19, జనవరి 2022, బుధవారం

సమస్య - 3967

20-1-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హంతకునిఁ గొల్చెదరు దేవుఁడంచు జనులు”
(లేదా...)
“హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే”

29 కామెంట్‌లు:

  1. బాల్య మందున‌ పూతనన్ పట్టి‌
    చంపె

    చిన్న తనమున కంసుని‌ చిదిమి‌ వేసె

    తరచి చూడగ నిలలోన దైత్య జాతి

    హంతకుని గొల్చెదరు దేవుడంచు జనులు

    రిప్లయితొలగించండి
  2. దారిదప్పినజీవులఁదానుగావ
    గీతబోధించిక్రుష్ణుడుకీర్తినందె
    ధర్మసంగతిపార్థుకుధనువునిచ్చె
    హంతకునిగోల్చెదరుదేవుడంచుజనులు

    రిప్లయితొలగించండి
  3. దుష్ట శిక్షణ జేసియు శిష్ట తతిని
    రక్ష సేయ గ భువిలోన రాము డగుచు
    కుంభకర్ణాది యసురుల గూల్చి నట్టి
    హంతకుని గొల్చెదరు దేవు డంచు జనులు

    రిప్లయితొలగించండి
  4. సుంతయుజాలిలేకనటసుందరరాముఁడుకూల్చెరావణున్
    వంతలలెక్కజేయకయెవంచెనుక్రుష్ణుడురాక్షసాసువుల్
    చింతనులేకవామనుడుఛిద్రముజేసెనుచక్రవర్తినే
    హంతకుడైనవానిజనులందరుదేవుడటంచుగోల్తురే

    రిప్లయితొలగించండి
  5. గొఱ్ఱెనమ్ముకసాయిని గ్రుడ్డిగాను
    లోకనైజంబిదేగదా! రూకలేని
    మంచివారికి చేతురు వంచనమ్ము,
    హంతకునిఁ గొల్చెదరు దేవుఁడంచు జనులు

    రిప్లయితొలగించండి
  6. మానవాళిని పీడించి హానిసల్పి
    యజ్ఞ యాగాల హోమాల యంతు జూచి
    రాక్షసముగ పేట్రేగు కర్కశ దనుజుల
    హంతకునిఁ గొల్చెదరు దేవుఁడంచు జనులు

    రిప్లయితొలగించండి
  7. చింతిల జేయు తాటకిని జెండి ము
    నీంద్రులబ్రోచు వానినిన్
    పంతము వూని వీరుడగు వాలిని
    పేరడగించు వానిన్
    కాంతను మోసగించియును గైకొని
    పోయిన దుష్టు దున్మియున్
    హంతుకుడైన వాని జనులందరు
    దేవుడటంచు గొల్చిరే

    రిప్లయితొలగించండి
  8. నంద నందను డాతడు మైందహనుడు
    వృష్ణి గర్భుడు యవనారి వెన్ను డతడె
    శ్యామసుందరుడు మురారి మామ కంస
    హంతకుని గొల్చెదరు దేవుడంచు జనులు.

    రిప్లయితొలగించండి
  9. కంతుని గూల్చినట్టి కరకంఠుని కార్ముఖమెత్తి జానకిన్
    స్వంతము జేసుకున్న గుణసాంద్రుడు సూర్యకులాన్వయుండా
    కాంతను బంధిసేసెనని కాముకుడౌ ఖలు రావణాసురున్
    హంతకుడైనవాని జనులందరు దేవుడటంచు గొల్చిరే.

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    ధరణి నూటికి కోటికొక్కరన నొప్ప
    ప్రజలు పాటించు మూఢచారములఁ గూల్చ
    రామమోహను రాయల ప్రస్తుతించి
    హంతకునిఁ గొల్చెదరు దేవుఁడంచు జనులు

    ఉత్పలమాల
    వింతయె మూఢచారములు వీగగఁ జేసిన సంఘమందునన్?
    సుంతయు నోర్చరానివన చోటిడ నొప్పక రామమోహనుల్
    పంతము తోడ బాపెనన భాగ్యమటంచును గౌరవించుచున్
    హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే!

    రిప్లయితొలగించండి
  11. బద్దకమును వదలి ,మొద్దు నిద్దురవిడి ,
    యుగ్ర నారసింహుడగుచు నుప్పెనవలె
    మతము , కులమను మయిలల మట్టు జేయు
    హంతకునిఁ గొల్చెదరు దేవుఁడంచు జనులు

    రిప్లయితొలగించండి
  12. చింతలుదీర్చి భూజనుల జీవితమందున వెల్గు రేఖలన్
    సంతతమందజేయు జనచక్షువు నీరజబంధు వాతడే
    వింతయదెట్లగున్ పిలువ వేలుపటంచిల నంథ రాశికిన్
    హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే

    రిప్లయితొలగించండి
  13. వంతుల వారిగా జనుల, వండుకు వచ్చిన బండి యన్నమున్
    పొంతల కొద్ది పప్పుయును, భోజనమందున దున్నపోతులన్,
    పంతముగా బకాసురుడు భక్షణ జేయ నపార భీతితో
    హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే.

    రిప్లయితొలగించండి
  14. ఉత్పలమాల:
    వింతయదేమిగాదు మును వేదము దోచిన వాని గూల్చె ,స్తం
    భాంతరమందువెల్వడి కణాది దిగంతములన్ కలండనెన్
    సంతసమొంద సజ్జనులు సత్యశివమ్మయి
    దైత్యరాశికిన్
    “హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే”
    --కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  15. తేటగీతి:
    శంఖ ఖడ్గ గదాశూల చక్రములను
    అంత కనువుగ భుజములు హస్త ములును
    దాల్చు రూపమ్ము నూహించి దనుజ దునుము
    “హంతకునిఁ గొల్చెదరు దేవుఁడంచు జనులు”
    --కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  16. స్వాంతమునందు పట్టుదల యగ్గలమై కొనసాగు చుండగా
    పంతముతోనెదుర్కొనుచు వైరుల చర్యల రూపుమాపుచున్
    ప్రాంతములందు సుస్థిరత ప్రాకటమౌగతి నెంచి శత్రురాట్
    హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే

    రిప్లయితొలగించండి
  17. మానవాకారమును తోడ మనుజ విభుడు
    దుష్ట దానవ గణమును దునుము కతన
    మహిమ నెఱిగిన వారలై మహిత మదిని
    హంతకుని గొల్చెదరు దేవుడంచు జనులు

    రిప్లయితొలగించండి
  18. భక్త జన శిష్ట జన పరిపాలన రతు
    దుష్ట జన దనుజ దమన దోర్బల వరు
    నాశ్రిత జన సందోహ కృ తాఘ రాశి
    హంతకునిఁ గొల్చెదరు దేవుఁ డంచు జనులు


    శాంత మనస్కుఁ డెంతయును జాప ధరుండు ఘనుండు భండ నై
    కాంత లయుండు చండ కిరణాభుఁడు గండఁడు దండకావనిన్
    వింతగ నిల్చి యొక్కఁడును వీర వరుండు నిశాచ రాలికిన్
    హంతకుఁ డైన వాని జను లందఱు దేవుఁ డటంచుఁ గొల్చిరే

    రిప్లయితొలగించండి
  19. అంతము జేయ దుష్టులను నాహరి మానవు డైజనించియే
    యంతము జేయగా దనరి యాతని చేష్టకు సంతసించుచున్
    జింతలు లేని జీవితము సేమపు రీతిని గడ్పువారలై
    హంతకుడైన వాని జనులందరు దేవుడటంచు గొల్చిరే

    రిప్లయితొలగించండి
  20. అంతము సేయబూని భరతావని దాస్యము నుగ్రవాద సి
    ద్ధాంతము మేల్దలంచుచు మదాంధుల పీచమడంచనెంచె నా
    వంతయు జంకు లేక కఠినాత్ముల కుత్తుకలుత్తరించగా
    హంతకుఁడైనవాని జనులందరు దేవుఁడటంచుఁ గొల్చిరే

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    దనుజ సంహారమును జేసి ధర్మ మిలన
    నిల్పి సుఖ శాంతులను పాదు గొల్పి ,రాజ్య
    పాలనము జేయ ,దశకంఠ ప్రాణ హరుని
    హంతకుని గొల్చెదరు దేవుడంచు జనులు.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  23. పంతము బూని జంపగను పాపము నెంచక మేనమామయే
    వింతగు నెత్తులేయుచును వెన్నుని గూల్చగ దాడిజేయగన్
    గెంతుచు సింగమోయనగ కృష్ణుడు కంసుని నుత్తరించ,నా
    హంతకు డైన వాని జనులందరు దేవుడటంచు గొల్చిరే

    రిప్లయితొలగించండి
  24. శిష్ట రక్షణ జేసి దుష్టుల దునుమాడ
    మనుష రూపు దాల్చి మమత బంచి
    మహిమలెన్నొ జూపి మామనే తెగగూల్చు
    హంతకుని గొల్చెదరు దేవుడంచు!!

    రిప్లయితొలగించండి
  25. "శంకరాభరణం" విశిష్టత:

    ప్రతిదిన మొక్క పద్దియము
    వ్రాయగ నోపెడి మార్గమందు మా
    నితమగు కైపదమ్మునిడి
    నేర్పుగ పద్యము దీర్చు మంచు భా
    సితమగు "శంకరాభరణ"
    చిత్ప్రభల న్వెలుగొందు వేదికన్
    నుతయుతమైన సేవల వి
    నూత్నత నింపిరి శంకరార్యులే!

    రిప్లయితొలగించండి
  26. చింతలు దీర్చువాడు శుభ
    శ్రీలను బంచు దయాంతరంగుడున్,
    శాంతము ధీరతన్ బరగు
    సౌమ్య సుధా రస రూప మందునన్
    కాంతులనీను రాముడు, వి
    క్రాంతమునన్ దశకంఠుపాలిటన్
    హంతకుఁడైనవాని, జను
    లందరు దేవుఁడటంచుఁ గొల్చిరే!

    రిప్లయితొలగించండి
  27. దుష్టకంసాదులనిలను దునుమనెంచి
    నవతరించె ద్వాపరమున నచ్యుతుండు
    మంచి వారలహింసించి మట్టు పెట్టు
    హంతకుని గొల్చెదరు దేవుడంచు జనులు

    రిప్లయితొలగించండి