8-7-2026 (బుధవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్”(లేదా...)“భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్”
ముక్తీ నొసగునని నమ్ముచు భక్తిగ నిత్యము భజించు బత్తుడు దనపై రక్తిగొనుట దగ్గుటగని భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంసక్తత భిక్షకు వెడలగభుక్తికి వ్యాసునకు ముద్ద పుట్టక తానుద్యుక్తుడుగ నెంచ శాపముభక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్!ఉత్పలమాలసక్తత విశ్వనాథునకు సద్మమటంచును శిష్యకోటితోభుక్తికి భిక్షకై వెడలి పుట్టక ముద్దయు శాపమెంచ నిర్యుక్తికమంచు వ్యాసుముని నోపక శంకరుడంపె నక్కటా!భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్!
నక్తంచరునకు వరమిడిభక్తునిచే భంగపడెను భర్గుఁడు, గాశిన్భక్తవశంకరుడు నిలిచె భక్తులు కోరుకొను నట్టి పరము నొసంగన్.ముక్తిని గోరి కాదు నరభోజనుడే తప మాచరించి తా భక్తవ శంకరున్ గరము భాస్మమొనర్చు వరమ్ము గోరె, యా భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్ ముక్తి నొసంగ నిల్చెనట మూర్ఖుని కైనను విశ్వనాథుడై
రక్తగ్రహులకు వరమిడిభక్తునిచే భంగపడెను భర్గుఁడు; గాశిన్ముక్తినొసగుచుండు సతముభక్తింగొలిచెడి జనులకు పరమేశ్వరుడేవ్యక్తికిఁ దేహమందుగల వైదుషికిన్ గల భేదమేమిటోవ్యక్తమొనర్చు రీతి తను పంచము డైనను ప్రశ్నరేచెనాభక్తుడు తప్పుకోమనుచు పావన జన్ముడు శంకరుండనన్భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్[శంకరుఁడు = ఆది శంకరాచార్యుడు]
భుక్తికి బిక్షము దొరకక శక్తియు నశియించి యొకడు శాపంబి చ్చె న్ భక్తుని యావే శము తో భక్తుని చే భంగ పడెను భర్గుడు కాశి న్
కం: భక్తు ననుచు గుడిలో కడుయుక్తిగ సొమ్ముల గణించు నొకడై ధనమున్శక్తి కొలది దోచె గపటభక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్”
ఉ:ముక్తి నొసంగు క్షేత్రమని మ్రొక్కుల బొందెడు కాశి లోననేభక్తునిగా నటించు నొక పాపి ధనమ్ము గణించు వానిగాయుక్తిగ జేరుకన్ గుడిని నున్న ధనమ్మును దోచె మోసపుంభక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్”
ఉ॥ భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్యుక్తిగ సత్యదూరముల యోగ్యత నెంచక కించపర్చఁగన్ముక్తినిఁ గాంచు ధర్మమును మూఢులు నిల్పి కుతర్కమందు నాసక్తిని యట్లు పల్కినను శంకరుఁ డెప్పుడు భక్తవంద్యుఁడే!
దిక్తటములు తిరుగఁ దిరుగ భుక్తికి నన్నము దొరకమి పురమున నెందున్ రిక్తోదర విప్రునిచేభక్తునిచే భంగపడెను భర్గుఁడు కాశిన్ ముక్తి నొసంగు లింగ వర మూర్తియె పాశుప తాస్త్ర రాజ మా సక్తి నొసంగఁ బార్థునకు సత్వము ధైర్య పరాక్రమమ్ములన్ రక్తిఁ బరీక్ష సేయఁగ నరణ్యము దూఱఁ ద్యజించి వీటినిన్,భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నక్తచరు తపము మెచ్చుచుభక్తుడు భస్మాసురునకు వరమీయ భవున్యుక్తిగ శివు వెంట పడెనుభక్తునిచే భంగపడెను భర్గుడుఁ గాశిన్.
ముక్తీ నొసగునని నమ్ముచు
రిప్లయితొలగించండిభక్తిగ నిత్యము భజించు బత్తుడు దనపై
రక్తిగొనుట దగ్గుటగని
భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిసక్తత భిక్షకు వెడలగ
భుక్తికి వ్యాసునకు ముద్ద పుట్టక తాను
ద్యుక్తుడుగ నెంచ శాపము
భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్!
ఉత్పలమాల
సక్తత విశ్వనాథునకు సద్మమటంచును శిష్యకోటితో
భుక్తికి భిక్షకై వెడలి పుట్టక ముద్దయు శాపమెంచ ని
ర్యుక్తికమంచు వ్యాసుముని నోపక శంకరుడంపె నక్కటా!
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్!
నక్తంచరునకు వరమిడి
రిప్లయితొలగించండిభక్తునిచే భంగపడెను భర్గుఁడు, గాశిన్
భక్తవశంకరుడు నిలిచె
భక్తులు కోరుకొను నట్టి పరము నొసంగన్.
ముక్తిని గోరి కాదు నరభోజనుడే తప మాచరించి తా
భక్తవ శంకరున్ గరము భాస్మమొనర్చు వరమ్ము గోరె, యా
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్
ముక్తి నొసంగ నిల్చెనట మూర్ఖుని కైనను విశ్వనాథుడై
రక్తగ్రహులకు వరమిడి
రిప్లయితొలగించండిభక్తునిచే భంగపడెను భర్గుఁడు; గాశిన్
ముక్తినొసగుచుండు సతము
భక్తింగొలిచెడి జనులకు పరమేశ్వరుడే
వ్యక్తికిఁ దేహమందుగల వైదుషికిన్ గల భేదమేమిటో
వ్యక్తమొనర్చు రీతి తను పంచము డైనను ప్రశ్నరేచెనా
భక్తుడు తప్పుకోమనుచు పావన జన్ముడు శంకరుండనన్
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్
[శంకరుఁడు = ఆది శంకరాచార్యుడు]
భుక్తికి బిక్షము దొరకక
రిప్లయితొలగించండిశక్తియు నశియించి యొకడు శాపంబి చ్చె న్
భక్తుని యావే శము తో
భక్తుని చే భంగ పడెను భర్గుడు కాశి న్
కం: భక్తు ననుచు గుడిలో కడు
రిప్లయితొలగించండియుక్తిగ సొమ్ముల గణించు నొకడై ధనమున్
శక్తి కొలది దోచె గపట
భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్”
ఉ:ముక్తి నొసంగు క్షేత్రమని మ్రొక్కుల బొందెడు కాశి లోననే
రిప్లయితొలగించండిభక్తునిగా నటించు నొక పాపి ధనమ్ము గణించు వానిగా
యుక్తిగ జేరుకన్ గుడిని నున్న ధనమ్మును దోచె మోసపుం
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ॥ భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్
రిప్లయితొలగించండియుక్తిగ సత్యదూరముల యోగ్యత నెంచక కించపర్చఁగన్
ముక్తినిఁ గాంచు ధర్మమును మూఢులు నిల్పి కుతర్కమందు నా
సక్తిని యట్లు పల్కినను శంకరుఁ డెప్పుడు భక్తవంద్యుఁడే!
దిక్తటములు తిరుగఁ దిరుగ
రిప్లయితొలగించండిభుక్తికి నన్నము దొరకమి పురమున నెందున్
రిక్తోదర విప్రునిచే
భక్తునిచే భంగపడెను భర్గుఁడు కాశిన్
ముక్తి నొసంగు లింగ వర మూర్తియె పాశుప తాస్త్ర రాజ మా
సక్తి నొసంగఁ బార్థునకు సత్వము ధైర్య పరాక్రమమ్ములన్
రక్తిఁ బరీక్ష సేయఁగ నరణ్యము దూఱఁ ద్యజించి వీటినిన్,
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నక్తచరు తపము మెచ్చుచు
భక్తుడు భస్మాసురునకు వరమీయ భవున్
యుక్తిగ శివు వెంట పడెను
భక్తునిచే భంగపడెను భర్గుడుఁ గాశిన్.