5-1-2022 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఏడవ మగఁడున్న భార్యకే దక్కు నుతుల్”(లేదా...)“ఏడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్”
కందంచేడియ కినుకను దివిపైదాడిని హరి పారిజమ్ము ధరణికి దించెన్గూడగనే తానడుగుచునేడవ, మగఁడున్న భార్యకే దక్కు నుతుల్!ఉత్పలమాలచూడగ వచ్చి నారదుడు చోద్యమనంగను కృష్ణమూర్తిపైచేడియ సత్య కిన్కఁబడఁ జేయఁగ స్వర్గముపైన దాడిమైకూడియుఁ దెచ్చె పారిజము కోమలి రంజిల! మోజు దీర్పఁ దానేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్!
పోడిమి యై యను రాగము తోడ మెలగు పతి కరోన తో మడియంగా చేడియ కుమిలి కుమిలి తా నేడవ : మగడున్న భార్య కే దక్కు నుతుల్
వీడకతననీడయటులనేడకు తానేగినయట కేతెంచు, సతిన్చూడగ మనసొప్పని తానేడవ, మగఁడున్న భార్యకే దక్కు నుతుల్
వేడగ నమ్మ మాతులునిఁ బెండిలి యాడితి చిత్తశుద్ధితోచేడియ యొక్కదాని వలఁ జిక్కి గృహమ్మును చేరకుండె నేవీడగ లేను బంధమును బిడ్డలకై భరియింతుఁ బ్రేమకైయేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
నేటి శంకరాభరణము వారి సమస్యఏడవ మగడున్న భార్యకే దక్కు సుతుల్ఇచ్చిన పాదము కందము నా పూరణ. సీసములోకుంతి ఆవేదనమునివరు డొకవర మొసగగ దానిన్ పరీక్షించ దలచి కోరి దినకరునిపిలువగ నేలనో, పిలచి నతనితోడకూడి నే రీతిని కొమరుని కనవలెను, లోకంబప వాదు లిడుననుచు తలచంగ నేమేలు కలుగదు పలుమార్లు నీ వేడవ,మగడున్న భార్యకే దక్కు సుతులెపుడున్ థరణి పైన,ప్రజలు నిందలన్ వేయుచు బాధ లిడకపూర్వ మీతనిన్ నదిలోన విడువ మేలుకలుగునని యంత రాత్మ పలికెను కుంతితోడ సుతునిపై ప్రేమను వీడమంచు
తోడూనీడగమెలగినవాడేననువీడ నెటుల బ్రతికెదను యమా!వేడుక చూడకుమా నేనేడవ, మగఁడున్న భార్యకే దక్కు నుతుల్
వేడినతోడనేగనుచువేదనఁదీర్చుచుభాగ్యలక్ష్మియైకూడికకష్టసౌఖ్యములకోమలహస్తముసేదఁదీర్చుచున్తోడుగనీడగానిలచుతోయ్యలికాననిబాధతోడతానేడవ, భర్తకల్గినపుడేగదసాధ్వికిగౌరవంబిలన్
ఆడఁ గల యేడు జంటలునాడుచుఁ బాడుచుఁ జెలంగ నానందముగా నేడుగురు పురుషులఁ బతిగ నేడవ మగఁ డున్న భార్యకే దక్కు నుతుల్ఆడిన యాటలో గెలుపె యాడిన వారి కొసంగు ఖ్యాతినిం బాడిన పాట మెప్పరయఁ బన్నుగ గాయకుఁ డందు మన్ననల్ కోడలుగా గృహమ్ము నను గూరిమి నుండఁగఁ బుత్రుఁ డింటిలో నేడవ భర్త కల్గి నపుడే కద సాధ్వికి గౌరవం బిలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంవీడని కామన తోడనెచేడియ తన వేడుక దలచి వగచి మగనిన్పీడించి పట్టు వదలకఏడవ ,మగడున్న భార్యకే దక్కు నుతుల్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
వీడక పంతమున్ మగని వీడెదనంచటులా కుమార్తె దానేడవ, "భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్వీడుమపోహమున్ వడిగ బెన్మిటి జేరి నిజాంతరంగమున్బాడిగ దెల్ప మేల"నుచు పల్కెను తల్లి విధాయకంబుగా
వేడుకగా స్వయంవరపు వేదిని బారులు తీరియున్న మన్నీడుల నొక్కరొక్కరిగ నీరజలోచన వీక్షజేయుచున్యేడవవానిగాంచి యతడే తన భర్తని తండ్రితోననెన్యేడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
చేడియ నొక్కతె జగతినిజూడగ నెవ్వరును లేక చులకనపాలైతోడుగ పెనిమిటి లేడనియేడవ,మగఁడున్న భార్యకే దక్కు నుతుల్.
పాడిగ గాజులు మట్టెలుపోడిమి కంఠము పయినను పుస్తెలు బొట్టున్తోడై సిగ తిలకము లకుయేడవ మగఁడున్న భార్యకే దక్కు నుతుల్బొట్టు = మంగళసూత్రమునందు గ్రుచ్చెడు పూస
కందం
రిప్లయితొలగించండిచేడియ కినుకను దివిపై
దాడిని హరి పారిజమ్ము ధరణికి దించెన్
గూడగనే తానడుగుచు
నేడవ, మగఁడున్న భార్యకే దక్కు నుతుల్!
ఉత్పలమాల
చూడగ వచ్చి నారదుడు చోద్యమనంగను కృష్ణమూర్తిపై
చేడియ సత్య కిన్కఁబడఁ జేయఁగ స్వర్గముపైన దాడిమై
కూడియుఁ దెచ్చె పారిజము కోమలి రంజిల! మోజు దీర్పఁ దా
నేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్!
పోడిమి యై యను రాగము
రిప్లయితొలగించండితోడ మెలగు పతి కరోన తో మడియంగా
చేడియ కుమిలి కుమిలి తా
నేడవ : మగడున్న భార్య కే దక్కు నుతుల్
వీడకతననీడయటుల
రిప్లయితొలగించండినేడకు తానేగినయట కేతెంచు, సతిన్
చూడగ మనసొప్పని తా
నేడవ, మగఁడున్న భార్యకే దక్కు నుతుల్
వేడగ నమ్మ మాతులునిఁ బెండిలి యాడితి చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండిచేడియ యొక్కదాని వలఁ జిక్కి గృహమ్మును చేరకుండె నే
వీడగ లేను బంధమును బిడ్డలకై భరియింతుఁ బ్రేమకై
యేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
నేటి శంకరాభరణము వారి సమస్య
రిప్లయితొలగించండిఏడవ మగడున్న భార్యకే దక్కు సుతుల్
ఇచ్చిన పాదము కందము నా పూరణ. సీసములో
కుంతి ఆవేదన
మునివరు డొకవర మొసగగ దానిన్ ప
రీక్షించ దలచి కోరి దినకరుని
పిలువగ నేలనో, పిలచి నతనితోడ
కూడి నే రీతిని కొమరుని కన
వలెను, లోకంబప వాదు లిడుననుచు
తలచంగ నేమేలు కలుగదు పలు
మార్లు నీ వేడవ,మగడున్న భార్యకే
దక్కు సుతులెపుడున్ థరణి పైన,
ప్రజలు నిందలన్ వేయుచు బాధ లిడక
పూర్వ మీతనిన్ నదిలోన విడువ మేలు
కలుగునని యంత రాత్మ పలికెను కుంతి
తోడ సుతునిపై ప్రేమను వీడమంచు
తోడూనీడగమెలగిన
రిప్లయితొలగించండివాడేననువీడ నెటుల బ్రతికెదను యమా!
వేడుక చూడకుమా నే
నేడవ, మగఁడున్న భార్యకే దక్కు నుతుల్
వేడినతోడనేగనుచువేదనఁదీర్చుచుభాగ్యలక్ష్మియై
రిప్లయితొలగించండికూడికకష్టసౌఖ్యములకోమలహస్తముసేదఁదీర్చుచున్
తోడుగనీడగానిలచుతోయ్యలికాననిబాధతోడతా
నేడవ, భర్తకల్గినపుడేగదసాధ్వికిగౌరవంబిలన్
ఆడఁ గల యేడు జంటలు
రిప్లయితొలగించండినాడుచుఁ బాడుచుఁ జెలంగ నానందముగా
నేడుగురు పురుషులఁ బతిగ
నేడవ మగఁ డున్న భార్యకే దక్కు నుతుల్
ఆడిన యాటలో గెలుపె యాడిన వారి కొసంగు ఖ్యాతినిం
బాడిన పాట మెప్పరయఁ బన్నుగ గాయకుఁ డందు మన్ననల్
కోడలుగా గృహమ్ము నను గూరిమి నుండఁగఁ బుత్రుఁ డింటిలో
నేడవ భర్త కల్గి నపుడే కద సాధ్వికి గౌరవం బిలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండివీడని కామన తోడనె
చేడియ తన వేడుక దలచి వగచి మగనిన్
పీడించి పట్టు వదలక
ఏడవ ,మగడున్న భార్యకే దక్కు నుతుల్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివీడక పంతమున్ మగని వీడెదనంచటులా కుమార్తె దా
రిప్లయితొలగించండినేడవ, "భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
వీడుమపోహమున్ వడిగ బెన్మిటి జేరి నిజాంతరంగమున్
బాడిగ దెల్ప మేల"నుచు పల్కెను తల్లి విధాయకంబుగా
వేడుకగా స్వయంవరపు వేదిని బారులు తీరియున్న మ
రిప్లయితొలగించండిన్నీడుల నొక్కరొక్కరిగ నీరజలోచన వీక్షజేయుచున్
యేడవవానిగాంచి యతడే తన భర్తని తండ్రితోననెన్
యేడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
చేడియ నొక్కతె జగతిని
రిప్లయితొలగించండిజూడగ నెవ్వరును లేక చులకనపాలై
తోడుగ పెనిమిటి లేడని
యేడవ,మగఁడున్న భార్యకే దక్కు నుతుల్.
పాడిగ గాజులు మట్టెలు
రిప్లయితొలగించండిపోడిమి కంఠము పయినను పుస్తెలు బొట్టున్
తోడై సిగ తిలకము లకు
యేడవ మగఁడున్న భార్యకే దక్కు నుతుల్
బొట్టు = మంగళసూత్రమునందు గ్రుచ్చెడు పూస