31, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4869

 1-9-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

“పెండ్లి సేయఁదగును ప్రేతమునకు”

(లేదా...)

“పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్”

(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

16 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    బక్కపలుచ వాని చిక్కఁబట్టుకునూర
    పిలుచుకొంద్రు జనులు ప్రేతమనుచుఁ
    గొలువునందుఁ జేరి గుణవంతునిగ వెల్గఁ
    బెండ్లి సేయఁదగును ప్రేతమునకు

    ఉత్పలమాల
    కండ్లకు బక్కవానిగను గన్పడ ప్రేతమటంచు నెంచ నూ
    రిండ్లకుఁ బల్లెలో నొకడె యిష్టము తోడను విద్యనేర్చియున్
    వాండ్లకుఁ జూపుచున్ నిపుణి బంగరు కొల్వునుబొందినంతటన్
    బెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్

    రిప్లయితొలగించండి

  2. కాంతిలేని కనులు కండలేని యొడలు
    కాంచి నంత నామె గాము వోలె
    నున్న నేమిర మనమూరుకుండుటయేల
    పెండ్లి సేయఁదగును ప్రేతమునకు.


    కండ్లవి భావహీనమయి కండలు లేని శరీరమందునన్
    పండ్లను గాంచ గత్తులవి వర్ణన సేయ పిశాచమే, పదా
    రేండ్లవి దాటెగాదె నికయేల విచారము సత్వర మ్ముగన్
    పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్.


    (అందవికారముగా పిశాచిలా వున్నా వయసుదాటుచున్న ఆ ప్రేతానికీ పెండ్లిచేయాలిసిందే నని )

    రిప్లయితొలగించండి
  3. ఆ॥ ఒక్క గజము ధ్వంస మొనరించు చుండఁగ
    నిచ్చ కచ్చి యెగయ పిచ్చి గాను
    మదమడఁచఁగ నాడ మత్తకీశముఁ దెచ్చి
    పెండ్లి సేయఁ దగును ప్రేతమునకు

    ఉ॥ కండ్లను చూడఁ జాలకను గట్టిగ ధ్వంసముఁ జేయుచుండఁగన్
    బండ్లను దోటలన్ దనదు బల్మినిఁ జూపుచు మత్త దంతియే
    యిండ్లను శిక్షణన్ గనిన యేనగు నెన్నుచు నాడుదానిన్
    బెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్


    ప్రేతము దంతి మత్తకీశము ఏనుగు నిఘంటువు సహాయమండి

    మదపుటేనుగులను ఇలాగే లొంగదీస్తారండి. ఈమధ్య కేరళ కర్నాటక బహుశః తమిళనాడు కూడ అనుకుంటాను, బోర్డర్ లో ఈప్రయోగము చేసారండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రేతము = ఏనుగు BN Reddy గారి నిఘంటువులో పీనుగునకు ముద్రా దోష మనుకుంటానండి.
      ఏనుగు పర్యాయ పదములలో వారి నిఘంటువులోనే ప్రేతము లేదు కదా.

      తొలగించండి
  4. బడికి బోవు చుండి , పంతులు గారిచే
    వెర్రి పీనుగయని పిలువ బడెడు
    వాడు , గోలసేయ వాసిగ బడితెతో
    పెండ్లి సేయఁదగును ప్రేతమునకు

    రిప్లయితొలగించండి
  5. పెద్దదైన తనయ ప్రేమించె నొక్కడిన్
    బ్రేత మనగ నొప్పు వెర్రివాని
    కోరి వలచినట్టివరుని చేర పిలిచి
    పెండ్లి సేయఁదగును ప్రేతమునకు

    పెండ్లికి సిద్దమైన తన పెంపుడు కూతురు ప్రేముడించె నా
    కండ్లకు ప్రేతమే పొదలె కాముని బోలెడు రూపుతోడ పె
    క్కేండ్లుగ వేచిచూచెనట కేవల మాయమ కోర్కెతీరగా
    పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్




    రిప్లయితొలగించండి
  6. వయసు పైన బడిన వధువును గానక
    చిక్కిశల్యమయ్యెఁ జింత వడుచు
    తల్లిదండ్రులపుఁడు దలచిరెట్టులనైన
    బెండ్లి సేయఁదగును ప్రేతమునకు

    రిప్లయితొలగించండి
  7. వరుని రేఖ లరయ వసుధ నల్పాయుష్కుఁ
    డనిన వినక యుంటి వకట సుంత
    పట్టు విడువ కున్నఁ బట్టి కిప్పట్టునఁ
    బెండ్లి సేయఁ దగును బ్రేతమునకు


    పెండ్లి కుమారుఁ గూర్చి వెస వేఁడఁగ నెల్లరు భక్తి వేల్పు పే
    ర్దండ్ల దయా రసం బడరఁ గ్రన్ననఁ బ్రాణము తేరు బొందిఁ బూఁ
    బోండ్ల తుటంపుఁ బేరఁటము మూరక మున్న గతించె నక్కటా
    పెండ్లినిఁ జేయఁగాఁ దగును బ్రేతమునుం బ్రియమారఁ బిల్చియున్

    రిప్లయితొలగించండి
  8. పెండ్లముకోసమై యతఁడు వెంపరలాడెను చిక్కిశల్యమై
    కండ్లకుఁ గాసె కాయలు కకావికలయ్యె మనంబు గానిపె
    క్కేండ్లు గతించినన్ దనకదేలనొ పెండిలిగాదు, యెట్టులో
    పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్

    రిప్లయితొలగించండి
  9. బక్క పీనుగ నుచు బాలుని భావించి
    ప్రేత మనుచు వాని పిలుచు చుండ
    పెరిగి పెద్ద గయిన పిదప న వ్వానికి
    పెండ్లి సేయ దగును ప్రేత మునకు

    రిప్లయితొలగించండి
  10. ప్రశ్నోత్తరి
    ఆ.వె:మనుమరాల!నిన్ ప్రేమించు ఘను డెవండు?
    తాత!నా ప్రియసఖుడు ప్రీతం కుమార్
    కొడుక! ప్రీతమో,ప్రేతమో కూతు పెండ్లి
    సేయఁదగును ప్రేతమునకు చెలిమి కలువ
    (మనుమరాలు ప్రీతం ని ప్రేమించానని తాతతో అన్నది.ఆయన "అది ప్రేమించింది కదా!వాడు ప్రీతమో,ప్రేతమో వాడి కిచ్చి పారెయ్" అని కొడుక్కి సలహా ఇచ్చాడు.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:"పెండ్లియె నాకు వ"ద్దనుచు పెంకెతనమ్మున జెప్ప ప్రేమ తో
    కండ్లకు గట్టి పెంచుకొనగా తమ కూతురు భూతవైద్యునిన్
    "పెండ్లికి దారి జూపు"మన పీడలు బోవ వచించె నిట్టులన్
    "పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్”
    (కూతురు పెండ్లి వద్దంటోంది,మార్గం చెప్పమంటే భూతవైద్యుడు ప్రేతాన్ని పిలిచి దాని కిచ్చి పెళ్లి చేస్తే పీడలు పోయి పెళ్లి అవుతుందని చెప్పాడు.)

    రిప్లయితొలగించండి
  12. మనిషిఁజూడ మిగుల మందుని వోలెను
    కండ లేమి బక్క కాయమైన
    కామమతిశయింప గరుణన వానికి
    పెండ్లి సేయఁదగును ప్రేతమునకు

    రిప్లయితొలగించండి
  13. పెండ్లికి వచ్చుభామినికి పెండ్లికి వీలగు వాడులేనిచో
    పెండ్లికిగల్గుదోషములు పెద్దగ నుండక మంచి జర్గ నౌ
    పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్
    నేండ్లును నేండ్లుగా మనువు నెప్పటి వోలెను సాగునేగదా

    రిప్లయితొలగించండి
  14. వయసు వచ్చినట్టి పాపకు వేగమే
    పెండ్లి చేయుదగును,.ప్రేతమునకు
    తగినశాస్తిచేయ ధరణియందు పరుగు
    తీయునదియు వడిగదేహినుండి

    రిప్లయితొలగించండి