9, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4847

10-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్”

(లేదా...)

“పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా”

(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

  1. విల్లును పట్టిన పార్కును
    నల్లనజూచియుతడబడి యారాజుమదిన్
    తల్లడమందుచుతాకం
    పిల్లంగని, పాండవులను భీష్ముడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    విల్లందిమత్స్యయంత్రము
    పెల్లున ఛేదించి పొంది పృథ యానతితో
    నుల్లమలర పతులైనన్
    పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      విల్లంబుల్ దగఁ గూర్చి మత్స్యపు మరన్ బీభత్సుఁడున్ద్రుంచఁగన్
      ఝల్లంచున్ హృదిపొంగ ద్రౌపదికి, నుత్సాహించి కుంతీమదిన్
      జెల్లింపన్ బతులౌచు రాగమున రంజిల్లన్ విభాగమ్మునన్
      పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా!

      తొలగించండి

  3. పల్లెలలో నివ సించెడి
    పల్లియల యవస్థలను గని పరితాపముతో
    పిల్లల కనుదోయియె చి
    ప్పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్.

    . (విరించి)

    రిప్లయితొలగించండి
  4. చెల్లెన్కాలముకౌరవాదులకువాసిన్వీడరాజ్యంబులో
    విల్లున్బూనియువేగపార్థుడనిలోవిశృఖలుండైగనన్
    వల్లన్మాలినబాహువిక్రమముతాపంబందరారాజుకం
    పిల్లన్గన్గొనిపాండురాట్తనయులన్భీష్ముండుమెచ్చెన్గదా

    రిప్లయితొలగించండి
  5. తల్ల డ మందగ రాజులు
    విల్లును గొని యును గొట్టె విజయుడు మీనున్
    చెల్లెను ద్రౌపది సతి యై
    పిల్లం గని పాండవులను భీష్ముడు మెచ్చె న్

    రిప్లయితొలగించండి

  6. తల్లిన్ గైకొని లక్కయిల్లు విడి గోత్రాముండ్ర వేషమ్ముతో
    నిల్లిల్లుల్ తిరుగాడు బాధలవి మీకేరీతి వాచింపగన్
    గల్లోలుండ్ర కిరాతకమ్ములను వక్కాణింపగా కండ్లు చి
    ప్పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా.

    రిప్లయితొలగించండి
  7. పిల్ల లయిదుగును బెరిగిరి
    తల్లిని కడు భక్తితోడ దనరుచు నుండన్
    ఎల్ల చదువులందున శో
    భిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ విల్లును ధరించి తెలుపరొ
    యల్లన తరుశాఖ పైన నగుపడినదియే!
    నల్లని పులుఁగన విజయుడు
    బిల్లంగని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్

    శా॥ విల్లంబుల్ గొని శస్త్ర విద్యలను నేర్పించంగ బోధించుచున్
    మెల్లంగా గురిపెట్టి చెప్పుమనఁగన్ మీకేమి కన్పట్టెనో
    విల్లంబుల్ గొని పార్థుఁడచ్చటఁ గనన్ బిట్టన్ మహీజమ్ముపై
    పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా!

    చిన్నప్పుడు విన్నదండి. పాండవులకు కౌరవులకు విలు విద్య నేర్పే సమయంలో చెట్టుపైన ఉన్న పక్షికి గురి పెట్టి మీకేమి కనపడిందో చెప్పుమంటే కేవలము అర్జునుడు నాకు పక్షితప్ప మరేమీ కనబడలేదు అంటాడట. దాని ఆధారంగానండి

    రిప్లయితొలగించండి
  9. కొల్లలుగ యుద్ధ విద్యల
    నెల్లన్ ద్రోణుని కడ గడియించియు మించన్
    దెల్లమగు పౌరుషము చి
    ప్పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  10. అల్లన కృష్ణుడు సారధి
    నెల్లలు దాటంగఁగాంతిఁనీప్సిత యశుడై,
    దెల్లము రణమున ధరకం
    పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు
    (లేదా...)

    రిప్లయితొలగించండి
  11. విల్లూని నరుఁడు మత్స్యపుఁ
    బిల్లను నలవోకఁ గొట్ట వెసఁ జేపట్టన్
    నల్లని కన్యను ద్రుపదుని
    పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్


    సల్లాపమ్ముల సున్నితత్వము మహా సత్కార్య సంప్రీతినిం
    గల్లోలౌఘము భీత మానసములం గంపింప వీక్షింపఁగాఁ
    నల్లోకోన్నత నైపుణమ్ము నిజ శస్త్రాస్త్రమ్ములన్ వారు సొం
    పిల్లం గన్గొని పాండు రాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా

    [కల్లోలుఁడు = శత్రువు]

    రిప్లయితొలగించండి
  12. కం:విల్లున్ గొని యర్జునుడు,గు
    భిల్లన గదబూని చెలగ భీముడు, నాజిన్
    గొల్లున కురుసేనలు దుర
    పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్”

    రిప్లయితొలగించండి
  13. శా:విల్లంబుల్ గొనినంత పాండవులదే వీరత్వ మంచెంచ గా
    పిల్లల్ కా రుపపాండవాళియు,మహా వీరుండు గా హెచ్చి శో
    భిల్లెన్ నే డభిమన్యుడంచు ,విజయున్ వీక్షించి,యా సింగపుం
    పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా”
    (పాండవులే వీరు లనుకుంటే ఈ ఉపపాండవులూ పిల్లలు కారు.అభిమన్యుడు మరీ ప్రకాశిస్తున్నాడు అనుకొని ఒకసారి తండ్రి ఐన అర్జునుని వంక చూశాడు.ఆ సింగపు పిల్ల వంటి అభిమన్యుణ్ని మెచ్చుకున్నాడు. జనకు లైన పాండవులనీ మెచ్చుకున్నాడు.పద్మవ్యూహం ఘట్టానికి పూర్వం కూడా అభిమన్యుడు యుద్ధం లో ఉన్నాడు.భగవద్గీత లో పాండవవీరుల పేర్లు చెప్పేటప్పుడు అభిమన్యుని పేరు కూడా ఉంటుంది.)


    రిప్లయితొలగించండి
  14. విల్లంబుల్గొని పాండునందనులు నిర్భీతిన్ దురంబందునన్
    కల్లోలంబొనరించి కౌరవుల విక్రాంతమ్ము జూపించగా
    నుల్లాసంబును శౌర్య సంపదల దానుద్వేగమున్ హాళి చి
    ప్పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా

    రిప్లయితొలగించండి
  15. విల్లంబులు చేతంగొని
    కల్లోలమొనర్ప శత్రుగణములనెల్లన్
    యుల్లంబున తోషము చి
    ప్పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    విల్లున కిరీటి సభలో
    అల్లన ఛేదించ మత్స్య యంత్రము,నృపుడున్
    అల్లుడనుచు కీర్తించెను
    పిల్లం గని పాండవులను భీష్ముడు మెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  17. విల్లంబులతో పార్థుడు
    కల్లోలము సృష్టిజేయఁ గాంచినవారై
    యెల్లరు ప్రేక్షకులే సొం
    పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్

    విల్లంబుల్ ధరియించి మెప్పెనయగా వేగాన సాధింపగా
    యుల్లంబుల్ రమణీయమైన వనుచున్ హోరాటమై ప్రేక్షకుల్
    కల్లోలం బొనరించిహర్షణముతో కాన్పించ నెల్లారు సొం
    పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా

    రిప్లయితొలగించండి
  18. విల్లెక్కుబెట్టిపార్థుడు
    మెల్లగ కొట్టన్ ఝషమును మేల్మేలంచున్
    అల్లుని గాగొన నృపతియు
    *"పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్”*,

    రిప్లయితొలగించండి