29, సెప్టెంబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/8


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

8వ అర్థము నిరృతి స్మరణ          

భూరి జఠర గురుఁడు = గొప్ప కఠినులగు వారికి (రాక్షసులకు) రాజైన వాడును,
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివుఁడే
భూతి = ఐశ్వర్యముగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన = వృత్రాసురుఁడను ప్రభువుకు
మణి కలాపుఁడు = రత్నభూషణము వంటివాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = దిక్పాలకాగ్రణి యైనవాఁడును,
మహా మర్త్యసింహుఁడు = మిక్కిలిగా మానవులకు సింహప్రాయుఁ డైనవాఁడును (అగు నిరృతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

3 కామెంట్‌లు:

  1. నీర జాంబ క భూతుడు నిరృతి యనగ
    నగ్ర గోపుడు సద్గణేశా గ్రజుండు
    మర్త్య సింహుడు నిరతము మనలగావు
    గాత ! నతులను నిత్తును గరుణ కలుగ

    రిప్లయితొలగించండి
  2. కఠిన రాక్షసులకు రాజు కంటనిప్పు
    వాడె కలిమి,యతిశయుండు పరగ వృత్ర
    రత్నభూషణుడు సుగుణ రాశివాడు
    గొప్పదిక్పతి నిరృతి యొప్పగాచు.

    రిప్లయితొలగించండి
  3. అద్దిరబన్న! వర్షమన నారుతడిన్ బడ గానమైతి మీ P.Satyanarayana
    కొద్ది దినంబులున్ గడిచె గోరిక మేరకు గొన్నిచిన్కు లి
    ప్పొద్దున జూడగంటిమిట బోదము మేనుల దడ్ప హాయిగా!
    వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగన్. (ప్పొ కు క్రావడి టైపులో రాలేదు)

    P.Satyanarayana
    ఆతపముకొక్క గొడుగుండు నాప,వాని
    బట్టు విజ్ఞతలున్నను భగవదాజ్ఞ
    లేక కడగండ్ల గడచియు లెక్కలేల?
    కుండపోత వర్షమ్మున గొడుగు లేల?!P.Satyanarayana





    రిప్లయితొలగించండి