27, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4955

28-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్”
(లేదా...)
“రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్”

18 కామెంట్‌లు:

  1. నెమ్మనమున శంభుదలచి
    సమ్మతి లోఁజూచిపరము సాధనతోడన్
    బమ్మనుదాటి నిరాకా
    కమ్మును గొనియాడిరిమునిరాజులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    నమ్ముచు సృష్టి ఘనత నీ
    మమ్ముగ తపమాచరించి యధిదేవునికై
    సమ్మతి కారకునధికా
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    శార్దూలవిక్రీడితము
    నమ్మంగన్ఘన సృష్టి పోకడలనే ధన్యాత్ములై భక్తి నీ
    మమ్ముల్ ధ్యాన తపాల నిష్ఠ 'పరమాత్మ'న్ జూచు సంకల్పమై
    నెమ్మిన్శోధన సత్యముల్ దెలిసి సందేశాదులన్ 'సాధికా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్'

    రిప్లయితొలగించండి
  3. రమ్మును త్రాగిస శిష్యుడు
    దమ్ము కికురువెట్టి నట్టి తరుణము నందున్
    గమ్మున పట్టినతని బీ
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి

  4. ఇమ్మహినేలు నృపుడు ప
    త్రమ్ములతో తాపసులకు దావము నను తా
    నిమ్ముగ కట్టించు కుటీ
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్.


    సమ్మానింతు మునీంద్రులన్ సతము నిస్వార్థమ్ము తో లోక క్షే
    మమ్మున్ గోరెడి వారలంచు నృపుడా మాన్యుండు నిర్మించెనే
    యిమ్మౌ వాసము తానరణ్యమున ప్రత్యేకమ్ముగా నాకుటీ
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్.

    రిప్లయితొలగించండి
  5. నమ్మిన రాముని భార్యను
    సొమ్ములతో రామదాసు సొక్కించెనుగా
    సమ్మోహనంబనుచు హా
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    నమ్మెన్ రాముని రామదాసు మదిలో నత్యంత శ్రద్ధాళువై
    సొమ్మున్ వెచ్చముచేసి కట్టెనుగదా సొంపారగా కోవెలన్
    సమ్మోహాన్వితమైన భూషణములన్ సంప్రీతితో గాంచి హా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్

    రిప్లయితొలగించండి
  6. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తము:-

    వమ్మౌనే సుముహూర్తమెట్లు యువరాట్ పట్టాభిషేకమ్ముకున్!
    దమ్మంబున్ నిలపంగ లోక రిపులౌ దైత్యాళిఁ గూల్చంగ దై
    వమ్మే పెట్టిన లగ్గమద్ది! తిధియున్ భావింప నక్షత్ర వా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్!!

    రిప్లయితొలగించండి
  7. కం:ఇమ్మహి కైలాసమ్మై,
    యిమ్మగు కాశీయె తటిన నేర్పడగా జ్ఞా
    నమ్ముల నిథి గంగా తీ
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్”

    రిప్లయితొలగించండి
  8. శా:అ మ్మౌనీంద్రుడు కౌశికుండు జరుపన్ యాగమ్ము ,తా దాల్చిశ
    స్త్రమ్మున్ రక్షనొసంగె రాముడనుచున్ ధైర్యమ్ములన్ బొంది "నీ
    మమ్మున్ రక్షయొనర్చ నీవె సరి రామా!" యంచు రామావతా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిన్ గోరుచున్”

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. కం॥ వమ్మగునా సూక్ష్మ మరసి
      నమ్మి రఘువరునిఁ దలచఁగ నయముగ మదిలో
      నిమ్మహిఁ బారముఁ గను ద్వా
      రమ్మున్ గొనియాడిరి ముని రాజులు నెమ్మిన్

      శా॥ సమ్మోహింౘుౘు రామభద్రుని సదా సత్కార్య నిష్ఠాఝరిన్
      సమ్మానింౘుౘు భక్తిభావమున సంస్కారాదులన్ భాసిలన్
      వమ్మౌనా యది మోక్షదాత యని సంభావించి సిద్ధించు ద్వా
      రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్

      తొలగించండి
  10. కమ్మని స్వరమున బాడుచు
    నెమ్మనమున నీ శు నిల్పి నిర్మల భక్తి న్
    నమ్ముచు సతతము నో o కా
    రమ్ము ను గొని యాడిరి ముని రాజులు నె మ్మి న్

    రిప్లయితొలగించండి
  11. తమ్ము నిరంతరమును జెలు
    వమ్మునఁ గాపాడు చుండ వానిం గని వా
    రమ్మను జాధిపు సహకా
    రమ్మునుఁ గొనియాడిరి ముని రాజులు నెమ్మిన్


    సమ్మా నార్హము లా మనో బలములే సామాన్యమౌ మానవౌ
    ఘమ్మొల్లం గడు విస్మయం బరయ దీక్షా దక్షతం గాంచఁగన్
    నెమ్మిన్ దుస్సహ ఘోర సంతత తపో నిష్ఠా నిమిత్తాత్త భా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్

    రిప్లయితొలగించండి
  12. కందం:
    ఇమ్ముగ సందర్శించుచు
    నిమ్మహి నారామములను నిష్టముతోడన్
    సమ్ముదమున బౌద్ధవిహా
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  13. శార్దూలము:
    సమ్మోదంబుగ తీర్థదర్శనము నాస్వాదించుచున్ సాధువుల్
    సమ్మానంబులు సల్పు భక్తవరులన్ సంతృప్తులన్ జేయుచున్
    నెమ్మిన్ జేరిరి వేంకటేశ్వరుని సాన్నిధ్యమ్ము శ్రీవారి హా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్

    రిప్లయితొలగించండి
  14. క్రమ్మెను నొకపరి మేఘచ
    యమ్ములు పొడగట్టుచు వివిధాకృతినాకా
    శమ్మున, గని లింగా కా
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నెమ్మిని యా యసురులను వ
    నమ్మున సంహరణ చేసె నర్ధించ మునుల్
    ఇమ్ముగ రాముని యవతా
    రమ్మును గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్.

    రిప్లయితొలగించండి
  16. అమ్మునివరులకొరకై
    నమ్మయు వంటలను వండ నానందమతో
    నిమ్ముగ గనుచాయాహా
    *“రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్”*

    రిప్లయితొలగించండి