5-2-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము”(లేదా...)“కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతికపిని జంపిన రాముని కర్మఫలమునంటె కృష్ణావతారాన హరికి గనఁగవెనక జన్మ పాపాలు దప్పింప గావుకావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలముఉత్పలమాలపావన రామచంద్రుడల వాలిని జంపిన కర్మ వీడకేయావల కృష్ణుఁడై వెలయ నంటెను దప్పక దుష్ఫలంబునైజీవుల జన్మమేదయిన చేసిన పాప ఫలాలు వీడగన్గావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
బాగా చెప్పారు గురువుగారూ 🙏👍
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురుదేవులకు మరియు యగ్నేశ్ గారికి ధన్యవాదములు. 🙏
కావు కావనుచు నరచు కాకులెల్లతెలుపు సత్యంబు లివియేను తెలుసు కొనుముసంపదలు, సుఖ భోగముల్ శాశ్వతములు కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము. దేవుని మ్రొక్కినన్ గలక తీరునటంచుదలంచి స్వార్థమున్ గోవెలకేగి వానినట గొల్చుచు పిమ్మట పాప కార్యముల్ నీవిట సల్పుచుండుటది నీచము లానుడులెల్ల సత్యముల్ కావని, కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్.
కావు తనువులు చిరములు కావుకావుకావు సంపదల్ స్థిరములు కావుకావునీవు నీవనుకున్నవి నీవి కావుకావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము
చక్కని పూరణ. అభినందనలు.
జీవన కాలమందు గడు చింతిలు , సంపదభోగభాగ్యముల్లేవని జీవితాంతమును లెక్కలు వేసెడువాని గాంచియున్ జీవుడ యేవి యీభువిని చెందవు నీకు సదా తిరంబుగాకావని కావుకావని కాకులు కర్మ ఫలంబు దెల్పెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ దివసమందున గడియలేమియు నలికావనుచుఁ గాకు లెఱిఁగించుఁ ; గర్మఫలముబావుకొనకుండుటనునది వలను గాదుతెలిసు కొనుచ మసలుటయే తిన్న యౌను
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తెలిసికొనుచు' టైపాటు.
🙏🏽
కలిమి లేములు స్థిరములు కావు కావుకష్థ నష్ఠము లనిశము కావు కావుఅనుభవించు పదవు లక్షయములు కావుకావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలముదైవకటాక్షమే మరల దక్కొన జేయును జన్మ మిచ్చటన్చావుని విస్మరించి తమ సంపద నెన్నడు చాలదందురేకావరమే సదా బలుపు కారణ మౌనని పాపపుణ్యముల్ కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'కష్ట నష్ట...' టైపాటు.
భావనచేయ పుణ్యమును పాపములబ్బును సంచితమ్ముగాయీవొనరించు కర్మఫల మెన్నఁడు నీవెనువెంట వచ్చునింకేవియు నీవికావనుచు హెచ్చరికన్ వినిపించ గూయుచున్కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సంచితమ్ముగా నీ వొనరించు...'
ఈ వసుధన్ ఘటిల్లుసిరి యింపును గూర్చునటంచు మత్తులైజీవితకాలమందునను శ్రీకరునిన్ మది నెంచి యెట్టి సంభావన చేయకున్నభువి వైభవముల్ కన శాశ్వతమ్ములేకావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జీవి త మ శాశ్వ త మటంచు చెప్పు కొఱకుసంపద లు మొద లైనవి సమసి పోవువెంట రావేవి యను సత్య విషయ మనుచుకావనుచు గాకు లెరిగించు కర్మ ఫలము
కాకి యెప్పుడు వల్కును కా వని యిలమేఁక సంతత మఱవదె మే యని వినిపింప నేరి కైనను విశ్వసింప కిట్లు కా వనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మ ఫలముకా వనుటం ద్యజించి మఱి కాకులు నేర్చునె పల్క నన్యమున్ నీ వన యెద్ది యైనను సునిశ్చిత మద్ది వచించు నట్టులే కావున నెట్లు సెప్ప నగుఁ గాకుల కూతల కర్థ మివ్విధిం గావని కావు కా వనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
కావు కావు మనుచుఁ బెద్దగా నఱచుచు నందఁజేయును బిండము నాదరమున పాప పుణ్యపు ఫలితముఁబఱగఁ జెప్పు కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము
పిన్నక నాగేశ్వరరావు.కూడబెట్టిన దేదియు తోడు రాదుజీవితమ్ములు బంధముల్ స్థిరము కావుతనువు సంపదల్ భువి శాశ్వతము కావుకావనుచుఁ గాకు లెఱిగించుఁ గర్మఫలము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండికపిని జంపిన రాముని కర్మఫలము
నంటె కృష్ణావతారాన హరికి గనఁగ
వెనక జన్మ పాపాలు దప్పింప గావు
కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము
ఉత్పలమాల
పావన రామచంద్రుడల వాలిని జంపిన కర్మ వీడకే
యావల కృష్ణుఁడై వెలయ నంటెను దప్పక దుష్ఫలంబునై
జీవుల జన్మమేదయిన చేసిన పాప ఫలాలు వీడగన్
గావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
బాగా చెప్పారు గురువుగారూ 🙏👍
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు మరియు యగ్నేశ్ గారికి ధన్యవాదములు. 🙏
తొలగించండి
రిప్లయితొలగించండికావు కావనుచు నరచు కాకులెల్ల
తెలుపు సత్యంబు లివియేను తెలుసు కొనుము
సంపదలు, సుఖ భోగముల్ శాశ్వతములు
కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము.
దేవుని మ్రొక్కినన్ గలక తీరునటంచుదలంచి స్వార్థమున్
గోవెలకేగి వానినట గొల్చుచు పిమ్మట పాప కార్యముల్
నీవిట సల్పుచుండుటది నీచము లానుడులెల్ల సత్యముల్
కావని, కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికావు తనువులు చిరములు కావుకావు
రిప్లయితొలగించండికావు సంపదల్ స్థిరములు కావుకావు
నీవు నీవనుకున్నవి నీవి కావు
కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిజీవన కాలమందు గడు చింతిలు , సంపద
రిప్లయితొలగించండిభోగభాగ్యముల్
లేవని జీవితాంతమును లెక్కలు వేసెడు
వాని గాంచియున్
జీవుడ యేవి యీభువిని చెందవు నీకు
సదా తిరంబుగా
కావని కావుకావని కాకులు కర్మ ఫలంబు దెల్పెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ దివసమందున గడియలేమియు నలి
రిప్లయితొలగించండికావనుచుఁ గాకు లెఱిఁగించుఁ ; గర్మఫలము
బావుకొనకుండుటనునది వలను గాదు
తెలిసు కొనుచ మసలుటయే తిన్న యౌను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తెలిసికొనుచు' టైపాటు.
🙏🏽
తొలగించండికలిమి లేములు స్థిరములు కావు కావు
రిప్లయితొలగించండికష్థ నష్ఠము లనిశము కావు కావు
అనుభవించు పదవు లక్షయములు కావు
కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము
దైవకటాక్షమే మరల దక్కొన జేయును జన్మ మిచ్చటన్
చావుని విస్మరించి తమ సంపద నెన్నడు చాలదందురే
కావరమే సదా బలుపు కారణ మౌనని పాపపుణ్యముల్
కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'కష్ట నష్ట...' టైపాటు.
భావనచేయ పుణ్యమును పాపములబ్బును సంచితమ్ముగా
రిప్లయితొలగించండియీవొనరించు కర్మఫల మెన్నఁడు నీవెనువెంట వచ్చునిం
కేవియు నీవికావనుచు హెచ్చరికన్ వినిపించ గూయుచున్
కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంచితమ్ముగా నీ వొనరించు...'
ఈ వసుధన్ ఘటిల్లుసిరి యింపును గూర్చునటంచు మత్తులై
రిప్లయితొలగించండిజీవితకాలమందునను శ్రీకరునిన్ మది నెంచి యెట్టి సం
భావన చేయకున్నభువి వైభవముల్ కన శాశ్వతమ్ములే
కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజీవి త మ శాశ్వ త మటంచు చెప్పు కొఱకు
రిప్లయితొలగించండిసంపద లు మొద లైనవి సమసి పోవు
వెంట రావేవి యను సత్య విషయ మనుచు
కావనుచు గాకు లెరిగించు కర్మ ఫలము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాకి యెప్పుడు వల్కును కా వని యిల
రిప్లయితొలగించండిమేఁక సంతత మఱవదె మే యని విని
పింప నేరి కైనను విశ్వసింప కిట్లు
కా వనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మ ఫలము
కా వనుటం ద్యజించి మఱి కాకులు నేర్చునె పల్క నన్యమున్
నీ వన యెద్ది యైనను సునిశ్చిత మద్ది వచించు నట్టులే
కావున నెట్లు సెప్ప నగుఁ గాకుల కూతల కర్థ మివ్విధిం
గావని కావు కా వనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికావు కావు మనుచుఁ బెద్దగా నఱచుచు
రిప్లయితొలగించండినందఁజేయును బిండము నాదరమున
పాప పుణ్యపు ఫలితముఁబఱగఁ జెప్పు
కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
కూడబెట్టిన దేదియు తోడు రాదు
జీవితమ్ములు బంధముల్ స్థిరము కావు
తనువు సంపదల్ భువి శాశ్వతము కావు
కావనుచుఁ గాకు లెఱిగించుఁ గర్మఫలము.