18-2-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్”(లేదా...)“పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్”
అల్లరి చేసెడి పిల్లల యల్లరి మాన్పంగనెంచి యాండ్రైడనెడిన్ సెల్లును తెచ్చితి నందున పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్.
కల్లకపటమెరుగని దనచెల్లిని బిలచి యొక కథను జెప్పగ గోరన్నల్లినకథలో నొక పరిపిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్
పెల్లుగ కల్లలు బలుకుచుచెల్లని మాటలను దెలిపె చిత్రము గాగన్మెల్లగ బాలుని తో ననె"పిల్లికి జనియించి కోతి పికమును మ్రింగె న్ "
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చిల్లర పైకము కోరుచునల్లరితో పిట్టలదొర హాస్యోక్తులతోనల్లిన వృత్తాంతమిదియెపిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్
కల్లలు కొల్లలాడు విధి కల్పన జేయును నవ్వులాటకైచిల్లర పైకమున్ గొనుచు చెప్పును పిట్టల రాయుడే కతల్బల్లెము పట్టగా తనకు పట్టము కట్టిరి భారతీయులేపిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్
ఎల్లెడల తిరుగు, గాంచినపిల్లలు భీతిల్లునట్టి భీకరమౌ యానల్లని ప్రాణియె బావురుపిల్లికి జనియించి , కోఁతి, పికమును మ్రింగెన్. పిల్లలు గాంచి భీతిలెడు భీకర రూపము గల్గినట్టి యానల్లని ప్రాణి యొక్క విపినమ్మున తా దిరుగాడు వేళలో నల్లన గానవచ్చెనని యాకలి తాళగ లేనటంచదే పిల్లికిఁ బుట్టి , కోఁతి, గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్.
కల్లాకపటంబెఱుగనిపెల్లుగవెఱ్ఱినుతులనివేదనజేసెన్పిల్లడుకాళికిదాసుడుపిల్లికిజనియించికోతిపికమునుమ్రింగెన్
మెల్లగ బిల్చియు మిక్కిలియల్లరి మనుమనుని బిల్చియడిగెన్ బ్రశ్నన్అల్లన నుడు మేతీరునపిల్లికి జనియించి కోతి పికమును మ్రింగెన్
పిల్లల యల్లరిమాన్పగకల్లల కథ జెప్పె తల్లి కడు చోద్యముగానల్లిన కథలో వనమున“పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్”
అల్లరిచేయు బాలకుల నందర నొక్కటఁ జేరబిల్చి యాపిల్లలయందునుత్సుకతఁ బెంచుచు నాయమ గల్పితమ్ముగానల్లిన కల్లబొల్లి కథయందలి చిత్రపు సన్నివేశమేపిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో... కందంకల్లలు వల్కను గురువర!యిల్లిదె మీరిడు సమస్యలెంచుచుఁ బండన్త్రుళ్లింతల స్వప్నంబునపిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్!ఉత్పలమాలకల్లలు వల్కజాలనయ! గౌరవ కందికులాబ్ధి చంద్రమా!యిల్లిదె మీ సమస్యలకు నెంచుచు పూరణ పండినంతటన్ద్రుళ్లితి దిగ్గునన్ మదికి ద్యోతకమైనను స్వప్నమందునన్బిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్!
కల్లయె శాఖాహారులెయెల్ల ప్లవంగము లనంగ నిద్ధరలో వర్ధిల్లి, భయంపడ కింతయుఁ బిల్లికి, జనియించి కోఁతి పికమును మ్రింగెన్ఉల్లము నందు నెంచి తన కొప్పెడు పండని యుత్సహించుచుం దల్లడిలంగఁ బక్షి కని దారుణ కర్మము నొక్క గ్రుడ్డునుం జల్లని వేళ నొక్క కపి సత్తము భార్యకు మున్ను, కాక యే పిల్లికిఁ, బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్
రిప్లయితొలగించండిఅల్లరి చేసెడి పిల్లల
యల్లరి మాన్పంగనెంచి యాండ్రైడనెడిన్
సెల్లును తెచ్చితి నందున
పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్.
కల్లకపటమెరుగని దన
రిప్లయితొలగించండిచెల్లిని బిలచి యొక కథను జెప్పగ గోరన్
నల్లినకథలో నొక పరి
పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్
పెల్లుగ కల్లలు బలుకుచు
రిప్లయితొలగించండిచెల్లని మాటలను దెలిపె చిత్రము గాగన్
మెల్లగ బాలుని తో ననె
"పిల్లికి జనియించి కోతి పికమును మ్రింగె న్ "
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిల్లర పైకము కోరుచు
తొలగించండినల్లరితో పిట్టలదొర హాస్యోక్తులతో
నల్లిన వృత్తాంతమిదియె
పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్
కల్లలు కొల్లలాడు విధి కల్పన జేయును నవ్వులాటకై
తొలగించండిచిల్లర పైకమున్ గొనుచు చెప్పును పిట్టల రాయుడే కతల్
బల్లెము పట్టగా తనకు పట్టము కట్టిరి భారతీయులే
పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్
రిప్లయితొలగించండిఎల్లెడల తిరుగు, గాంచిన
పిల్లలు భీతిల్లునట్టి భీకరమౌ యా
నల్లని ప్రాణియె బావురు
పిల్లికి జనియించి , కోఁతి, పికమును మ్రింగెన్.
పిల్లలు గాంచి భీతిలెడు భీకర రూపము గల్గినట్టి యా
నల్లని ప్రాణి యొక్క విపినమ్మున తా దిరుగాడు వేళలో
నల్లన గానవచ్చెనని యాకలి తాళగ లేనటంచదే
పిల్లికిఁ బుట్టి , కోఁతి, గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్.
కల్లాకపటంబెఱుగని
రిప్లయితొలగించండిపెల్లుగవెఱ్ఱినుతులనివేదనజేసెన్
పిల్లడుకాళికిదాసుడు
పిల్లికిజనియించికోతిపికమునుమ్రింగెన్
మెల్లగ బిల్చియు మిక్కిలి
రిప్లయితొలగించండియల్లరి మనుమనుని బిల్చియడిగెన్
బ్రశ్నన్
అల్లన నుడు మేతీరున
పిల్లికి జనియించి కోతి పికమును
మ్రింగెన్
పిల్లల యల్లరిమాన్పగ
రిప్లయితొలగించండికల్లల కథ జెప్పె తల్లి కడు చోద్యముగా
నల్లిన కథలో వనమున
“పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్”
అల్లరిచేయు బాలకుల నందర నొక్కటఁ జేరబిల్చి యా
రిప్లయితొలగించండిపిల్లలయందునుత్సుకతఁ బెంచుచు నాయమ గల్పితమ్ముగా
నల్లిన కల్లబొల్లి కథయందలి చిత్రపు సన్నివేశమే
పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించండికందం
కల్లలు వల్కను గురువర!
యిల్లిదె మీరిడు సమస్యలెంచుచుఁ బండన్
త్రుళ్లింతల స్వప్నంబున
పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్!
ఉత్పలమాల
కల్లలు వల్కజాలనయ! గౌరవ కందికులాబ్ధి చంద్రమా!
యిల్లిదె మీ సమస్యలకు నెంచుచు పూరణ పండినంతటన్
ద్రుళ్లితి దిగ్గునన్ మదికి ద్యోతకమైనను స్వప్నమందునన్
బిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్!
కల్లయె శాఖాహారులె
రిప్లయితొలగించండియెల్ల ప్లవంగము లనంగ నిద్ధరలో వ
ర్ధిల్లి, భయంపడ కింతయుఁ
బిల్లికి, జనియించి కోఁతి పికమును మ్రింగెన్
ఉల్లము నందు నెంచి తన కొప్పెడు పండని యుత్సహించుచుం
దల్లడిలంగఁ బక్షి కని దారుణ కర్మము నొక్క గ్రుడ్డునుం
జల్లని వేళ నొక్క కపి సత్తము భార్యకు మున్ను, కాక యే
పిల్లికిఁ, బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్