6, ఫిబ్రవరి 2023, సోమవారం

సమస్య - 4330

7-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలలోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్”
(లేదా...)
“తలలోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్”

26 కామెంట్‌లు:


  1. ఖలుడని పరమ పిలుగనుచు
    వలదిక వానిచెలిమి యని వచియించితివె
    ట్టుల యన తెలిపెనతడు చే
    తల లోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    తిలకింప రాయబారము
    పలుకుచు భయపెట్టి మమ్ము పాండవులకు నూ
    రుల నిప్పింప హరీ! కో
    తలలోనే యిమిడియుండె తత్వంబెల్లన్

    మత్తేభవిక్రీడితము
    తిలకింపంగను రాయబారము హరీ! తీవ్రంపు దౌష్ట్యమ్ము నీ
    పలుకుల్ గ్రక్కెను గాదె! భీతిగొలుపన్ భావించి యాపాండు పు
    త్రులకిప్పింపగ రాజ్యభాగమునహో దూషించెడున్ వెక్కిరిం
    తలలోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్

    రిప్లయితొలగించండి
  3. ఇల భాగవతాదికృతులు
    నెలకొన్న తెలుంగు సీమ నిక్కము దివియే
    సులభముగ తెలుగు "సత్కవి
    తల" లోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్

    రిప్లయితొలగించండి

  4. ఖలుడాతండని, కింపచానుడనుచున్ ఖట్వాప్లుతుండంచు నె
    ట్టుల వాచించితివోయి తెల్పుమని నిష్టూరమ్ముగా నడ్గగా
    తలపంకించుచు చెప్పెనా సఖుడు నిందారోపణల్ గావు చే
    తల లోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్.

    రిప్లయితొలగించండి
  5. తలపుల లో మంచి దనము
    కలతలు విడనాడి మెలగు కమ్మని నడతల్
    విలసిత యౌ దార్యపు చిం
    తల లోనే యిమిడి యుండె దత్వం బెల్లన్

    రిప్లయితొలగించండి
  6. ఇలలో మానవ జన్మమెత్తియు సదా యిష్టానుసారంబుగా
    పలుమారుల్ దన పాత్ర మార్చు గద సంపాదించ దుష్కర్మచే
    తలరాతల్ సెడిపోవునుగదా దరచుగా
    దత్యంబు నీదైన చే
    తలలోనే నెలకొన్న దందునిక తత్వంబెల్ల యోచించినన్

    రిప్లయితొలగించండి
  7. ఇలయందున యే మనుజుని
    యలవాటుల నెంచి జూడ నరయగ నొప్పున్
    దలలో మెదలా డెడు జిం
    తలలోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్

    రిప్లయితొలగించండి
  8. మ.

    జలమున్ మట్టియు నగ్ని వాయువులు గూర్చంగన్ మెయిన్ బద్ధతిన్
    సెలవున్ బొందుచు నాత్మ నాకసమునన్ జేరంగ మాయంచుడిన్
    బలుకుల్ గీతలు కృష్ణుడున్ శివుడు జెప్పంగన్ బటారంబు చిం
    *“తలలోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్”*

    రిప్లయితొలగించండి
  9. కొలదిగనైనను తత్వం
    బలవడు మార్గము తెలియక మలికిత మేలా
    తిలకించిన వేమన కవి
    తలలోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్

    రిప్లయితొలగించండి
  10. కలుషపు యోచనలు మదిని
    పలుకులలో సుధలఁ జిలుకు, భావింపఁగనా
    ఖలుఁడొనరించెడు పలు చే
    తలలోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్

    రిప్లయితొలగించండి
  11. పలుకుల్తీయని 'పంచదార చిలకల్' వాక్చాతురీ యుక్తముల్
    కలుషంబౌ విషతుల్యమౌ తలపులన్ గ్రాలున్ మనంబెన్నడున్
    ఖలుఁడీ రీతిగ వర్తిలున్ సతతమా గర్హ్యుండు గావించు చే
    తలలోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్

    రిప్లయితొలగించండి
  12. ఇలలోఁ జిన్ని కుమారుఁడు
    లలితుఁడు ప్రహ్లాదుఁడు వర రక్షస్సుతుఁడుం
    గలఁడు పరమ భాగవతుని
    తల లోనే యిమిడి యుండెఁ దత్త్వంబెల్లన్

    అల మున్నెందఱొ తాపసోత్తముల నభ్యర్థింపఁగాఁ బుట్టు వా
    రల బోధామృత వార్ధులందుఁ గన నౌ రమ్యంబులౌ తత్త్వముల్
    లలి తాంతఃకర ణైక సంయముల సల్లాపమ్ము లందింక వ్రా
    తల లోనే నెలకొన్న దందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్

    రిప్లయితొలగించండి
  13. ఇలలో పావనమైన జీవనములో నింపొందుచున్ దీక్షతో
    పలువైనమ్ముల ప్రాణి కోటి కిడుచుం మార్గమ్ములాపేక్షతో
    బలమౌ జాతి సృజించ నెంచు ఘనులౌ భట్టారకశ్రేణి చిం
    తలలోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్

    రిప్లయితొలగించండి