25-2-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల”(లేదా...)“వ్రతముం జేయక వాయకనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్”
తేటగీతివలువలొసఁగి రక్షింపఁగఁ గొలువ సతమునన్నకేకాదశియె ముఖ్యమనఁగఁ గృష్ణప్రీతి ముత్తైదువులఁ బిల్చి, వీడగలఁదెవ్రతముఁ జేయక? యిడె నాతి వాయనములమత్తేభవిక్రీడితమువెతలంజిక్కఁగ వల్వలిచ్చి వడిగన్ వేంచేసి శ్రీకృష్ణుడున్సతియా ద్రౌపదిఁ గావఁగన్, హరికినుత్సాహంబు గల్గించునన్మతితోఁ బిల్చియుఁ దా సువాసినుల సంభావింప, వారించునేవ్రతముం జేయక? వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్
అన్య దేశము నకుపోయి యదురుగడగ ;చెమ్మ చెక్కల నాడిన చిన్ననాటిసకియ వచ్చిన కతమున చక్కటి నెరివ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల
తాను బుణ్యకవ్రతమని దానమొసగెనల్లనయ్యను వైదేహి నారదునికిపుణ్యమును గోరి నేడిట పుణ్యకమను వ్రతముఁ జేయక యిడె నాతి వాయనములవ్రతదీక్షా నియమంబులెర్గి విధిగా బాటింప భావించుచున్బతినే దానము సేసె నారదునికిన్ వైదర్భి సంప్రీతినిన్బతిలేకున్నను పూజ సల్పునెపుడున్ బద్మాక్షి తాఁ బుణ్యకవ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్
తేటగీతి రెందవ పాదము లో 'వైదర్భి ' గా చదువ గోరుచున్నాను
పండితులు చెప్పిరంచును వ్రతము నొకటిభర్త క్షేమంబు గోరుచు పడతి చేయబూనినంతనె పెనిమిటి మూర్ఛబోవ వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల.పతిక్షేమంబును గోరి చేయదలచెన్ వారాహికిన్ బూజనాసతి శ్రావణమాసమందు విహితుల్ సద్బాంధవుల్ చూడగా వ్రతమారంభము జేయువేళ పతికిన్ స్వాస్థ్యంబదే పాడవన్ వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్.
చెలిమి మరువ క వచ్చిన కలికి గాంచి పడతి స్వాగ తమ్మును బ ల్కి పరవశించి వ్రతము జేయక యి డె వాయన ములచూపి ప్రేమాద రమ్ముల సొంపు మీర
తే.గీ:శుక్రవారము నాడెంతొ శుచి వహించిశ్రద్ధగా బూజ జేసియు శాస్త్రవేత్త రీతిపుణ్య మగు నంచు లోభపు బుద్ధి గల్గువ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల”(లోభబుద్ధితో వ్రతం చెయ్యక సక్రమంగా గా చేసింది. )
వంత యేల తప్పున్నదె సుంత యేని యక్క వ్రత మొనర్పంగ నొక్కొక్కరికిని సాయ మొనరింపఁ దలఁచి తత్క్షణము దాను వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల ఇతరాలోచన లెల్ల మాని మనమం దింతేనియున్ గౌరవాన్విత సద్భావము నూను మమ్మ యిఁక విద్వేషంబు త్యాజ్యం బగున్ వ్రతముల్ నిష్ఠ నొనర్చి పెక్కిఁటిని సద్భక్తిన్ యథోక్తమ్ము కువ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.వ్రతమునకు సకలము సిద్ధపరచె పడతిపిలిచి ముత్తైదులను తాను వేడ్క జరుపభర్త రాలేక నతి ముఖ్య పనుల వల్ల వ్రతము చేయక యిడె నాతి వాయనముల.
తేటగీతి
రిప్లయితొలగించండివలువలొసఁగి రక్షింపఁగఁ గొలువ సతము
నన్నకేకాదశియె ముఖ్యమనఁగఁ గృష్ణ
ప్రీతి ముత్తైదువులఁ బిల్చి, వీడగలఁదె
వ్రతముఁ జేయక? యిడె నాతి వాయనముల
మత్తేభవిక్రీడితము
వెతలంజిక్కఁగ వల్వలిచ్చి వడిగన్ వేంచేసి శ్రీకృష్ణుడున్
సతియా ద్రౌపదిఁ గావఁగన్, హరికినుత్సాహంబు గల్గించునన్
మతితోఁ బిల్చియుఁ దా సువాసినుల సంభావింప, వారించునే
వ్రతముం జేయక? వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్
అన్య దేశము నకుపోయి యదురుగడగ ;
రిప్లయితొలగించండిచెమ్మ చెక్కల నాడిన చిన్ననాటి
సకియ వచ్చిన కతమున చక్కటి నెరి
వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల
తాను బుణ్యకవ్రతమని దానమొసగె
రిప్లయితొలగించండినల్లనయ్యను వైదేహి నారదునికి
పుణ్యమును గోరి నేడిట పుణ్యకమను
వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల
వ్రతదీక్షా నియమంబులెర్గి విధిగా బాటింప భావించుచున్
బతినే దానము సేసె నారదునికిన్ వైదర్భి సంప్రీతినిన్
బతిలేకున్నను పూజ సల్పునెపుడున్ బద్మాక్షి తాఁ బుణ్యక
వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్
తేటగీతి రెందవ పాదము లో 'వైదర్భి ' గా చదువ గోరుచున్నాను
తొలగించండి
రిప్లయితొలగించండిపండితులు చెప్పిరంచును వ్రతము నొకటి
భర్త క్షేమంబు గోరుచు పడతి చేయ
బూనినంతనె పెనిమిటి మూర్ఛబోవ
వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల.
పతిక్షేమంబును గోరి చేయదలచెన్ వారాహికిన్ బూజనా
సతి శ్రావణమాసమందు విహితుల్ సద్బాంధవుల్ చూడగా
వ్రతమారంభము జేయువేళ పతికిన్ స్వాస్థ్యంబదే పాడవన్
వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్.
చెలిమి మరువ క వచ్చిన కలికి గాంచి
రిప్లయితొలగించండిపడతి స్వాగ తమ్మును బ ల్కి పరవశించి
వ్రతము జేయక యి డె వాయన ముల
చూపి ప్రేమాద రమ్ముల సొంపు మీర
తే.గీ:శుక్రవారము నాడెంతొ శుచి వహించి
రిప్లయితొలగించండిశ్రద్ధగా బూజ జేసియు శాస్త్రవేత్త రీతి
పుణ్య మగు నంచు లోభపు బుద్ధి గల్గు
వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల”
(లోభబుద్ధితో వ్రతం చెయ్యక సక్రమంగా గా చేసింది. )
వంత యేల తప్పున్నదె సుంత యేని
రిప్లయితొలగించండియక్క వ్రత మొనర్పంగ నొక్కొక్కరికిని
సాయ మొనరింపఁ దలఁచి తత్క్షణము దాను
వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల
ఇతరాలోచన లెల్ల మాని మనమం దింతేనియున్ గౌరవా
న్విత సద్భావము నూను మమ్మ యిఁక విద్వేషంబు త్యాజ్యం బగున్
వ్రతముల్ నిష్ఠ నొనర్చి పెక్కిఁటిని సద్భక్తిన్ యథోక్తమ్ము కు
వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వ్రతమునకు సకలము సిద్ధపరచె పడతి
పిలిచి ముత్తైదులను తాను వేడ్క జరుప
భర్త రాలేక నతి ముఖ్య పనుల వల్ల
వ్రతము చేయక యిడె నాతి వాయనముల.