరుగా భావించి పూరించడమైనది)
శిశుపాలుడు ధర్మరాజుతో....కందంశోధింప వెన్నదొంగకుమాధవునకు నగ్రపూజ మాముందరనా?వేధనమొనర్ప కునుకఁగరాధిక, కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే!ఉత్పలమాలశోధన జేయు వెన్నకని చోరుని రీతిగ గొల్లలిండ్లలోమాధవుడగ్రపూజఁగొన మాన్యుఁడటందువె ధర్మనందనా!వేధనమెందగన్ విటునివిన్ననువందున దోచి సోలఁగన్రాధిక, పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్!(రంభ= ఒక గోపిక పేరుగా భావించి పూరించడమైనది)
శోధన కందని వాడగుమాధవు డగుపించి యపుడె మాయంబగుచున్ వేధించు కృష్ణుడనుకునిరాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే.మాధవ ప్రేరితమ్మగు మానస మామెది యెంచిచూడగాశోధన కందబోడనుచు చూడగ నంటిన నుండు వాడె యామాధవు డంచు నెంచుచును మాలిమితో దరి యచ్చటన్ రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్.(రంభ= అరటిచెట్టు)
రాధిక రంభలిర్వు రనురాగపు నెచ్చెలులొక్క ప్రాణమైబాధలయందు సౌఖ్యముల బాయక నొక్కటియై చరింత్రు సమ్మోదమెసంగ ప్రేముడిని మోహనకృష్ణుడు వెల్లడించగన్రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్
రాధిక రంభకు నెచ్చెలిబాధలలో సుఖములందు బాయకనుండున్మోదమెసఁగ బ్రేముడితోరాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే
ఈ ధరలోఁ గాంచఁ బ్రణయగాధలు వర్ధిల్లుఁ బెక్కు కంతు కృత మనో బాధను నలకూబరుఁ డో రాధిక! కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే నా ధవుఁ డేడ కేఁగె నని నాఁతి మరుండు కడింది యేఁప నా బాధను దాళ లే కరఁటి పాదప మాని సలీల నిల్చె నా మాధవుఁ డేఁగు దెంచి యని మానస మందు భ్రమించి నట్టి యారాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్ [రంభ = అరఁటి]
రాధిక వేదన గాంచియు బాధను బాపంగ రంభ వైద్యము జేసెన్ మోదము జెందియు న య్యె డ రాధిక కౌగిట ను జే ర్చె రంభను గంటే
కం:మాధవుని బొంద నప్సరలే ధన్యలు కారొ! ధాత యేలనొ యీ ప్రేమాధిక్యాకర్షణ లిడిరాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే”(మాధవుణ్ని పొందితే అప్సరసలు కూడా అదృష్టవంతులే కానీ బ్రహ్మదేవుడు రాధిక లో ఎంత ఆకర్షణ ఉంచాడో! ఆమె కౌగిట్లో ఒక రంభని ప్రతిష్ఠించాడు.)
ఉ:మాధవు జాడనే కనక మాపటి వేళన వేచి వేచి యామాధవు జూచినంతటనె మన్మథ తాపము తోడ కౌగిటన్మాధవు జేర్చె నీ ఘటన మా కవనమ్మున నిట్లు చెప్పనౌ"రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్”(రాధ మాధవుణ్ని కౌగిట జేర్చిన సంఘటనని కవులు వర్ణిస్తే-ఆమె మాధవుని కౌగిట్లో ఒక రంభను చేర్చింది అని చెప్ప వచ్చు.)
రాధిక రంభలు మిత్రులు మోదముతో నొకరికొకరు ముద్దుల తోడన్ గాదన కుండగ నుండగ రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే
రాధిక రంభలిర్వురును రాచరికంబున నుండనౌటచే మోదముఁజెందుచున్ దనరి ముద్దుల వర్షముఁగుర్వఁజేయ యారాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్ సాదరమొప్పవారలిక సంతసమొందుచు నుండెనిర్వురున్
కం॥ శోధన విద్యార్థిని కన
రిప్లయితొలగించండిబాధలు మిగుల కఠినమని వరదాయనియై
బోధను జేయఁ జన సఖియ
రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభను గంటే
ఉ॥ శోధనఁ జేయఁ జేరఁగను శోధన కష్టము గాఁగ క్రుంగఁగన్
బాధలు హెచ్చి త్రోవఁగను పద్ధతి తోఁచని పాళమందునన్
బోధను జేయుదంచు సఖి మోదము తోడఁ జనంగ నెమ్మితో
రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్
శోధన విద్యర్థులందరికి ఇది సామాన్యమండి. ఏదో ఒక సమయములో చాలా కష్టపడడము.
శిశుపాలుడు ధర్మరాజుతో....
రిప్లయితొలగించండికందం
శోధింప వెన్నదొంగకు
మాధవునకు నగ్రపూజ మాముందరనా?
వేధనమొనర్ప కునుకఁగ
రాధిక, కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే!
ఉత్పలమాల
శోధన జేయు వెన్నకని చోరుని రీతిగ గొల్లలిండ్లలో
మాధవుడగ్రపూజఁగొన మాన్యుఁడటందువె ధర్మనందనా!
వేధనమెందగన్ విటునివిన్ననువందునదోచి చిక్కగన్
రాధిక, పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్!
(రంభ= ఒక గోపిక పేరుగా భావించి పూరించడమైనది)
శిశుపాలుడు ధర్మరాజుతో....
తొలగించండికందం
శోధింప వెన్నదొంగకు
మాధవునకు నగ్రపూజ మాముందరనా?
వేధనమొనర్ప కునుకఁగ
రాధిక, కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే!
ఉత్పలమాల
శోధన జేయు వెన్నకని చోరుని రీతిగ గొల్లలిండ్లలో
మాధవుడగ్రపూజఁగొన మాన్యుఁడటందువె ధర్మనందనా!
వేధనమెందగన్ విటునివిన్ననువందున దోచి సోలఁగన్
రాధిక, పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్!
(రంభ= ఒక గోపిక పేరుగా భావించి పూరించడమైనది)
రిప్లయితొలగించండిశోధన కందని వాడగు
మాధవు డగుపించి యపుడె మాయంబగుచున్
వేధించు కృష్ణుడనుకుని
రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే.
మాధవ ప్రేరితమ్మగు మానస మామెది యెంచిచూడగా
శోధన కందబోడనుచు చూడగ నంటిన నుండు వాడె యా
మాధవు డంచు నెంచుచును మాలిమితో దరి యచ్చటన్
రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్.
(రంభ= అరటిచెట్టు)
రాధిక రంభలిర్వు రనురాగపు నెచ్చెలులొక్క ప్రాణమై
రిప్లయితొలగించండిబాధలయందు సౌఖ్యముల బాయక నొక్కటియై చరింత్రు స
మ్మోదమెసంగ ప్రేముడిని మోహనకృష్ణుడు వెల్లడించగన్
రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్
రాధిక రంభకు నెచ్చెలి
రిప్లయితొలగించండిబాధలలో సుఖములందు బాయకనుండున్
మోదమెసఁగ బ్రేముడితో
రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే
ఈ ధరలోఁ గాంచఁ బ్రణయ
రిప్లయితొలగించండిగాధలు వర్ధిల్లుఁ బెక్కు కంతు కృత మనో
బాధను నలకూబరుఁ డో
రాధిక! కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే
నా ధవుఁ డేడ కేఁగె నని నాఁతి మరుండు కడింది యేఁప నా
బాధను దాళ లే కరఁటి పాదప మాని సలీల నిల్చె నా
మాధవుఁ డేఁగు దెంచి యని మానస మందు భ్రమించి నట్టి యా
రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్
[రంభ = అరఁటి]
రాధిక వేదన గాంచియు
రిప్లయితొలగించండిబాధను బాపంగ రంభ వైద్యము జేసెన్
మోదము జెందియు న య్యె డ
రాధిక కౌగిట ను జే ర్చె రంభను గంటే
కం:మాధవుని బొంద నప్సర
రిప్లయితొలగించండిలే ధన్యలు కారొ! ధాత యేలనొ యీ ప్రే
మాధిక్యాకర్షణ లిడి
రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే”
(మాధవుణ్ని పొందితే అప్సరసలు కూడా అదృష్టవంతులే కానీ బ్రహ్మదేవుడు రాధిక లో ఎంత ఆకర్షణ ఉంచాడో! ఆమె కౌగిట్లో ఒక రంభని ప్రతిష్ఠించాడు.)
ఉ:మాధవు జాడనే కనక మాపటి వేళన వేచి వేచి యా
రిప్లయితొలగించండిమాధవు జూచినంతటనె మన్మథ తాపము తోడ కౌగిటన్
మాధవు జేర్చె నీ ఘటన మా కవనమ్మున నిట్లు చెప్పనౌ
"రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్”
(రాధ మాధవుణ్ని కౌగిట జేర్చిన సంఘటనని కవులు వర్ణిస్తే-ఆమె మాధవుని కౌగిట్లో ఒక రంభను చేర్చింది అని చెప్ప వచ్చు.)
రాధిక రంభలు మిత్రులు
రిప్లయితొలగించండిమోదముతో నొకరికొకరు ముద్దుల తోడన్
గాదన కుండగ నుండగ
రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే
రాధిక రంభలిర్వురును రాచరికంబున నుండనౌటచే
రిప్లయితొలగించండిమోదముఁజెందుచున్ దనరి ముద్దుల వర్షముఁగుర్వఁజేయ యా
రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్
సాదరమొప్పవారలిక సంతసమొందుచు నుండెనిర్వురున్