9-2-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్”(లేదా...)“సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్”
కందంఆర్యా! యోట్లనిడి మరోపర్యాయమ్మిడక నుండ ప్రజ వారింపన్కార్యమన వ్రేళ్లను సిరాసూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్శార్దూలవిక్రీడితముఆర్యా! వింతయనంగలేదు కద! రాజ్యానన్ బ్రజాస్వామ్యమన్గార్యంబందున నేతలన్ బ్రజలునెన్నన్నోటు వైచన్ మరోపర్యాయమ్మునువేయకుండగనునేర్పాటై సిరా గుర్తుతోసూర్యుం డా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
🙏🙏🙏
సూర్యుడు ద్రుంచె నిరులననిధైర్యము తో పడతులెల్ల ధరుణముకై ప్రాచుర్యముగా జనుట గనగ సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్.
మీ పూరణ బాగున్నది అభినందనలు
కార్యోన్ముఖులైరి జనులుసూర్యోదయమైన పిదప, చుక్కలు వొడిచెన్సూర్యాస్తమయము పిమ్మటకార్యకలాపములు ముగిసె కర్షక తతికిన్
హర్యక్షమ్మువలెన్ సుషీమమది తిష్యమ్మందు బాధింపగా పర్యంకమ్ముల వీడలేమనుచు శంపాంగుల్ ప్రతుష్టి వేయగానిర్యూహమ్మున ముగ్గులన్ నిలిచిరే నేత్తమ్మి చుట్టానికై సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ , బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.
కార్యోన్ముఖుడగు నతడుసూర్యోదయమైన పిదప ; చుక్కలు వొడిచెన్మర్యాదగ శయనించగ ,నార్యులకిది నిరవధికపు యలవాటెగదా
ఆర్యులు నిర్దేశించినమర్యాదను లక్ష్యపెట్టి మరి మెహెన్దీవర్యులు శుభముగ వధువుకు సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్
కార్యేషు దాసు లగుచున్భార్యలు దారలు కరణిగ భాసిలుచు సదాయార్యో క్తి నిజము గాగాసూ ర్యో దయ మైన పిదప చుక్కలు వొడిచెన్
సూర్యుని కాంతులు వొడమెనుసూర్యోదయమైన పిదప, చుక్కలు వొడిచెన్సూర్యాస్తమానమందు నవార్యములెపుఁడీ పుడమిని పగలును రాత్రుల్
మర్యాద నేమఱక యనివార్యమ్ముగఁ జిత్ర వసన భామా మణులే కార్యాలయములు సేరఁగ సూర్యోదయ మైన పిదప చుక్కలు వొడిచెన్పర్యావర్తము సేయుఁ బూర్వ గిరికిం బాశ్చాత్యపుం గొండకున్సూర్యుం డెప్పుడు మానకుండగను నస్తోకంపు ధైర్యమ్ముతో నార్యావర్తము దాఁటి సంభ్రమముతో నస్తాద్రినిన్, వీడి వేసూర్యుం డా యుదయాద్రి, నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆర్యాతెల్పెద విస్తరంబుగ వినుండాపార్శ్వమం దీభువిన్పర్యావర్తనమందుచున్ వితతమౌ ప్రద్యోతముల్ జిమ్ముచున్సూర్యుండా యుదయాద్రి నెక్కఁ ,బొడిచెన్జుక్కల్ మనోజ్ఞంబుగన్ఆర్యావర్తమునందు భాస్కరుడు తానస్తాద్రిలో గ్రుంకగన్
శౌర్యమ్మున్ ఘన వాయుసేన సలుపన్ సౌందర్య విన్యాసముల్చేరన్ జూడ ప్రజాళి సంతసమ్మున గడున్ జెన్నైన రూపున్ సినీతారల్ రాగ కనుంగొనంగనల ప్రాతఃకాలమున్ వింతగాసూర్యుండా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్
కందం
రిప్లయితొలగించండిఆర్యా! యోట్లనిడి మరో
పర్యాయమ్మిడక నుండ ప్రజ వారింపన్
కార్యమన వ్రేళ్లను సిరా
సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్
శార్దూలవిక్రీడితము
ఆర్యా! వింతయనంగలేదు కద! రాజ్యానన్ బ్రజాస్వామ్యమన్
గార్యంబందున నేతలన్ బ్రజలునెన్నన్నోటు వైచన్ మరో
పర్యాయమ్మునువేయకుండగనునేర్పాటై సిరా గుర్తుతో
సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
తొలగించండి🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిసూర్యుడు ద్రుంచె నిరులనని
ధైర్యము తో పడతులెల్ల ధరుణముకై ప్రా
చుర్యముగా జనుట గనగ
సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికార్యోన్ముఖులైరి జనులు
రిప్లయితొలగించండిసూర్యోదయమైన పిదప, చుక్కలు వొడిచెన్
సూర్యాస్తమయము పిమ్మట
కార్యకలాపములు ముగిసె కర్షక తతికిన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిహర్యక్షమ్మువలెన్ సుషీమమది తిష్యమ్మందు బాధింపగా
పర్యంకమ్ముల వీడలేమనుచు శంపాంగుల్ ప్రతుష్టి వేయగా
నిర్యూహమ్మున ముగ్గులన్ నిలిచిరే నేత్తమ్మి చుట్టానికై
సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ , బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికార్యోన్ముఖుడగు నతడు
రిప్లయితొలగించండిసూర్యోదయమైన పిదప ; చుక్కలు వొడిచెన్
మర్యాదగ శయనించగ ,
నార్యులకిది నిరవధికపు యలవాటెగదా
ఆర్యులు నిర్దేశించిన
రిప్లయితొలగించండిమర్యాదను లక్ష్యపెట్టి మరి మెహెన్దీ
వర్యులు శుభముగ వధువుకు
సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్
కార్యేషు దాసు లగుచున్
రిప్లయితొలగించండిభార్యలు దారలు కరణిగ భాసిలుచు సదా
యార్యో క్తి నిజము గాగా
సూ ర్యో దయ మైన పిదప చుక్కలు వొడిచెన్
సూర్యుని కాంతులు వొడమెను
రిప్లయితొలగించండిసూర్యోదయమైన పిదప, చుక్కలు వొడిచెన్
సూర్యాస్తమానమందు న
వార్యములెపుఁడీ పుడమిని పగలును రాత్రుల్
మర్యాద నేమఱక యని
రిప్లయితొలగించండివార్యమ్ముగఁ జిత్ర వసన భామా మణులే
కార్యాలయములు సేరఁగ
సూర్యోదయ మైన పిదప చుక్కలు వొడిచెన్
పర్యావర్తము సేయుఁ బూర్వ గిరికిం బాశ్చాత్యపుం గొండకున్
సూర్యుం డెప్పుడు మానకుండగను నస్తోకంపు ధైర్యమ్ముతో
నార్యావర్తము దాఁటి సంభ్రమముతో నస్తాద్రినిన్, వీడి వే
సూర్యుం డా యుదయాద్రి, నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆర్యాతెల్పెద విస్తరంబుగ వినుండాపార్శ్వమం దీభువిన్
రిప్లయితొలగించండిపర్యావర్తనమందుచున్ వితతమౌ ప్రద్యోతముల్ జిమ్ముచున్
సూర్యుండా యుదయాద్రి నెక్కఁ ,బొడిచెన్జుక్కల్ మనోజ్ఞంబుగన్
ఆర్యావర్తమునందు భాస్కరుడు తానస్తాద్రిలో గ్రుంకగన్
శౌర్యమ్మున్ ఘన వాయుసేన సలుపన్ సౌందర్య విన్యాసముల్
రిప్లయితొలగించండిచేరన్ జూడ ప్రజాళి సంతసమ్మున గడున్ జెన్నైన రూపున్ సినీ
తారల్ రాగ కనుంగొనంగనల ప్రాతఃకాలమున్ వింతగా
సూర్యుండా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్