25, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4983

26-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె”
(లేదా...)
“నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే”

24 కామెంట్‌లు:

  1. చేత కాకుండినను గూడ జెట్టు నెక్కి
    జామ గోయబోవగ గాలు జారుటగనె ,
    తలము నెరుగక మూర్ఖుడు దనను జూసి
    నవ్వెఁ బొరుగింటి దనుచు నానందమొందె

    రిప్లయితొలగించండి
  2. "ధగధగలాడు దేహరుచి, తామరపూవులఁ బోలు కన్నులున్
    నగరము నందునీమె సరి నాతినిఁ జూడము, జోడు నాకనిన్"
    నెగడుచుఁ బల్కి సుందరుడు నెయ్యపు నువ్వును రువ్వ మారుగా
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాకు + అనిన్... అనిన్ అనడం సాధురూపం కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ.
      సరిదిద్దుకొనినాను
      "ధగధగలాడు దేహరుచి, తామరపూవులఁ బోలు కన్నులున్
      నగరము నందునీమె సరి నాతినిఁ జూడ నసాధ్య" మంచుఁ దా
      న్నెగడుచుఁ బల్కి సుందరుడు నెయ్యపు నువ్వును రువ్వ మారుగా
      నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే

      తొలగించండి

  3. పెండ్లి చూపులు జరిగినన్ వేలవేలు
    ముఖమునగల మచ్చలగాంచి మూతివిరిచి
    కన్నె లెల్లరు వలదన్న కన్ను గీటి
    నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె.


    మగువలు మెచ్చరెవ్వరును మంచి యవక్రమ మున్న నేమిరా
    మొగమున మచ్చలున్నవని మూర్ఖుడ వంచు తిరస్కరింపగా
    వగచుచు తా నిరాశపడు పాళము నందున గన్ను గీటుచున్
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే.

    రిప్లయితొలగించండి
  4. సవ్వుమోముతో నలరారు నవలనుగని
    రివ్వున లిఖించి యిచ్చెను ప్రేమ లేఖ
    సవ్వడి సలుపకుండ తాఁ సైగ సేయ
    నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె

    ద్విగుణితమైన సంబరము తియ్యని మాటలు వెల్వరించగా
    సొగసులరాణి నన్నుగని సొక్కిన వైనము తెల్పమందువా
    గగనము లోని రోహితము కన్నుల ముందర నిల్చినట్లుగా
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే

    రిప్లయితొలగించండి
  5. సొగసుగ జుట్టు దువ్వితిని సోకునుఁ బెంచగఁ జూర్ణమద్దితిన్
    మిగలగ నంగి దోపితిని మేలుగ కౌనునుఁ గట్టి వేసితిన్
    మగువలకై తెగించి సరి మన్మధ వేషముఁ గట్ట నేటికిన్
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే!!

    రిప్లయితొలగించండి
  6. తాను తన భర్త కలిసియు దనివి దీర
    సరస మాడుచు నున్నట్టి సమయ మందు
    వచ్చి దృశ్యాన్ని చూచియు పక పక మని
    నవ్వె పొరిగింటి దనుచు సంతసము జెందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దృశ్యాన్ని' అనడం వ్యావహారికం. "దృశ్యమున్" అనండి.

      తొలగించండి
  7. వగలొలికించు కన్నె తన వన్నెలు చిన్నెలు జూపు నీశునిన్
    పగతుని పూలబాణముల వాడిగ నాటుచు కంటి చూపుతో
    సెగలను రేపు మానసము చిందులు వేయగ సన్నసన్నగా
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే

    రిప్లయితొలగించండి
  8. పువ్వులన్నియు విరబూసి నవ్వినటుల
    పండు వెన్నెల నింగిపై పరచినటుల
    పచ్చవిలుకాడు విసరిన బాణమటుల
    నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    విలువగల చీరఁ దెచ్చియు వెలఁది చూప
    దానిమించు విలువకు వస్త్రమ్ముదెచ్చి
    యెంకి యీసున జూపించి, యేడ్వలేక
    నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె!

    వగలను జిందుచున్ వెలది పండుగకంచును చీరఁదెచ్చి తాఁ
    బొగరుగ మూడువేలనుచు మూతిని ద్రిప్పుచుఁ జెప్పి నంతటన్
    రగిలిన పంకజాక్షి ధర నాలుగువేలది చూపి, యేడ్వకే
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే!

    రిప్లయితొలగించండి
  10. ఇది మామూలే కదా గురువు గారు! సమ స్యేముంది?

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:"పతిని పొరుగింటి వగలాడి వలచి నవ్వు"
    ననుచు కుందెడు నిల్లాలు తనకు దెలిసి
    "భర్త కళ లేని యొక వెర్రి వా డటంచు
    నవ్వెఁ బొరుగింటి" దనుచు సంతసముఁ జెందె”
    (తన మగణ్ని చూసి పక్కింటావిడ ప్రేమతో నవ్వుతోందని బాధ పడింది కానీ ఆమె ప్రేమతో కాక మగణ్ని వెర్రివాడని నవ్వుతోంది అని స్థిమిత పడింది.)


    రిప్లయితొలగించండి
  12. చం:మగనికి యేండ్లు వచ్చి నను మానడు లే పొరుగింటి రంథి!యా
    మగువకు నా మగం డొక యమాయకుడం చనిపించి నవ్వగా
    "నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని" యంచు ముదంబుఁ జెందె, లే
    నగవులు రువ్వ సాగె వదినా !వినుమా యిక యన్న చేష్టలన్!
    ("మా ఆయన ఒక అమాయకుడి లాగా కనిపించి పక్కింటిది నవ్వుతుంటే తనని చూసి నవ్విందని ఈయన మళ్లీ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు" అని ఈమె మరొక పక్కింటావిడకి చెపుతోంది.వదినా! అని వరస పెట్టి చెప్పింది.మీ అన్నయ్య బుద్ధి ఇలాంటిది అని.)

    రిప్లయితొలగించండి
  13. తన్ను గాదన్న విషయమ్ము నెన్నకుండ
    మానసమ్మున నుప్పొంగి మానధనుఁడు
    వాని వెఱ్ఱిని వీక్షించి వాలుఁగంటి
    నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె


    మగువల పోక నేరకయె మానవుఁ డక్కట మోసపోయెఁగా
    మొగమును నింత సేసికొని పున్నమి చందురు మించునట్లుగా
    సొగసరి హాస కారణము చోద్య మెఱుంగక ప్రేమఁ జాటఁగా
    నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నల్లగా నుండెననుచు కన్యలు పదుగురు
    నచ్చలేదని చెప్పగ నొచ్చుకొనెను
    పడతి యొక్కతె యొకరోజు పలుకరించి
    నవ్వెఁ, బొరుగింటి దనుచు సంతసము జెందె.

    రిప్లయితొలగించండి