29, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4957

30-11-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వానరులకు లేవు వాలములఁట”
(లేదా...)
“వానరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్”

16 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    వంకమారె జీవపరిణామ క్రమమునన్
    దోకలూపుచుండి తుంటరులుగ
    వెనుక చెలఁగినారు! విజ్ఞులౌటన్ మాన
    వా! నరులకు లేవు వాలములట

    ఉత్పలమాల
    జ్ఞానము నందె జీవపరిణామ క్రమమ్మునఁ, దోకలూపుచున్
    హీనపు చేష్టలన్ జెలఁగిరింతకు ముందుగ కోతులంచనన్
    గానల వీడినన్ మఱువఁ గాదొకొ తుంటరి బుద్ధి మాన లే
    వా? నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్!

    రిప్లయితొలగించండి

  2. తెలియకనడిగితివొ తెలిసియె యడిగితివొ
    నా తెలివిని కనుగొన దలచితివొ
    తెలుపుచుంటి వినుము ధీరుడవైన బా
    వా , నరులకు లేవు వాలములఁట.


    శీనడవౌచు నడ్గితివి చెప్పెద నుత్తర మాలకించుమా
    కానగ తొంకలన్నిటికి కాన జరించెడు ప్రాణికోటికిన్
    భానువు నిచ్చుమాట యది వాస్తవ మందు ననాది నుంచి బా
    వా , నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  3. వానరమ్ములకును మానవ జాతికి
    వ్యత్యయమ్ముఁజూడ వాలమొకటె
    వానరములకుండు వాలము, కనుగొంటి
    వా! నరులకు లేవు వాలములఁట

    రిప్లయితొలగించండి
  4. తరగతి గదియందు తెలుగు గురువుగారు
    రక్తిగట్ట నుడవ రామకథను
    వివిధ పాత్రలాడ విద్యార్థులను గూర్చ
    వానరులకు లేవు వాలములఁట

    రిప్లయితొలగించండి
  5. లంకకు చని వడిగ రమణి వైదేహిని
    యచటి ఖైదు నుండి నాదు కొనగ
    రావణు నెదిరించి రణము సలుపుటకు
    వానరులకు లేవు వాలములఁట

    వాలము = కత్తి

    రిప్లయితొలగించండి
  6. వానరుల్ సహాయపడె రామునికిలలో
    వాలముండెనుగద వానరులకు
    మానవులకు మూల మందువా కాంచలే
    వా! నరులకు లేవు వాలములఁట

    వానరజాతి సాయపడె వాలిని గూల్చినవాని కిచ్చటన్
    మానవజాతి మూలమన మర్కటమేనని చెప్పుచుంటివా
    కానిట తోకతో నరులు కన్పడ నొప్పరు గాదె కాంచ లే
    వా! నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్

    రిప్లయితొలగించండి
  7. మేనునఁ బుట్టు తోకలెవి? మేలగు మానవ రూపమెట్లగున్?
    కానగ కల్లకాదె! మరి ఖచ్చితమెట్లగు నీదు భావముల్?
    మానవ జాతికిన్ కపి సమానమె? డార్వినుడా! మహానుభా
    వా! నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్!!

    రిప్లయితొలగించండి
  8. మానవజాతికెన్నడు సమాజమునన్ గనరాము వాలమున్
    వానరజాతి యెల్లపుడు వాలముతో నడయాడు చుండఁగా
    మానవులందు పాదుకొను మానవిహీనత కిల్బిషమ్ములౌ
    వానరజాతి, యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. పాఠశాలలో కోతులవలె అల్లరి చేస్తే తోక కత్తిరిస్తాను అని అధ్యాపకులనడము పరిపాటి. ఆ సుళువుతో

      ఆ॥ వానరుడివొ నీవు వాలముఁ ద్రిప్పుచుఁ
      బాఠశాలయందు పరుగులిడుచుఁ
      గోఁతి పనులు చేయు కొంటెవె యవిమాన
      వా! నరులకు లేవు వాలములఁట

      ఉ॥ వానరమో కుమార యిటు వాలముఁ ద్రిప్పుచుఁ బాఠశాలలో
      మానక నల్లరిన్ గనఁగ మంకును వీడక నెల్లవేళలన్
      బూనక మొందఁగన్ బడిత పూజను బొందవ బుద్ధిఁ గాంచ లే
      వా! నర జాతియెల్లపుడు వాలము లేనిది గాదెచూడఁగన్

      తొలగించండి
    2. ఆ॥ మూడవ పాదము చివర యవి వీడ అని యవి మాన బదులు మార్చినానండి

      తొలగించండి
  10. జీవ పరిణతి యను సిద్ధాంతమున వల్ల
    మార్పు జెందె గాదె మాన వుండు
    మాయ మ య్యె తోక మనుజు లందున గంటి
    వా ' నరులకు లేవు వాలము లట!

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె: నాన్న!పంతులమ్మ నిన్న చెప్పెను కోతు
    లన్నిటికిని వాల మమరి యుండు
    ననుకొనకుడటంచు నరుదైన జాతుల
    వానరులకు లేవు వాలము లట.
    (తోక లేని కోతులు కొన్ని ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  12. వానర పద మందు వా గిరను దొలఁగిం
    ప నరు లయిరి యెల్ల మానవు లిఁక
    వా రటు లొనరింపఁ గారణ మే మందు
    వా నరులకు లేవు వాలము లఁట


    దానవ మాన వౌక మృగ దైత్యులు కశ్యపు బిడ్డలే చుమీ
    మానవు లెల్ల వింతగను మర్కట కోటికిఁ బుట్టి నట్టి సం
    తానము నా వచించినను దథ్యమునే వచియించు చుంటి బా
    వా! నర జాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కోతి నుంచి మనుజ కోటి వచ్చెననుచు
    చరిత తెలుపుచున్న సంగతైన
    వాలములవి యుండె వాటికపుడు మాన
    వా! నరులకు లేవు వాలములట.

    రిప్లయితొలగించండి
  14. వానరములనుండివసుధలొ మనుజులు
    జననమొందిరనుచుచరిత తెలుపు
    కాని గలదు తోక కపులకు,,నోమాన
    వా!నరులకులేవువాలములట

    రిప్లయితొలగించండి