16-10-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
(లేదా...)
“కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో”
(న.చ. సాహిత్ శతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)
ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.
అరయగ జరిగిన భీకరకురుపాండవయుద్ధమందు గూలిరనేకుల్తరమౌనా లెక్కించగ“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”గండూరి
కందంఇరుదేశమ్ముల దురమునజరిగెను నరమేధ మెపుఁడు జరుగని రీతిన్ఒరిగెను నేలకు మనుజులకరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్
పరమాత్ముండా శ్రీహరి తిరుమలపై నిలిచె నంచు తిరువడు లెల్లన్ దరలగ తిరువెంగడమున కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్.అరమెయి జోదు వాడు త్రిపురాంతకు డాతడె వేడి నంత యు ద్ధరణము నిచ్చు వాడని సదాగతి గోరుచు భక్తు లెందరో ఖరువు సమీక్షణమ్ము కయి కాశి పురంబున కేగు నట్టి యా కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో.
దురము కొనసాగిన యెడల కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”ధరణిపయి చెదరి యుండుట నరయగ , నెవరికయిన నెద యలజడి నొందున్
భరతావనికి స్వతంత్రముదొరయింపగ నుద్యమమున దూఁకిన పిదపన్మరిదెబ్బల నోర్చినవగుకరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్తరమగు వాంఛితమ్మని స్వతంత్రము గావలెనంచుఁ బల్కుచున్బిరబిరఁ బౌరులెల్లరును వెన్కకు బంపగ తెల్లవారలన్వెరవక నుద్యమింప మరి బెత్తపు దెబ్బల నోర్చినట్టివౌకరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో
ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅరయగ జరిగిన భీకర
కురుపాండవయుద్ధమందు గూలిరనేకుల్
తరమౌనా లెక్కించగ
“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
గండూరి
కందం
రిప్లయితొలగించండిఇరుదేశమ్ముల దురమున
జరిగెను నరమేధ మెపుఁడు జరుగని రీతిన్
ఒరిగెను నేలకు మనుజుల
కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్
రిప్లయితొలగించండిపరమాత్ముండా శ్రీహరి
తిరుమలపై నిలిచె నంచు తిరువడు లెల్లన్
దరలగ తిరువెంగడమున
కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్.
అరమెయి జోదు వాడు త్రిపురాంతకు డాతడె వేడి నంత యు
ద్ధరణము నిచ్చు వాడని సదాగతి గోరుచు భక్తు లెందరో
ఖరువు సమీక్షణమ్ము కయి కాశి పురంబున కేగు నట్టి యా
కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో.
దురము కొనసాగిన యెడల
రిప్లయితొలగించండికరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
ధరణిపయి చెదరి యుండుట
నరయగ , నెవరికయిన నెద యలజడి నొందున్
భరతావనికి స్వతంత్రము
రిప్లయితొలగించండిదొరయింపగ నుద్యమమున దూఁకిన పిదపన్
మరిదెబ్బల నోర్చినవగు
కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్
తరమగు వాంఛితమ్మని స్వతంత్రము గావలెనంచుఁ బల్కుచున్
బిరబిరఁ బౌరులెల్లరును వెన్కకు బంపగ తెల్లవారలన్
వెరవక నుద్యమింప మరి బెత్తపు దెబ్బల నోర్చినట్టివౌ
కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో