2, ఫిబ్రవరి 2023, గురువారం

సమస్య - 4226

3-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్”
(లేదా...)
“సారా క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసారబంధమ్మునన్”
(వాడ్రేవు వేంకట సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      ఆ రామనామ మహిమన్
      మారుతి చిరజీవి యయ్యె మధురమ్మనగన్
      శ్రీరామ నామ సుధ మన
      సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్

      రావణునితో నంగదుడు:

      శార్దూలవిక్రీడితము
      శ్రీ రామామృత నామ కీర్తనమదే చేసెన్ జిరంజీవి సా
      మీరిన్ నిత్యము గ్రోల భక్తియుత సంప్రీతిన్! దశగ్రీవ! తత్
      క్షీరాంబోధిగఁ బంచునన్న సుధనే శీఘ్రమ్మె సద్భక్తి కా
      సారా! క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసారబంధమ్మునన్!

      తొలగించండి
  2. నారాయణు పర మేశ్వరు
    నోరారగ నుతు లొ నర్చి నుడువుచు సతమున్
    పారాయణ o బు నన్ మన
    సారా క్రోలంగ నొప్పు సౌఖ్యం బందన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    నారాయణ జపము సలుప
    చేరువ యగుమోక్షమనగ జీవిత సరణిన్
    శ్రీరామ నామ సుధ మన
    సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి

  4. పారావారంబది సం
    సారమనుచు భీతియేల? సంప్రీతిని యా
    నారి నిను గోరె గద వ
    త్సా! రా! క్రోలంగనొప్పు , సౌఖ్యంబందన్.

    రిప్లయితొలగించండి

  5. పారావారము నీదలేననుచు నీ బంధాలనే రోయుచున్
    జేరన్ బోయితి వేల? ప్రవ్వజనమున్ క్షేమంబు కాదందునే
    భీరుత్వమ్మును వీడి నిన్ వలచి యా బింబోష్ఠియే వేచె వ
    త్సా! రా! క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసారబంధమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. ప్రేమను మునిగిన జంటలు
    తామే ప్రేమకు ప్రబల నిదర్శనమనుచున్
    బ్రేమామృతధారలు మన
    సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్

    రిప్లయితొలగించండి
  7. శ్రీరామ నామమే భువి
    తారకమంత్రమ్ము ముక్తిదాయకమగు సం
    సార జలధి దాటఁగ మన
    సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్

    రిప్లయితొలగించండి
  8. కోరుచు నీదరి జేరిన
    పౌరుల లో సుగుణము గల వారల తోడన్
    పోరామి లోని చవి మన
    సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీరామాయను నామమంత్ర సుధనున్ సేవింప సద్భక్తితో
    నా రాముండు దయాప్రపూర్ణుడయి నీ యాకాంక్షలన్దీర్చు సం
    సారాంభోధిని దాటు తారణమిదే సత్యంబు శ్రీరామ దా
    సా! రా! క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసార బంధమ్మునన్

    రిప్లయితొలగించండి
  10. వీరాగ్రేసర దానవాంతకుడు తా విఖ్యాత
    సంశీలుడున్
    పారావారము దాటిపోయి యనిలో పౌలస్థ్యునిన్ జంపె నా
    శ్రీరామా మృతనామమున్ సతతమున్
    సేవానురక్తిన్ మన
    స్సారా క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసార బంధంబునన్

    రిప్లయితొలగించండి
  11. ఓరుపు వహించి యెడఁద వి
    చారించి సమంచితముగ శాస్త్ర వితతులన్
    సారమ్మును జ్ఞానవ దను
    సారా! క్రోలంగ నొప్పు సౌఖ్యం బందన్

    [జ్ఞానవత్+ అనుసార = జ్ఞానవదను సార]

    దారం బుత్రులఁ గావ బాధలకు నౌ ధామంబు నిత్యమ్మునున్
    లేరీ ధాత్రినిఁ గావ నిన్నెవరు నుద్రేకమ్ము వే వీడుమా
    పోరం జాలవు కృష్ణ వాఙ్మయ సుధన్ భోగమ్ములం జిద్విలా
    సా రా క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసార బంధమ్మునన్

    రిప్లయితొలగించండి
  12. దూరమ్మైతివి యున్నతమ్మయిన యుద్యోగమ్ము ప్రాప్తింపగా
    నారాటమ్మున నొంటరై బ్రతుకులో హర్షమ్ము గోల్పోతినే
    మారుండేయు సరమ్ములన్ బడితి ప్రేమన్ నాదు మై, హృన్నివా
    సా! రా! క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసారబంధమ్మునన్
    మై: శరీరము, క్రోలుము: అనుభవించు

    రిప్లయితొలగించండి
  13. వీరుడ వగునీకేతగు
    నీ రాజ్యపు సంపదలవి నిక్కంబిదియే
    చేరగ వసుమతి నంత
    స్సారా !క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్

    అంతస్సార = మనోబలము గలవాడు

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.

    నోరారగ ప్రతి దినమును
    శ్రీరామా రామయనుచు చేయుచు భజనల్
    ఆ రాముని నామము మన
    సారా క్రోలంగ నొప్పు సౌఖ్యంబందన్.

    రిప్లయితొలగించండి
  15. సారా మత్తు పదార్ధము
    సారానుంద్రాగఁగలుఁగు జాడ్యజము లెన్నో
    సారాఁద్రాగుట నేరము
    సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్?

    రిప్లయితొలగించండి
  16. నోరారగననవరతము
    యోరామాకావుమనుచు నుల్లాసముతో
    శ్రీరామనామసుధమన
    సారా గ్రోలంగ నొప్పు సౌఖ్యం బందన్

    మరో పూరణ

    నారాయణనర సింహా
    మారజ పితముర హరారమాదయితానీ
    యారాధనమ్మునేమన
    సారా గ్రోలంగనొప్పుసౌఖ్యంబందన్

    రిప్లయితొలగించండి