27-11-2024 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె”(లేదా...)“ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై”
తేటగీతిప్రవరుని వలచి యన్యులు వలదటన్నసరళి కామినిగానొప్ప తరుణమెరిగిమరుల గంధర్వుడల రూపుమార్చ నయ్యెద్విజుఁడు! మోహాంధుఁడై వరూధినినిఁ గూడె!మత్తేభవిక్రీడితముసుజనుండై ప్రవరుండు నప్సరను దా చూడంగ వైముఖ్యుడైనిజ పత్నీవ్రతుఁడౌచు వైదొలఁగగన్, నిర్నిద్ర గామింపగన్ద్యజితన్ పొందెడు గాంక్ష వైళమని గంధర్వుండు రూపెత్తనైద్విజవర్యుండు! దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై!
కోరె గంధర్వుడామెనుకూర్మితోడసమయమెంచుచుతాఁజూచె శమమువీడివిప్రుడాయెను ప్రవరుడౌ వేషమెంచిద్విజుడుమోహాంధుడైవరూధినినిగూడె.
అంద చందాలు గలిగిన యా వరూధిగాంచి వలచి గంధర్వుడు కాంక్ష చేతమహిత ప్రవరాఖ్యురూపుడై మాయకారిద్విజుడు , మహాంధుడై వరూధినిని గూడె
అల్ల సాని పెద్దన్నగా రల్లిన మనుచరితమున ప్రవరాఖ్యుడు చనె హిమగిరిపైకి , యచట గనబడిన వనితను గనిద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
సుజనుండౌ ప్రవరాఖ్యుఁడా దివిజకున్ క్షోభమ్ముఁ గల్పించుచున్నిజవాసంబునకేగె సల్ప నిరతిన్ నిత్యార్చనల్ గీమునన్కుజనుండౌ ఖచరుండు విప్రునిగ సంకోచింపకన్ మారి యాద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై
నిజగృహమునకు ప్రవరుడు నిష్క్రమింపవంచకుండు గంధర్వుడే వచ్చెనటకుమాయ రూపున బ్రవరుడై మాయకాడుద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె నిజభక్తిన్ హుతభుక్కుఁ వేడి మరలెన్ నిర్దోషిగా విప్రుడేగజ కైలాటకుడై చనెన్ బ్రవరుడై గంధర్వుడే తాఁ ఝషధ్వజ సూచీముఖతాడితుండు జవమున్ దత్కాల శైలూషుడైద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై
వలచిన వరూ ధిని విడిచి ప్రవరుండు తిరుగు ముఖమైన గమనించి తెలివి గలిగి మారి గంధర్వు డ య్యె డ మాయదారి ద్విజుడు మోహా o ధు డై వరూ ధిని ని గూడె
తే॥ అజుని వ్రాతయు తప్పునె సుజనులఘముఁజేయ నెంతురె మోహముఁ జేర నగునెయేల పరిహాసపు పలుకు లేల నెపుడుద్విజుఁడు మోహాంధుడై వరూధినినిఁ గూడెమ॥ కుజనుల్ నాటకమందు హాస్యమునకై ఘోరంబునౌ పోకడల్సుజనుల్ నొచ్చెడు రీతిఁ బెట్టుటయు సంశోధించి వక్రించుచున్నిజముల్ పాయికమేగదా తెలియకన్ నేమమ్ముఁ జూపించిరేద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాందుఁడై
జయము లెన్న నెవ్వరి కైన సంశయమ్ములని నెఱుంగక దైవోపహతుఁడయి కటసంతత సమ రాకాంక్షి సుక్షత్రియుండు ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె [వరూధిని = సేన] నిజ దేశంబున కేఁగ నా ప్రవరుఁడే నిశ్చింత నిష్కాముఁడై విజయం బందితి నంచు డెందమునఁ దృప్తిం జెంద నన్నాతియే నిజ రూపంబు వహింప కత్తఱి వెసన్ నిర్లజ్జ మాయామయద్విజ వర్యుండు తిరస్కరింపక వరూధిన్గూడె మోహాంధుఁడై వరూధిని పేరు గనుక వరూధి గాఁ గుదించి వరూధిన్గూడి యన నగును. న్యాయానికి వరూధినిన్ గూడి యన వలెను.
వలచి వచ్చిన వనితను వలదటంచుభూసురుండేగెను నిజనివాసమునకుద్విజునిగా మారె యక్షుఁడువిదనుఁగోరిద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కాంత పైన గంధర్వుడు కన్ను వేసివలపు ప్రకటించి యవమానపరచ బడియుప్రవరుడున్ లేనపుడు మాయ ప్రవరుని వలెద్విజుడు మోహాంధుడై వరూధినినిఁ గూడె.
తే.గీ:నే వరూధిని ననుకొను నెలత యొకతెకులము జెరుపుచు నర్చకున్ వలన వేసెప్రవరుడా యేమి మన గుడి బాపనయ్య?ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె(నిన్న బిజీ లో సమస్య చూడ లేదు.ఆలస్యపు పూరణకు మన్నించండి.)
ఆంధ్రభారతి లో వరూధి కి అర్ధాలు ఇవి .ఇవి కూడా అర్ధం కావటం లేదు.కవచధారి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 కత్తలీడు, పరివరుడు, వొందడీడు, వరూధి, వర్మి, వర్మితుడు, సజ్జుడు, సన్నద్ధుడు.
రథికుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report error(s)తేరుకాడు, పత్త్రి, ప్రవేత, రథి, రథిరుడు, వరూథి, శతాంగుడు.వరూథి : వావిళ్ల నిఘంటువు 1949 Report error(s)సం.వి.న్.పుం.1. సారధి.2. అపాయమునుండి తప్పించు పురుషుఁడు.విణ. (న్.ఈ.న్)1. కవచము కలవాఁడు.2. కప్పుకలది.3. సంరక్షించునది.4. సేనచేఁ బరివేష్టింపఁబడినది.5. రథికుఁడు.
వరూధిని పదమును జూడండి.
వలచితి ననిచెంతకు చేరి పైబడగనెవలదటంచువారించుచు పలికి చనగ *“ద్విజుఁడు, మోహాంధుఁడై వరూధినినిఁ గూడె”*ప్రవరునివలెవేషముమార్చివచ్చియొకడు
తేటగీతి
రిప్లయితొలగించండిప్రవరుని వలచి యన్యులు వలదటన్న
సరళి కామినిగానొప్ప తరుణమెరిగి
మరుల గంధర్వుడల రూపుమార్చ నయ్యె
ద్విజుఁడు! మోహాంధుఁడై వరూధినినిఁ గూడె!
మత్తేభవిక్రీడితము
సుజనుండై ప్రవరుండు నప్సరను దా చూడంగ వైముఖ్యుడై
నిజ పత్నీవ్రతుఁడౌచు వైదొలఁగగన్, నిర్నిద్ర గామింపగన్
ద్యజితన్ పొందెడు గాంక్ష వైళమని గంధర్వుండు రూపెత్తనై
ద్విజవర్యుండు! దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై!
కోరె గంధర్వుడామెనుకూర్మితోడ
రిప్లయితొలగించండిసమయమెంచుచుతాఁజూచె శమమువీడి
విప్రుడాయెను ప్రవరుడౌ వేషమెంచి
ద్విజుడుమోహాంధుడైవరూధినినిగూడె.
అంద చందాలు గలిగిన యా వరూధి
రిప్లయితొలగించండిగాంచి వలచి గంధర్వుడు కాంక్ష చేత
మహిత ప్రవరాఖ్యురూపుడై మాయకారి
ద్విజుడు , మహాంధుడై వరూధినిని గూడె
అల్ల సాని పెద్దన్నగా రల్లిన మను
రిప్లయితొలగించండిచరితమున ప్రవరాఖ్యుడు చనె హిమగిరి
పైకి , యచట గనబడిన వనితను గని
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
సుజనుండౌ ప్రవరాఖ్యుఁడా దివిజకున్ క్షోభమ్ముఁ గల్పించుచున్
రిప్లయితొలగించండినిజవాసంబునకేగె సల్ప నిరతిన్ నిత్యార్చనల్ గీమునన్
కుజనుండౌ ఖచరుండు విప్రునిగ సంకోచింపకన్ మారి యా
ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై
నిజగృహమునకు ప్రవరుడు నిష్క్రమింప
రిప్లయితొలగించండివంచకుండు గంధర్వుడే వచ్చెనటకు
మాయ రూపున బ్రవరుడై మాయకాడు
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
నిజభక్తిన్ హుతభుక్కుఁ వేడి మరలెన్ నిర్దోషిగా విప్రుడే
గజ కైలాటకుడై చనెన్ బ్రవరుడై గంధర్వుడే తాఁ ఝష
ధ్వజ సూచీముఖతాడితుండు జవమున్ దత్కాల శైలూషుడై
ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై
వలచిన వరూ ధిని విడిచి ప్రవరుండు
రిప్లయితొలగించండితిరుగు ముఖమైన గమనించి తెలివి గలిగి
మారి గంధర్వు డ య్యె డ మాయదారి
ద్విజుడు మోహా o ధు డై వరూ ధిని ని గూడె
తే॥ అజుని వ్రాతయు తప్పునె సుజనులఘముఁ
రిప్లయితొలగించండిజేయ నెంతురె మోహముఁ జేర నగునె
యేల పరిహాసపు పలుకు లేల నెపుడు
ద్విజుఁడు మోహాంధుడై వరూధినినిఁ గూడె
మ॥ కుజనుల్ నాటకమందు హాస్యమునకై ఘోరంబునౌ పోకడల్
సుజనుల్ నొచ్చెడు రీతిఁ బెట్టుటయు సంశోధించి వక్రించుచున్
నిజముల్ పాయికమేగదా తెలియకన్ నేమమ్ముఁ జూపించిరే
ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాందుఁడై
జయము లెన్న నెవ్వరి కైన సంశయమ్ము
రిప్లయితొలగించండిలని నెఱుంగక దైవోపహతుఁడయి కట
సంతత సమ రాకాంక్షి సుక్షత్రియుండు
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
[వరూధిని = సేన]
నిజ దేశంబున కేఁగ నా ప్రవరుఁడే నిశ్చింత నిష్కాముఁడై
విజయం బందితి నంచు డెందమునఁ దృప్తిం జెంద నన్నాతియే
నిజ రూపంబు వహింప కత్తఱి వెసన్ నిర్లజ్జ మాయామయ
ద్విజ వర్యుండు తిరస్కరింపక వరూధిన్గూడె మోహాంధుఁడై
వరూధిని పేరు గనుక వరూధి గాఁ గుదించి వరూధిన్గూడి యన నగును.
న్యాయానికి వరూధినిన్ గూడి యన వలెను.
వలచి వచ్చిన వనితను వలదటంచు
రిప్లయితొలగించండిభూసురుండేగెను నిజనివాసమునకు
ద్విజునిగా మారె యక్షుఁడువిదనుఁగోరి
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కాంత పైన గంధర్వుడు కన్ను వేసి
వలపు ప్రకటించి యవమానపరచ బడియు
ప్రవరుడున్ లేనపుడు మాయ ప్రవరుని వలె
ద్విజుడు మోహాంధుడై వరూధినినిఁ గూడె.
తే.గీ:నే వరూధిని ననుకొను నెలత యొకతె
రిప్లయితొలగించండికులము జెరుపుచు నర్చకున్ వలన వేసె
ప్రవరుడా యేమి మన గుడి బాపనయ్య?
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
(నిన్న బిజీ లో సమస్య చూడ లేదు.ఆలస్యపు పూరణకు మన్నించండి.)
రిప్లయితొలగించండిఆంధ్రభారతి లో వరూధి కి అర్ధాలు ఇవి .ఇవి కూడా అర్ధం కావటం లేదు.
కవచధారి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
కత్తలీడు, పరివరుడు, వొందడీడు, వరూధి, వర్మి, వర్మితుడు, సజ్జుడు, సన్నద్ధుడు.
రథికుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report error(s)
రిప్లయితొలగించండితేరుకాడు, పత్త్రి, ప్రవేత, రథి, రథిరుడు, వరూథి, శతాంగుడు.
వరూథి : వావిళ్ల నిఘంటువు 1949 Report error(s)
సం.వి.న్.పుం.
1. సారధి.
2. అపాయమునుండి తప్పించు పురుషుఁడు.
విణ. (న్.ఈ.న్)
1. కవచము కలవాఁడు.
2. కప్పుకలది.
3. సంరక్షించునది.
4. సేనచేఁ బరివేష్టింపఁబడినది.
5. రథికుఁడు.
వరూధిని పదమును జూడండి.
తొలగించండివలచితి ననిచెంతకు చేరి పైబడగనె
రిప్లయితొలగించండివలదటంచువారించుచు పలికి చనగ
*“ద్విజుఁడు, మోహాంధుఁడై వరూధినినిఁ గూడె”*
ప్రవరునివలెవేషముమార్చివచ్చియొకడు