మ:వినతుండై నచికేతు డిట్లనియె"నే వేడంగ నీ తత్త్వమున్ వినిపింపన్ మరలింప నన్ పసులనో,విత్తమ్మునో,స్త్రీలనో గొనుమంచున్ వచియింతు వేల నవి నే గొన్నంత మోహాన నా ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్” (యముడు కూడా రవిపుత్రుడే.నచికేతుడు జన్మమృత్యురహస్యాన్ని తెలుపమని కోరితే ఆ బాలుణ్ని మరిపించటానికి యముడు అనేక వరా లిస్తా నంటాడు.నన్ను మరిపించ వద్దు.నేను మోహం లో పడితే ఆ ధనా లన్నీ మృత్యుపాశాలే అవుతాయి.నాకు తత్త్వమే కావాలి అన్నాడు నచికేతుడు.)
అనువగు మిత్రుడుతనకగు
రిప్లయితొలగించండినను చును రారాజు నంత ప్రక్కన నిలువన్
వినయములేకను, దుర్యో
ధనసంసర్గమునఁజావుతప్పదుకర్ణా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీకృష్ణ పరమాత్మ కర్ణునితో:
తొలగించండికందం
నినుగన్న కుంతి సుతులం
దున నగ్రజుఁడవనఁ గృష్ణ తోడగు బావా!
యొనగూడు గద్దె,దుర్యో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!
మత్తేభవిక్రీడితము
నినుదొల్తన్ రవిఁ గూడి కుంతి బడసెం దేజమ్మునేపార నం
దనులందగ్రజుడంచు ద్రోవదియు భర్తన్రీతి మన్నించు నీ
కొనగూడున్ దగ పీఠమున్ వినవె? నీవొప్పారు బాటన్ సుయో
ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్!
వినడేభీష్ముని, తానుగాతలపడే, వివ్వచ్చునూహింపడే
రిప్లయితొలగించండికనడేకార్యము, కండకావరముతోగాండ్రించహంకారియై
చెనకన్జూచెనుధర్మమార్గమును, నాచివ్వన్, సదా
ధనసంసర్గమువీడకున్న, రవిపుత్రా! మృత్యుపాశంబగున్
సదాదుర్యోధన
రిప్లయితొలగించండి3వపాదంసవరణ
రిప్లయితొలగించండిచెనకన్జూచెనుధర్ంమార్గమునునాచివ్వన్ప్రథన్సుయో
ధనసంసర్గమువీడకున్న, రవిపుత్రా, మృత్యుపాశంబగున్
రిప్లయితొలగించండిచెనటులు ధర్మ విహీనుల
ననుకూలురటంచు నెంచి యంధుడ వయి నీ
వనినే సాగింప సుయో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా.
వినునామాటలు ధర్మరక్షకులనే విద్రోహు లంచెంచి నీ
కనుకూలుండ్రగు నట్టి దుష్టులకు సాయంమ్మంద జేయంగ నీ
వని సాగింపగ వారిపక్షమది యన్యాయంబెయౌ నా సుయో
ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్.
వినుమయ్య నాదు పలుకులు
రిప్లయితొలగించండిచెనటుల తోడను సతతము చెలిమిని చేయన్
కనరాదు మేలు,దుర్యో
ధన సంసర్గమున జావు తప్పదు కర్ణా!
వినయముగ జెప్పె కృష్ణుడు
రిప్లయితొలగించండివిను పాండవ పక్ష మీవు వెళ్ళుము శుభమౌ
మనుదువు తప్పక, ధుర్యో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!
ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడు కర్ణుడితో శరసంధానానికి మునుపు
రిప్లయితొలగించండికం॥ కొనిపోవంగను సాధ్యమె
వినుమా ఫల్గుణునిఁ గెల్చి విహితముఁ గనుమా!
మననెంచఁగ లేని యెడల
ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా
మ॥ కొనిపోవంగను సాధ్యమా విజయుఁడే ఘోరాకృతిన్ శస్త్రముల్
తనదౌ శైలినిఁ గూర్చి మోదఁగను యుద్ధంబందు రాధేయ నీ
కనుమోదమ్మగునేని యాహవము సాధ్యాసాధ్యముల్ గాంచవో
ధనసంసర్గము వీడకున్న రవి పుత్రా మృత్యు పాశమ్మగున్
ధన ధనము ఆవులమంద నిఘంటువు సహాయమండి.
కన్నడ భాషలో ధన హసువు రెండూ ఆవుకు వాడతారండి
ఘనుడవు దానగుణమ్మున
రిప్లయితొలగించండినినుమించిన వీరులెవరు నిఖిలజగములన్
రణమున దుష్టుండు సుయో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!
ఘనతన్ గాంచియు దానశీలునిగనో కర్ణా యధర్మంబునన్
రిప్లయితొలగించండిమను దుర్యోధను సాహచర్యమున దుర్మార్గంబులన్ సల్పగన్
నిను రక్షించెడువారలెవ్వరిలఁ? దుర్నీతుండవౌచున్ సుయో
ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్
రాయబారము విఫలమయ్యాక కృష్ణుడు కర్ణునితో
రిప్లయితొలగించండిఅనుగుణము జెప్పెదనువిను
మనీతిగ యితరుల నేల నార్జించుటకై
అనియం దారీతిగ సా
ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా
ఘన మని మైత్రిని నమ్ముచు
రిప్లయితొలగించండిమనమున యో చింప బో క మాత పలుకు లన్
విన నేరక నా దుర్యో
ధన సంసర్గ మున చావు తప్పదు కర్ణా!
తన దాయాదుల రాజ్యం
రిప్లయితొలగించండిబును తన సొంతమని తెల్పు మూర్ఖుడు వాడే
ధనకాంక్షా పరుడు సుయో
ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా
అనుకూలంబగు మిత్రుడైనఁ బడెఁ దానన్యాయమార్గంబునన్
నిను పుట్టించిన వానిమాట వినుమా నీఛాత్మునే వీడుమా
ధనమే సర్వమటంచు ప్రల్లదులకున్ దన్నైన మూర్ఖున్ సుయో
ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్
ఘనమౌ పాసుపతాస్త్ర ధారి నరుడే గాండీవమున్ బూన చె
రిప్లయితొలగించండిల్లునె నీశక్తి కిరీటి ముందరననిన్? లుప్తంబుగాదే శపిం
చిన శాపంబులు తీరు వేళకు? పృథా క్షేత్రోద్భవుండా! సుయో
ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా! మృత్యుపాశమ్మగున్!!
అని లోనఁ బాండవేయులు
రిప్లయితొలగించండికనలిన నిక్కముగ నంబికా నందన నం
దన దురభిమాన దుర్యో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా
ఘన సంతాపము సెందు చుండ నెద నా కాకుత్స్థ రత్నంబు వే
దన వర్ధిల్లెడు రీతి నిప్పగిది నుత్సాహమ్ముతోఁ గాల యా
పనముం జేయుచు రామ కార్యమున నీ భామా చరత్కామ సా
ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యు పాశమ్మగున్
[రవిపుత్రుఁడు = సుగ్రీవుఁడు]
కం:ఘనులౌ వరపుత్రులు నీ యనుజులు పాండవులు ,వారి యండ బడయు, మిం
రిప్లయితొలగించండిధనమౌదువె యనికి ?సుయో
ధనసంసర్గమునఁ జావుతప్పదు కర్ణా”
(రాయబారం సందర్భం లో కర్ణునితో శ్రీకృష్ణుని మాటలు.)
మ:వినతుండై నచికేతు డిట్లనియె"నే వేడంగ నీ తత్త్వమున్
రిప్లయితొలగించండివినిపింపన్ మరలింప నన్ పసులనో,విత్తమ్మునో,స్త్రీలనో
గొనుమంచున్ వచియింతు వేల నవి నే గొన్నంత మోహాన నా
ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్”
(యముడు కూడా రవిపుత్రుడే.నచికేతుడు జన్మమృత్యురహస్యాన్ని తెలుపమని కోరితే ఆ బాలుణ్ని మరిపించటానికి యముడు అనేక వరా లిస్తా నంటాడు.నన్ను మరిపించ వద్దు.నేను మోహం లో పడితే ఆ ధనా లన్నీ మృత్యుపాశాలే అవుతాయి.నాకు తత్త్వమే కావాలి అన్నాడు నచికేతుడు.)
పైనప టారుఁడు కర్ణుడు
రిప్లయితొలగించండిననిలో నర్జును గెలువఁగ నసమర్ధుండౌ
వినుమా యీయది దుర్యో
ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా
ఘన మార్తాండ మహాంశసంభవుడవే గర్హింపకన్ సత్కులాం
రిప్లయితొలగించండిగన నట్లీడ్చి మహాసభాంగణమునన్ భంగంబు గావించు దు
ర్జన సాంగత్య మహాంధకూపమున కూర్మంబౌదువేలా సుయో
ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్
వినుమయ్య నాదు పలుకులు
రిప్లయితొలగించండిచెనటుల తోడను సతతము చెలిమిని చేయన్
కనరాదు మేలు,దుర్యో
ధన సంసర్గమున జావు తప్పదు కర్ణా!
వినుమో విక్రమశాలి చెప్పు పలుకుల్ వేగమ్ము గా పాండవుల్
నిను సంహార మొనర్చకన్ విడరుగా నిన్నున్ వడిన్ మట్టిడన్
మనమందెంచరటంచువింటినయ నా మాటల్ నికన్ నా సుయో
*“ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్”*
ధనమే మూలము గావచించుటలు మిధ్యాలాపసంభాషణల్
రిప్లయితొలగించండిధనముంజూడుము లేశమాత్రమున విద్యాదానమెంతేనియున్
మనువుంగూర్చును గాననీవికను సన్మానించు నమ్మానినిన్
ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కర్ణునితో... కృష్ణుడు....
వినుమా కుంతీ పుత్రా
మనుమా ధర్మమ్ముతోడ మర్మమెఱుగుచున్
చనుమా,లేకున్న సుయో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!