15-8-2024 (గురువారం)
కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము”
(లేదా...)
“తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”
తేటగీతిచిలకమర్తివారలు నాడు చెప్పినట్లుతెల్లవారను గడుసరి గొల్లలపుడుసొంతవారు దుర్మార్గులై వంతలిడఁగదక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము?మత్తేభవిక్రీడితముఅలనాడార్తిగ మాన్యులై చిలకమర్త్యాఖ్యుల్ విలాపించెనన్పలుకుల్; తెల్లలు గొల్లలై భరతభూభాగంబునన్ దోచగన్విలువల్ మృగ్యమనంగ పాలకులు నిర్వీర్యమ్ము నేడెంచఁగన్దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్?
ఓటు విలువ నెరుగని వయోజనులిటమద్యమాశించి మిగుల దుర్మతుల మెచ్చప్రభువులుగ గెల్చు నీచుల పాలనమునదక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము.కలియమ్మాశకు నోటు నమ్ముకొను నిర్గ్రందుండ్రె కోకొల్లలైఖలులన్ మెచ్చుచు నోటువేయగను దుష్కార్యమ్ములే చేయుచున్ బలహీనుండ్ర దమించు నేతలిల సంప్రాప్తించి పాలింపగాతలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్.
జై హింద్గట్టిసంకల్పబలమున గామిగాకచిత్తమరయక స్వేచ్ఛను చీడ బట్టిఅంథమనుకరణమ్మును నాసజేయదక్కునభరతభూమికిస్వాతంత్య్రఫలము
తే॥ హక్కుభుక్తము లన్నియుఁ జక్కఁగానుగొందరే పొందఁగన్ దేశమందు నిటులనర్భకులు కలతఁ బడఁగ నాశలుడుగిదక్కున భరత భువిని స్వాతంత్ర్యఫలము మ॥ కలయేఁ గాదొకొ దేశసంపదలు స్వీకారమ్ముఁ జేయన్ గనన్జలగల్ వోలెను గొల్లగొట్టుచు నిటుల్ సాంతమ్ముగాఁ గొందరేబలిమిన్ జూపుచు సర్వులున్ మనఁగ సౌభాగ్యమ్ముఁ బ్రాప్తించఁగన్దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
అన్యదేశపు పాలకులణచివేయవిడుపు నొందియు , నీనాటివిభుల వింతపోకడలను గనిన శంకపుట్టు నిటులదక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము ?
దేశ భక్తులు మిక్కిలి దీక్ష బూనలభ్య. మయ్యెను స్వాతంత్ర్య లక్ష్మి మనకు దుష్ట నేతల న్ పాలనన్ దొచె నిపుడు దక్కున భరత భువికి స్వాతంత్ర్య ఫలము?
మూడవ పాదంలో దుష్ట నేతల పాలనన్ దో చె నిపుడు అని సవరణ చేయడమైనది
ఒక్కటై తెల్ల వారిని ధిక్కరించిచిక్కినారము నేతల చేతలందుమిక్కుటంబుగ నేతలే మెక్కుచుండదక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలముకలకాలమ్మభివృద్ధి చెందు దిశలో కన్పట్టు నాదేశమేయిలసాధింపగ నేర్చునొక్కొ విభవమ్మేనాటి కైనన్ సదాగెలుపోటంబుల పైన ధృక్కులు వినా కేండ్రింతురా దైన్యమున్తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
దృక్కులు....
కలగంటిన్ గలలోన భారతినహో కన్నీరు మున్నీరుగావిలపించన్ గనుగొంటి బిడ్డలను నిర్వేదంబుగా జూచుచున్ఖలులై స్వార్థముతోచరించి ప్రగతిన్ గావింపఁగా ధ్వంసమున్తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
ఎక్కితిరి యందలమ్ములు సక్క జనులు చిక్కు లెల్లఁ దొలంగిన వక్కజముగఁ దక్కు పలుకంగ వాక్కులు నొక్కి యిట్లు దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము తొలఁగెన్ శృంఖలముల్ పరాంగ్ల జన దుర్దోర్దండ బంధమ్ములుం దొలఁగెన్ వర్ణ విభేదముల్ మనకు సంతోషమ్ము లేపారఁగాఁ దొలఁగం జూడము వర్ణ భేదముల నెందుం గొంచె మైనం గటా తలపోయన్ భరతాంబ పొందు నొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే.గీ:దక్కె స్వాతంత్ర్య మనగ మతమ్ము కొరకుముక్క లయ్యె దేశము, చీలి పోగ మిగులుదేశమున హెచ్చ కులమతా వేశము లికదక్కునె భరతభువికి స్వాతంత్ర్యఫలము?
మ:తలచెన్ గాంధి మహాత్ముడై యిటుల స్వాతంత్ర్యమ్ము నామార్ధమే?కులమున్ జూచుచు నిమ్నజాతులనుచున్ క్రూరంపు టాచారమైవెలి వేయన్ మన వారి,వారి కిలలో స్వేచ్ఛన్ నివారించుటన్ దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”(మన మనుషులనే మనం స్వేచ్ఛ లేని వారిగా చేసి వెలివేస్తే,అస్పృశ్యత పాటిస్తే దేశానికి స్వాతంత్ర్యం నామమాత్రమే అని గాంధీజీ భావించారు.)
కులతత్వంబు మతంపు మత్సరము లెక్కొల్పంగ దుష్టాత్ములావలలన్ జిక్కి వివేకమున్ విడిచి సౌభ్రాత్రంబు మన్నింపకేకలహంబే పరమార్థమై జనులహంకారంబునే వీడరేతలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
భరతమాతకు దాస్యమ్ముఁ బాపు కొరకుపణముగానొడ్డిరెందరో ప్రాణములనెయట్టి మహనీయ మూర్తుల త్యాగనిరతిదక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము
కలుషాత్ముల్ నరరూపరాక్షసులయో కామాంధులా కీచకుల్ కలలే కల్లలు జేసి కొమ్మను బలాత్కారంబునన్ ద్రుంచిరేవిలువేలేదిట ప్రాణమానములకున్ వేధింపులే నిత్యమైతలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
ఇలలో చూడ నరాచకమ్ము లవియున్ హెచ్చన్ గదా చూడగా విలువల్ తగ్గెను మంచి కార్యములకున్ విశ్వమ్ము నందెల్లడన్ ఛలమున్ వీడక సాగుతున్న నికపై సత్కార్యముల్సాగవే*“తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”*
గాంధికన్నట్టికలలెల్ల కల్లలాయెయోటువిలువ నెరుంగక నోట్ల కమ్ముకొనెడిసంఖ్యయధికమయ్యెకువలయాన*“దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము”*
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. విలువ తెలియక వోటును విక్రయించకొనుచు నధికార పీఠమున్ గొనెడు నేతలున్న, ప్రజలకు మేలు చేకూరుటెట్లుదక్కున భరత భువికి స్వాతంత్ర్య ఫలము?
తేటగీతి
రిప్లయితొలగించండిచిలకమర్తివారలు నాడు చెప్పినట్లు
తెల్లవారను గడుసరి గొల్లలపుడు
సొంతవారు దుర్మార్గులై వంతలిడఁగ
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము?
మత్తేభవిక్రీడితము
అలనాడార్తిగ మాన్యులై చిలకమర్త్యాఖ్యుల్ విలాపించెనన్
పలుకుల్; తెల్లలు గొల్లలై భరతభూభాగంబునన్ దోచగన్
విలువల్ మృగ్యమనంగ పాలకులు నిర్వీర్యమ్ము నేడెంచఁగన్
దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్?
రిప్లయితొలగించండిఓటు విలువ నెరుగని వయోజనులిట
మద్యమాశించి మిగుల దుర్మతుల మెచ్చ
ప్రభువులుగ గెల్చు నీచుల పాలనమున
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము.
కలియమ్మాశకు నోటు నమ్ముకొను నిర్గ్రందుండ్రె కోకొల్లలై
ఖలులన్ మెచ్చుచు నోటువేయగను దుష్కార్యమ్ములే చేయుచున్
బలహీనుండ్ర దమించు నేతలిల సంప్రాప్తించి పాలింపగా
తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్.
జై హింద్
రిప్లయితొలగించండిగట్టిసంకల్పబలమున గామిగాక
చిత్తమరయక స్వేచ్ఛను చీడ బట్టి
అంథమనుకరణమ్మును నాసజేయ
దక్కునభరతభూమికిస్వాతంత్య్రఫలము
తే॥ హక్కుభుక్తము లన్నియుఁ జక్కఁగాను
రిప్లయితొలగించండిగొందరే పొందఁగన్ దేశమందు నిటుల
నర్భకులు కలతఁ బడఁగ నాశలుడుగి
దక్కున భరత భువిని స్వాతంత్ర్యఫలము
మ॥ కలయేఁ గాదొకొ దేశసంపదలు స్వీకారమ్ముఁ జేయన్ గనన్
జలగల్ వోలెను గొల్లగొట్టుచు నిటుల్ సాంతమ్ముగాఁ గొందరే
బలిమిన్ జూపుచు సర్వులున్ మనఁగ సౌభాగ్యమ్ముఁ బ్రాప్తించఁగన్
దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
అన్యదేశపు పాలకులణచివేయ
రిప్లయితొలగించండివిడుపు నొందియు , నీనాటివిభుల వింత
పోకడలను గనిన శంకపుట్టు నిటుల
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము ?
దేశ భక్తులు మిక్కిలి దీక్ష బూన
రిప్లయితొలగించండిలభ్య. మయ్యెను స్వాతంత్ర్య లక్ష్మి మనకు
దుష్ట నేతల న్ పాలనన్ దొచె నిపుడు
దక్కున భరత భువికి స్వాతంత్ర్య ఫలము?
మూడవ పాదంలో దుష్ట నేతల పాలనన్ దో చె నిపుడు అని సవరణ చేయడమైనది
తొలగించండిఒక్కటై తెల్ల వారిని ధిక్కరించి
రిప్లయితొలగించండిచిక్కినారము నేతల చేతలందు
మిక్కుటంబుగ నేతలే మెక్కుచుండ
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము
కలకాలమ్మభివృద్ధి చెందు దిశలో కన్పట్టు నాదేశమే
యిలసాధింపగ నేర్చునొక్కొ విభవమ్మేనాటి కైనన్ సదా
గెలుపోటంబుల పైన ధృక్కులు వినా కేండ్రింతురా దైన్యమున్
తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
దృక్కులు....
తొలగించండికలగంటిన్ గలలోన భారతినహో కన్నీరు మున్నీరుగా
రిప్లయితొలగించండివిలపించన్ గనుగొంటి బిడ్డలను నిర్వేదంబుగా జూచుచున్
ఖలులై స్వార్థముతోచరించి ప్రగతిన్ గావింపఁగా ధ్వంసమున్
తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
ఎక్కితిరి యందలమ్ములు సక్క జనులు
రిప్లయితొలగించండిచిక్కు లెల్లఁ దొలంగిన వక్కజముగఁ
దక్కు పలుకంగ వాక్కులు నొక్కి యిట్లు
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము
తొలఁగెన్ శృంఖలముల్ పరాంగ్ల జన దుర్దోర్దండ బంధమ్ములుం
దొలఁగెన్ వర్ణ విభేదముల్ మనకు సంతోషమ్ము లేపారఁగాఁ
దొలఁగం జూడము వర్ణ భేదముల నెందుం గొంచె మైనం గటా
తలపోయన్ భరతాంబ పొందు నొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ:దక్కె స్వాతంత్ర్య మనగ మతమ్ము కొరకు
రిప్లయితొలగించండిముక్క లయ్యె దేశము, చీలి పోగ మిగులు
దేశమున హెచ్చ కులమతా వేశము లిక
దక్కునె భరతభువికి స్వాతంత్ర్యఫలము?
మ:తలచెన్ గాంధి మహాత్ముడై యిటుల స్వాతంత్ర్యమ్ము నామార్ధమే?
రిప్లయితొలగించండికులమున్ జూచుచు నిమ్నజాతులనుచున్ క్రూరంపు టాచారమై
వెలి వేయన్ మన వారి,వారి కిలలో స్వేచ్ఛన్ నివారించుటన్
దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”
(మన మనుషులనే మనం స్వేచ్ఛ లేని వారిగా చేసి వెలివేస్తే,అస్పృశ్యత పాటిస్తే దేశానికి స్వాతంత్ర్యం నామమాత్రమే అని గాంధీజీ భావించారు.)
కులతత్వంబు మతంపు మత్సరము లెక్కొల్పంగ దుష్టాత్ములా
రిప్లయితొలగించండివలలన్ జిక్కి వివేకమున్ విడిచి సౌభ్రాత్రంబు మన్నింపకే
కలహంబే పరమార్థమై జనులహంకారంబునే వీడరే
తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
భరతమాతకు దాస్యమ్ముఁ బాపు కొరకు
రిప్లయితొలగించండిపణముగానొడ్డిరెందరో ప్రాణములనె
యట్టి మహనీయ మూర్తుల త్యాగనిరతి
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలుషాత్ముల్ నరరూపరాక్షసులయో కామాంధులా కీచకుల్
రిప్లయితొలగించండికలలే కల్లలు జేసి కొమ్మను బలాత్కారంబునన్ ద్రుంచిరే
విలువేలేదిట ప్రాణమానములకున్ వేధింపులే నిత్యమై
తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్
ఇలలో చూడ నరాచకమ్ము లవియున్ హెచ్చన్ గదా చూడగా
రిప్లయితొలగించండివిలువల్ తగ్గెను మంచి కార్యములకున్ విశ్వమ్ము నందెల్లడన్
ఛలమున్ వీడక సాగుతున్న నికపై సత్కార్యముల్సాగవే
*“తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగాంధికన్నట్టికలలెల్ల కల్లలాయె
రిప్లయితొలగించండియోటువిలువ నెరుంగక నోట్ల కమ్ము
కొనెడిసంఖ్యయధికమయ్యెకువలయాన
*“దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
విలువ తెలియక వోటును విక్రయించ
కొనుచు నధికార పీఠమున్ గొనెడు నేత
లున్న, ప్రజలకు మేలు చేకూరుటెట్లు
దక్కున భరత భువికి స్వాతంత్ర్య ఫలము?