కం:మా స్త్రీ రత్నము బట్టి వి వస్త్రన్ జేతురె? రణమున పాండవ ధృతి చే వస్త్రములటు చిరుగగ మీ శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్” (మా ఇల్లాలిని వివస్త్రని చేస్తారా?మీ శరీరాలే వస్త్రాల లాగా చిరిగి పోయాయి.అని భీము డన్నట్టు.)
శా:మీ స్త్రీరత్నము నైన నన్ను సభలో మీ ముందుకున్ దెచ్చి ని ర్వస్త్రన్ జేయగ జూచు పాపులను మీరల్ సైతురే మీ గదా శస్త్రమ్మున్ మరి గాండివమ్ము వృథలే? సాగింపరే ఆజి!యా శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్”
కందం
రిప్లయితొలగించండివస్త్రాపహరణకుఁ బెనఁగి
నిస్త్రాణగ కౌరవాళి నిధనముమదిలో
నా స్త్రీ రణమున కోరన్
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్
శార్దూలవిక్రీడితము
తొలగించండినిస్త్రాణంబున కౌరవాళి సభలో నిర్వేదనన్ గ్రుంగుచున్
వస్త్రాలూడ్చిన కౌరవాధములకై వాంఛించి గిట్టింపహో!
యా స్త్రీమూర్తి రణంబునన్ నిలచి దుష్టాత్ముల్ మరించంగనే
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్!
అస్త్రంబులిచే మలచిన
రిప్లయితొలగించండినా స్త్రీ శిల్పంబుల గన నద్భుత మనుచున్
శాస్త్రియె వచించె నిట్టుల
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్.
నిస్త్రాణుండతగాడు పామరుడిలన్ నేర్వంగ లేదయ్యె నే
శాస్త్రమ్ముల్ కడు పేదయై చెలగు పంచాణుండు తా దీక్షతో
నా స్త్రీ శిల్పములెన్నొ చెక్కెనులియే యస్త్రంబుగా గాంచ నా
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్.
వస్త్రాన్నంబులధ్యాసలేక చదువన్ వైద్యంబునాసక్తితోన్
రిప్లయితొలగించండిశాస్త్రీయంబుగ విన్నదానికిఁ దగన్ సాక్ష్యంబులన్ జూచుచున్
నిస్త్రింశంబునఁ గోసి జంతుచయమున్ నేర్వంగసూక్షమ్ములన్
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ స్త్ర ము తగిలిన తనువది
రిప్లయితొలగించండిని స్త్రా ణ o బై నశించు నిక్కం బగు చున్
శ స్త్ర ము బాధ లిడనెటు ల
శ స్త్రా చ్చి న్నాo గ రాశి సంబర ము నిడున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ న్త్రీ వస్త్రము లాగగ
రిప్లయితొలగించండివిస్తృతముగ పాండుసుతులు వేదన నొందన్
అస్త్రముల బూన , కౌరవ
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశాస్త్రీయ విద్యలు నెరిగి
రిప్లయితొలగించండిశస్త్ర్రాస్త్రములన్ విడిచిన సంగ్రామములో
వస్త్రాలే పేలికలై
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్
శాస్త్రీయంబగు విద్యనేర్చె నతడే సంగ్రామ సం రంభియై
శస్త్రాస్త్రంబుల తోడ సాగె నటకున్ సంస్పోటమేసల్పగా
వస్త్రాలైనవి పేలికల్ కుదురుగా ప్రత్యర్థులన్ జూడగా
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండివిద్యలనెరిగి ...
రిప్లయితొలగించండిఅస్త్రము స్థపతికిఁ నులి యా
రిప్లయితొలగించండియస్త్రముతో ఱాయి దొలిచి హరువుగ జెక్కెన్
దా స్త్రీ శిల్పము, కనుఁగొన
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅస్త్రంబుల్గొని యాలమందు రిపులన్ హల్లోలముం బొందగన్
రిప్లయితొలగించండినిస్త్రాణంబు నొనర్చి భీకరముగా నిర్జించునా యోధునిన్
శస్త్రాస్త్రంబుల సల్పు సంగరమునన్ శస్తంబుగా నయ్యెడన్
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం॥ దస్త్రము వ్రాసి చరించఁగ
రిప్లయితొలగించండినిస్త్రాణముఁ జేయ దేశ నెమ్మది ప్రగతిన్
వస్త్రములనూడ్చి త్రుంచఁగ
శస్త్రఛిన్నాంగ రాశి సంబరము నిడెన్
శా॥ దస్త్రమ్ముల్ రచియించి దుష్టులు భయోత్పాదమ్ముతో దేశమున్
నిస్త్రాణమ్మును జేయ వర్తిలనటుల్ నిత్యమ్ము హేయమ్ముగా
నస్త్రమ్ముల్ గొని సైన్య సంచయము సంహారమ్ముఁ గావించఁగన్
శస్త్రఛిన్న శరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్
నేటి స్థితిగతుల ననుసరించి వ్రాయలని నాప్రయత్నమండి
తొలగించండినిస్త్రాణాకృతి భర్తృపంచకము చింతింపన్ సభన్ గ్రూరులై
రిప్లయితొలగించండివస్త్రాభిగ్రహదుష్కృతిన్ సలిపిరా పాపాత్ము లీయుద్ధమం
దా స్త్రీమూర్తి పరాభవాగ్ని శలభాలై చచ్చి యున్నారు త
చ్ఛస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్.
🙏🙏
తొలగించండికం:మా స్త్రీ రత్నము బట్టి వి
రిప్లయితొలగించండివస్త్రన్ జేతురె? రణమున పాండవ ధృతి చే
వస్త్రములటు చిరుగగ మీ
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్”
(మా ఇల్లాలిని వివస్త్రని చేస్తారా?మీ శరీరాలే వస్త్రాల లాగా చిరిగి పోయాయి.అని భీము డన్నట్టు.)
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిశా:మీ స్త్రీరత్నము నైన నన్ను సభలో మీ ముందుకున్ దెచ్చి ని
రిప్లయితొలగించండిర్వస్త్రన్ జేయగ జూచు పాపులను మీరల్ సైతురే మీ గదా
శస్త్రమ్మున్ మరి గాండివమ్ము వృథలే? సాగింపరే ఆజి!యా
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్”
అస్త్ర విహీనాంభోనిధి
రిప్లయితొలగించండివస్త్ర మొసఁగు శాంతి సౌఖ్య పరితోషమ్ముల్
శాస్త్రం బొల్ల దిటు లనన్
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్
సస్త్రీ పుం శిశు భద్ర మెంచి నిజ దేశం బందుఁ గావింపఁగా
శస్త్రవ్రాత సమేత సంగరము వే సాధింప గెల్పింపుగా
నిస్త్రాణార్దిత వైరి మర్గ మవనిన్ నిశ్చేష్టతన్ నిల్వఁగా
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్
అస్త్రము లేమియు లేవట
రిప్లయితొలగించండిశస్త్రంబగు జ్ఞానసుమము సభలను విరియన్
అస్త్రంబై వేదిక వా
క్ఛస్త్ర ఛిన్నాంగరాశి సంబరమునిడెన్!