22, ఫిబ్రవరి 2023, బుధవారం

సమస్య - 4346

23-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాఘ్రము మగవాఁడు నమ్మవచ్చునె మగువా”
(లేదా...)
“వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్”

16 కామెంట్‌లు:


  1. ఆఘ్రాణించుచు వాసన
    శీఘ్రగ వలె వడిగ నురికి చెండాడెడి యా
    వ్యాఘ్రములను దునుమాడెడు
    వ్యాఘ్రము మగవాఁడు , నమ్మవచ్చునె మగువా.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. వ్యాఘ్రనఖంబు కంఠమున యౌవన శక్తిని పెంపుసేయగా
      శీఘ్రముగా శుభాంగులకు సేవయొనర్చగ సిద్ధమెప్పుడున్
      వ్యాఘ్రము బోలు దీమసము పక్వపు చేష్టల వర్తనమ్ముతో
      వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్

      తొలగించండి
  3. వ్యాఘ్రనఖభూషణుని గడు
    శీఘ్రముగానమ్మి వ్యర్ధ చింతనమేలా
    యాఘ్రాణించి యెగవిడును
    వ్యాఘ్రము మగవాఁడు నమ్మవచ్చునె మగువా?

    రిప్లయితొలగించండి

  4. శీఘ్రతరంబు పర్వులిడు చిహ్నమదే గద జన్యువున్ గనన్
    శీఘ్రగ వంటి వేగమున జేరి వధించు పటుత్వమున్న యా
    వ్యాఘ్రముఁ నిల్వరించెడి వియాతుడు వాడె గుహాశయాలకే
    వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్.

    రిప్లయితొలగించండి
  5. శీఘ్రమె వనిలో వ్యాధుడు
    నాఘ్రా ణించు చు మృగముల నంతము సేయన్
    వ్యాఘ్రము వే టా డెన్నా
    వ్యాఘ్ర ము మగవాడు :: నమ్మ వచ్చునె మాగువా!

    రిప్లయితొలగించండి
  6. ఆఘ్రాణమె సరిజాలదు
    శీఘ్ర గతిని మగవారి శీలము నెంచన్
    వ్యాఘ్రాసము నన నొప్పదు
    వ్యాఘ్రము మగవాఁడు ; నమ్మవచ్చునె మగువా

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. మహారాణి ప్రమీలతో ఆంతరంగిక సలహాదారు:

      కందం
      జిఘ్రుండర్జునుఁడనఁ దా
      నాఘ్రాణించి మననెఱిగి యందఁగవచ్చున్
      శీఘ్రమె ప్రమీల! పురుష
      వ్యాఘ్రము మగవాఁడు నమ్మవచ్చునె మగువా?

      ఉత్పలమాల
      జిఘ్రుఁడు నర్జునుండనఁగ జేరగ వచ్చె ప్రమీల! వీరుఁడై
      శీఘ్రమె గెల్చు మొగ్గరము సిద్ధముగావలె తప్పదమ్మరో!
      యే ఘృణ యుద్ధమందున వహింపని కాలుడు! పౌరుషమ్మునన్
      వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్

      తొలగించండి
  8. ఉ.

    వ్యాఘ్ర శిరమ్ము నొందె యిన వంశ సుదాసుడు నల్ల కాళ్ళతో
    వ్యాఘ్రము రీతి బ్రాహ్మణుని భక్షణ సేయగ శాపమొందగా
    శీఘ్రము కామ వాంఛ గని శ్రేష్ఠ వశిష్ఠుడు గర్భ మిచ్చెడిన్
    *వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్.*

    రిప్లయితొలగించండి
  9. శీఘ్రముచలితుండగుగద
    సఘ్రాణముతోడనుపరసతిపొందికన్తా
    నిగ్రహమింతయులేకను
    వ్యాఘ్రముమగవాఁడునమ్మవచ్చునెచెలియా

    రిప్లయితొలగించండి
  10. శీఘ్ర చరులు గోవదన
    వ్యాఘ్రమ్ములు కారె నరులు పరికింపంగన్
    వ్యాఘ్రము నమ్మరు మగువలు
    వ్యాఘ్రము మగవాఁడు నమ్మవచ్చునె మగువా

    జిఘ్రుఁడు విత్త సంపదల చెల్వపు వాసన లున్న మానవ
    వ్యాఘ్రుఁడు మించుఁ గ్రూరతను వ్యాఘ్రము నెంచ నెడంద నింపుగా
    శీఘ్రపు నిర్ణయమ్ములను జింతలు సేకుఱు నిశ్చయమ్ముగన్
    వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్

    రిప్లయితొలగించండి
  11. శీఘ్రమ్ముగపరుగిడుతా
    వ్యాఘ్రమ్ములవలెనడవులపట్టగజనులన్
    నాఘ్రాణించుచుమట్టిని
    వ్యాఘ్రము మగవాడు నమ్మవచ్చునెమగువా

    రిప్లయితొలగించండి