12-1-2022 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్”(లేదా...)“హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ”
అనిలాత్మజుడని పిలుతురెవని? యడియన నర్థమేమి? వశ కౌసల్యాతనయుండెట్లు ప్రసిద్ధుడు?హనుమంతుని, బంటు, రాముఁడై నుతి కెక్కెన్
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనముగదైవముతానైమనమరలగదాసుసేవమరువకరాగావినబడజీవునిజపమేహనుమంతునిబంటురాముఁడైనుతికెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముడు ఆవులించిన హనుమ చిటికేయుట.హనుమెప్పుడు చిటికేయునొ?యని రాముడు నోరు తెఱువ ననుమానముతోడను దా జృంభిక నందున్హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్జృంభిక-ఆవులింత
ఇచ్చిన పాదము కందమునా పూరణ సీసములోసతతము రాముని చరణములనుపట్టి రాముని నిరతము రమ్య గతినిమదిలోన వీడక స్మరణము చేయుచురాముని పలుకులు క్షేమ మనుచుతలపోయుచు తన హృదయ మందు రాముని బంథించిన ఘనుడు పవన సుతుడుమనుజులార హనుమంతుని బంటు రాముడై నుతి కెక్కె నెచ్చట నో తెలుపుముచదువ గవలయు నెల్లరు సంతసముగరాముని చరిత మెప్పుడు, దేము నెపుడుదూషణముచేయ సబబు కాదు వినవలెనునాస్తిక వరులార యనుచు జ్ఞాని పలికెపూసపాటి
మును,రామాఖ్యుఁడు భక్తినిహనుమంతుని దీక్షఁగొలిచి యధికారి యయెన్పనిఁజేయ మెచ్చిరందఱుహనుమంతుని బంటు రాముడైనుతికెక్కెన్.
చక్కని పూరణ. అభినందనలు.
వినుమా భక్తుడు రాఘవుండొక తరిన్ వీరుండు ధీరుండునౌతనదైవంబగు మారుతీ విభునకున్ దారుఢ్య శిల్పంబుతోకనసొంపయ్యెడు దేవళంబొకటి తాన్ గట్టెన్ సదా దానిలోహనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మారుతీ విభునకు' అనడం సాధువు కాదు. "మారుతాత్మజునకున్" అనండి.
హనుమద్భక్తుడు నామముకనుగొన రాముడని దెలిసె కడుధర్మాత్ముండనిలజు భక్తుండగుటన్హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
వనపర్తిన నభి రాముడుహనుమంతుని బంటు ; రాముఁడై నుతి కెక్కెన్ఘనమగు రీతిని యచ్చటిహనుమానుని యాలయముల నధికము జేయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వనపర్తిని... రీతిని నచ్చటి..." అనండి.
ఘనుడా రాముని పాదసేవయదె సత్కార్వం బటంచున్ గదా యనిశమ్మాతడు వానినామ మదియే ధ్యానించెనా యంజనీతనయుండన్నది మర్చి ముష్కరుడటన్ దా పల్కె నీరీతిగా హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
కందంవినునప్పుడు చరవాణినిఁగనవద్దన వీడకుండ కావ్యము వింటే?యని బోవఁగ నీ నోటను, "హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్!""వినుచున్ రావణు జానకీ! మిగుల నా ప్రేమన్ విలోకించుమా! నిను దేవేరిగ రాణివాసమున మన్నింపంగ నేఁజూచెదన్మును ముందున్ నిను జేరవచ్చి తుదిఁ బోరాడలేనట్టి యూహను మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ!"
సవరించిన వృత్త పూరణము:"వినుమా జానకి! రావణున్ మిగుల నా ప్రేమన్ విలోకించుమా! నిను దేవేరిగ రాణివాసమున మన్నింపంగ నేఁజూచెదన్మును ముందున్ నిను జేరవచ్చి తుదిఁ బోరాడలేనట్టి యూహను మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ!"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏సవరించిన వృత్త పూరణము:"వినుమా జానకి! రావణున్ మిగుల నా ప్రేమన్ విలోకించుమా! నిను దేవేరిగ రాణివాసమున మన్నింపంగ నేఁజూచెదన్మును ముందున్ నిను జేరవచ్చి తుదకున్ బోరాడలేనట్టి యూహను మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ!"
వినమే పూర్వము భట్టుమూర్తి సుకవిన్ విఖ్యాతిఁగాంచెంగదా!ఘనుడౌ శ్రీవసురాట్ చరిత్రమునుసత్కావ్యంబుగావ్రాసి ,యాహనుమత్సేవకుఁడౌచు,రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్బాత్రుఁడౌననగా సత్యము,రామరాజ్యమన నానందించరే యెల్లరున్.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధనధనమని కవి యొక్కడుతనదగు రీతిన రచించె తత్తరపడుచున్కనుగొననాకావ్యంబునహనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "రీతిని రచించె" అనండి.
ధనధనమని కవి యొక్కడుతనదగు రీతిని రచించె తత్తరపడుచున్కనుగొననాకావ్యంబునహనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
క్రమాలంకారంలో --ఘనమగు బంటుగ నెవ్వని విను తింతురు ' సేవకునికి వేరర్థంబౌ 'ఇన కుల మున దా బుట్టియు 'హనుమంతుని ' బంటు ' రాముడై నుతి కెక్కెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: అనువున రాముడు హనుమకుఘనముగ తనయూరిన గుడికట్టి కొలుచుచున్చనువుగ నందరి నోటనుహనుమంతుని బంటు రాముడై నుతి కెక్కెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "తన యూరిని..."
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: ఘనమౌ భక్తిని రాఘవుండనెడి నిష్కాముండు తానూరిలో తనదైవమ్మగు నాంజనేయునకు నుత్సాహమ్ముతో కోవెలన్ ననువౌ రీతిని నిల్పి నచ్చటనె తానారాధనల్ సల్పుచున్ హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "నిల్పి యచ్చటనె..."
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: అనగ ననగ నొక రాముడు అనవరతము హనుమ గొలిచె నార్తిన్ గూడన్ వినగను యెల్లరి నోటను హనుమంతుని బంటు రాముడై నుతికెక్కెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "రాముం డనవరతము... వినగను నెల్లరి..."
హనుమంతున్ సతతంబుగొల్చు మనమందత్యంత శ్రద్ధాళువైవినుతుండై దనరారె రాఘవుఁడు సంప్రీతిన్ సదాచారుడైజనతామోదమునొంది నాయకునిగా సంతృప్తుడై నిచ్చలున్హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తనయుం గానకు నంప సంశయమ! తత్ప్రావీణ్యముం గానవేవనిఁ దా నుగ్గడగించు రక్కసుల కావం జాలు మౌనీంద్రులన్ఘనశస్త్రాస్త్రములన్ గడించు మది శంకన్ వీడు తొల్గించు మూ హను, మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌకంజర్ల రామాచార్య.
ఘనుడౌ నీదు కుమారుఁ గూర్చి మదిలో కన్నోటుతో నివ్విధిన్వనటన్ బొందకు నాదు సంగడి కడున్ బ్రావీణ్యుడై దైత్యులన్దునుమున్ జెచ్చెర, దెచ్చునీకునల సంతుష్టిన్, విడన్ నీ యపోహను, మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
వనజాసన వాసవ ముఖదనుజారి గణంబు గోర ధరణిన్ జన్మించిన దశరథ నందనుఁ డో హనుమంతుని బంటు! రాముఁడై నుతి కెక్కెన్ఘన నీలాంగుఁడు రామచంద్రుఁడు మహా కాకుత్స్థ వంశాగ్ర్యుఁడుం దన భార్యార్థము గూడి వానర తతిన్ ధానుష్కుఁ డుత్సాహియై ఘనరక్షః పతి రావణాసురుని సంగ్రామంబునం జంపఁగా హనుమత్సేవకుఁ డౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిం బాత్రుఁడౌ [హనుమత్సేవకుఁడు = హనుమంతుఁడు సేవకుఁడుగాఁ గలవాఁడు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పనివాడని యెడముంచక తన దోడుగ నాటకము ప్రదర్శింపగనం దున, యజమాని ధరింపగహనుమంతుని, బంటు రాముఁడై నుతి కెక్కెన్
అనువగు మాటయె యీయది?హనుమంతునిబంటు రాముడై నుతికెక్కెన్హనుమంతు డరయ రామునకనుగుంసేవకుడు గాదె యార్యా! దలపన్
వినుమా రావణునాజిలో దునుమ యాభీష్టంబు సిద్ధించగా హనుమత్సేవకుడౌచు రాఘవుడు సమ్యక్కీర్తికిన్ బాత్రుడౌ ననుమానంబును జెందనోపకుడు మాయాజాలంబుగాదులే యినవంశంబున బుట్ట,గారణమె యాతేజంబు నట్లుండునౌ
ఘన నీలాంగుని రామునిన్ సుజన రక్షా దక్షునా పక్షివా హను "మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌగనుడీ" యంచడకించెనా ఖలుఁడు లంకాధీశుఁడౌద్ధత్యమున్ జనె వంశక్షయకారియై యణఁగె పాపాత్ముండు బాణాహతిన్
అనవచ్చున? యిట్టు లెపుడు"హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్"కనగన్ రామాయణమునతన భక్తిని కొల్చె హనుమ దాశరథి నొగిన్!
రిప్లయితొలగించండిఅనిలాత్మజుడని పిలుతురె
వని? యడియన నర్థమేమి? వశ కౌసల్యా
తనయుండెట్లు ప్రసిద్ధుడు?
హనుమంతుని, బంటు, రాముఁడై నుతి కెక్కెన్
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘనముగదైవముతానై
రిప్లయితొలగించండిమనమరలగదాసుసేవమరువకరాగా
వినబడజీవునిజపమే
హనుమంతునిబంటురాముఁడైనుతికెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాముడు ఆవులించిన హనుమ చిటికేయుట.
రిప్లయితొలగించండిహనుమెప్పుడు చిటికేయునొ?
యని రాముడు నోరు తెఱువ ననుమానముతో
డను దా జృంభిక నందున్
హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
జృంభిక-ఆవులింత
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇచ్చిన పాదము కందము
రిప్లయితొలగించండినా పూరణ సీసములో
సతతము రాముని చరణము
లనుపట్టి
రాముని నిరతము రమ్య గతిని
మదిలోన వీడక స్మరణము చేయుచు
రాముని పలుకులు క్షేమ మనుచు
తలపోయుచు తన హృదయ మందు రాముని
బంథించిన ఘనుడు పవన సుతుడు
మనుజులార హనుమంతుని బంటు రాముడై
నుతి కెక్కె నెచ్చట నో తెలుపుము
చదువ గవలయు నెల్లరు సంతసముగ
రాముని చరిత మెప్పుడు, దేము నెపుడు
దూషణముచేయ సబబు కాదు వినవలెను
నాస్తిక వరులార యనుచు జ్ఞాని పలికె
పూసపాటి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమును,రామాఖ్యుఁడు భక్తిని
రిప్లయితొలగించండిహనుమంతుని దీక్షఁగొలిచి యధికారి యయెన్
పనిఁజేయ మెచ్చిరందఱు
హనుమంతుని బంటు రాముడైనుతికెక్కెన్.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండివినుమా భక్తుడు రాఘవుండొక తరిన్ వీరుండు ధీరుండునౌ
రిప్లయితొలగించండితనదైవంబగు మారుతీ విభునకున్ దారుఢ్య శిల్పంబుతో
కనసొంపయ్యెడు దేవళంబొకటి తాన్ గట్టెన్ సదా దానిలో
హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మారుతీ విభునకు' అనడం సాధువు కాదు. "మారుతాత్మజునకున్" అనండి.
హనుమద్భక్తుడు నామము
రిప్లయితొలగించండికనుగొన రాముడని దెలిసె కడుధర్మాత్ముం
డనిలజు భక్తుండగుటన్
హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనపర్తిన నభి రాముడు
రిప్లయితొలగించండిహనుమంతుని బంటు ; రాముఁడై నుతి కెక్కెన్
ఘనమగు రీతిని యచ్చటి
హనుమానుని యాలయముల నధికము జేయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వనపర్తిని... రీతిని నచ్చటి..." అనండి.
రిప్లయితొలగించండిఘనుడా రాముని పాదసేవయదె సత్కార్వం బటంచున్ గదా
యనిశమ్మాతడు వానినామ మదియే ధ్యానించెనా యంజనీ
తనయుండన్నది మర్చి ముష్కరుడటన్ దా పల్కె నీరీతిగా
హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండివినునప్పుడు చరవాణినిఁ
గనవద్దన వీడకుండ కావ్యము వింటే?
యని బోవఁగ నీ నోటను,
"హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్!"
"వినుచున్ రావణు జానకీ! మిగుల నా ప్రేమన్ విలోకించుమా!
నిను దేవేరిగ రాణివాసమున మన్నింపంగ నేఁజూచెదన్
మును ముందున్ నిను జేరవచ్చి తుదిఁ బోరాడలేనట్టి యూ
హను మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ!"
సవరించిన వృత్త పూరణము:
తొలగించండి"వినుమా జానకి! రావణున్ మిగుల నా ప్రేమన్ విలోకించుమా!
నిను దేవేరిగ రాణివాసమున మన్నింపంగ నేఁజూచెదన్
మును ముందున్ నిను జేరవచ్చి తుదిఁ బోరాడలేనట్టి యూ
హను మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ!"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసవరించిన వృత్త పూరణము:
"వినుమా జానకి! రావణున్ మిగుల నా ప్రేమన్ విలోకించుమా!
నిను దేవేరిగ రాణివాసమున మన్నింపంగ నేఁజూచెదన్
మును ముందున్ నిను జేరవచ్చి తుదకున్ బోరాడలేనట్టి యూ
హను మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ!"
వినమే పూర్వము భట్టుమూర్తి సుకవిన్
రిప్లయితొలగించండివిఖ్యాతిఁగాంచెంగదా!
ఘనుడౌ శ్రీవసురాట్ చరిత్రమునుసత్కావ్యంబుగా
వ్రాసి ,యా
హనుమత్సేవకుఁడౌచు,రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్
బాత్రుఁడౌ
ననగా సత్యము,రామరాజ్యమన నానందించరే యెల్లరున్.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధనధనమని కవి యొక్కడు
రిప్లయితొలగించండితనదగు రీతిన రచించె తత్తరపడుచున్
కనుగొననాకావ్యంబున
హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రీతిని రచించె" అనండి.
ధనధనమని కవి యొక్కడు
తొలగించండితనదగు రీతిని రచించె తత్తరపడుచున్
కనుగొననాకావ్యంబున
హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్
క్రమాలంకారంలో --
రిప్లయితొలగించండిఘనమగు బంటుగ నెవ్వని
విను తింతురు ' సేవకునికి వేరర్థంబౌ '
ఇన కుల మున దా బుట్టియు '
హనుమంతుని ' బంటు ' రాముడై నుతి కెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిఅనువున రాముడు హనుమకు
ఘనముగ తనయూరిన గుడికట్టి కొలుచుచున్
చనువుగ నందరి నోటను
హనుమంతుని బంటు రాముడై నుతి కెక్కెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తన యూరిని..."
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిఘనమౌ భక్తిని రాఘవుండనెడి నిష్కాముండు తానూరిలో
తనదైవమ్మగు నాంజనేయునకు నుత్సాహమ్ముతో కోవెలన్
ననువౌ రీతిని నిల్పి నచ్చటనె తానారాధనల్ సల్పుచున్
హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నిల్పి యచ్చటనె..."
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిఅనగ ననగ నొక రాముడు
అనవరతము హనుమ గొలిచె నార్తిన్ గూడన్
వినగను యెల్లరి నోటను
హనుమంతుని బంటు రాముడై నుతికెక్కెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రాముం డనవరతము... వినగను నెల్లరి..."
హనుమంతున్ సతతంబుగొల్చు మనమందత్యంత శ్రద్ధాళువై
రిప్లయితొలగించండివినుతుండై దనరారె రాఘవుఁడు సంప్రీతిన్ సదాచారుడై
జనతామోదమునొంది నాయకునిగా సంతృప్తుడై నిచ్చలున్
హనుమత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితనయుం గానకు నంప సంశయమ! తత్ప్రావీణ్యముం గానవే
రిప్లయితొలగించండివనిఁ దా నుగ్గడగించు రక్కసుల కావం జాలు మౌనీంద్రులన్
ఘనశస్త్రాస్త్రములన్ గడించు మది శంకన్ వీడు తొల్గించు మూ
హను, మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఘనుడౌ నీదు కుమారుఁ గూర్చి మదిలో కన్నోటుతో నివ్విధిన్
రిప్లయితొలగించండివనటన్ బొందకు నాదు సంగడి కడున్ బ్రావీణ్యుడై దైత్యులన్
దునుమున్ జెచ్చెర, దెచ్చునీకునల సంతుష్టిన్, విడన్ నీ యపో
హను, మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండివనజాసన వాసవ ముఖ
రిప్లయితొలగించండిదనుజారి గణంబు గోర ధరణిన్ జన్మిం
చిన దశరథ నందనుఁ డో
హనుమంతుని బంటు! రాముఁడై నుతి కెక్కెన్
ఘన నీలాంగుఁడు రామచంద్రుఁడు మహా కాకుత్స్థ వంశాగ్ర్యుఁడుం
దన భార్యార్థము గూడి వానర తతిన్ ధానుష్కుఁ డుత్సాహియై
ఘనరక్షః పతి రావణాసురుని సంగ్రామంబునం జంపఁగా
హనుమత్సేవకుఁ డౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిం బాత్రుఁడౌ
[హనుమత్సేవకుఁడు = హనుమంతుఁడు సేవకుఁడుగాఁ గలవాఁడు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపనివాడని యెడముంచక
రిప్లయితొలగించండితన దోడుగ నాటకము ప్రదర్శింపగనం
దున, యజమాని ధరింపగ
హనుమంతుని, బంటు రాముఁడై నుతి కెక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅనువగు మాటయె యీయది?
రిప్లయితొలగించండిహనుమంతునిబంటు రాముడై నుతికెక్కెన్
హనుమంతు డరయ రామున
కనుగుంసేవకుడు గాదె యార్యా! దలపన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివినుమా రావణునాజిలో దునుమ యాభీష్టంబు సిద్ధించగా
రిప్లయితొలగించండిహనుమత్సేవకుడౌచు రాఘవుడు సమ్యక్కీర్తికిన్ బాత్రుడౌ
ననుమానంబును జెందనోపకుడు మాయాజాలంబుగాదులే
యినవంశంబున బుట్ట,గారణమె యాతేజంబు నట్లుండునౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘన నీలాంగుని రామునిన్ సుజన రక్షా దక్షునా పక్షివా
రిప్లయితొలగించండిహను "మత్సేవకుఁడౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిన్ బాత్రుఁడౌ
గనుడీ" యంచడకించెనా ఖలుఁడు లంకాధీశుఁడౌద్ధత్యమున్
జనె వంశక్షయకారియై యణఁగె పాపాత్ముండు బాణాహతిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅనవచ్చున? యిట్టు లెపుడు
రిప్లయితొలగించండి"హనుమంతుని బంటు రాముఁడై నుతి కెక్కెన్"
కనగన్ రామాయణమున
తన భక్తిని కొల్చె హనుమ దాశరథి నొగిన్!