15, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4943

16-11-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే”
(లేదా...)
“చెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే”

25 కామెంట్‌లు:

  1. వడిగనుభోవోద్రిక్తత
    తడబడుమాటలవిడివడి తప్పులుదొర్లన్
    బడిలో పాఠముతెలియమి
    చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే

    రిప్లయితొలగించండి
  2. కందం
    బడుగుల సేమము గన మా
    యడుగులు పడునెపుడనియెడు నభయము నిడుచున్
    గుడువగ ప్రభుత్వ సిరి దో
    చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!

    మత్తేభవిక్రీడితము
    బడుగుల్ సేమము నొందగన్ దలఁచి నిస్వార్థాన సేవింప మా
    యడుగల్ నిత్యము సాగు మాటనిడగా నందింప నేతృత్వమున్
    గుడువన్ జూచి ప్రభుత్వ బొక్కసమునే కొంగ్రొత్త వైనాల దో
    చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే!

    రిప్లయితొలగించండి
  3. కడు వడి హామీ లొస గుచు
    నడచు కొనక మాట తప్పి నైజ ము తోడ న్ దడ యక ప్రజలను వంచిo
    చెడు దుర్వార్త వినిన చేష్ట లుడు గరే

    రిప్లయితొలగించండి
  4. బెడిదమగు నాటి దినముల
    నడిగిన వెనువెంట వచ్చి యాదుకొ నంగన్
    నిడుము విడె వారు మరణిం
    చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే”

    రిప్లయితొలగించండి

  5. కడు దీక్షతోడ తిరుమల
    నడుచుచు చేరంగదలచు నరుల చిరుతయే
    కడతేర్చ పలువురు వచిం
    చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే.


    కడు జాగ్రత్తలు చెప్పినన్ వినని నిర్గ్రందుండు యంజానుడై
    వడిగా వాహనమొక్కటిన్ నడిపెడిన్ బాళమ్మునన్ లోయలో
    పడగన్ మ్రగ్గిరి నంటులెల్లరనుచున్ బాధించి దుఃఖానముం
    చెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే.

    రిప్లయితొలగించండి
  6. బుడిబుడి నడకల సంగడి
    విడివడి యుండిరి గడించ వెడబాటయ్యెన్
    కడ చూపులని తెలియ కల
    చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!!

    రిప్లయితొలగించండి
  7. చెడువార్తలు వ్యాపించును
    వడివడిగా సన్నయమున వనవహ్ని యనన్
    దుడుకుఁ భయసంద్రమున ముం
    చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే

    జడిపించున్ గదకొన్నివార్తలెపుడున్ సంపాదకీయంబులై
    వడిగా తీగలువాఱు వార్త లయినన్ బ్రాబల్యముంజూపి య
    ల్జడి పుట్టించునుగా జనాళినిలలో సంకోచ సంద్రాన ముం
    చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. శ్రీకృష్ణ నిర్యాణము గురించి అర్జునుడు ధర్మరాజుకు తెలియజెప్పుట:-

      వెడలంబాఱితి ద్వారకానగరికిన్ వెన్నుండు కృష్ణుండు దే
      వుడు గోపాలుడు నందనందనుడు నా పోరాట మూలంబటన్
      పడియుండంగని కొయ్యబారితి మనోభారమ్ము దుఃఖమ్ము పెం
      చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే!!

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. తడబడకను చెడుపనులను
    కడుదుర్మార్గముగ సల్పికనుగానమితో
    నడచెడు కుమతుల మదమణ
    చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే

    రిప్లయితొలగించండి
  10. తడబాటెన్నడు చూపకన్ కుమతులై ధర్మంబు పాటింపకన్
    కడుదుర్మార్గపు కృత్యముల్ సలుపుచున్ గర్వాంధకారంబునన్
    నడయాడన్ గనియట్టి దుర్మతుల యన్యాయంబు పోకార్చి ద్రుం
    చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే

    రిప్లయితొలగించండి
  11. కం:గుడులన్ మూర్తుల బూజిం
    చెడు భక్తులు నీచు డెవడొ చెప్పుల తో కా
    లిడి దైవ ప్రతిమల గూ
    ల్చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!"

    రిప్లయితొలగించండి
  12. మ:బిడియ మ్మైనను లేదె నింద యెడలన్?ద్వేషమ్ము తో రామునే
    యడవిన్ ద్రోయుట యేమి? తిట్టరె అయోధ్యావాసులున్ కైక! రా
    ముడు రాజయ్యె నటంచు సంతసిల నీ మూర్ఖత్వ మా తృప్తి ద్రుం
    చెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే”
    (కైక సంకుచితత్త్వాన్ని వారించటానికి దశరథుడు అన్ని ప్రయత్నాలూ చేసి కనీసం లోకము ఏమనుకుంటుందో అనే సిగ్గైనా లేదా? రాముడు రాజయ్యాడని సంతోషించే దేశప్రజలు నీ పనికి నిశ్చేష్టు లవరా?అన్నాడు.కొందరు మూర్ఖులకి కుటుంబం,ధర్మం లెక్క లేక పోయినా కనీసం లోకము ఏమనుకుంటుందో అనే భయం ఉంటుంది.కైక అదైనా ఆలోచిస్తుం దేమో అనేదిశరథుని ఆశ.)

    రిప్లయితొలగించండి
  13. నుడివితి వక్షర సత్యం
    బెడంద సందేహము వల దింతయు నీకుం
    గడు చక్కని మాటే యిది
    చెడు దుర్వార్తలను వినినఁ జేష్టలు డుగరే

    [చెడు దుర్వార్తలు = మంచి వార్తలు]


    తడి వస్త్రమ్మున గొంతు కోయుట యనన్ ధర్మమ్ము లో నెన్నకే
    కడు దుర్వార్తలు దుఃఖ దేయములు వక్కాణించుటే మానవా
    యడరన్ భీతి కడింది డెందముల కత్యం తోగ్ర కంపమ్ము లి
    చ్చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జడివానగ మొదలైనను
    వడిగా పెరుగుచును పొంగి వరదలు ముంచన్
    కడు ఖేదమ్మును కలిగిం
    చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగునే!

    రిప్లయితొలగించండి
  15. ఇడుముల వియధిక మవగా
    తడబాటొందుచుజనములు త్వరితగతినటన్
    కడుదుఃఖమునతిగాపం
    చెడు దుర్వార్త లను వినిన చేష్టలుడగరే


    రిప్లయితొలగించండి