20, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4978

21-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్”
(లేదా...)
“పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా”
(అన్యదేశ్యాలు ప్రయోగింపవచ్చు)

28 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మాన్షనులో నివసించినఁ
      టెన్షను పడు మానవులకు టెంకణమిడెదన్
      టెన్షను భరింప నలవడి
      పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్

      మాన్షను లో వసించినను మారదు మానవ నైజమెన్నడున్
      టెన్షను లోన దుష్టులను ఢీ కొను ధైర్యముఁ జూపియుంటినే
      కాన్షసుతో నకార్యములకడ్డుగ నిల్చితి నేల నాకు స
      స్పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా

      తొలగించండి
  2. టెన్షనుకలుగును బ్రదుకుస
    సస్పెన్షన్ లోనుండుజూడ సేమములేకన్
    సన్షేరడుగునుగాదే
    పెన్షన్వచ్చిననొకండువేదనజెందెన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఛాన్సున కోట్లు గడించిన
    సిన్సియరుగ బ్రతుక లేక జీవితమందున్
    సెన్సువిడి పొరుగువాడికిఁ
    బెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్!

    ఉత్పలమాల
    సిన్సును లెక్క చేయక రచించిన వ్యూహము గోట్లు గూర్చఁ గ
    న్విన్సయి తృప్తిగన్ బ్రతుకనేరక నీమము దప్పనెంచుచున్
    సెన్సును వీడుచున్ బొరుగు చేసినయత్నము సక్సెసందునన్
    బెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా?

    రిప్లయితొలగించండి

  4. మెన్షన్ జేసిన లిష్టది
    టెన్షను పెంచె వ్యయమది జటిలమవగనె హై
    టెన్షను తెచ్చెను బీపీ
    పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్.


    పెన్షను చేతికందగనె పిల్లలు వాలెదరైరి గొప్ప క
    న్వెన్షను హాలులో జరుపు వేడుకకై ధనమింక హెచ్చుగా
    మెన్షను జేసి హద్దులను మీరుచు పుత్రులు పోర యెందుకీ
    పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా.

    రిప్లయితొలగించండి
  5. టెన్షను టెన్షనైనది యటెన్షను యేమరుపాటునొందె క
    న్వెన్షనునందు పాల్గొనగ వెళ్ళవలెన్ మదరాసు తప్పకన్
    పెన్షను డబ్బులేమొ నెల వెచ్చములన్గొన జాలునక్కటా
    పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా

    రిప్లయితొలగించండి
  6. మాన్ష ను లేనట్టి యొకడు
    పెన్షను పై యప్పు చేసి పెరిగిన వడ్డీ
    టెన్షను తో తీర్చు కొఱకు
    పెన్షను వచ్చిన నొకండు వేదన జెందెన్

    రిప్లయితొలగించండి
  7. కం॥ టెన్షను భాధ్యత లుండఁగ
    పెన్షను వయసుఁ బడయుటయు విశదము గాదా
    మెన్షను చేయఁగ వలెనో
    పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్

    ఉ॥ మెన్షను చేయ బాధ్యతలు మేదిని తీరఁగ మోదమే గదా
    పెన్షను తోడ జీవనము వృద్ధుఁడుగా తరుగంగ జీతమే
    టెన్షను చిన్నపిల్లలను ఠీవిగఁ బెంచఁగ నట్టి వేళలో
    పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా

    మాతండ్రి గారు పదవీ విరమణ చేసినపుడు నాకు 11సం॥ నాకంటే చిన్నవారిద్దరు. స్వానుభవమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ (అక్షర సత్యము)

      ఉ॥ పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా
      మెన్షను చేయగా నిటుల మెచ్చను కాంచఁగ లోకమందునన్
      బెన్షను లేక బాధపడు పెద్దల కష్టముఁ సత్య దూరమే!
      పెన్షను చక్కనైనపుడు వృద్ధుల జీవిత మొప్పగా కనన్

      పెన్షన్ ప్రభుత్వోద్యోగులకే కదండి. Private ఉద్యోగులకు PSU వారికి EPS95 వర్తించే వారికి నామ మాత్రమే! నవంబరు 4 2022 SC తీర్పు అసలైన వృద్ధులకు మోసమే! పెద్ద ఉద్యోగాలు చేసిన వారి పరిస్థితి సరే! చిన్న ఉద్యోగస్థులకు కష్టము తొలగలేదండి.

      తొలగించండి
  8. టెన్షను లేకసంఘమున ఠీవిగ వర్తిలు లంచగొండి తా
    మాన్షనులన్,సువర్ణమును, మాన్యములన్ బలు కూడబెట్టుటన్
    మెన్షను చేయపత్రికలు, మేదినిఁ బొక్కిన సాకుచేత స
    స్పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా

    రిప్లయితొలగించండి
  9. మెన్షను చేయ లేని వ్యధ! మేలుగ నుండెను జూడ పాతదౌ
    పెన్షను స్కీము! కష్టములు బెట్టగ తెచ్చిరి నూత్నమైన ని
    న్వెన్షను! బ్రహ్మ వ్రాతలవి వీలగునే చెరపంగ! క్రొత్తదౌ
    పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా!!

    నూత్నమైనన్ + ఇన్వెన్షన్ (invention) = నూత్నమైననిన్వెన్షను

    రిప్లయితొలగించండి
  10. మన్షికి భయము ముదిమియన
    మెన్షీలకు లేదు వేరు మేధావులకున్
    టెన్షను బెట్ట విరామము
    పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్!!

    Men + She + లకు= మెన్షీలకు

    రిప్లయితొలగించండి
  11. పెన్షను బొందుట దెలియగ
    మెన్షను చేసెద రు విడుట మేలుగ దలచన్
    టెన్షను నెక్కొనినందున
    పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్

    రిప్లయితొలగించండి
  12. పెన్షను కాగా నరకొర
    పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్
    టెన్షను హెచ్చె మనఁమున యె
    టెన్షను వొందగ పరాకు డీలాపడియెన్

    రిప్లయితొలగించండి
  13. కం:పెన్షన్ కోరకు నాన్నా
    టెన్షన్ లే దింక ప్రావిడెంట్ ఫండే కో
    రన్ షేర్సున నుంచెద మన
    పెన్షన్ వచ్చిన నొకండు వేదన జెందెన్.
    (బ్యాంకుల్లో ఒకప్పుడు పెన్షన్ కానీ పి యఫ్ కానీ కోరే ఆప్షన్ ఇచ్చారు.ఒక్క సారే పెద్ద మొత్తం వస్తే వ్యాపారం చెయ్య వచ్చనేది కొందరి ఆలోచన ఐతే ఒక్క సారే వస్తే సొమ్ము నాశన మౌతుందని, నెల వారీ పెన్షన్ క్షేమ మని కొందరి ఆలోచన.కొడుకు పి యఫ్ కోరుకో మంటే తండ్రి పెన్షన్ కోరుకున్నాడు.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:పెన్షను గోల లెంచ కొక పెండిలి యైన పతిన్ వరించ గా
    పెన్షను బొందగా మొదటి పెండ్లము పేరునె బెట్టి భర్త యే
    టెన్షను బెట్టి పోయె వికటించగ పెండ్లియె పెద్ద భార్యకే
    పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా
    (పెన్షన్ రూల్స్ తెలియని ఒకామె పెళ్లి ఐన వాడికి రెండవ భార్యగా వెళ్లింది.పెన్షన్ మొదటి భార్యకే అంటే వేదన కలగటం న్యాయమే కదా!)

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. మున్ష మెదలఁ దల్పరు వే
      పున్షము కాలము జనులను మూరి కరుణఁ గా
      వన్షము కాలమ్మున నిడఁ
      బెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్

      [మును + షము = మున్షము; షము = ముగింపు]


      పెన్షము దన్క నింపొదవ వృద్ధులు వీడఁగఁ గొల్వు వారిఁ బ్రా
      పన్షము కాల మంతయును బాలకు లిచ్చెడు విత్త రాశి ని
      ల్పన్షము నందు దార నిలఁ బన్నుగ నెల్లరు నంద్రు దానినే
      పెన్షను వచ్చె నంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా

      [పెను+షము = పెన్షము; షము = అంతము]

      తొలగించండి
  16. టెన్షన్ హెచ్చెను మగనికి
    పెన్షన్తో బ్రతుకుటెట్లు విశ్వేశ్వరుడా
    పెన్షన్ చేయగ లేనని
    *“పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్”*

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పెన్షనున పన్ను కోసిరి
    టెన్షను పడితి నెల గడచుటెట్టులొ యనుచున్
    పెన్షను తక్కువ రాగా
    పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్

    రిప్లయితొలగించండి