13, ఫిబ్రవరి 2023, సోమవారం

సమస్య - 4337

14-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్”
(లేదా...)
“శునకమ్ముల్ గుసుమంబులయ్యె మిగులన్ శోభావిశేషంబునన్”

26 కామెంట్‌లు:

  1. కందం
    ప్రణయము వివాహమై య
    య్యనురాగము శోభనంపు టార్తిని పెంచన్
    తనుసంగమ సతికృతమీ
    శునకమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్!


    మత్తేభవిక్రీడితము
    ప్రణయమ్ముల్ మదినిండి దంపతులుగా రంజిల్ల కల్యాణమై
    యనురాగమ్ములు వంచు శోభనమునందానందసందోహమై
    తనువుల్ సంగమమందెడున్ దమకమై దారాకృతమ్మౌచు నీ
    శునకమ్ముల్ గుసుమంబులయ్యె మిగులన్ శోభావిశేషంబునన్!

    రిప్లయితొలగించండి
  2. కనదాలంకృతకన్యగాకవితతాకావ్యాలయందుండగా
    మనసేలేకనునూగిపోదురటనామాలన్సరిన్జూచుచున్
    వినగానూసులుజెప్పగానెవరులేవిందారగింపన్ధ్వనిన్
    శునకమ్ముల్గుసుమంబులయ్యెమిగులన్శోభావిశేషంబునన్

    రిప్లయితొలగించండి
  3. మ.

    వనటన్ విష్ణువు దీర్చమంచు సురలున్ వైకుంఠమున్ జేరగా
    వినువీధిన్ మొన రాక్షసుల్ సలుప ప్రావీణ్యమ్ము జూపించగన్
    చనుదెంచంగ సుమాలి, మాలివధ, వైశారద్యమున్ ముంజకే
    *శున కమ్ముల్ గుసుమంబులయ్యె మిగులన్ శోభావిశేషంబునన్.*

    రిప్లయితొలగించండి
  4. మినుసిక వాడె శబరుడని
    ధనుంజయు డెరుగక జేయ దందడి యందున్
    మనసిజ మర్దనుడౌ మహే
    శున కమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్.

    రిప్లయితొలగించండి
  5. జనకుని యానతి గైకొని
    వనములలో మునుల యాగ పరిరక్షణకై
    జని సంధింప రఘుకులే
    శునకమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్

    రిప్లయితొలగించండి
  6. ఘనుడగు మంత్రజ్ఞుడు పుర
    జనులందరి సముఖముననె జరిపెను వింతన్
    కనుకట్టు విద్య జూపగ
    శునకమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్

    రిప్లయితొలగించండి

  7. మునిగా క్రీడి తపమ్ము జేయు తరినిన్ మూకాసురున్ జంపగన్
    దునుమాడిందది నేనటంచు పలికెన్ ధూర్తుండు శైలాటుడై
    రణమే సాగెను భీకరమ్ముగను, పోరాటమ్ములో మహే
    శున కమ్ముల్ గుసుమంబులయ్యె మిగులన్ శోభావిశేషంబునన్.


    మహేశునకు + అమ్ములు = మహేశునకమ్ములు

    రిప్లయితొలగించండి
  8. పెనగొను సమయములో ఫ
    ల్గునుడు ధనువునెక్కుపెట్టి గుప్పిన శరముల్
    కనులయెదుట నంబరకే
    శునకమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్

    రిప్లయితొలగించండి
  9. మనమున వలపు జనింప గ
    బనిచిన దేవతల యొక్క పథ కము గాగా
    మనసిజు వదలిన నా నీ
    శున కమ్ములు బువ్వుల య్యె శోభ వహింపన్

    రిప్లయితొలగించండి
  10. వనిలో పాండు సుతుండు నీశ్వరుల దుర్వారంపు కయ్యంబునన్
    తనయస్త్రమ్ములతోడఁ బార్థుఁడు నితాంతంబైన వేగంబుతో
    ననలాక్షున్ గుదియింపబూనుకొన నత్యాశ్చర్యముం గొల్ప నీ
    శునకమ్ముల్ గుసుమంబులయ్యె మిగులన్ శోభా విశేషంబునన్

    రిప్లయితొలగించండి
  11. ఇన తేజుం డయ్యడవినిఁ
    గనలి కిరాతుని పయిఁ గడఁక సెలంగఁ గర
    మ్ము నరుం డేసినచో నీ
    శున కమ్ములు వువ్వు లయ్యె శోభ వహింపన్

    కనకమ్ముల్ వెస నయ్యెనే యినుప ముక్కల్ రత్నమే ఱాయిగన్
    మినుముల్ మారెను వేగమే యిసుకగా మే నయ్యెఁ గాష్ఠమ్ముగాఁ
    గనలన్ భూమి సురుండు శాప మిడఁగాఁ గంపించి యొక్కుమ్మడిన్
    శునకమ్ముల్ కుసుమంబు లయ్యె మిగులన్ శోభావిశేషంబునన్

    [తన పైకి శునకముల నుసికొల్పిన దుష్టుని నొక మునీశ్వరుండు శపించిన సందర్భము]

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.

    ఘనముగ తపమొనరించు శి
    వునిపై శరములను మరుడు పూని విసరగన్
    తనువును తాకగ పరమే
    శున కమ్ములు బువ్వులయ్యె శోభవహింపన్.
    (పరమేశునకు+అమ్ములు)

    రిప్లయితొలగించండి