13, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4971

14-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ”
(లేదా...)
“నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్”

26 కామెంట్‌లు:

  1. కురుక్షేత్ర సంగ్రామంలో తనపైకి రథచక్రముతో వచ్చెడు శ్రీకృష్ణ పరమాత్మతో భీష్ముడు:


    కందం
    దేవుండని నిను నమ్మితి
    సేవకునిగ బాధ్యతగని చేసెద రణమున్
    గోవిందా! ప్రాణమనన్
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ!

    ఉత్పలమాల
    దేవుడవంచు గోపకుల తేజము నీవని నమ్మినానయా!
    సేవక వృత్తినిన్ రణము సేసెడువాడను నందనందనా!
    చావది నీదు చేతఁ గన చక్కని భాగ్యము దక్కె! ప్రాణమే
    నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్!

    రిప్లయితొలగించండి
  2. దేవకినందనా! నినుమదీయ పరేశుడవంచు నామదిన్
    కోవెలఁగట్టినాడ నినుఁగొల్వగ నిత్యము భక్తితోడ నా
    జీవనదాతవీవెగద సిద్ధినొసంగవె నాదు జన్మకున్
    నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్

    రిప్లయితొలగించండి
  3. దేవకినందన నామదిఁ
    కోవెలఁ గట్టితిని నిన్నుఁ గొల్వగ దేవా!
    జీవన్ముక్తి నొసంగుము
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ

    రిప్లయితొలగించండి

  4. *(ఒక రైతు పంటనూర్పుళ్ళానంతరం విశేషఃంగా పండిన పంట రాశిని చూసి తన్మయుడై ఆ ధాన్యపురాశిని తన ఇష్టదైవానికి నివేదన చేస్తూ పలికిన మాటలుగా.....)*


    దేవా! నీదయ లేనిదె
    జీవన మెట్లందు, మేము సేసెడి సేద్య
    మ్మేవిధిని సాగు నీ సిరి
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ.


    నీవెకదా సకాలమున నీరధరమ్ములనంపి ప్రీతితో
    జీవనమందజేసితివి, సేద్యము సత్ఫలమై ఫలించెనే
    దైవమ కాంచినంతనిట ధాన్యపు రాశుల భాగ్యమంతయున్
    నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్.

    రిప్లయితొలగించండి
  5. ఏకలవ్యుని గురుదక్షిణ:-

    నా విలువిద్య నేర్పునకు నా గురుదేవులు ద్రోణ! నీవెగా
    నీ వచనమ్ము నాకు కడు నీమము మీరునె యేకలవ్యుడే
    చావుకు నైన సిద్ధము విచారము నొందక వ్రేలునిచ్చెదన్
    నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్!!

    రిప్లయితొలగించండి
  6. కోవిదుడనైతి నంటివి
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ
    చేవగ వ్రాసిన కవితలు ,
    నీవు కరపినట్లు రచన నెరపెద నికపై

    రిప్లయితొలగించండి
  7. దేవి కృపారసమేనని
    యావిర్భవమైన కృతుల నాయమ కిడెదన్
    పావకి! నాకు కరుణతో
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ

    ఈవిధి నేలిఖింపదగు నేకృతినైనను నీదునెమ్మితో
    నావశమయ్యె నక్షరము నామదినెన్నడు నిల్చియుండుమా
    పావకి! యిత్తు నంకితము వ్రాసిన కావ్యము నీకు భక్తితో
    నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్

    రిప్లయితొలగించండి
  8. ప్రహ్లాదుడు శ్రీహరి తో ---
    దేవా! శ్రీహరి వే డె ద
    కావగ రావయ్య నన్ను కరుణా సింధూ
    జీవము నీదే కదరా
    నీవిచ్చి న బిక్ష యి ద్ధి నీకే విo దౌ

    రిప్లయితొలగించండి
  9. కం॥ రావము గాత్ర మధురిమయు
    భావాతి శయమొసఁగితివి భక్తిని నుతులన్
    దేవా దాసుఁడుగ నిడుదు
    నీవిచ్చిన భిక్ష యుద్ది నీకే విందౌ

    ఉ॥ రావము గాత్రశుద్ధియును రమ్యమటంచును మెచ్చి రెల్లరున్
    భావము భక్తియున్ నిలిపి పాడుచు దాసుఁడనై తరించెదన్
    గావుమయా దయాంబుధులు క్రమ్మఁగ ధామము నీదు సేరఁగన్
    నీవిడినట్టి బిక్షయిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్

    రామదాసు గారు పురందర దాసరు కనక దాసరు ఇత్యాది భక్త శ్రేష్ఠులు భగవత్కీర్తనలు పాడి తరించారండి.

    రిప్లయితొలగించండి
  10. కం:నీవే పలికించితి విది
    నీవియె యవతారకథలు,నీ భక్తుడనై
    కావించితి భాగవతము
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ”
    (పలికించెడు వాడు రామభద్రుండట అనే పోతన గారి భావం-అంకితం రాముడికి ఇచ్చాడు కదా!)

    రిప్లయితొలగించండి
  11. 2)ఉ:నీవె తమమ్ము బాపితివి,నీ కృప మద్యము నేను మానితిన్,
    నీ వొక దేవి వై బతుకు నిల్పుచు ప్రేమ నొసంగినావుగా!
    రా!వసియింప ప్రేమ నగరమ్మున, నీకు గృతజ్ఞతాంజలుల్
    నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్”
    (ప్రేమనగర్ సినిమాలో "నీకోసం వెలిసింది ప్రేమ మందిరం " అనే పాటలో "నీ విచ్చిన ఈ బతుకు నీకే నైవేద్యం" అంటాడు.)

    రిప్లయితొలగించండి
  12. ఏ విధి నూహించితివో
    నే వాడను నీదు సొమ్ము నిర్ద్వంద్వముగా
    నే వచియించుచు నుంటిన్
    నీ విచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ

    [విచ్చిన = విడఁదీసిన]


    నీవు తలంచి తేని నను నీ గురు వర్యుని గా మనమ్మునం
    దావక దక్షిణాంగుటము దక్షిణ గాఁగ నొసంగుమా వెసన్
    నా విని యేకలవ్యుఁ డనె నా దగు నంగుట మీయ కుందునే
    నీ విడి నట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఓ వాణీ! నీ దయతో
    భావుకతలు వెల్లివిరియ పద్యములందున్
    సేవగ వ్రాయుచు నుంటిని
    నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ.

    రిప్లయితొలగించండి
  14. పావనచరితా శ్రీశా
    సేవకుఫలమది లభించె శీఘ్రమె నాకున్
    బ్రోవగ నీవే వ్రాసితి
    నీవిచ్చిన భిక్షయిద్దినీకేవిందౌ

    రిప్లయితొలగించండి