5-12-2024 (శుక్రవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “అవధానం బనెడు విద్య యాంగ్లేయులదే” (లేదా...) “అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే”
అవమానంబె చరిత్రయంచు మరి విద్యాసంస్థలం జేరి పా ఠవముం జూపిరి యెర్ర రంగుల సిరా టంకారమే చేసి గౌ రవమే చూపని వాడు పుస్తకములన్ వ్రాయంగ నిట్లుండదే యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే!!
కం:అవధానులు మన పండితు లవధానం బనెడు విద్య యాంగ్లేయుల దే శవసనమున విడకుండుట కవి గా నా కెంత యైన గర్వము గూర్చున్ (మన అవధానులు కొందరు ఆంగ్లేయుల దేశాలలో ఉన్నా వదల లేదు కదా!)
మ:కవి వేమన్నకు గీర్తి బెంచె కవిలోకమ్మందు నా బ్రౌను,భ వ్యవిధిన్ వ్రాసె నిఘంటువున్ నిజములే యవ్వెల్ల యా మేలునే యవలోకించుచు భాష నిల్పినది యా యాంగ్లేయులే యందుమే? అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే? (బ్రౌన్ మొదలైన ఆంగ్లేయులు తెలుగుకి సేవ చేసింది నిజమే కానీ ఉద్ధరించింది మొత్తం వాళ్లే అనటం కొందరి అతిశయోక్తి.అవధానం వాళ్లే మైనా నేర్పారా ఏమిటి?)
(3)కం:ఎవరికి బ్రిటన్ న కావలె నవధాన? మ్మచటి కేగ నది కూ డిడునే? అవధాన మాంధ్ర కే సరి అవధానం బనెడు విద్య యాంగ్లేయులదే”? (బ్రిటన్ పోయే కుర్రాణ్ని అవధానం నేర్చుకో మంటే ఇలా అంటాడు)
(4)కం:చవి గల పదముల విరుపులు కవివర! తెలుగుననె చెల్లు, కాని పనియె నీ కవధాన మ్మాంగ్లమ్మున నవధానం బనెడు విద్య యాంగ్లేయులదే”? (ఒక కవి గారికి ఇంగ్లీష్ లో అవధానం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వస్తే మరొక కవి తెలుగు పదాలలో ఐతే చక్కని విరుపులు కుదురుతాయి కానీ ఇంగ్లీష్ ముక్కలు అలా విరగవు,అవి ఇనప ముక్కల లాగా ఉంటాయి అని చెప్పాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివివరుణుడాతం డాగ్లే
య విధేయుడు పల్కె హాలహలి మత్తున తా
కవనపు క్రీడగ పొగడెడి
యవధానం బనెడు విద్య యాంగ్లేయులదే.
భువినాంగ్లేయులె మేటిప్రాజ్ఞులని సంబోధించు పెచ్చారి యా
సవమున్ గ్రోలి నసత్యముల్ పలికెనే సమ్మోదికుల్ కోరగా
కవనక్రీడగ పండితోత్తములు వక్కాణించు చున్ మెచ్చె డా
యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే.
రవిక్రుంకని పాలనమున
రిప్లయితొలగించండివివిధ సమస్య లొకపరిగ పెనగుచు నుండన్
నవలీలగ సరి జేసిరి ,
యవధానం బనెడు విద్య యాంగ్లేయులదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివివరింపగ నాంధ్రులదే
రిప్లయితొలగించండియవధానం బనెడు విద్య; యాంగ్లేయులదే
వ్యవధానమనుచు తెలిపిరి
కవనము లందున పలువురు కమనీయముగా
అవలోకించుచు గౌరవించిరిగదా యాంగ్లేయులే తెల్గునే
లవలేశంబగు శంకలేదు విబుధుల్ ప్రాచీనులందించిరే
యవధానంబను విద్య నాంధ్రులకు; నా యాంగ్లేయులే నేర్పిరే
వివరింపందగు శబ్దకోశ విలువన్ విస్పష్టమౌరీతినిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఅవమానంబె చరిత్రయంచు మరి విద్యాసంస్థలం జేరి పా
రిప్లయితొలగించండిఠవముం జూపిరి యెర్ర రంగుల సిరా టంకారమే చేసి గౌ
రవమే చూపని వాడు పుస్తకములన్ వ్రాయంగ నిట్లుండదే
యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాటవమున్' టైపాటు.
కం:అవధానులు మన పండితు
రిప్లయితొలగించండిలవధానం బనెడు విద్య యాంగ్లేయుల దే
శవసనమున విడకుండుట
కవి గా నా కెంత యైన గర్వము గూర్చున్
(మన అవధానులు కొందరు ఆంగ్లేయుల దేశాలలో ఉన్నా వదల లేదు కదా!)
కం॥ భవినిఁ దమ సామ్రాజ్యము
రిప్లయితొలగించండిరవియస్తము నొందని యటు లక్ష్యముఁ గనుచున్
గవిగొనఁ జేయుటఁ దలపఁగ
నవధానం బనెడు విద్య యాంగ్లేయులదే
మ॥ అవలోకించుచు ధీరులై చనుచు బాహాటమ్మగా స్ఫూర్తితోఁ
జవిగా లక్యము నెంచి రాజ్యమును విస్తారమ్ము సేయన్ గనన్
రవి తానెందును గ్రుంకనట్లు తమసామ్రాజ్యమ్ములోఁ దోఁచెనే
యవధానంబను విద్య నాంధ్రులకు నాయాంగ్లేయులే నేర్పిరే
అవధానము ఏకాగ్రత
కవిగొను వ్యాపించు నిఘంటువు సహాయమండి
మ:కవి వేమన్నకు గీర్తి బెంచె కవిలోకమ్మందు నా బ్రౌను,భ
రిప్లయితొలగించండివ్యవిధిన్ వ్రాసె నిఘంటువున్ నిజములే యవ్వెల్ల యా మేలునే
యవలోకించుచు భాష నిల్పినది యా యాంగ్లేయులే యందుమే?
అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే?
(బ్రౌన్ మొదలైన ఆంగ్లేయులు తెలుగుకి సేవ చేసింది నిజమే కానీ ఉద్ధరించింది మొత్తం వాళ్లే అనటం కొందరి అతిశయోక్తి.అవధానం వాళ్లే మైనా నేర్పారా ఏమిటి?)
(3)కం:ఎవరికి బ్రిటన్ న కావలె
రిప్లయితొలగించండినవధాన? మ్మచటి కేగ నది కూ డిడునే?
అవధాన మాంధ్ర కే సరి
అవధానం బనెడు విద్య యాంగ్లేయులదే”?
(బ్రిటన్ పోయే కుర్రాణ్ని అవధానం నేర్చుకో మంటే ఇలా అంటాడు)
(4)కం:చవి గల పదముల విరుపులు
రిప్లయితొలగించండికవివర! తెలుగుననె చెల్లు, కాని పనియె నీ
కవధాన మ్మాంగ్లమ్మున
నవధానం బనెడు విద్య యాంగ్లేయులదే”?
(ఒక కవి గారికి ఇంగ్లీష్ లో అవధానం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వస్తే మరొక కవి తెలుగు పదాలలో ఐతే చక్కని విరుపులు కుదురుతాయి కానీ ఇంగ్లీష్ ముక్కలు అలా విరగవు,అవి ఇనప ముక్కల లాగా ఉంటాయి అని చెప్పాడు.)
మిగిలిన వారి పద్యసమీక్షణలను వాట్సప్ సమూహంలో చూడండి.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండికవనముఁ దెనుఁగన నడుగుము
స్తవనీయమనంగ, నాంగ్ల సంకరమున నీ
యవగుణమొప్పదు పృచ్ఛక!
యవధానం బనెడు విద్య యాంగ్లేయులదే?
మత్తేభవిక్రీడితము
కవనంబెంచుచుఁ పృచ్ఛకా! తెనుగునన్ గాంక్షించు వైపుణ్యమున్
స్తవనీయంబగు నంశమున్ మిగుల ప్రాశస్త్యంబునేపారగన్
వ్వవధానంబిడ నాంగ్ల సంకరమునన్ భాషింప భావ్యమ్మొకో?
యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే?
కందం
తొలగించండికవనముఁ దెనుఁగన నడుగుము
స్తవనీయమనంగ, నాంగ్ల సంకరమున నీ
యవగుణమొప్పదు పృచ్ఛక!
యవధానం బనెడు విద్య యాంగ్లేయులదే?
మత్తేభవిక్రీడితము
కవనంబెంచుచుఁ పృచ్ఛకా! తెనుగునన్ గాంక్షించు నైపుణ్యమున్
స్తవనీయంబగు నంశమున్ మిగుల ప్రాశస్త్యంబునేపారగన్
వ్వవధానంబిడ నాంగ్ల సంకరమునన్ భాషింప భావ్యమ్మొకో?
యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే?
వివరింపగ నాంధ్రు ల దే
రిప్లయితొలగించండియవ ధానం బ నెడి విద్య :: యాంగ్లేయు ల దే
కవనమున నూతన o బును
జవమున సృష్టి o ప నెంత్రు సామాజికమై
సువిదితమే యెల్లర కిది
రిప్లయితొలగించండియవధానం బనెడు విద్య యాంధ్ర జనులదే
భువి భేదోపాయ విలస
దవధానం బనెడు విద్య యాంగ్లేయులదే
స వినోదస్థితిఁ జేసి వర్తకము సంస్థాపించి సామ్రాజ్యమున్
సువిశాలమ్మును భేద దండ గతులం జోద్యంబుగా నూని వా
రవిరామంబుగ నాంగ్ల నామ పర భాషానంత విన్యస్త వా
గవధానం బను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే
అవధానులు తెలుగు కవులు
రిప్లయితొలగించండియవరతిఁగోరక సలుపుదు రవధానములన్
అవధులెరుంగని కలనం
బవధానం బనెడు విద్య యాంగ్లేయులదే?
అవధానుల్ గలరెందరో తెలుగునం దత్యంత ప్రజ్ఞానిధుల్
రిప్లయితొలగించండివ్యవధానం బిసుమంతయేని గొనకన్ వాగ్దేవి నర్చింతురే
స్తువముంజేయుచు నాంగ్లభాషపయి మోజున్ జూపఁగానేలొకో!
యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అవధానము తెలుగున త
ప్ప వేరు భాషలను లేదు పరికించంగా
ప్రవచించిన దెవరిట్టుల
అవధానంబనెడు విద్య యాంగ్లేయులదే?