28-8-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దానము శాపముగ మారె దాతకు భువిలో”
(లేదా...)
“దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే”
(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)
కందంహీనమని వామనుఁడడుగఁబూనిక బలి మూడడుగుల భూమిడుదనఁగానానె ద్రివిక్రమునిగఁ గొనిదానము శాపముగ మారె దాతకు భువిలో!
ఉత్పలమాలహీనము భూమిమూడడగులెంచ నటంచు బలీంద్రుఁడొప్పఁగన్బూని త్రివిక్రముండనఁగ భూమినినింగిని రెండుపాదముల్తానుగ నింపి వామనుడు తాచెను మూడవదుంచి శీర్షమున్దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే!
సూనుని గావగ నింద్రుడు భానుని సుతు కర్ణుని గని వాంఛ ను దెలుపన్ మౌనముగా కవచ మొసగదానము శాపము గ మారె దాతకు భువిలో
ఆ నరుని తక్క నేనుత్థానమునన్ జిక్కనేమి తక్కిన సుతులన్ బోనడచననిన యా వా గ్దానము శాపముగ మారె దాతకు భువిలోసూనుడ నంచు వచ్చితివి శుశ్రువుగా నిది యాలకింపు ముత్థానము నందు ఫల్గునుని తక్క మరొక్క సుతుండు చిక్కినన్ నేనట సంహరింపనిది నిశ్చయ మంచు నొసంగినట్టి వాగ్దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే.
మానక మద్యము త్రాగగనానాటికి కుశలమునకు నష్టినొసగుటన్పానము జేయుటకయి ధనదానము శాపముగ మారె దాతకు భువిలో
దానమునడుగంగాబలినానారాయణుడుతానునర్భకునివలెన్ మానుగ మూడడుగులుడుగ*"దానము శాపముగ మారె దాతకు భువిలో”*దానవచక్రవర్తినటదానమువేడగవచ్చె శ్రీశుడున్మానవరూపుతోసభకుమానుగదండకమండలమ్ములన్తానటచేతులందునిచి ధాత్రిని కోరగ మూడపాదముల్ *“దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ దానమునకు ధనవనరులఁదాను గనిన విధము నుడువఁ దప్పదటంచున్మానకఁ బ్రభుత్వము తెలుపదానము శాపముగ మారె దాతకు భువిలోఉ॥ దానము సేయు విత్తమును ధర్మముఁ దప్పక నెట్లు పొందితోమానకఁ దెల్పఁగా వలయు మన్నన సేసి ప్రభుత్వ యాజ్ఞలన్గానకఁ నీవు వర్తిలగఁ గష్టముఁ దప్పుదటంచు నందురే!దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే(నేటి సామాజిక ఆదాయ పన్నుల నిబంధనలననుసరించి యండి)
ఉ॥ 3వ పాదము చివర దప్పదటంచు నందురే లో పొరపాటున దప్పుదటంచు అని వ్రాసానండి. Typing error
మానస ముప్పొంగఁ దగని వానికి వాంఛిత మెఱుగక పన్నుగ నొసఁగన్ దానవున కుమా పతి వర దానము శాపముగ మారె దాతకు భువిలో మానక నిర్జరాలి కవమాన మొసంగుచు నుండి యోటమిం గానని వాని కక్కజముగా బవరమ్మున రోష చిత్తుఁడై రా నిడ మచ్చ రావణు నురమ్మున శక్రుని ప్రాగ్దిశా సదా దానము శాప మయ్యెఁ గద దాతకు నీ భువి లోనఁ గంటివే [సదాదానము= ఏనుఁగు; దాతకు = యుద్ధ దాతకు]
కం: మా నాన్న కేమి యుంచకయేనాడును దాన మొక్కటే గొప్ప యటం చీనాడు పేద యయ్యెను దానము శాపముగ మారె దాతకు భువిలో”(ఇక్కడ దాత కాదు.తాత సరళాదేశం తో దాత.)
దానము గోరి వామనుడు దైత్యవరున్ బలి యుక్కడంచెతాదానము గోరె దేవపతి తాపను వర్మము కుండలమ్ములన్దానమొసంగి యిర్వురును తద్దయు నొందిరి భంగపాటునేదానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే
తాపనుఁడు=కర్ణుడు
తానడిగెను మూడడుగులుదానవపతి బలిని హరియె దానమునీయన్దానమొసఁగి భంగపడెనుదానము శాపముగ మారె దాతకు భువిలో
దానపుటర్హత గలిగిన వానికినేయీయవలయుఁబైకము వసుధన్ దానముఁజేసిన యాబలి దానము శాపముగ మారె దాతకు భువిలో
దానముఁజేయగావలయుదాతలు తప్పక పేదవానికిన్ వానికి దానమేయిడును భాగ్యము సంపద యెల్లవారికిన్ దానముఁజేసియా బలియె ధర్మము నిల్ప,చూడగన్ దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. తానిడె దానము వటునికికానక నాపదను బలి, యొక యడుగు తోడన్తానేగెను పాతాళముదానము శాపముగ మారె దాతకు భువిలో.
కందం
రిప్లయితొలగించండిహీనమని వామనుఁడడుగఁ
బూనిక బలి మూడడుగుల భూమిడుదనఁగా
నానె ద్రివిక్రమునిగఁ గొని
దానము శాపముగ మారె దాతకు భువిలో!
ఉత్పలమాల
తొలగించండిహీనము భూమిమూడడగులెంచ నటంచు బలీంద్రుఁడొప్పఁగన్
బూని త్రివిక్రముండనఁగ భూమినినింగిని రెండుపాదముల్
తానుగ నింపి వామనుడు తాచెను మూడవదుంచి శీర్షమున్
దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే!
సూనుని గావగ నింద్రుడు
రిప్లయితొలగించండిభానుని సుతు కర్ణుని గని వాంఛ ను దెలుపన్
మౌనముగా కవచ మొసగ
దానము శాపము గ మారె దాతకు భువిలో
రిప్లయితొలగించండిఆ నరుని తక్క నేను
త్థానమునన్ జిక్కనేమి తక్కిన సుతులన్
బోనడచననిన యా వా
గ్దానము శాపముగ మారె దాతకు భువిలో
సూనుడ నంచు వచ్చితివి శుశ్రువుగా నిది యాలకింపు ము
త్థానము నందు ఫల్గునుని తక్క మరొక్క సుతుండు చిక్కినన్
నేనట సంహరింపనిది నిశ్చయ మంచు నొసంగినట్టి వా
గ్దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే.
మానక మద్యము త్రాగగ
రిప్లయితొలగించండినానాటికి కుశలమునకు నష్టినొసగుటన్
పానము జేయుటకయి ధన
దానము శాపముగ మారె దాతకు భువిలో
దానమునడుగంగాబలి
రిప్లయితొలగించండినానారాయణుడుతానునర్భకునివలెన్
మానుగ మూడడుగులుడుగ
*"దానము శాపముగ మారె దాతకు భువిలో”*
దానవచక్రవర్తినటదానమువేడగవచ్చె శ్రీశుడున్
మానవరూపుతోసభకుమానుగదండకమండలమ్ములన్
తానటచేతులందునిచి ధాత్రిని కోరగ మూడపాదముల్
*“దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ దానమునకు ధనవనరులఁ
రిప్లయితొలగించండిదాను గనిన విధము నుడువఁ దప్పదటంచున్
మానకఁ బ్రభుత్వము తెలుప
దానము శాపముగ మారె దాతకు భువిలో
ఉ॥ దానము సేయు విత్తమును ధర్మముఁ దప్పక నెట్లు పొందితో
మానకఁ దెల్పఁగా వలయు మన్నన సేసి ప్రభుత్వ యాజ్ఞలన్
గానకఁ నీవు వర్తిలగఁ గష్టముఁ దప్పుదటంచు నందురే!
దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే
(నేటి సామాజిక ఆదాయ పన్నుల నిబంధనలననుసరించి యండి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఉ॥ 3వ పాదము చివర దప్పదటంచు నందురే లో పొరపాటున దప్పుదటంచు అని వ్రాసానండి. Typing error
తొలగించండిమానస ముప్పొంగఁ దగని
రిప్లయితొలగించండివానికి వాంఛిత మెఱుగక పన్నుగ నొసఁగన్
దానవున కుమా పతి వర
దానము శాపముగ మారె దాతకు భువిలో
మానక నిర్జరాలి కవమాన మొసంగుచు నుండి యోటమిం
గానని వాని కక్కజముగా బవరమ్మున రోష చిత్తుఁడై
రా నిడ మచ్చ రావణు నురమ్మున శక్రుని ప్రాగ్దిశా సదా
దానము శాప మయ్యెఁ గద దాతకు నీ భువి లోనఁ గంటివే
[సదాదానము= ఏనుఁగు; దాతకు = యుద్ధ దాతకు]
కం: మా నాన్న కేమి యుంచక
రిప్లయితొలగించండియేనాడును దాన మొక్కటే గొప్ప యటం
చీనాడు పేద యయ్యెను
దానము శాపముగ మారె దాతకు భువిలో”
(ఇక్కడ దాత కాదు.తాత సరళాదేశం తో దాత.)
దానము గోరి వామనుడు దైత్యవరున్ బలి యుక్కడంచెతా
రిప్లయితొలగించండిదానము గోరె దేవపతి తాపను వర్మము కుండలమ్ములన్
దానమొసంగి యిర్వురును తద్దయు నొందిరి భంగపాటునే
దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే
తాపనుఁడు=కర్ణుడు
తొలగించండితానడిగెను మూడడుగులు
రిప్లయితొలగించండిదానవపతి బలిని హరియె దానమునీయన్
దానమొసఁగి భంగపడెను
దానము శాపముగ మారె దాతకు భువిలో
దానపుటర్హత గలిగిన
రిప్లయితొలగించండివానికినేయీయవలయుఁబైకము వసుధన్
దానముఁజేసిన యాబలి
దానము శాపముగ మారె దాతకు భువిలో
దానముఁజేయగావలయుదాతలు తప్పక పేదవానికిన్
రిప్లయితొలగించండివానికి దానమేయిడును భాగ్యము సంపద యెల్లవారికిన్
దానముఁజేసియా బలియె ధర్మము నిల్ప,చూడగన్
దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
తానిడె దానము వటునికి
కానక నాపదను బలి, యొక యడుగు తోడన్
తానేగెను పాతాళము
దానము శాపముగ మారె దాతకు భువిలో.