18-1-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్”(లేదా...)“శ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్”
పోరునగెలువశివుడుసంసారముగంగనుతలనిడిశమమునుబోందెన్గౌరికిసగమైకంఠముశ్రీరమణినిసతిగఁబోందెశివుడుముదమునన్
నారాయణుండుఁబ్రీతిన్శ్రీరమణిన్ సతిగఁబొందె,శివుఁడు ముదమునన్గౌరిని పెండిలి యాడెనుశారదఁబెండ్లాడె నలువ జగములు మెచ్చన్.
కందంతారకుఁ జంపెడు సుతునిడదారగ శైలేయినొందు దైవత వినతిన్గౌరిని, మ్రొక్కుచు శౌరినిశ్రీరమణిన్, సతిగఁ బొందె శివుఁడు ముదమునన్ఉత్పలమాలతారకుఁ జంపు పుత్రునిడఁ ద్ర్యక్షుని సాంబునిఁ జేయ మన్మథున్గూరిచి దేవతల్ మిగులఁ గోరఁగ రుద్రునిఁ బోలి శాంతిమైగౌరినిఁ బెళ్లికూతుగను గాంచుచు, భక్తిని మ్రొక్కి విష్ణువున్శ్రీరమణీమణిన్, శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
ధీరతగంగశీర్షమునతీరుననిల్పినదేవుడీయనేవేరుగభావనల్గనకవేగమపార్వతికర్ధమయ్యెనేసారముదెల్సెనీధవుడుసౌమ్యతవేడగదేవదానవుల్శ్రీరమణిన్శివుడుసేకోనెభార్యగమెచ్చగన్సురల్
మారరిపుఁ బతిగ పొందెడుకోరికతో తపము జేయు గుహజననిని కామారియె కరుణించి హిమశ్రీ రమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్ క్రూరుడు లోకకంటకుని కూల్చెడు వాడు శివాత్మజుండె, యాశూరుడు జన్మమందవలె శూలధరా! మము గావుమంచు తామారితి తో సురాళి యలికాక్షుని వేడగ నద్రిజన్ హిమశ్రీ రమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
క్షీ రాబ్ధి కన్యకను హరి శ్రీ రమణిన్ సతిగ బొందె : శివుడు ముదమునన్ గౌరిని వివాహ మాడియు కూరిమి తోడ సుర తతుల కోరిక దీర్చెన్
నారాయణుడే ప్రీతిన్శ్రీరమణిన్ సతిగఁ బొందె; శివుఁడు ముదమునన్గౌరిని పెండ్లాడె గదాకోరితపమొనర్చు గిరిజ కోర్కెను దీర్చన్
వారిజగర్భుఁడున్ వలచి భార్యగఁగైకొనె దేవి భారతిన్వారిజనాభుడున్ వలచె వారిధికన్యను సుందరాంగినాశ్రీరమణీమణిన్ ,శివుఁడు సేకొనెభార్యగ మెచ్చగన్ సురల్గౌరిని,వీరు మమ్మెపుడుకంటికి ఱెప్పగఁబ్రోచుగావుతన్.
నారాయణు డనురక్తిగశ్రీరమణిన్ సతిగఁ బొందె ; శివుఁడు ముదమునన్గౌరికి తనలో సగముగగౌరవమిడి ప్రజకు తారకాణము నొసగెన్
నీరజనేత్రుఁడు హరి దాశ్రీరమణిన్ సతిగఁ బొందె; శివుఁడు ముదమునన్గౌరిని గైకొనె సతిగా,వారిజగర్భుఁడు వరించె వాణిని దెలియన్
కోరగ దేవతల్ మరుడు ఘోరతపంబును జేయుచున్న నీశ్వరని గుండెలో విడిచె వత్తుగ మెత్తని పూలబాణమున్మారుడు మండిభస్మమయె,బాణము తాకుట చేత పార్వతీశ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్.
ఉత్పలమాల:ఘోరపరాభవమ్ముగొని కోమలి నుగ్గయె దక్ష వాటికన్ గౌరిగ జన్మమంది సితగాత్రుని శంభుని లోకశంకరు న్నారిగ తన్నుతాను పరిణామము చెందిన యాదిశక్తి సు “శ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్”--కటకం వేంకటరామ శర్మ.
కందము:వారలు మువ్వురునొకటే పేరులె గౌరి రమవాణి వేర్వేరనగన్ ప్రేరణకు తోడు శక్తియె “శ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్”--కటకం వేంకటరామ శర్మ.
శౌరితగ పెండ్లియాడెనుశ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్గౌరిని, సరవిని వాణినినీరజభవుడగు విరించి నెమ్మిగ పొందెన్
కందంనీరజ నేత్రుడు జిష్ణువుశ్రీరమణిన్ సతిగ బొందె ,శివుడు ముదమునన్ఘోర తపంబొనరించినగౌరిని చేపట్టె దేవ గణములు మురియన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఘోరతపమ్మునన్ హిమపు గోత్రము నుండగ శంకరుండు తాన్తారకుఁ జంపు వానిని త్రిధాముని బిడ్డగఁ బొంద, దేవతల్మారునిఁ బంపి రాతపము మాన్పి యపర్ణను గైకొనన్, శుభశ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
పరమాత్ముం డాకృష్ణుడు శ్రీరమణిన్ సతిగ బొందె,శివుడు ముదమునన్ గిరిజను వివాహ మాడగ సురలందఱు హాజరైరి సోత్సాహమునన్
ఘోరార్త జనాశ్రిత మందారను నలినాక్షి సంతత త్రిదశ సమూ హారాధిత గిరిజ నుతశ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్వారిజ సంభ వాది సుర పర్వ మనోరథ పూర ణార్థమై వారని దీక్షఁ బంచ శర పాణి చలమ్మున నుద్యమింపఁగా మార శరాభి తప్త హృత మానస శైలజఁ బార్వతీ తపశ్శ్రీ రమణీ మణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
శ్రీరమ సేవలందుకొను శ్రీహరి వార్ధిని శేష శయ్యపైసారసగర్భుడౌ నలువ శారద నెన్నడు గూడియుండు సొంపారగ శైలపుత్రికను పార్వతి దేవిని సర్వసద్గుణశ్రీ రమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
ఆరమ భర్తయే గదిల నాయత రీతిని బెండ్లియాడెనే శ్రీరమణీమణిన్ ,శివుడు సేకొనె భార్యగ మెచ్చగన్సురల్ యాగిరిజాసతిన్ రతిని యద్బుతమంచును బల్కగావుతన్ నారయ కృష్ణులున్ శివులయాకృతి వేరగు గాని యొక్కరే
స్మేరవికాస సుందర విశేష విలాస ప్రభా స్వరూపిణిన్ధీర యశో విరాజ మణిధీయుత భాసిని పార్వతి న్మదిన్గోరి వరించి చేరుచు నకుంఠిత ప్రేమను హేమకాంతిమచ్ఛ్రీ రమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్!
పోరునగెలువశివుడుసం
రిప్లయితొలగించండిసారముగంగనుతలనిడిశమమునుబోందెన్
గౌరికిసగమైకంఠము
శ్రీరమణినిసతిగఁబోందెశివుడుముదమునన్
నారాయణుండుఁబ్రీతిన్
రిప్లయితొలగించండిశ్రీరమణిన్ సతిగఁబొందె,శివుఁడు ముదమునన్
గౌరిని పెండిలి యాడెను
శారదఁబెండ్లాడె నలువ జగములు మెచ్చన్.
కందం
రిప్లయితొలగించండితారకుఁ జంపెడు సుతునిడ
దారగ శైలేయినొందు దైవత వినతిన్
గౌరిని, మ్రొక్కుచు శౌరిని
శ్రీరమణిన్, సతిగఁ బొందె శివుఁడు ముదమునన్
ఉత్పలమాల
తారకుఁ జంపు పుత్రునిడఁ ద్ర్యక్షుని సాంబునిఁ జేయ మన్మథున్
గూరిచి దేవతల్ మిగులఁ గోరఁగ రుద్రునిఁ బోలి శాంతిమై
గౌరినిఁ బెళ్లికూతుగను గాంచుచు, భక్తిని మ్రొక్కి విష్ణువున్
శ్రీరమణీమణిన్, శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
ధీరతగంగశీర్షమునతీరుననిల్పినదేవుడీయనే
రిప్లయితొలగించండివేరుగభావనల్గనకవేగమపార్వతికర్ధమయ్యెనే
సారముదెల్సెనీధవుడుసౌమ్యతవేడగదేవదానవుల్
శ్రీరమణిన్శివుడుసేకోనెభార్యగమెచ్చగన్సురల్
రిప్లయితొలగించండిమారరిపుఁ బతిగ పొందెడు
కోరికతో తపము జేయు గుహజననిని కా
మారియె కరుణించి హిమ
శ్రీ రమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్
క్రూరుడు లోకకంటకుని కూల్చెడు వాడు శివాత్మజుండె, యా
శూరుడు జన్మమందవలె శూలధరా! మము గావుమంచు తా
మారితి తో సురాళి యలికాక్షుని వేడగ నద్రిజన్ హిమ
శ్రీ రమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
క్షీ రాబ్ధి కన్యకను హరి
రిప్లయితొలగించండిశ్రీ రమణిన్ సతిగ బొందె : శివుడు ముదమునన్
గౌరిని వివాహ మాడియు
కూరిమి తోడ సుర తతుల కోరిక దీర్చెన్
నారాయణుడే ప్రీతిన్
రిప్లయితొలగించండిశ్రీరమణిన్ సతిగఁ బొందె; శివుఁడు ముదమునన్
గౌరిని పెండ్లాడె గదా
కోరితపమొనర్చు గిరిజ కోర్కెను దీర్చన్
వారిజగర్భుఁడున్ వలచి భార్యగఁగైకొనె దేవి భారతిన్
రిప్లయితొలగించండివారిజనాభుడున్ వలచె వారిధికన్యను సుందరాంగినా
శ్రీరమణీమణిన్ ,శివుఁడు సేకొనెభార్యగ మెచ్చగన్ సురల్
గౌరిని,వీరు మమ్మెపుడుకంటికి ఱెప్పగఁబ్రోచుగావుతన్.
నారాయణు డనురక్తిగ
రిప్లయితొలగించండిశ్రీరమణిన్ సతిగఁ బొందె ; శివుఁడు ముదమునన్
గౌరికి తనలో సగముగ
గౌరవమిడి ప్రజకు తారకాణము నొసగెన్
నీరజనేత్రుఁడు హరి దా
రిప్లయితొలగించండిశ్రీరమణిన్ సతిగఁ బొందె; శివుఁడు ముదమునన్
గౌరిని గైకొనె సతిగా,
వారిజగర్భుఁడు వరించె వాణిని దెలియన్
కోరగ దేవతల్ మరుడు ఘోరతపంబును జేయుచున్న నీ
రిప్లయితొలగించండిశ్వరని గుండెలో విడిచె వత్తుగ మెత్తని పూలబాణమున్
మారుడు మండిభస్మమయె,బాణము తాకుట చేత పార్వతీ
శ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్.
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిఘోరపరాభవమ్ముగొని కోమలి నుగ్గయె దక్ష వాటికన్
గౌరిగ జన్మమంది సితగాత్రుని శంభుని లోకశంకరు
న్నారిగ తన్నుతాను పరిణామము చెందిన యాదిశక్తి సు
“శ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్”
--కటకం వేంకటరామ శర్మ.
కందము:
రిప్లయితొలగించండివారలు మువ్వురునొకటే
పేరులె గౌరి రమవాణి వేర్వేరనగన్
ప్రేరణకు తోడు శక్తియె
“శ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్”
--కటకం వేంకటరామ శర్మ.
శౌరితగ పెండ్లియాడెను
రిప్లయితొలగించండిశ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్
గౌరిని, సరవిని వాణిని
నీరజభవుడగు విరించి నెమ్మిగ పొందెన్
కందం
రిప్లయితొలగించండినీరజ నేత్రుడు జిష్ణువు
శ్రీరమణిన్ సతిగ బొందె ,శివుడు ముదమునన్
ఘోర తపంబొనరించిన
గౌరిని చేపట్టె దేవ గణములు మురియన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఘోరతపమ్మునన్ హిమపు గోత్రము నుండగ శంకరుండు తాన్
రిప్లయితొలగించండితారకుఁ జంపు వానిని త్రిధాముని బిడ్డగఁ బొంద, దేవతల్
మారునిఁ బంపి రాతపము మాన్పి యపర్ణను గైకొనన్, శుభ
శ్రీరమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
పరమాత్ముం డాకృష్ణుడు
రిప్లయితొలగించండిశ్రీరమణిన్ సతిగ బొందె,శివుడు ముదమునన్
గిరిజను వివాహ మాడగ
సురలందఱు హాజరైరి సోత్సాహమునన్
ఘోరార్త జనాశ్రిత మం
రిప్లయితొలగించండిదారను నలినాక్షి సంతత త్రిదశ సమూ
హారాధిత గిరిజ నుత
శ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్
వారిజ సంభ వాది సుర పర్వ మనోరథ పూర ణార్థమై
వారని దీక్షఁ బంచ శర పాణి చలమ్మున నుద్యమింపఁగా
మార శరాభి తప్త హృత మానస శైలజఁ బార్వతీ తప
శ్శ్రీ రమణీ మణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
శ్రీరమ సేవలందుకొను శ్రీహరి వార్ధిని శేష శయ్యపై
రిప్లయితొలగించండిసారసగర్భుడౌ నలువ శారద నెన్నడు గూడియుండు సొం
పారగ శైలపుత్రికను పార్వతి దేవిని సర్వసద్గుణ
శ్రీ రమణీమణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్
ఆరమ భర్తయే గదిల నాయత రీతిని బెండ్లియాడెనే
రిప్లయితొలగించండిశ్రీరమణీమణిన్ ,శివుడు సేకొనె భార్యగ మెచ్చగన్సురల్
యాగిరిజాసతిన్ రతిని యద్బుతమంచును బల్కగావుతన్
నారయ కృష్ణులున్ శివులయాకృతి వేరగు గాని యొక్కరే
స్మేరవికాస సుందర వి
రిప్లయితొలగించండిశేష విలాస ప్రభా స్వరూపిణిన్
ధీర యశో విరాజ మణి
ధీయుత భాసిని పార్వతి న్మదిన్
గోరి వరించి చేరుచు న
కుంఠిత ప్రేమను హేమకాంతిమ
చ్ఛ్రీ రమణీమణిన్ శివుఁడు
సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్!