8-1-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త"(లేదా...)"కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్"
పాపభీతియె లేనట్టి స్వార్థపరులువిరివిగ విరాళము బొందు వివిధమనుచునాస్తికుడు గట్టె గోవెలన్ నగరమందుదైవదూషకుఁడె, గుడికీ ధర్మకర్త.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వైరితనదైనభావంబువంతఁదీరకోరెకమలాక్షుసేవనుగోప్యమందుజయుడువిజయుండురాక్షసజాతిబుట్టెదైవదూషకుడెగుడికిధర్మకర్త
తేటగీతిరాజకీయంపు లీలలు బూజు బూజుకోరి యన్యమతస్తుని కొలువుఁ దీర్పదొంగవేషగాడన నంతరంగమందుదైవదూషకుఁడె గుడికి ధర్మకర్త!చంపకమాలప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమేయమరచ రెండు వత్సరములకాశ్రితుఁడంచును పక్షపాతమై గుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన చంపకచంపకమాలప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమేయమరచ రెండు వత్సరములాశ్రితుఁడంచును పక్షపాతమైగుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?
ఆటవెలదిదూరముండు//దైవ దూషకుఁడె గుడికి,ధర్మ కర్త//యగును దైవ భక్తిపాప భీతి కల్గి భగవంతు సన్నిధిన్ప్రార్ధ నంబు సేయు భక్త వరుడె.
తేటగీతిపాప కార్యము లెన్నియో వలతి గా సలుపుచు బాహ్యము నందున లోక మాతనే కొలిచెడి భక్త శిఖామణి నని జెప్పుదైవ దూషకుడె ,గుడికి ధర్మ కర్త.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ధన మ దాంధ ము తో మెల్గు దానవుండు దైవ దూషకుడె : గుడికి ధర్మ కర్త భక్త జనతతి సహకార పరత తోడ వృధ్ధి చేయగ శ్రమియించి ప్రీతి గూర్చు
భ్రమలను పెంచి లోకులకు భక్తియటంచు విరాళమంచు తామమితముగా ధనమ్ము పరమాత్ముని పేరున పొందలేరిలన్ సుమతులు, హెచ్చుగాను గుడి స్తోమము బెంచెడు జల్లికాడె యౌ కుమతియు దైవదూషకుఁడె కోవెలకుందగు ధర్మకర్తగన్.
జియ్య మూర్తిని నాశము జేయ దలచెదైవదూషకుఁడె ; గుడికి ధర్మకర్తయా జతన నెరిగి భటుల నామతించియాప గలిగె విధ్వంసము నమర కుండ
అమరును బుద్ధిహీనులకు నల్పులకున్ ఘనమౌప్రవక్తగాశమదమ సత్క్రియల్ విడిచి శాంతిని కోరని ధర్మ హీనుడౌ//కుమతియు దైవదూషకుడె, కోవెలకుందగు ధర్మకర్తగన్//సుమతియు,దైవభక్తిగల శ్రోత్రియుడే పరికించి చూడగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: స్వామియన ధనమిత్తురు సమధికముగ ఆస్తికులని స్వార్ధమదిని నాస్తికు డట కోవెలను దీర్చ జనులనుకొను చుండె దైవదూషకుడె గుడికి ధర్మకర్త.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."జనులనుకొనుచునుండ్రి" అనండి.
తమకముడబ్బుకైపడడుతాత్వికచింతకుడున్ యతండిలన్సుమతియుదైవమార్గమునశోభిలుకోవెలధర్మకర్తయౌఅమలినమానసంబునరయార్తిగనాతడు, కాదగండుగాకుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'చింతకుడున్+అతడు' అన్నపుడు యడాగమం రాదు. మూడవ పాదం అర్థం కాలేదు.
తమకము డబ్బుకై పడడు తాత్విక చింతకుడున్ అతండిలన్సుమతియు దైవ మార్గమున శోభిలు కోవెల ధర్మకర్తయౌఅమలిన మానసంబుగల అర్చకుడాతడు, కాదగండుగాకుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్correct chesaa nandi..ippudu ok?
తనమతమును మార్చుకొనిన ధన్యజీవిముఖ్యనేతగ నెన్నికై మూర్ఖ విధినిధర్మకర్తలమండలి తానుగూర్చదైవదూషకుఁడె గుడికి ధర్మకర్త
కలుషమాయెను సకలము కాలమహిమనిత్యపూజలయందున నియతిలేనిభక్తి మార్గమునం దనురక్తి లేనిదైవదూషకుఁడె గుడికి ధర్మకర్త
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: కాదు వింతేది జూడగ కలియుగాన మతము పేరున జనులను మాయజేసి కపట పూజలు జేయుచు ఘనత నొందు దైవదూషకుడె గుడికి ధర్మకర్త. చిత్త మంతయు నిరతము విత్తమందె కాంచ లేడేది ముక్తికి కారణమ్ము దుష్టబుద్ధిని భక్తుల దోచుకొనెడి దైవదూషకుడె గుడికి ధర్మకర్త.
క్రమముగ నాక్రమించుకొని కాపురుషాదులు భారతమ్మునన్దమ మత మద్భుతంబను నుదారత నైహికవాద మేర్పడన్దమతమ జేబునింపుకొను ధర్మ విహీనుల రాజ్యమందునన్,గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్.
ఉత్తమ గుణుండు దనరంగఁ జిత్త మందు నిర్మలత మనో వాక్కాయ కర్మములను దైవమును విశ్వసించు నతండు క్షుద్ర దైవ దూషకుఁడె గుడికి ధర్మకర్తవిమల మనస్కుఁ డుత్తముఁడు వేద విదుండు వివేక వంతఁడున్ సముచిత భాషణుండు నుత సచ్చరితుండు దయామయుండు నిత్య మమర పూజలం దనియు ధార్మికుఁ డాతఁడు సత్యమెన్నఁ దాఁ గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పొందు బాపము దప్పక పుడమి యందుదైవదూషకుడె,గుడికి ధర్మకర్తస్వార్ధపరతను విడనాడు వాడె యగును దైవసంపద హరియింప ద్రాబుడగును
సమముగ బంచి యిచ్చుటకు సాటిగనుండెడు వారికచ్చటన్ కుమతియు,దైవదూషకుడె కోవిలకుందగు ధర్మకర్తగన్ ప్రముఖుడు ధర్మబద్ధతను బాలన జేయును గావునన్రమా!కుమతులు దైవదూషకుల గోరక యొప్పగు వారిజూడుమా
క్రమముగ మారె జీవనము కల్మషబుద్ధులు పెచ్చరిల్లి యాక్రమణముజేసి గద్దెలను రాజ్యమునేలుచునుండి రక్కటా!సుమతులయందు నిర్దయను చూపెడునీ కలికాల మందునన్కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
ప్రమదము తోడ సొమ్ము సముపార్జన జేయుచు దొడ్డి దారిలో ప్రమదలతో చరించుచును వారుణిఁ గ్రోలు నబాసియున్ ప్రభుత్వము నధికర్మమున్ బడిచి తన్పుచు పై యధికారులన్ సదాకుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
భ్రమసి యశాశ్వతంబులగు లౌకిక వాంఛలనోలలాడుచున్సమయునధర్మమార్గమున సాగెడి నాస్తికుఁడల్పబుద్ధియౌకుమతియు దైవదూషకుఁడె; కోవెలకుం దగు ధర్మకర్తగన్విమల మనస్కుఁడాస్తికుఁడభిజ్ఞుఁడునౌ సుగుణాత్ముఁడెన్నికన్
రిప్లయితొలగించండిపాపభీతియె లేనట్టి స్వార్థపరులు
విరివిగ విరాళము బొందు వివిధమనుచు
నాస్తికుడు గట్టె గోవెలన్ నగరమందు
దైవదూషకుఁడె, గుడికీ ధర్మకర్త.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివైరితనదైనభావంబువంతఁదీర
రిప్లయితొలగించండికోరెకమలాక్షుసేవనుగోప్యమందు
జయుడువిజయుండురాక్షసజాతిబుట్టె
దైవదూషకుడెగుడికిధర్మకర్త
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిరాజకీయంపు లీలలు బూజు బూజు
కోరి యన్యమతస్తుని కొలువుఁ దీర్ప
దొంగవేషగాడన నంతరంగమందు
దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త!
చంపకమాల
ప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్
సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమే
యమరచ రెండు వత్సరములకాశ్రితుఁడంచును పక్షపాతమై
గుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన చంపక
తొలగించండిచంపకమాల
ప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్
సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమే
యమరచ రెండు వత్సరములాశ్రితుఁడంచును పక్షపాతమై
గుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?
ఆటవెలది
రిప్లయితొలగించండిదూరముండు//దైవ దూషకుఁడె గుడికి,
ధర్మ కర్త//యగును దైవ భక్తి
పాప భీతి కల్గి భగవంతు సన్నిధిన్
ప్రార్ధ నంబు సేయు భక్త వరుడె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిపాప కార్యము లెన్నియో వలతి గా స
లుపుచు బాహ్యము నందున లోక మాత
నే కొలిచెడి భక్త శిఖామణి నని జెప్పు
దైవ దూషకుడె ,గుడికి ధర్మ కర్త.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధన మ దాంధ ము తో మెల్గు దానవుండు
రిప్లయితొలగించండిదైవ దూషకుడె : గుడికి ధర్మ కర్త
భక్త జనతతి సహకార పరత తోడ
వృధ్ధి చేయగ శ్రమియించి ప్రీతి గూర్చు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభ్రమలను పెంచి లోకులకు భక్తియటంచు విరాళమంచు తా
రిప్లయితొలగించండిమమితముగా ధనమ్ము పరమాత్ముని పేరున పొందలేరిలన్
సుమతులు, హెచ్చుగాను గుడి స్తోమము బెంచెడు జల్లికాడె యౌ
కుమతియు దైవదూషకుఁడె కోవెలకుందగు ధర్మకర్తగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజియ్య మూర్తిని నాశము జేయ దలచె
రిప్లయితొలగించండిదైవదూషకుఁడె ; గుడికి ధర్మకర్త
యా జతన నెరిగి భటుల నామతించి
యాప గలిగె విధ్వంసము నమర కుండ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅమరును బుద్ధిహీనులకు నల్పులకున్ ఘనమౌప్రవక్తగా
రిప్లయితొలగించండిశమదమ సత్క్రియల్ విడిచి శాంతిని కోరని ధర్మ హీనుడౌ
//కుమతియు దైవదూషకుడె, కోవెలకుందగు ధర్మకర్తగన్//
సుమతియు,దైవభక్తిగల శ్రోత్రియుడే పరికించి చూడగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిస్వామియన ధనమిత్తురు సమధికముగ
ఆస్తికులని స్వార్ధమదిని నాస్తికు డట
కోవెలను దీర్చ జనులనుకొను చుండె
దైవదూషకుడె గుడికి ధర్మకర్త.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జనులనుకొనుచునుండ్రి" అనండి.
రిప్లయితొలగించండితమకముడబ్బుకైపడడుతాత్వికచింతకుడున్ యతండిలన్
సుమతియుదైవమార్గమునశోభిలుకోవెలధర్మకర్తయౌ
అమలినమానసంబునరయార్తిగనాతడు, కాదగండుగా
కుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చింతకుడున్+అతడు' అన్నపుడు యడాగమం రాదు. మూడవ పాదం అర్థం కాలేదు.
తమకము డబ్బుకై పడడు తాత్విక చింతకుడున్ అతండిలన్
తొలగించండిసుమతియు దైవ మార్గమున శోభిలు కోవెల ధర్మకర్తయౌ
అమలిన మానసంబుగల అర్చకుడాతడు, కాదగండుగా
కుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్
correct chesaa nandi..ippudu ok?
తనమతమును మార్చుకొనిన ధన్యజీవి
రిప్లయితొలగించండిముఖ్యనేతగ నెన్నికై మూర్ఖ విధిని
ధర్మకర్తలమండలి తానుగూర్చ
దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలుషమాయెను సకలము కాలమహిమ
రిప్లయితొలగించండినిత్యపూజలయందున నియతిలేని
భక్తి మార్గమునం దనురక్తి లేని
దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండికాదు వింతేది జూడగ కలియుగాన
మతము పేరున జనులను మాయజేసి
కపట పూజలు జేయుచు ఘనత నొందు
దైవదూషకుడె గుడికి ధర్మకర్త.
చిత్త మంతయు నిరతము విత్తమందె
కాంచ లేడేది ముక్తికి కారణమ్ము
దుష్టబుద్ధిని భక్తుల దోచుకొనెడి
దైవదూషకుడె గుడికి ధర్మకర్త.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రమముగ నాక్రమించుకొని కాపురుషాదులు భారతమ్మునన్
రిప్లయితొలగించండిదమ మత మద్భుతంబను నుదారత నైహికవాద మేర్పడన్
దమతమ జేబునింపుకొను ధర్మ విహీనుల రాజ్యమందునన్,
గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్తమ గుణుండు దనరంగఁ జిత్త మందు
రిప్లయితొలగించండినిర్మలత మనో వాక్కాయ కర్మములను
దైవమును విశ్వసించు నతండు క్షుద్ర
దైవ దూషకుఁడె గుడికి ధర్మకర్త
విమల మనస్కుఁ డుత్తముఁడు వేద విదుండు వివేక వంతఁడున్
సముచిత భాషణుండు నుత సచ్చరితుండు దయామయుండు ని
త్య మమర పూజలం దనియు ధార్మికుఁ డాతఁడు సత్యమెన్నఁ దాఁ
గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపొందు బాపము దప్పక పుడమి యందు
రిప్లయితొలగించండిదైవదూషకుడె,గుడికి ధర్మకర్త
స్వార్ధపరతను విడనాడు వాడె యగును
దైవసంపద హరియింప ద్రాబుడగును
సమముగ బంచి యిచ్చుటకు సాటిగనుండెడు వారికచ్చటన్
రిప్లయితొలగించండికుమతియు,దైవదూషకుడె కోవిలకుందగు ధర్మకర్తగన్
ప్రముఖుడు ధర్మబద్ధతను బాలన జేయును గావునన్రమా!
కుమతులు దైవదూషకుల గోరక యొప్పగు వారిజూడుమా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిక్రమముగ మారె జీవనము కల్మషబుద్ధులు పెచ్చరిల్లి యా
రిప్లయితొలగించండిక్రమణముజేసి గద్దెలను రాజ్యమునేలుచునుండి రక్కటా!
సుమతులయందు నిర్దయను చూపెడునీ కలికాల మందునన్
కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
ప్రమదము తోడ సొమ్ము సముపార్జన జేయుచు దొడ్డి దారిలో
రిప్లయితొలగించండిప్రమదలతో చరించుచును వారుణిఁ గ్రోలు నబాసియున్ ప్రభు
త్వము నధికర్మమున్ బడిచి తన్పుచు పై యధికారులన్ సదా
కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
భ్రమసి యశాశ్వతంబులగు లౌకిక వాంఛలనోలలాడుచున్
రిప్లయితొలగించండిసమయునధర్మమార్గమున సాగెడి నాస్తికుఁడల్పబుద్ధియౌ
కుమతియు దైవదూషకుఁడె; కోవెలకుం దగు ధర్మకర్తగన్
విమల మనస్కుఁడాస్తికుఁడభిజ్ఞుఁడునౌ సుగుణాత్ముఁడెన్నికన్