కం:మద్యము సినిమా కవులకు హృద్యమ్మని తలచి తనకు నెదురుగ గల భా స్వద్యశు మర్యాద కొరకు మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్” (సినిమారంగం లో దాశరథి,మారుతీ రావు ఇద్దరూ ఉన్నారు.మారుతి దాశరథిని ఆ అలవాటుబుందేమో అని మర్యాద కోసం అడిగాడు.)
మరొక పూరణ సమస్య "మద్యముఁ, గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్"
ఉ:మద్యము త్రాగు వానరుల మధ్యన నుండియు ,త్రాగకుండ నై వేద్యము జేయ రామునకు ప్రీతిగ పాలను దెచ్చి, స్వామి !యే ఖాద్యము గ్రోలకుంటివిగ గైకొను మియ్యవి పాలు , పోయలే మద్యముఁ, గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్ (వానరసేన లో అందరూ మద్యము త్రాగుతారు కానీ హనుమంతుడు త్రాగడు.రాముడికి పాలు తెచ్చాడు.అన్ని కోతుల మధ్య ఉన్న హనుమంతుడు పాలు తెచ్చినా రాముడు కల్లు అనుకో వచ్చు కదా! ఇది కల్లు కాదులే!పాలు.వీటిని త్రాగు అన్నాడు.)
పద్యమునూఱునుసంఖ్యను
రిప్లయితొలగించండివిద్యనుజెప్పెనుసుకవియు వినగనుసొంపై
సద్యశమిచ్చెడి కవితా
మద్యముఁగొన దాశరథి నిన్ను మారుతిపిలిచెన్
దాశరథినిమారుతి పిలిచెన్
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిఆద్యంతము నాటకమిది
హృద్యమ్ముగ రాణకెక్కె హేలన్ పాత్రల్
సద్యశమందిన వేడుక
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్
ఉత్పలమాల
వేద్యమనంగ రామకథ ప్రేక్షకులెల్లరు మెచ్చి కేకలన్
హృద్యము హృద్యమంచు వినుతించిగ నాటక పాత్రధారులై
సద్యశమందినామనుచు సంబరమందున వేడ్కఁ జేయుచున్
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్
చోద్యముగ పిల్లవాడనె
రిప్లయితొలగించండి"మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
సద్యము శిక్షకుడు బిలచి
ఆద్యముగ నతనికి శిక్షనందించె కసిన్
రిప్లయితొలగించండివేద్యులు సమ్మక్కకు నై
వేద్యము నర్పించినట్టి ప్రియమిదీ నీ కా
రాధ్యుడు పంపెనటంచును
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్.
విద్యలు నేర్వకున్నను వివేకము తోడను నాటకమ్మునే
సేద్యము జేయు వారలగు క్షేత్రకరుండ్రట వేయ పండితా
రాధ్యులు మెచ్చిరంచు ముద మందుచు వేడుక జేయ గోరుచున్
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్.
పద్యములన్ బాడిరి కడు
రిప్లయితొలగించండిహృద్యముగా నాటకమున బృందంబచటన్
చోద్యముగా నటుపిమ్మట
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్
పద్యములాలపించి తమ పాత్రలఁ బ్రోచిరి నాటకంబునన్
సద్యము సంబరమ్మునకు సాగిరి నాటక పాత్రధారులే
చోద్యము గాదె దృశ్యమట చూడగఁ బ్రేక్షకులుత్సహించగా
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్
ద్వారకానగరమునకు వచ్చిన భీముని గురించి శ్రీకృష్ణుడు బలరామునికి చెప్పుట:
రిప్లయితొలగించండిచోద్యమె చూడ భీముడు రజోగుణవంతుడు వచ్చె వీటికిన్
పాద్యమునిచ్చి రమ్మనుచు పల్కితి స్వాగతవాక్కులంతటన్
ఖాద్యములారగించు తఱి కానగ వచ్చెను భద్రుడచ్చటన్
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామ!భద్రునిన్!!
భద్రుడు = వసుదేవుడు పౌరవిల సంతానము (శ్రీకృష్ణుని సోదరుడు)
మారుతి = వాయుపుత్రుడు - భీముడు
రామ = బలరామ
మీ పూరణ మత్యంత వైవిధ్యముగా నిద్దఱిని నలుగురినిఁ జేయుచు మనోహరముగా నున్నదండి.
తొలగించండివీటికిం / బాద్యము నిచ్చి; రమ్మనుచుఁ బల్కితి; తఱిఁ గానఁగ వచ్చె ననండి.
ద్రుత సంధులు నిత్యములు కదా. చేయకున్న వ్యాకరణ దోషము.
కామేశ్వర రావు గారికి ధన్యవాదములు
తొలగించండిద్వారకానగరమునకు వచ్చిన భీముని గురించి శ్రీకృష్ణుడు బలరామునికి చెప్పుట:
చోద్యమె చూడ భీముడు రజోగుణవంతుడు వచ్చె వీటికిం
బాద్యమునిచ్చి రమ్మనుచుఁ బల్కితి స్వాగతవాక్కులంతటన్
ఖాద్యములారగించు తఱిఁ గానగ వచ్చెను భద్రుడచ్చటన్
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామ!భద్రునిన్!!
భద్రుడు = వసుదేవుడు పౌరవిల సంతానము (శ్రీకృష్ణుని సోదరుడు)
మారుతి = వాయుపుత్రుడు - భీముడు
రామ = బలరామ
కం:మద్యము సినిమా కవులకు
రిప్లయితొలగించండిహృద్యమ్మని తలచి తనకు నెదురుగ గల భా
స్వద్యశు మర్యాద కొరకు
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
(సినిమారంగం లో దాశరథి,మారుతీ రావు ఇద్దరూ ఉన్నారు.మారుతి దాశరథిని ఆ అలవాటుబుందేమో అని మర్యాద కోసం అడిగాడు.)
విద్యలలో రాణింపక
రిప్లయితొలగించండిసేద్యము జేబట్టినారు స్నేహితులిర్వుర్
చోద్యముగానొక దినమున
“మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
ఉ:పద్యము పాడ కంఠమును బాగొనరించు నటంచు, నట్టిదౌ
రిప్లయితొలగించండివిద్య యెరింగి, నాటకపు వేదికపై నటులందు నెంతయున్
హృద్యపు నెయ్యమై, తెరకు నీవల వేషము నెంచ కుండ నీ
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్”
మద్యమునమ్మి జీవనము మారుతి సల్పుచునుండు, విద్యలన్
రిప్లయితొలగించండిసద్యశమందె నాతనికి సంగడిగాడగు రామభద్రుడే
చోద్యముగానతండు తన చొక్కపు మిత్రుని జూడ బోవగన్
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్
కం॥ మద్యముఁ ద్రావి పరుండఁగ
రిప్లయితొలగించండివిద్యా హీనునకు కలలు విరివిగ వచ్చెన్
జోద్యముగా నొక్క కలను
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్
ఉ॥ విద్యకు దూరమై దురిత భీత దురాగత కార్యశురుఁడై
మద్యము సర్వ కాలముల మక్కువ మీరఁగఁ ద్రావి వర్తిలన్
జోద్యముగాద స్వప్నమునఁ జూచెను సర్వులుఁ ద్రావుచుండఁగన్
మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్
ఏగూటి చిలుక ఆపలుకు పలుకుతుందన్న విధముగా నండి
మద్యపు దుకాణ మందున
రిప్లయితొలగించండిమద్యమున కు డబ్బు లేని మౌన వ్రతు నిన్
మద్యపు మిత్రుని గనుచున్
మద్యము గొన దాశరథి ని మారుతి పిలిచె న్
మద్యము సేవించితివా
రిప్లయితొలగించండివైద్య మవసర మని పిచ్చి వాఁడవె యంచున్
వేద్యం బాయెను జెపు మే
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్
విద్యల నుత్తముండు కపి వీరుఁడు రాఘవ కార్య మగ్నుఁడున్
హృద్య వచో వితానముల హృష్టి నొసంగుచుఁ బుణ్య శీల యే
తద్యము నాభ జానకి సుదర్శన భాగ్య రసమ్ము, తుల్య ధీ
మద్యముఁ, గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్
[ఏతత్ + యమునా + ఆభ = ఈ యమునా నదీ సమాన మైన
యామె; తుల్య ధీమత్ +యము = ధీమంతుఁడైన యమునికి సమాన మైన వాని]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరొక పూరణ
రిప్లయితొలగించండిసమస్య
"మద్యముఁ, గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్"
ఉ:మద్యము త్రాగు వానరుల మధ్యన నుండియు ,త్రాగకుండ నై
వేద్యము జేయ రామునకు ప్రీతిగ పాలను దెచ్చి, స్వామి !యే
ఖాద్యము గ్రోలకుంటివిగ గైకొను మియ్యవి పాలు , పోయలే
మద్యముఁ, గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్
(వానరసేన లో అందరూ మద్యము త్రాగుతారు కానీ హనుమంతుడు త్రాగడు.రాముడికి పాలు తెచ్చాడు.అన్ని కోతుల మధ్య ఉన్న హనుమంతుడు పాలు తెచ్చినా రాముడు కల్లు అనుకో వచ్చు కదా! ఇది కల్లు కాదులే!పాలు.వీటిని త్రాగు అన్నాడు.)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పద్యపు నాటకమందున
హృద్యముగా పాడి యలసి యిరువురు
నటులున్
మధ్యన తెర వెనుక కరిగి
మద్యము గొన దాశరథిని మారుతి పిలిచెన్.
హృద్యము నీదు నామమిల హేలగ పాడుచుచేసినానునై
రిప్లయితొలగించండివేద్యము గ్రోలుమీవెపుడువేడుకతోడనురామభద్రుడా
ఖాద్యముచేయుమా వడిగ కమ్మగ పేర్చిన భక్తితత్త్వమౌ
*“మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్”*