26, ఫిబ్రవరి 2023, ఆదివారం

సమస్య - 4350

27-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వజ్రపుటుంగరము మ్రింగవలె మేలుఁ గనన్”
(లేదా...)
“వజ్రపుటుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీకగున్”

12 కామెంట్‌లు:

  1. వజ్రంబయ్యదివిషమే
    వజ్రాయుధుడంతవాడువణకెనుగనగా
    వజ్రముమ్రింగెనుశివుడే
    వజ్రపుటుంగరముమ్రంగవలెమేలుగనన్

    రిప్లయితొలగించండి

  2. అజ్ర నుకబళించి సఖుం
    డిజ్రాయెలు వాసి చెప్పె నెగతాళిగ నా
    హజ్రతు చచ్చుట కిక నీ
    వజ్రపుటుంగరము మ్రింగవలె మేలుఁ గనన్.


    ఈ జ్ర యె ప్రాసనిచ్చిన సహించుట యెట్టుల చత్తునంచనన్
    హజ్రతు చెప్పెనీ విధిని యజ్ర యటంచన క్షేత్రమ మంచు నా
    యజ్రను గూర్చి చచ్చుటయె న్యాయము, చత్తును తప్పదన్న నీ
    వజ్రపుటుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీకగున్.

    రిప్లయితొలగించండి

  3. అజ్ర నుకబళించి సఖుం
    డిజ్రాయెలు వాసి చెప్పె నెగతాళిగ నా
    హజ్రతు చచ్చుట కిక నీ
    వజ్రపుటుంగరము మ్రింగవలె మేలుఁ గనన్.


    ఈ జ్ర యె ప్రాసనిచ్చిన సహించుట యెట్టుల చత్తునంచనన్
    హజ్రతు చెప్పెనీ విధిని యజ్ర యటంచన క్షేత్ర మంచు నా
    యజ్రను గూర్చి చచ్చుటయె న్యాయము, చత్తును తప్పదన్న నీ
    వజ్రపుటుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీకగున్.

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    అజ్రము భస్మధారణ మహా మహిమాన్వితమున్ బవిత్రమున్
    వజ్రములాయుధంబయినఁ బ్రాణము పోదు విభూతిఁ దాల్చగా
    వజ్రకలాపముల్ నగలఁ బన్నిన బుండ్రము శైవభక్తిచే
    *వజ్రపుటుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీకగున్.*

    రిప్లయితొలగించండి
  5. వజ్ర శరీరియు చావగ
    వజ్రపుటుంగరము మ్రింగవలె ; మేలుఁ గనన్
    వజ్రము శకులి సతముదినిన ,
    వజ్రపు సంకల్పముననె ఫలితము శుభమౌ

    రిప్లయితొలగించండి
  6. వజ్రంకునికేల వలయు
    వజ్రపుటుంగరము, మ్రింగవలె మేలుఁ గనన్
    వజ్రిని పరిమితి మేరకు
    వజ్రాసనమభ్యసించ వర్ష్మము దృఢమౌ

    [వజ్రి - ఆకుజెముడు]

    రిప్లయితొలగించండి
  7. వజ్రి యయిన దిన నొప్పడు
    వజ్రపుటుంగరము ; మ్రింగవలె మేలుఁ గనన్
    వజ్రంకుడయిన బండ్లనె ,
    వజ్రములెన్ని కలిగినను ఫలితం బదియే

    రిప్లయితొలగించండి
  8. వజ్రావతి ధరి యించెను
    వజ్రపు టుంగర ము:మ్రింగ వలె మేలు గనన్
    వజ్రము లను కొని మందుల
    వజ్రపు d3హమ్ము పొంద వసుధను సుకవీ!

    రిప్లయితొలగించండి
  9. నామకరణ సందర్భంగా...

    కందం
    వజ్రదృఢత నిడు శిశువా!
    తా జృంభనమెంచి మామ తాకించుననెన్
    ఋజ్రుఁడు, తేనె స్రవింపగ
    వజ్రపుటుంగరము, మ్రింగవలె మేలుఁ గనన్


    ఉత్పలమాల
    ఋజ్రుడు మేనమామఁగని యింపుగ బిల్చుచు చేనొసంగగన్
    వజ్ర దృఢత్వమున్ శిశువ! వాసిగ బొందగ బారసాలకున్
    వజ్రతరంపు పూనికను పాలును తేనె స్రవింపఁ బట్టినన్
    వజ్రపుటుంగరమ్మును, శివా యని మ్రింగిన మేలు నీకగున్

    రిప్లయితొలగించండి
  10. ఇజ్రాయిలునను నాతఁడు
    వజ్రముఁ గొనుగో లుజేయ బంగరు తోడన్
    హిజ్రాలు బలికి రిటులుగ
    వజ్రపుటుంగరము మ్రింగవలె మేలుఁ గనన్

    రిప్లయితొలగించండి
  11. వజ్రమును గోయఁ గావలె
    వజ్రం బెవ్వరికి నైన వసుధన్ నీ క్షు
    ద్వజ్రంబున కమ్మి వెసన్
    వజ్రపు టుంగరము మ్రింగ వలె మేలుఁ గనన్

    వజ్రికి నాయుధం బగును బాణి తలమ్మున వెల్గి నిత్యమున్
    వజ్రము నీకు భూషణము పాయక నూన శరీర మందు నా
    వజ్రము మూర నాఁకలి యపారముగాఁ దపియింప కమ్మి నీ
    వజ్రపు టుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీ కగున్

    రిప్లయితొలగించండి
  12. వజ్రపుటుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీకగున్
    వజ్రముఁగోయగానగును వజ్రము తోడనె గాదె చూడగా
    వజ్రము మ్రింగుచో రసము వజ్రపు ధాటికి స్రుక్కురక్తమై
    వజ్రము మ్రింగఁబో కుఁడుశి వాయని కల్గును గీడు తప్పకన్

    రిప్లయితొలగించండి