20-11-2024 (వారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “స్వరము లేని పాట శ్రావ్యమయ్యె” (లేదా...) “స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్” (బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
గోంతుచించుకొనుచు కూతల గూయుచు నవియె పాటలనుట యక్కజమ్ము శ్రుతిని లయను గలిగి స్తోకమైనను నప స్వరము లేని పాట శ్రావ్యమయ్యె.
అరుపులు కేకలున్ననది యద్భుతగీతమటంచు నేడిలన్ దరుణులు నమ్ముచుండుట ముదమ్మది కాదని చెప్పబూనితిన్ సరసులు మెచ్చు పాటలన చక్కని శైలిని గల్గియుండి కు స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్.
సరిగమలఁ విడువక సాధన చేసి సు స్వరము లేర్చి కూర్చ సాధ్యమాయె మనసు దొంగిలించు మధురానుభూతి వి స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
సరిగమ లౌను గాయకుల సాధన సంగతమెంచిచూడగా స్వరముల నేర్చికూర్చి బహుచక్కని రాగములాలపించి సు స్వరములు మేళవించి పలు చక్కని గీతములన్ సృజింప వి స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
చం:"సరిగమ పాదనీ నిదప సా" యని శీర్షము నూపి పాడగా "సరిసరి" యంచు మెచ్చు సరసత్వము నే డెట నుండె? "విప్పి చూ డర!" యను పల్లవిన్ గలిగి డప్పుల మోతయె హెచ్చి పాతవౌ స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్” (శాస్త్రీయ సంగీత మైతే మధ్య లో సరిగమ స్వరాలు పలుకుతారు.నేటి మామూలు సినిమా పాటల్లో, లలిత గీతాలలో అవి ఉండవు కదా!"విప్పి చూడరా" అనే పల్లవి తో దరువుల మోత తో ఉన్న పాట దేశ మంతటా నచ్చింది.)
)ఆ.వె:బాలు డొకడు పాడె నీ లీల పాడెద దేవ యనుచు కరవు తీరు రీతి జానకమ్మ వేయు సంగతుల్ గల యప స్వరము లేని పాట శ్రావ్యమయ్యె” ("నీ లీల పాడెద దేవా" అనే పాటని అన్ని స్వరాల తో,గమకాలతో ఒక బాలుడు పాడాడు.ఆ పాట గురించే దేనికి చెప్పాలి? అంటే దాని గొప్ప ,దాని కష్టం దానివి కనుక.ఎలాగూ పూరిస్తున్నప్పుడు ఆమెని స్మరిద్దా మని.)
సరిగమ సుస్వరమ్ములను జక్కగ సాధన చేయు వారకున్ వరమది సామవేదమున పారవశమ్మున నోలలాడగన్ చరణము పల్లవుల్ పరమ శ్రద్ధగ పాడుచునున్న నెట్టి కు స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
ఆటవెలది
రిప్లయితొలగించండిగానమన్నదొక్క కమనీయమౌ కళ!
శిశువు పశువు పరవశింప మిగుల
భావగర్భితమగు భాషఁ గలిగి యప
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
చంపకమాల
స్వరఝరి శ్రావ్యమై మిగుల పాపలు పక్షులు జంతుజాలమున్
బరవశమొందఁ జేయు కళ భాగ్యము గల్గిన వారి జన్మకున్!
మెరిసెడు భావగర్భితపు మిన్నగు భాషయె నిండి యే యప
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
జాతరకయి చనిన సాయంసమయమున
రిప్లయితొలగించండినచటనున్న యజుని యాలయమున
భజన జేయుచుండి పాడగ , గార్దభ
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
పాట పాడు మనుచు బాలుని గోరగా
రిప్లయితొలగించండిచక్క నైన మధుర జానపద ము
రమ్య శైలి తోడ రంజిల్ల గా నాప
స్వరము లేని పాట శ్రావ్య మ య్యె
చివర నప అని సవరణ చేయడమైనది
తొలగించండి
రిప్లయితొలగించండిగోంతుచించుకొనుచు కూతల గూయుచు
నవియె పాటలనుట యక్కజమ్ము
శ్రుతిని లయను గలిగి స్తోకమైనను నప
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె.
అరుపులు కేకలున్ననది యద్భుతగీతమటంచు నేడిలన్
దరుణులు నమ్ముచుండుట ముదమ్మది కాదని చెప్పబూనితిన్
సరసులు మెచ్చు పాటలన చక్కని శైలిని గల్గియుండి కు
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్.
సరిగమలఁ విడువక సాధన చేసి సు
రిప్లయితొలగించండిస్వరము లేర్చి కూర్చ సాధ్యమాయె
మనసు దొంగిలించు మధురానుభూతి వి
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
సరిగమ లౌను గాయకుల సాధన సంగతమెంచిచూడగా
స్వరముల నేర్చికూర్చి బహుచక్కని రాగములాలపించి సు
స్వరములు మేళవించి పలు చక్కని గీతములన్ సృజింప వి
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
గురుతర గాయకుండు పెను కోరిక గల్గిన నేర్వకుండగన్
రిప్లయితొలగించండిసరళముగన్ శృతుల్ బలుక సాధ్యమె? పల్కెను మంత్రపుష్పమున్
వరుసనుదాత్త ధీర్ఘములు వర్జ్యముగన్ స్వరితానుదాత్తమౌ
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేవ నాదమటుల భావన కలిగించు
రిప్లయితొలగించండిపాట వినఁగ మనసు పరవశించు
గర్వమెరుగనట్టి గానకోకిల యప
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
పరవశమొందు మానసము ప్రాగహరమ్మగు గానమాధురుల్
రిప్లయితొలగించండిపరిగొని విన్న, వేదనలు వారక బాయును నిశ్చయమ్ముగా
సరిగమపాదనీ యనుచు జానుగ రాగము మేళవించి వి
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
చం:"సరిగమ పాదనీ నిదప సా" యని శీర్షము నూపి పాడగా
రిప్లయితొలగించండి"సరిసరి" యంచు మెచ్చు సరసత్వము నే డెట నుండె? "విప్పి చూ
డర!" యను పల్లవిన్ గలిగి డప్పుల మోతయె హెచ్చి పాతవౌ
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్”
(శాస్త్రీయ సంగీత మైతే మధ్య లో సరిగమ స్వరాలు పలుకుతారు.నేటి మామూలు సినిమా పాటల్లో, లలిత గీతాలలో అవి ఉండవు కదా!"విప్పి చూడరా" అనే పల్లవి తో దరువుల మోత తో ఉన్న పాట దేశ మంతటా నచ్చింది.)
ఆ॥ నాట్లు వేయుచుండు నారీమణులు తమ
రిప్లయితొలగించండికష్టము మరచి చనఁ గలసి మెలసి
గళము విప్పి పాడఁ గమనీయముగ నటు
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
చం॥ కరములు నాడుచుండ తమ కార్యములందున లీన మొందుచున్
విరివిగ నాట్లు వేయుచును వెన్నును వంచుచుఁ గష్ట మెంచకన్
సరిగమ లేవి నేర్వకనె చక్కగఁ జేనున స్త్రీలు పాడెడిన్
స్వరములు లేని పాట కడు శ్రవ్యముగా విని పించె నెల్లెడన్
స్వరములు సరిగమపదని అండి కంఠధ్వని కాదండి
కాలగమనములో ఇది దాదాపుగా అంతరించిన కళ
శ్రావ్యముగా ను పొరపాటున శ్రవ్యముగా అని టైపు చేసానండి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి)ఆ.వె:బాలు డొకడు పాడె నీ లీల పాడెద
రిప్లయితొలగించండిదేవ యనుచు కరవు తీరు రీతి
జానకమ్మ వేయు సంగతుల్ గల యప
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె”
("నీ లీల పాడెద దేవా" అనే పాటని అన్ని స్వరాల తో,గమకాలతో ఒక బాలుడు పాడాడు.ఆ పాట గురించే దేనికి చెప్పాలి? అంటే దాని గొప్ప ,దాని కష్టం
దానివి కనుక.ఎలాగూ పూరిస్తున్నప్పుడు ఆమెని స్మరిద్దా మని.)
వెక్కసమ్ము గాను వీనుల కిడ విందు
రిప్లయితొలగించండిరాగ తాళము లవి మ్రోగుచుండఁ
జక్కఁగ శ్రుతు లమర నొక్కటేనియు నప
స్వరము లేని పాట శ్రావ్య మయ్యె
నరులటఁ దోలుచుండ వడి నడ్ముల పైనఁ గడింది మొత్తుచున్
వరుసగ నొక్క టొక్కటిగఁ బాడుచు వింతగ గొంతు లెత్తి యా
ఖరముల మంద సాగ ఘన కంపము సెంద ధరాతలం బహో
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
తరచి సామవేద సారము నెరుగగా
రిప్లయితొలగించండిపరమ హాయిగొలుపు వరము పాట
అరుపులు రణగొణుల చెరబడకను అప
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె
సరిగమ సుస్వరమ్ములను జక్కగ సాధన చేయు వారకున్
రిప్లయితొలగించండివరమది సామవేదమున పారవశమ్మున నోలలాడగన్
చరణము పల్లవుల్ పరమ శ్రద్ధగ పాడుచునున్న నెట్టి కు
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బాలల కొక చోట పాటల పోటీలు
జరుపగ నొక పాప చక్కనైన
గాన మాలపించ కంఠమునం దప
స్వరము లేని పాట శ్రావ్యమయ్యె.
వయసుపిన్నయైన వాసిగానేర్చుచు
రిప్లయితొలగించండినాలపించుచుండనాలయమున
నాలకించువారికచ్చోట నేయప
*“స్వరము లేని పాట శ్రావ్య మయ్యె”*
పరవశ మొందుచున్నచట బాలికలెల్లరుకూడి నెమ్మితో
స్థిరముగ నాలయమ్ము దరిచేరుచు. స్వామికి మానసమ్మునన్
కరములనెత్త మ్రొక్కి సిరికాంతునిపైకడు భక్తితో నప
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్”*