23-12-2024 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”(లేదా...)“కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్”
తేటగీతిఇంద్ర పీఠాన సగమంది యింపుమీరఁద్ర్యక్షు సమయుజ్జి క్రీడియై ధన్యతఁగనియుగ్ర సమరాన నోటమి నుక్కఁడగుగఁగర్ణుఁడు, ద్రిలోకవిజయుఁడై కాంచె యశము!ఉత్పలమాలఅర్ణవమంత శౌర్యమున నందియునింద్రుని యర్ధపీఠమున్శీర్ణకళాధరున్ కదనసీమనునుజ్జిగనిల్చి క్రీడి, సంపూర్ణ కృపాకటాక్షములఁ బ్రోవఁగ కృష్ణుడు నొందనోటమిన్గర్ణుఁడు, మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వినయముగ దాపునకు వచ్చి వితరణముగనిమ్మనగనె యెందులకని యెంచకుండనురవుగనె వేరుదలచక నొసగుటందుకర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము
సూర్యు పుత్రుడు లోకము చుట్టగలఁడుధర్మరాజుకుభ్రాతగా ధరణి యందుఇంద్రుమెప్పించెదాతయైనేర్పుతోడకర్ణుడుత్రిలోకవిజయుడై కాంచెయశము
గొప్ప దాత గాగ కవచ కుండల ముల మారు పలుకక నొసగియు మాన్యు డ య్యె దైవ గణములు మెచ్చ గా దాన మందు కర్ణుడు ద్రి లోక విజయు డై కాంచె యశము
అంగరాజుపై యభిమాన మధికమవగరాత్రి శయనించు వేళ రారాజు గాంచెస్వప్నమొక్కటి యందున సంగతకుడుకర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము.స్వర్ణపలంగుపై చెలులు జల్లెడ చేకొని యూపుచుండగా జర్ణుని కామవల్లభపు చల్లనికాంతిని స్నానమాడుచున్ పూర్ణిమ నాటి నక్తమున మూర్ఖ సుయోధను స్వప్నమందునన్ కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్.
యుద్ధానికి ముందు కర్ణునితో శ్రీకృష్ణుడు:వర్ణచతుర్ధజాతుడను పల్కులసత్యము, గొంతిపట్టి! దుఃఖార్ణవ మీదుటల్ సరి, సుభాంబుధి తేలుమ చేరిధర్మజున్,బూర్ణజయంబు నందు మని, భూజను లెల్లరు పాడ నిత్తరిన్: “కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్”
సుఖాంబుధి*
సహజ కవచ కుండలములఁ స్వర్గపతికినర్పణమిడి కీర్తి గడించె నంగరాజు కర్ణుఁడు; ద్రిలోకవిజయుఁడై కాంచె యశముబల్లిదుండగు బలి చక్రవర్తి భువినివర్ణవివక్ష చేతఁ దలవంపుల పాలయె సూత పుత్రుడేనిర్ణయముల్ విపత్తులను నిశ్చయపర్చగ క్రుంగిపోయెనా కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము; జయమ్ము నందుటన్వర్ణువు హర్షయిత్నువట భండన మందున గాంచకుండినన్
వర్ణణఁ జేయ గల్గుదురె పార్థ పరాక్రమ విక్రమంబునున్చూర్ణముఁ జేయ కౌరవుల సొంపును పోరున గెల్చె పాండవుల్పూర్ణముగాగ కౌరవ చమూపతులన్ మరి సంఖ్యఁ జూడగన్కర్ణుఁడు మూడు,లోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్!!
తే॥ ఎంచ నతని దాన గుణము నెవరు సాటియెంచ నతని మిత్ర నియతి నెవరు సాటియిట్టి సుగుణముల నతఁడె యెదురుఁ గనకఁగర్ణుడు ద్రిలోక విజయుఁడై కాంచె యశముఉ॥ పూర్ణ మనమ్ము మిత్రతను పూర్ణ మనమ్మున దానతత్వమున్వర్ణము శాప సంచయపు బాధల నెంచని శౌర్యసంపదల్గర్ణుని సొంతమై పరఁగ గాదిలిఁ బొందుచు నిట్టి వాటిలోఁగర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
తే.గీ:చావు కైనను వెరువక సహజకవచకుండలమ్ముల నింద్రునకున్ ద్యజించి దాన గుణమున శ్రేష్ఠుండు తానె యౌచు కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”
ఉ:వర్ణము గూర్చి యెల్లరును వ్యాఖ్య లొనర్చగ సైచి, వంటి పైస్వర్ణపు కుండలమ్ములను శత్రువు కిచ్చియు దానశీలతన్కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము, జయమ్ము నందుటన్వర్ణనకే యసాధ్యమగు వంచనలన్ విఫలత్వ మొందియున్(యుద్ధం లో జయించటం లో వంచనల వల్ల విఫల మైనా దానశీలతలో యశం పొందాడు.)
దానగుణమును శౌర్యములోన మిన్నకర్ణుడు; ద్రిలోక విజయుడైకాంచె యశముపార్థుడట భారతమ్మున ప్రభను నింపిఎన్న నిరువురన్గనుగొన నిరవు గలదు!
దేవ లోకాధి నాథుఁడు దేహి యనఁగ నొసఁగెఁ గవచ కుండలముల నొలుక నెత్రు దాన గుణ మందు విజయమ్ము దనర దాన కర్ణుఁడు త్రిలోక విజయుఁడై కాంచె యశము పూర్ణ సుధాక రాననుఁడు భూరి పరాక్రముఁ డాజి సత్కళోత్తీర్ణుఁడు దుర్నిరీక్ష నిజ తేజుఁడు పార్థుఁడు కాల మేఘ వద్వర్ణుఁడు గాండివాఖ్య గుణి ధారి నరుండు తృణీకృతాంగ రాట్కర్ణుఁడు మూడు లోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.స్వర్ణ కవచ కుండలములు ప్రాణ సమములైన దానమిచ్చెను వజ్రి యడుగగానుధర్మదాతగా పేరొంది ధరణియందుకర్ణుడుఁ ద్రిలోక విజయుడై కాంచె యశము.
సూత పుత్రుడిగ పెరిగి శూరు డైన*“కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”*దానము లపారముగ చేసి ధరణి యందువజ్రికే కుండలములిడి వాసిగాంచె.
తేటగీతి
రిప్లయితొలగించండిఇంద్ర పీఠాన సగమంది యింపుమీరఁ
ద్ర్యక్షు సమయుజ్జి క్రీడియై ధన్యతఁగని
యుగ్ర సమరాన నోటమి నుక్కఁడగుగఁ
గర్ణుఁడు, ద్రిలోకవిజయుఁడై కాంచె యశము!
ఉత్పలమాల
అర్ణవమంత శౌర్యమున నందియునింద్రుని యర్ధపీఠమున్
శీర్ణకళాధరున్ కదనసీమనునుజ్జిగనిల్చి క్రీడి, సం
పూర్ణ కృపాకటాక్షములఁ బ్రోవఁగ కృష్ణుడు నొందనోటమిన్
గర్ణుఁడు, మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివినయముగ దాపునకు వచ్చి వితరణముగ
రిప్లయితొలగించండినిమ్మనగనె యెందులకని యెంచకుండ
నురవుగనె వేరుదలచక నొసగుటందు
కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము
సూర్యు పుత్రుడు లోకము చుట్టగలఁడు
రిప్లయితొలగించండిధర్మరాజుకుభ్రాతగా ధరణి యందు
ఇంద్రుమెప్పించెదాతయైనేర్పుతోడ
కర్ణుడుత్రిలోకవిజయుడై కాంచెయశము
గొప్ప దాత గాగ కవచ కుండల ముల
రిప్లయితొలగించండిమారు పలుకక నొసగియు మాన్యు డ య్యె
దైవ గణములు మెచ్చ గా దాన మందు
కర్ణుడు ద్రి లోక విజయు డై కాంచె యశము
రిప్లయితొలగించండిఅంగరాజుపై యభిమాన మధికమవగ
రాత్రి శయనించు వేళ రారాజు గాంచె
స్వప్నమొక్కటి యందున సంగతకుడు
కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము.
స్వర్ణపలంగుపై చెలులు జల్లెడ చేకొని యూపుచుండగా
జర్ణుని కామవల్లభపు చల్లనికాంతిని స్నానమాడుచున్
పూర్ణిమ నాటి నక్తమున మూర్ఖ సుయోధను స్వప్నమందునన్
కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్.
రిప్లయితొలగించండియుద్ధానికి ముందు కర్ణునితో శ్రీకృష్ణుడు:
వర్ణచతుర్ధజాతుడను పల్కులసత్యము, గొంతిపట్టి! దుః
ఖార్ణవ మీదుటల్ సరి, సుభాంబుధి తేలుమ చేరిధర్మజున్,
బూర్ణజయంబు నందు మని, భూజను లెల్లరు పాడ నిత్తరిన్:
“కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్”
సుఖాంబుధి*
తొలగించండిసహజ కవచ కుండలములఁ స్వర్గపతికి
రిప్లయితొలగించండినర్పణమిడి కీర్తి గడించె నంగరాజు
కర్ణుఁడు; ద్రిలోకవిజయుఁడై కాంచె యశము
బల్లిదుండగు బలి చక్రవర్తి భువిని
వర్ణవివక్ష చేతఁ దలవంపుల పాలయె సూత పుత్రుడే
నిర్ణయముల్ విపత్తులను నిశ్చయపర్చగ క్రుంగిపోయెనా
కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము; జయమ్ము నందుటన్
వర్ణువు హర్షయిత్నువట భండన మందున గాంచకుండినన్
వర్ణణఁ జేయ గల్గుదురె పార్థ పరాక్రమ విక్రమంబునున్
రిప్లయితొలగించండిచూర్ణముఁ జేయ కౌరవుల సొంపును పోరున గెల్చె పాండవుల్
పూర్ణముగాగ కౌరవ చమూపతులన్ మరి సంఖ్యఁ జూడగన్
కర్ణుఁడు మూడు,లోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్!!
తే॥ ఎంచ నతని దాన గుణము నెవరు సాటి
రిప్లయితొలగించండియెంచ నతని మిత్ర నియతి నెవరు సాటి
యిట్టి సుగుణముల నతఁడె యెదురుఁ గనకఁ
గర్ణుడు ద్రిలోక విజయుఁడై కాంచె యశము
ఉ॥ పూర్ణ మనమ్ము మిత్రతను పూర్ణ మనమ్మున దానతత్వమున్
వర్ణము శాప సంచయపు బాధల నెంచని శౌర్యసంపదల్
గర్ణుని సొంతమై పరఁగ గాదిలిఁ బొందుచు నిట్టి వాటిలోఁ
గర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
తే.గీ:చావు కైనను వెరువక సహజకవచ
రిప్లయితొలగించండికుండలమ్ముల నింద్రునకున్ ద్యజించి
దాన గుణమున శ్రేష్ఠుండు తానె యౌచు
కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”
ఉ:వర్ణము గూర్చి యెల్లరును వ్యాఖ్య లొనర్చగ సైచి, వంటి పై
రిప్లయితొలగించండిస్వర్ణపు కుండలమ్ములను శత్రువు కిచ్చియు దానశీలతన్
కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము, జయమ్ము నందుటన్
వర్ణనకే యసాధ్యమగు వంచనలన్ విఫలత్వ మొందియున్
(యుద్ధం లో జయించటం లో వంచనల వల్ల విఫల మైనా దానశీలతలో యశం పొందాడు.)
దానగుణమును శౌర్యములోన మిన్న
రిప్లయితొలగించండికర్ణుడు; ద్రిలోక విజయుడైకాంచె యశము
పార్థుడట భారతమ్మున ప్రభను నింపి
ఎన్న నిరువురన్గనుగొన నిరవు గలదు!
దేవ లోకాధి నాథుఁడు దేహి యనఁగ
రిప్లయితొలగించండినొసఁగెఁ గవచ కుండలముల నొలుక నెత్రు
దాన గుణ మందు విజయమ్ము దనర దాన
కర్ణుఁడు త్రిలోక విజయుఁడై కాంచె యశము
పూర్ణ సుధాక రాననుఁడు భూరి పరాక్రముఁ డాజి సత్కళో
త్తీర్ణుఁడు దుర్నిరీక్ష నిజ తేజుఁడు పార్థుఁడు కాల మేఘ వ
ద్వర్ణుఁడు గాండివాఖ్య గుణి ధారి నరుండు తృణీకృతాంగ రా
ట్కర్ణుఁడు మూడు లోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
స్వర్ణ కవచ కుండలములు ప్రాణ సమము
లైన దానమిచ్చెను వజ్రి యడుగగాను
ధర్మదాతగా పేరొంది ధరణియందు
కర్ణుడుఁ ద్రిలోక విజయుడై కాంచె యశము.
సూత పుత్రుడిగ పెరిగి శూరు డైన
రిప్లయితొలగించండి*“కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”*
దానము లపారముగ చేసి ధరణి యందు
వజ్రికే కుండలములిడి వాసిగాంచె.