22-7-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్”
(లేదా...)
“హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్”
(ఛందోగోపనం)
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)
స్నేహితులన్న క్షీరమును నీరము వోలె లయించువారు విద్రోహపు చింతనన్ విడచి తోషము గూర్చగ జూతు రొండొరుల్స్నేహమె యూపిరై మెలఁగి నిత్యము నాజత గోరువారలౌనాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
సాహిత్య సేద్య మొనరిం చు హాలికులుగ పచరించు సుముఖుల లోనన్ సహృదయము నొందిన కడు సన్నాహితు లర్థప్రియులనగ నమ్మరు విజ్ఞుల్
స్నేహితుడని యడుగగ పౌ రోహిత్యము జేయువాడు రొక్కము గొని యు ద్వాహముహుర్తము జెప్పెను నా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్.నరులిల స్వార్థ చిత్తులు ధనమ్మె ప్రధాన మటంచు నమ్ముచున్ ధరణి జరించు వారలుచితమ్ముగ సాయము జేయ రైరి నె య్యరి యని చెంత జేరుచు సహాయము గోరిన పేద యంచు కా నరు, హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్.
గేహము యాగనిలయమేదేహము నిరతము తరించు దేవుని సేవన్!ఆహవన నిరతులగు నగ్న్యాహితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్గేహము నిత్యకర్మలకు కేంద్రము శ్రోత్రియులైనవారికిన్దేహము నీమనిష్ఠలకు దేవుని పూజకు సర్వసిద్ధమే!ఆహవనమ్ముకై సతతమగ్నులఁ బ్రోచెడి వేదవేత్త లగ్న్యాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్ [అగ్న్యాహితుఁడు = అగ్నిహోత్రి; నిత్యము అగ్నికార్యము చేయువాఁడు]
(1)కం:మనుజుల దోచున దెవ్వడొ,ఘను డగు పాలకు డెవండొ కాంచరె పౌరుల్?మనమున వివేక మున్నన్జనహితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్”(2)ఉ:సాహసి యై వధానముల సాగుచు బాల్యము నుండి, సుంత సందేహము లేక విద్య చెడు దీన నటంచు, మహాప్రసాదమౌసాహితి గొప్ప భాగ్యమని శారద గొల్చును గాదె యీసునన్సాహితుడర్థకామి యన నమ్మరు పండితు లీ సభాస్థలిన్"(3)చం:ఘన మగు పద్య విద్య యిక కాలము చెల్లిన విద్య,దీనిలో ధనము గడించ నంచు దన దారిని దా విడి పోక రాష్ట్ర మందున బలు సంఘముల్ నడిపె,ధూర్తులు దూరగనేమి! యెంతయున్జనహితు , డర్థకామి యన నమ్మరు పండితు లీ సభాస్థలిన్"
చం॥ తనరుచు స్నేహ భావమునఁ దారణ మొందఁగఁ బేద లెల్లరున్ధనమును ధారవోసి తగు ధన్యతఁ గాంచుచు సంచరించుచున్ మనఁగఁ బరోపకారమున మక్కువ యొప్పఁగ నన్య మేది కానని హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్ల వేళలన్
ద్రోహము నెన్నఁడు తలపడుస్నేహితుఁడే హితముఁగోరు నిరతము మదిలోస్నేహమె పెన్నిధిగ దలఁచునా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్
దేహ మ శాశ్వత మనుకొని స్నేహముతో సకల జనుల శ్రేయము కొరకై సాహస మొ న రిం చె డి యే నా హితు లర్థ ప్రియులన నమ్మరు విజ్ను ల్?
ఆ హర భక్తులకున్ ధన దాహ మొకింతయును లేదు తథ్యము నిత్యం బాహా సంతృప్తు లయిన నా హితు లర్థప్రియు లన నమ్మరు విజ్ఞుల్ ధన మది యెంత యున్న ధన దాహము తీరదు లోభి కెన్నఁడున్ వనజ దళాక్షునిన్ మదిని వారక తల్చుచు నిత్య హర్యుపాసనమున మున్గు చుండుదురు సాధు జనుల్ కడు బీద వార లైనను హితు లర్థ కాము లన నమ్మరు పండితు లెల్ల వేళలన్
కందంజగతిని నీరము తరువులుమిగుల పరహితమ్మునెంచి మేదిని సాగున్దగ నా రీతిని సృష్టిఁ గనగ హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్చంపకమాలజగతిని నీరమున్ దరులు స్వార్థము లేక హితమ్ము గూర్చెడున్మిగుల పరోపకారమున మేదిని జీవుల కంకితమ్ముగన్దగ గనుగొన్న వీనివలె ధాత్రిని సత్కృతులన్ బొనర్పఁ గానగ హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.దేహము రోగము పాలైస్నేహితులను ధనమడుగగ శీఘ్రము పంపన్దోహదపడె నా ధనమేనా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్.
సమస్య: హితులర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్ (యతి అక్షర గోపన సమస్య)అనయము పద్య సేద్యము నయమ్మున జేయుచు చిత్తశుద్ధితోవినయము జూపుచున్ గురులు ప్రీతిగ నేర్పెడు విద్య నేర్చుచున్ ఘనముగ వ్రాయ నెంచుచును కావ్యములన్ గడు నిచ్చతోడుతన్ మను హితులర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
స్నేహితులన్న క్షీరమును నీరము వోలె లయించువారు వి
రిప్లయితొలగించండిద్రోహపు చింతనన్ విడచి తోషము గూర్చగ జూతు రొండొరుల్
స్నేహమె యూపిరై మెలఁగి నిత్యము నాజత గోరువారలౌ
నాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
సాహిత్య సేద్య మొనరిం
రిప్లయితొలగించండిచు హాలికులుగ పచరించు సుముఖుల లోనన్
సహృదయము నొందిన కడు స
న్నాహితు లర్థప్రియులనగ నమ్మరు విజ్ఞుల్
రిప్లయితొలగించండిస్నేహితుడని యడుగగ పౌ
రోహిత్యము జేయువాడు రొక్కము గొని యు
ద్వాహముహుర్తము జెప్పెను
నా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్.
నరులిల స్వార్థ చిత్తులు ధనమ్మె ప్రధాన మటంచు నమ్ముచున్
ధరణి జరించు వారలుచితమ్ముగ సాయము జేయ రైరి నె
య్యరి యని చెంత జేరుచు సహాయము గోరిన పేద యంచు కా
నరు, హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్.
గేహము యాగనిలయమే
రిప్లయితొలగించండిదేహము నిరతము తరించు దేవుని సేవన్!
ఆహవన నిరతులగు న
గ్న్యాహితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్
గేహము నిత్యకర్మలకు కేంద్రము శ్రోత్రియులైనవారికిన్
దేహము నీమనిష్ఠలకు దేవుని పూజకు సర్వసిద్ధమే!
ఆహవనమ్ముకై సతతమగ్నులఁ బ్రోచెడి వేదవేత్త ల
గ్న్యాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
[అగ్న్యాహితుఁడు = అగ్నిహోత్రి; నిత్యము అగ్నికార్యము చేయువాఁడు]
(1)కం:మనుజుల దోచున దెవ్వడొ,
రిప్లయితొలగించండిఘను డగు పాలకు డెవండొ కాంచరె పౌరుల్?
మనమున వివేక మున్నన్
జనహితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్”
(2)ఉ:సాహసి యై వధానముల సాగుచు బాల్యము నుండి, సుంత సం
దేహము లేక విద్య చెడు దీన నటంచు, మహాప్రసాదమౌ
సాహితి గొప్ప భాగ్యమని శారద గొల్చును గాదె యీసునన్
సాహితుడర్థకామి యన నమ్మరు పండితు లీ సభాస్థలిన్"
(3)చం:ఘన మగు పద్య విద్య యిక కాలము చెల్లిన విద్య,దీనిలో
ధనము గడించ నంచు దన దారిని దా విడి పోక రాష్ట్ర మం
దున బలు సంఘముల్ నడిపె,ధూర్తులు దూరగనేమి! యెంతయున్
జనహితు , డర్థకామి యన నమ్మరు పండితు లీ సభాస్థలిన్"
చం॥ తనరుచు స్నేహ భావమునఁ దారణ మొందఁగఁ బేద లెల్లరున్
రిప్లయితొలగించండిధనమును ధారవోసి తగు ధన్యతఁ గాంచుచు సంచరించుచున్
మనఁగఁ బరోపకారమున మక్కువ యొప్పఁగ నన్య మేది కా
నని హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్ల వేళలన్
ద్రోహము నెన్నఁడు తలపడు
రిప్లయితొలగించండిస్నేహితుఁడే హితముఁగోరు నిరతము మదిలో
స్నేహమె పెన్నిధిగ దలఁచు
నా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్
దేహ మ శాశ్వత మనుకొని
రిప్లయితొలగించండిస్నేహముతో సకల జనుల శ్రేయము కొరకై
సాహస మొ న రిం చె డి యే
నా హితు లర్థ ప్రియులన నమ్మరు విజ్ను ల్?
ఆ హర భక్తులకున్ ధన
రిప్లయితొలగించండిదాహ మొకింతయును లేదు తథ్యము నిత్యం
బాహా సంతృప్తు లయిన
నా హితు లర్థప్రియు లన నమ్మరు విజ్ఞుల్
ధన మది యెంత యున్న ధన దాహము తీరదు లోభి కెన్నఁడున్
వనజ దళాక్షునిన్ మదిని వారక తల్చుచు నిత్య హర్యుపా
సనమున మున్గు చుండుదురు సాధు జనుల్ కడు బీద వార లై
నను హితు లర్థ కాము లన నమ్మరు పండితు లెల్ల వేళలన్
కందం
రిప్లయితొలగించండిజగతిని నీరము తరువులు
మిగుల పరహితమ్మునెంచి మేదిని సాగున్
దగ నా రీతిని సృష్టిఁ గ
నగ హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్
చంపకమాల
జగతిని నీరమున్ దరులు స్వార్థము లేక హితమ్ము గూర్చెడున్
మిగుల పరోపకారమున మేదిని జీవుల కంకితమ్ముగన్
దగ గనుగొన్న వీనివలె ధాత్రిని సత్కృతులన్ బొనర్పఁ గా
నగ హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
దేహము రోగము పాలై
స్నేహితులను ధనమడుగగ శీఘ్రము పంపన్
దోహదపడె నా ధనమే
నా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్.
సమస్య: హితులర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్ (యతి అక్షర గోపన సమస్య)
రిప్లయితొలగించండిఅనయము పద్య సేద్యము నయమ్మున జేయుచు చిత్తశుద్ధితో
వినయము జూపుచున్ గురులు ప్రీతిగ నేర్పెడు విద్య నేర్చుచున్
ఘనముగ వ్రాయ నెంచుచును కావ్యములన్ గడు నిచ్చతోడుతన్
మను హితులర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్