26-1-2022 (బుధవారం)కవిమిత్రులారా,గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వలదనుచు కోరుదురు ప్రాజాస్వామ్యము నిట”(లేదా...)“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్”
బ్యాలెటును వాడుచుండగన్ ప్రస్తుతంబునిచట లేదుపయోగము, నేరములనుమాన్ప బులెటును వాడిన మంచి కలుగవలదనుచు కోరెదరు ప్రజా స్వామ్యమిచట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాత రోతని తాతల పద్ధతులనుదినదినముపటాటోపమె దీనులందుచూపరేమాత్రము మదిదయ చోద్యముగను"వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యునిట" తే. గీ.
అందరికి గణతంత్రదినోత్సవశుభాకాంక్షలుమేడిపండుగకనిపించుమేలుఁజూచికలలసౌధంబుగూలంగకనులనీరుపెట్టుచుండినపనివారుబిట్టునలిగివలదనుచుకోరుదురుప్రాజాస్వామ్యమునిట
నీతి నియమాలు లేనట్టి నేత లగుచు చేత గానట్టి వారలై చెలగు చుండ వలదనుచు గోరుదురు ప్రజా స్వామ్య మునిట భార తమ్మున విసిగిన పౌరులెల్ల
నిలువన్ నీడను లేని పేదలు ,కడున్నేరంబులున్ హింసలున్కలలో గాంచని తీరు బాలికలపై గంభీరదుశ్చర్యలున్విలవల్ లేని ప్రభుత్వ చర్యలు వెసన్బెంపెక్కుచున్నన్ సదా వలదంచున్ జనులెల్ల గోరిరి ప్రజాస్వామ్యంబు దేశంబున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాష్ట్రమందు నియంతృత్వ రాగమింకవలదనుచు కోరుదురు :ప్రజాస్వామ్యము నిటనెలకొలుప సంతసింతురు నిశ్చయముగనిదియె యీనాటి ప్రజ యొక్క యిచ్ఛ నరయ
కుట్రలు కుతంత్రములజేయు కుజనులైనవారె కదర నేడిల మనపాలకులయిప్రజల సంతము దోచు వ్యవస్థ యంచువలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట.
ఛలకుండ్రే పరిపాలకుండ్రుగ ప్రజాస్వామ్యమ్ములో గెల్వగన్ కలుషమ్మయ్యెను రాజకీయమని వక్కాణించుచున్ లోకులే హలకున్ డబ్బుకు లొంగఁగాంచి పరదాహమ్మందొకండిట్లనెన్ వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్.
గురుదేవులకు కవిమిత్రులందరకూ రేపటిసగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో... కందంవెలసిన స్వాతంత్ర్యమ్మునబలమున పదవులు గడించి పడయఁగఁ గలిమిన్సులువన మార్పెప్పటికిన్వలదు ప్రజాస్వామ్యమునుచు వాంఛించుదురే!(కందంలో సమస్య నూహించి మొదటి మూడుపాదాలను వ్రాసుకుని, సమస్యాపాదం తేటగీతిగా గుర్తించి సమస్యను సవరించికుని చేసిన పూరణము. మన్నించి పరిశీలింప ప్రార్థన) తేటగీతిభరతదేశాన స్వాతంత్య్ర వారసత్వవిలువలకు చాటు దోపిడీ సులువటంచుగద్దెనెక్కెడి నేర్పులు గలుఁగ, మార్చవలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట!మత్తేభవిక్రీడితమువెలయన్ స్వేచ్ఛ మహామహుల్ రుధిరమర్పింపంగ దేశాన పెన్విలువల్ నిల్పెడు నేలికల్ బెనుపు సంప్రీతిన్ ప్రసాదింపఁగన్దెలివిన్ జూపుచు నెన్నగన్ బ్రజలు వర్ధిల్లంగ నన్యమ్ములున్వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్✍ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
మత్తేభము: ఇలపాలించెడు వాడు విష్ణువనుచున్ ఇన్నాళ్ళు రాజ్యాధికారులు రాజుల్, ప్రజ కన్నబిడ్డ లన కారుణ్యాన పాలించిరే కలకాలంబొకరీతినుండదుకదా గర్వాంధులౌ రాజులే “వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్--కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అనుచున్+ఇన్నాళ్ళు' అని విసంధిగా వ్రాయరాదు కదా? "విష్ణువని తా మిన్నాళ్ళు..." అనవచ్చు.
మత్తేభము: ఇలపాలించెడు వాడు విష్ణు వనుచున్నిన్నాళ్ళు రాజ్యాధికారులు రాజుల్, ప్రజ కన్నబిడ్డ లన కారుణ్యాన పాలించిరే కలకాలంబొకరీతినుండదుకదా గర్వాంధులౌ రాజులే “వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్--కటకం వేంకటరామ శర్మ.
తేటగీతి:భానుడు నడచు మార్గంపు భాగమంత పాలనను జేసిన బ్రిటిషు పాలకులను తరిమి కొట్టి, స్వతంత్రులై, దాస్యమింక వలదనుచు కోరుదురు ప్రజా స్వామ్యము నిట”--కటకం వేంకటరామ శర్మ.
నోరూరునట్లుగ నూతన పథకాలు చతురతతో వెదజల్ల వచ్చుఓట్లు కొనదలంచి నోట్లనే వెచ్చించి సులభతరమ్ముగ గెలువ వచ్చుతానున్న పక్షపు తంత్రమే ఫలియింప నధికార పీఠమ్ము నందవచ్చుమంత్రి పదవితోడ మర్యాద పెంపొంద చురుకుగ నార్జించి మురియ వచ్చుకోరు కొన్నట్టి పక్షాన జేర వచ్చు క్రొత్త వయిన కేతనముల నెత్త వచ్చు ప్రియము గద యీవ్యవస్థ మరియొక విధమువలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట
ధన్యవాదాలు 🙏
పలురీతుల్ పడినాము కష్టముల నబ్బా!పారతంత్య్రంబులోఫలియించెంగద!మా తపస్సు ఘనమౌ స్వాతంత్య్రముంబొంద,చంచల చిత్తంబులవారి పాలనము మాసామ్రాజ్యమందెన్నడున్వలదంచున్, జనులెల్లఁగోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్.రాచరికపు వ్యవస్థలరాచకములుబానిసత్వపు బ్రతుకులు ,వర్ణ వర్గభేదములు,భాగ్యవంతుల పెత్తనాలువలదనుచు,కోరుదురు ప్రజాస్వామ్యమునిట.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
విలువౌయాస్తుల నార్జనమ్మువిడుచున్ విజ్ఞానులౌయుత్తముల్కలనున్ నిల్చిరి గుండెనొడ్డి గతమున్ కాంక్షించి స్వాతంత్ర్యమున్విలువల్ వీడిన నాయకుల్ గెలుచుచున్ పీడింప దుర్నేతలేవలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. "...యిడుము లెన్నేన్ భారతమ్మందునన్" అనవచ్చు.
విలువల్వీడి చరించు దుష్టజనులే పీడించు దుష్టాత్ములేకలికాలంబున ధర్మచింత విడుచున్ క్షాపాలులై ధూర్తులైఖలులై సంస్కృతికెల్ల కీడు సలుపన్ కర్తవ్యతా దీక్షతోవలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
నీతి నియమాలు లేనట్టి నేతలుండు తావులందున నెవరైన దప్పకుండ వలదనుచు కోరుదురు ప్రాజాస్వామ్యమునిట సహజ మయ్యది పరికించ సబబె కూడ
అలకా నేతలె యుండుచున్మిగుల గయ్యాలన్బ్రవర్తించుచో వలదంచున్ జనులెల్ల గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్ గలకాలంబును మంచి గోరుచును జక్కౌరీతి సాయంబునున్ నలరంజేసెడు వానినే జనులు నాహ్వానింతురే యెయ్యెడన్
అరసినఁ గపటం బెన్నిక లందుఁ గరము పెరిగిన విభుల స్వార్థమ్ము ధరణి యందుఁదఱిఁగిన నవకాశమ్ములు దద్ద యింకవలదనుచుఁ గోరుదురు ప్రజాస్వామ్యము నిటఇలలో రాచరికమ్ము మున్వెలిఁగె దేవేంద్రాభ రాజన్యులే విలసిల్లంగను ధర్మ రక్షకులునై వీక్షింపఁగా నేఁడు రావలె నంచున్ జను లెల్లఁ గోరిరి ప్రజా స్వామ్యమ్ము దేశమ్మునన్ వలదంచున్ జను లెల్లఁ గోరిరి ప్ర జాస్వామ్యమ్ము దేశమ్మునన్
ఇలలోస్వేచ్ఛకుస్వర్గధామమనిసాహిత్యాదిస్వాతంత్ర్యమైకలిమిన్లేమినివర్గజాతిమతముల్కళ్యాణవృద్ధ్యర్థమైపలుసౌభాగ్యములిచ్చునించనగనెబ్భంగిన్నిరాశార్తినిన్*“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్”*?
విలయంబీతని పాలనంబకట విద్వేషంబులేపారగాకలతల్ రేగెను రాజ్యమెల్లెడల దుష్కర్మంబులే హెచ్చెనేపలుకాడంగ నిజంబు నేరమగు వ్యధ్వంబీ నియంతృత్వమే వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
మంచియనుమాటకనరాకమచ్చుకైనప్రజల సొమ్మును దోచుచు వాసిగా నుసంచరించెడి నేతల సందడి గనివలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యమిలను
ధనమెసర్వస్వమనిమది తలచుకొనుచునక్రమమ్ముగచేయుచునార్జనమ్ముతిరుగునేతలనుగనుచు తీరుగ నిటువలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యమిలను
బ్యాలెటును వాడుచుండగన్ ప్రస్తుతంబు
రిప్లయితొలగించండినిచట లేదుపయోగము, నేరములను
మాన్ప బులెటును వాడిన మంచి కలుగ
వలదనుచు కోరెదరు ప్రజా స్వామ్యమిచట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాత రోతని తాతల పద్ధతులను
రిప్లయితొలగించండిదినదినముపటాటోపమె దీనులందు
చూపరేమాత్రము మదిదయ చోద్యముగను
"వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యునిట" తే. గీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికి గణతంత్రదినోత్సవశుభాకాంక్షలు
రిప్లయితొలగించండిమేడిపండుగకనిపించుమేలుఁజూచి
కలలసౌధంబుగూలంగకనులనీరు
పెట్టుచుండినపనివారుబిట్టునలిగి
వలదనుచుకోరుదురుప్రాజాస్వామ్యమునిట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతి నియమాలు లేనట్టి నేత లగుచు
రిప్లయితొలగించండిచేత గానట్టి వారలై చెలగు చుండ
వలదనుచు గోరుదురు ప్రజా స్వామ్య మునిట
భార తమ్మున విసిగిన పౌరులెల్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిలువన్ నీడను లేని పేదలు ,కడున్
రిప్లయితొలగించండినేరంబులున్ హింసలున్
కలలో గాంచని తీరు బాలికలపై గంభీర
దుశ్చర్యలున్
విలవల్ లేని ప్రభుత్వ చర్యలు వెసన్
బెంపెక్కుచున్నన్ సదా
వలదంచున్ జనులెల్ల గోరిరి ప్రజా
స్వామ్యంబు దేశంబున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాష్ట్రమందు నియంతృత్వ రాగమింక
రిప్లయితొలగించండివలదనుచు కోరుదురు :
ప్రజాస్వామ్యము నిట
నెలకొలుప సంతసింతురు నిశ్చయముగ
నిదియె యీనాటి ప్రజ యొక్క యిచ్ఛ నరయ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికుట్రలు కుతంత్రములజేయు కుజనులైన
రిప్లయితొలగించండివారె కదర నేడిల మనపాలకులయి
ప్రజల సంతము దోచు వ్యవస్థ యంచు
వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఛలకుండ్రే పరిపాలకుండ్రుగ ప్రజాస్వామ్యమ్ములో గెల్వగన్
కలుషమ్మయ్యెను రాజకీయమని వక్కాణించుచున్ లోకులే
హలకున్ డబ్బుకు లొంగఁగాంచి పరదాహమ్మందొకండిట్లనెన్
వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు కవిమిత్రులందరకూ రేపటిసగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించండికందం
వెలసిన స్వాతంత్ర్యమ్మున
బలమున పదవులు గడించి పడయఁగఁ గలిమిన్
సులువన మార్పెప్పటికిన్
వలదు ప్రజాస్వామ్యమునుచు వాంఛించుదురే!
(కందంలో సమస్య నూహించి మొదటి మూడుపాదాలను వ్రాసుకుని, సమస్యాపాదం తేటగీతిగా గుర్తించి సమస్యను సవరించికుని చేసిన పూరణము. మన్నించి పరిశీలింప ప్రార్థన)
తేటగీతి
భరతదేశాన స్వాతంత్య్ర వారసత్వ
విలువలకు చాటు దోపిడీ సులువటంచు
గద్దెనెక్కెడి నేర్పులు గలుఁగ, మార్చ
వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట!
మత్తేభవిక్రీడితము
వెలయన్ స్వేచ్ఛ మహామహుల్ రుధిరమర్పింపంగ దేశాన పె
న్విలువల్ నిల్పెడు నేలికల్ బెనుపు సంప్రీతిన్ ప్రసాదింపఁగన్
దెలివిన్ జూపుచు నెన్నగన్ బ్రజలు వర్ధిల్లంగ నన్యమ్ములున్
వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
✍ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిమత్తేభము:
రిప్లయితొలగించండిఇలపాలించెడు వాడు విష్ణువనుచున్ ఇన్నాళ్ళు రాజ్యాధికా
రులు రాజుల్, ప్రజ కన్నబిడ్డ లన కారుణ్యాన పాలించిరే
కలకాలంబొకరీతినుండదుకదా గర్వాంధులౌ రాజులే
“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
--కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనుచున్+ఇన్నాళ్ళు' అని విసంధిగా వ్రాయరాదు కదా? "విష్ణువని తా మిన్నాళ్ళు..." అనవచ్చు.
మత్తేభము:
రిప్లయితొలగించండిఇలపాలించెడు వాడు విష్ణు వనుచున్నిన్నాళ్ళు రాజ్యాధికా
రులు రాజుల్, ప్రజ కన్నబిడ్డ లన కారుణ్యాన పాలించిరే
కలకాలంబొకరీతినుండదుకదా గర్వాంధులౌ రాజులే
“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
--కటకం వేంకటరామ శర్మ.
తేటగీతి:
రిప్లయితొలగించండిభానుడు నడచు మార్గంపు భాగమంత
పాలనను జేసిన బ్రిటిషు పాలకులను
తరిమి కొట్టి, స్వతంత్రులై, దాస్యమింక
వలదనుచు కోరుదురు ప్రజా స్వామ్యము నిట”
--కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినోరూరునట్లుగ నూతన పథకాలు చతురతతో వెదజల్ల వచ్చు
రిప్లయితొలగించండిఓట్లు కొనదలంచి నోట్లనే వెచ్చించి సులభతరమ్ముగ గెలువ వచ్చు
తానున్న పక్షపు తంత్రమే ఫలియింప నధికార పీఠమ్ము నందవచ్చు
మంత్రి పదవితోడ మర్యాద పెంపొంద చురుకుగ నార్జించి మురియ వచ్చు
కోరు కొన్నట్టి పక్షాన జేర వచ్చు
క్రొత్త వయిన కేతనముల నెత్త వచ్చు
ప్రియము గద యీవ్యవస్థ మరియొక విధము
వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు 🙏
తొలగించండిపలురీతుల్ పడినాము కష్టముల నబ్బా!పారతంత్య్రంబులో
రిప్లయితొలగించండిఫలియించెంగద!మా తపస్సు ఘనమౌ స్వాతంత్య్రముంబొంద,చం
చల చిత్తంబులవారి పాలనము మాసామ్రాజ్యమందెన్నడున్
వలదంచున్, జనులెల్లఁగోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్.
రాచరికపు వ్యవస్థలరాచకములు
బానిసత్వపు బ్రతుకులు ,వర్ణ వర్గ
భేదములు,భాగ్యవంతుల పెత్తనాలు
వలదనుచు,కోరుదురు ప్రజాస్వామ్యమునిట.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివిలువౌయాస్తుల నార్జనమ్మువిడుచున్ విజ్ఞానులౌయుత్తముల్
రిప్లయితొలగించండికలనున్ నిల్చిరి గుండెనొడ్డి గతమున్ కాంక్షించి స్వాతంత్ర్యమున్
విలువల్ వీడిన నాయకుల్ గెలుచుచున్ పీడింప దుర్నేతలే
వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. "...యిడుము లెన్నేన్ భారతమ్మందునన్" అనవచ్చు.
విలువల్వీడి చరించు దుష్టజనులే పీడించు దుష్టాత్ములే
రిప్లయితొలగించండికలికాలంబున ధర్మచింత విడుచున్ క్షాపాలులై ధూర్తులై
ఖలులై సంస్కృతికెల్ల కీడు సలుపన్ కర్తవ్యతా దీక్షతో
వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
నీతి నియమాలు లేనట్టి నేతలుండు
రిప్లయితొలగించండితావులందున నెవరైన దప్పకుండ
వలదనుచు కోరుదురు ప్రాజాస్వామ్యమునిట
సహజ మయ్యది పరికించ సబబె కూడ
అలకా నేతలె యుండుచున్మిగుల గయ్యాలన్బ్రవర్తించుచో
రిప్లయితొలగించండివలదంచున్ జనులెల్ల గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
గలకాలంబును మంచి గోరుచును జక్కౌరీతి సాయంబునున్
నలరంజేసెడు వానినే జనులు నాహ్వానింతురే యెయ్యెడన్
అరసినఁ గపటం బెన్నిక లందుఁ గరము
రిప్లయితొలగించండిపెరిగిన విభుల స్వార్థమ్ము ధరణి యందుఁ
దఱిఁగిన నవకాశమ్ములు దద్ద యింక
వలదనుచుఁ గోరుదురు ప్రజాస్వామ్యము నిట
ఇలలో రాచరికమ్ము మున్వెలిఁగె దేవేంద్రాభ రాజన్యులే
విలసిల్లంగను ధర్మ రక్షకులునై వీక్షింపఁగా నేఁడు రా
వలె నంచున్ జను లెల్లఁ గోరిరి ప్రజా స్వామ్యమ్ము దేశమ్మునన్
వలదంచున్ జను లెల్లఁ గోరిరి ప్ర జాస్వామ్యమ్ము దేశమ్మునన్
ఇలలోస్వేచ్ఛకుస్వర్గధామమనిసాహిత్యాదిస్వాతంత్ర్యమై
రిప్లయితొలగించండికలిమిన్లేమినివర్గజాతిమతముల్కళ్యాణవృద్ధ్యర్థమై
పలుసౌభాగ్యములిచ్చునించనగనెబ్భంగిన్నిరాశార్తినిన్
*“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్”*?
విలయంబీతని పాలనంబకట విద్వేషంబులేపారగా
రిప్లయితొలగించండికలతల్ రేగెను రాజ్యమెల్లెడల దుష్కర్మంబులే హెచ్చెనే
పలుకాడంగ నిజంబు నేరమగు వ్యధ్వంబీ నియంతృత్వమే
వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
మంచియనుమాటకనరాకమచ్చుకైన
రిప్లయితొలగించండిప్రజల సొమ్మును దోచుచు వాసిగా ను
సంచరించెడి నేతల సందడి గని
వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యమిలను
ధనమెసర్వస్వమనిమది తలచుకొనుచు
రిప్లయితొలగించండినక్రమమ్ముగచేయుచునార్జనమ్ము
తిరుగునేతలనుగనుచు తీరుగ నిటు
వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యమిలను