9-1-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కార మగును మోక్షకారకమ్ము”(లేదా...)“కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్”
ఆటవెలదిఅన్నమయ్యవోలె హరికీర్తనమ్ములస్వామి సేవఁ జేసి పరము నందుచిత్తశుద్ధి కలుగు నుత్తమ భక్తి సాకార మగును మోక్షకారకమ్ము
ఉత్పలమాలశౌరిని వేంకటాద్రిఁగని సన్నుతిఁ జేయుచు నందకాంశమైనేరిచి నాటపాటలను నిక్కము గాంచుచు శ్రీనివాసునిన్భూరి వరమ్మనన్ బ్రభువు మ్రోలను నిల్వఁగనంతమందు సాకారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
చిత్త శుద్ధి తోడ శివునినామము దల్చి వాని సన్నిధియదె భాగ్యమనుచుభావనమ్ము గలుగు భక్తున కదియె సత్కారమగును, మోక్ష కారకమ్ము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సర్వమాతనిస్రుష్టిసంబంధమేలేదుఅహమువీడుడయ్యయానమందుబాహ్యమందుమమతఁబాయతలపునిర్వికారమగునుమోక్షకారకమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సృష్టి' టైపాటు.
భక్త సులభు డైన భవుని నామ జపము విడువ కుండ జగతి విమల మతులు సత్య ధర్మ ముగను సతతంబు సల్పు నోం కార మగును మోక్ష కారకమ్ము
ఆరనికోరికన్దగలకాత్మనువేంకననామమెంచుచున్సారములేనిదీజగతిశాంతికిమార్గములౌకికంబనన్పారముజూడగానరుడుభావననిల్పిననిర్వికారమాకారముమోక్షకారకముకారణజన్మునకాత్మవేత్తకున్
శాంతికిమార్గమలౌకికంబనన్, సవరణగ్రహింపగలరు
విష్ణు,శివ,విధాత పేర్లు మూడు వరుసనలరు చుండు గాదె అ-ఉ-మ లనగమంత్ర రాజ మగును మఱికూడి యవియె ఓమ్కారమగును మోక్ష కారకమ్ము.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
వారికి చేతజిక్కినను భద్రత నిచ్చెడు శీలవంతుడై కోరినవారి కెల్లపుడు కోర్కెలదీర్చెడు దాతగా భువిన్ పేరగుచున్ సదా శివుని బ్రీతిగ గొల్చెడు సౌమనస్వి సంస్కారము మోక్షకారకము కారణజన్మున కాత్మ వేత్తకున్.
భారము నీదెయంచు భగవానుని నెమ్మనమందు నమ్మి సంసార మహాంబుధీతరణసక్తత చూపు మహాత్ములీ భువిన్ధీరులు వారెరుంగుదురు దేవునిజేరుపథంబె యాత్మసంస్కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
సారహీనమైన సంసార జలధినితారణంబుజేయు తరణి యెద్ది?దైవచింతనమున తరియించునట్టి సంస్కార మగును మోక్షకారకమ్ము
భారము కాక జీవనము పావనమైన మనమ్ము కూడ నా హారము నీరమైన పరమాత్మ యె గూర్చు నటన్న భావముల్ చేరును భీతి దూరమగు, సిద్ధి గడింపగ మిత్రుఁడన్న యోం కారము మోక్ష కారకము కారణ జన్మున కాత్మ వేత్తకున్!
మొదటి పాదాన్ని "భారము కాని జీవనము పావనమైన మనమ్ము కూడు నా" అని సవరించడమైనది
కారము కూరలందు,సహకారము తోటల యందు,భూరి సంస్కారము జీవితాన ,సహకారము చేష్టల,మాటలంజమత్కారము నొప్పగా వలె,వికారముఁజెందని మానసాన నోంకారము మోక్షకారకము కారణ జన్మునకాత్మ వేత్తకున్.
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పుట్టునుుండి తుదకు గిట్టునం తదనుకనుర్వి జనుల కెల్ల నుండు వావిబాధ ,లవి వి డుటకు పరమాత్మ పయి మమకార మగును మోక్షకారకమ్ము
నరుడు మనసు నెపుడు పరమాత్మపై నిల్పదైవశక్తి మదిన దాగి యుండుప్రబలమైన భక్తి వలన సత్పథము సాకార మగును మోక్షకారకమ్ము
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: నియమ నిష్ఠ లొంది నిశ్చల గుణమున నాత్మ నందు నెపుడు నఖిలగురుని భక్తి దలచు చుండు వారల కెపుడు నోంకారమగును మోక్ష కారకమ్ము.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: కోరినకోర్కెలన్నిటిని గొప్పగ దీర్చెడి చంద్రశేఖరున్ తీరగు నిష్ఠతో మదిని దెల్చుచు భౌతిక వాంఛలెల్లయున్ నేరుగ విడ్చి నిల్కడగ నిశ్చల తత్త్వము నొందువాని సం స్కారము మోక్ష కారకము కారణజన్మునకాత్మవేత్తకున్.
తీరము గమ్యమున్ తనకు దేవునిసన్నిదిజేరుటే అదేసారము జీవితం బునకు శాంతి ప్ర దంబనిచిత్తముంతనాకారణ కర్తనే దలచి కామము వీడును, అట్లుజే యు ఓంకారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
ఆటవెలదిభవుని నామ జపము వాంఛిత ముక్తి నొసంగు మార్గమనుచు సాధనలనుజేయ కడకు శివుని జేరెడి సరణి సాకారమగును మోక్ష కారకమ్ము.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
భారమునుంచి, మానసము భావన చేయుచు నెప్పుడా నిరాకారుని, పేదవారల సుకార్యములన్ దనియింప చేయుచున్చేరగ నెంచి మాధవుని చేసెడి పూజల యందు చిత్త సంస్కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
ఘోర తపంబున సంచితప్రారబ్ధాగమన కర్మ ఫల హరణంబైశ్రీ రాఙ్ఞీ నిజ సాక్షాత్కారమగును మోక్షకారకమ్ము జగతిలోఆట వెలదిగా ఇచ్చిన సమస్యని కందంలొ పూరించ వలసి వచ్చింది. కాముధ - కాకర మురళీధర్.రెండురొజుల గా ఫోన్ క్రాష్ అవ్వడం వలన బ్లాగ్ లొ పెడుతున్నాను.
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
భక్తి రక్తి కలిగి భవుని పూజీంచునోంకారమగును మోక్షకారకమ్ము బంధములను వీడి పాపముల్సేయక శివుని వేడుకొనుము సిద్ధి కలుగు
ఒకటి తీర నన్య మొదవుచు నిత్యము పార మెఱుఁగ నట్టి కోరికలను జెలఁగు చుండు నట్టి స్వీయేంద్రియముల ధి క్కార మగును మోక్ష కారకమ్ముమూరిన పూర్వ కర్మ ఫల భుక్తి నిమిత్తము కల్గు జన్మముల్ శౌరి యొసంగు మోక్షమును జన్మ పరంపర నాపి యింపుగా నీరజ నాభు నామముల నిత్య సమంచిత కీర్తనమ్ము సోంకారము మోక్షకారకము కారణ జన్మున కాత్మవేత్తకున్ [స+ ఓంకారము =సోంకారము ]
బీరము లాడకుండగను భీముని నాదము బల్కుచో టయోంకారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్ మీరక హద్దు లెన్నడును మీరును శంభుని బూజజేయుచో దీరని కోరికల్ మిగుల దీర్చును దప్పక సంతసించగన్
కారణకారణోద్భవమఖండజగద్పరివేష్టితంబునాధారము సర్వభూతసముదాయహితంకరమాదినాదమౌతారకమంత్రమాత్మసుఖదాయకమక్షర బ్రహ్మ రూపమోంకారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
సారము లేని జీవితము చచ్చుట పుట్టుటజర్గుచుండెడిన్భారము మోయలేక తన భార్యను బిల్లలజీవితాంతమున్సారెకు సారెకున్ మనసు చంచలమైతలపోసె నిట్టు లోంకారము మోక్ష కారకము కారణ జన్మున కాత్మవేత్తకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సతతము మది లోన సంతస మొందుచుభక్తితోడ నెపుడు పరమ శివునికొలచి ననవరతము పలికెడు నట్టి యోంకారమగును మోక్ష కారకమ్ము
ఆటవెలది
రిప్లయితొలగించండిఅన్నమయ్యవోలె హరికీర్తనమ్ముల
స్వామి సేవఁ జేసి పరము నందు
చిత్తశుద్ధి కలుగు నుత్తమ భక్తి సా
కార మగును మోక్షకారకమ్ము
ఉత్పలమాల
తొలగించండిశౌరిని వేంకటాద్రిఁగని సన్నుతిఁ జేయుచు నందకాంశమై
నేరిచి నాటపాటలను నిక్కము గాంచుచు శ్రీనివాసునిన్
భూరి వరమ్మనన్ బ్రభువు మ్రోలను నిల్వఁగనంతమందు సా
కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిచిత్త శుద్ధి తోడ శివునినామము దల్చి
వాని సన్నిధియదె భాగ్యమనుచు
భావనమ్ము గలుగు భక్తున కదియె స
త్కారమగును, మోక్ష కారకమ్ము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసర్వమాతనిస్రుష్టిసంబంధమేలేదు
రిప్లయితొలగించండిఅహమువీడుడయ్యయానమందు
బాహ్యమందుమమతఁబాయతలపునిర్వి
కారమగునుమోక్షకారకమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సృష్టి' టైపాటు.
భక్త సులభు డైన భవుని నామ జపము
రిప్లయితొలగించండివిడువ కుండ జగతి విమల మతులు
సత్య ధర్మ ముగను సతతంబు సల్పు నోం
కార మగును మోక్ష కారకమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరనికోరికన్దగలకాత్మనువేంకననామమెంచుచున్
రిప్లయితొలగించండిసారములేనిదీజగతిశాంతికిమార్గములౌకికంబనన్
పారముజూడగానరుడుభావననిల్పిననిర్వికారమా
కారముమోక్షకారకముకారణజన్మునకాత్మవేత్తకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశాంతికిమార్గమలౌకికంబనన్, సవరణగ్రహింపగలరు
రిప్లయితొలగించండివిష్ణు,శివ,విధాత పేర్లు మూడు వరుస
రిప్లయితొలగించండినలరు చుండు గాదె అ-ఉ-మ లనగ
మంత్ర రాజ మగును మఱికూడి యవియె ఓమ్
కారమగును మోక్ష కారకమ్ము.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివారికి చేతజిక్కినను భద్రత నిచ్చెడు శీలవంతుడై
కోరినవారి కెల్లపుడు కోర్కెలదీర్చెడు దాతగా భువిన్
పేరగుచున్ సదా శివుని బ్రీతిగ గొల్చెడు సౌమనస్వి సం
స్కారము మోక్షకారకము కారణజన్మున కాత్మ వేత్తకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారము నీదెయంచు భగవానుని నెమ్మనమందు నమ్మి సం
రిప్లయితొలగించండిసార మహాంబుధీతరణసక్తత చూపు మహాత్ములీ భువిన్
ధీరులు వారెరుంగుదురు దేవునిజేరుపథంబె యాత్మసం
స్కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసారహీనమైన సంసార జలధిని
రిప్లయితొలగించండితారణంబుజేయు తరణి యెద్ది?
దైవచింతనమున తరియించునట్టి సం
స్కార మగును మోక్షకారకమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారము కాక జీవనము పావనమైన మనమ్ము కూడ నా
రిప్లయితొలగించండిహారము నీరమైన పరమాత్మ యె గూర్చు నటన్న భావముల్
చేరును భీతి దూరమగు, సిద్ధి గడింపగ మిత్రుఁడన్న యోం
కారము మోక్ష కారకము కారణ జన్మున కాత్మ వేత్తకున్!
మొదటి పాదాన్ని "భారము కాని జీవనము పావనమైన మనమ్ము కూడు నా" అని సవరించడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికారము కూరలందు,సహకారము తోటల యందు,భూరి సం
రిప్లయితొలగించండిస్కారము జీవితాన ,సహకారము చేష్టల,మాటలంజమ
త్కారము నొప్పగా వలె,వికారముఁజెందని మానసాన నోం
కారము మోక్షకారకము కారణ జన్మునకాత్మ వేత్తకున్.
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపుట్టునుుండి తుదకు గిట్టునం తదనుక
రిప్లయితొలగించండినుర్వి జనుల కెల్ల నుండు వావి
బాధ ,లవి వి డుటకు పరమాత్మ పయి మమ
కార మగును మోక్షకారకమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినరుడు మనసు నెపుడు పరమాత్మపై నిల్ప
రిప్లయితొలగించండిదైవశక్తి మదిన దాగి యుండు
ప్రబలమైన భక్తి వలన సత్పథము సా
కార మగును మోక్షకారకమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండినియమ నిష్ఠ లొంది నిశ్చల గుణమున
నాత్మ నందు నెపుడు నఖిలగురుని
భక్తి దలచు చుండు వారల కెపుడు నోం
కారమగును మోక్ష కారకమ్ము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండికోరినకోర్కెలన్నిటిని గొప్పగ దీర్చెడి చంద్రశేఖరున్
తీరగు నిష్ఠతో మదిని దెల్చుచు భౌతిక వాంఛలెల్లయున్
నేరుగ విడ్చి నిల్కడగ నిశ్చల తత్త్వము నొందువాని సం
స్కారము మోక్ష కారకము కారణజన్మునకాత్మవేత్తకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితీరము గమ్యమున్ తనకు దేవునిసన్నిదిజేరుటే అదే
రిప్లయితొలగించండిసారము జీవితం బునకు శాంతి ప్ర దంబనిచిత్తముంతనా
కారణ కర్తనే దలచి కామము వీడును, అట్లుజే యు ఓం
కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిభవుని నామ జపము వాంఛిత ముక్తి నొ
సంగు మార్గమనుచు సాధనలను
జేయ కడకు శివుని జేరెడి సరణి సా
కారమగును మోక్ష కారకమ్ము.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారమునుంచి, మానసము భావన చేయుచు నెప్పుడా నిరా
రిప్లయితొలగించండికారుని, పేదవారల సుకార్యములన్ దనియింప చేయుచున్
చేరగ నెంచి మాధవుని చేసెడి పూజల యందు చిత్త సం
స్కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘోర తపంబున సంచిత
రిప్లయితొలగించండిప్రారబ్ధాగమన కర్మ ఫల హరణంబై
శ్రీ రాఙ్ఞీ నిజ సాక్షా
త్కారమగును మోక్షకారకమ్ము జగతిలో
ఆట వెలదిగా ఇచ్చిన సమస్యని కందంలొ పూరించ వలసి వచ్చింది.
కాముధ - కాకర మురళీధర్.
రెండురొజుల గా ఫోన్ క్రాష్ అవ్వడం వలన బ్లాగ్ లొ పెడుతున్నాను.
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిభక్తి రక్తి కలిగి భవుని పూజీంచునోం
రిప్లయితొలగించండికారమగును మోక్షకారకమ్ము
బంధములను వీడి పాపముల్సేయక
శివుని వేడుకొనుము సిద్ధి కలుగు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఒకటి తీర నన్య మొదవుచు నిత్యము
రిప్లయితొలగించండిపార మెఱుఁగ నట్టి కోరికలను
జెలఁగు చుండు నట్టి స్వీయేంద్రియముల ధి
క్కార మగును మోక్ష కారకమ్ము
మూరిన పూర్వ కర్మ ఫల భుక్తి నిమిత్తము కల్గు జన్మముల్
శౌరి యొసంగు మోక్షమును జన్మ పరంపర నాపి యింపుగా
నీరజ నాభు నామముల నిత్య సమంచిత కీర్తనమ్ము సోం
కారము మోక్షకారకము కారణ జన్మున కాత్మవేత్తకున్
[స+ ఓంకారము =సోంకారము ]
బీరము లాడకుండగను భీముని నాదము బల్కుచో టయోం
రిప్లయితొలగించండికారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
మీరక హద్దు లెన్నడును మీరును శంభుని బూజజేయుచో
దీరని కోరికల్ మిగుల దీర్చును దప్పక సంతసించగన్
కారణకారణోద్భవమఖండజగద్పరివేష్టితంబునా
రిప్లయితొలగించండిధారము సర్వభూతసముదాయహితంకరమాదినాదమౌ
తారకమంత్రమాత్మసుఖదాయకమక్షర బ్రహ్మ రూపమోం
కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్
సారము లేని జీవితము చచ్చుట పుట్టుట
రిప్లయితొలగించండిజర్గుచుండెడిన్
భారము మోయలేక తన భార్యను బిల్లల
జీవితాంతమున్
సారెకు సారెకున్ మనసు చంచలమై
తలపోసె నిట్టు లోం
కారము మోక్ష కారకము కారణ జన్మున కాత్మవేత్తకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసతతము మది లోన సంతస మొందుచు
రిప్లయితొలగించండిభక్తితోడ నెపుడు పరమ శివుని
కొలచి ననవరతము పలికెడు నట్టి యోం
కారమగును మోక్ష కారకమ్ము