11, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4969

12-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాండుసుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్”
(లేదా...)
“పాండవు లెంచినారు శిశుపాలునిఁ బొందఁగ నగ్రపూజకున్”

17 కామెంట్‌లు:

  1. కందం
    పండఁగఁ బాపము శిశుపా
    లుండొలుకఁగ నిందలెన్నొ, క్రోధిగ శ్రీకృ
    ష్ణుండలుగ 'శిరచ్ఛేదన'
    పాండుసుతుల పూజను 'శిశుపాలుఁడు పొందెన్'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      గుండెలు మండురీతి దమఘోషుడు నందెను నాల్గుచేతులన్
      మొండెము గల్గెడున్ శిశును మోమునఁ జూడ లలాటనేత్రమై
      యొండొకనాడు శౌరి కొననొప్పెడు రూపము నంద బాలుడున్
      పాండవు లెంచినారు 'శిశు' పాలునిఁ బొందఁగ నగ్రపూజకున్

      తొలగించండి
  2. కందం
    అండగ నిలిచిన కృష్ణుడు
    పాండుసుతుల పూజను, శిశుపాలుఁడు పొందెన్
    దండనగా మరణమ్మున్
    మొండిగ హరినింద సలుప మూర్ఖుని రీతిన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి

  3. దండిదగు యజ్ఞమున కృ
    ష్ణుండందు కొనినదదేమి? సుడియగ నచటన్
    దండన పొందిన దెవడన
    పాండుసుతుల పూజను, శిశుపాలుఁడు పొందెన్.


    అండగ నుండువాడు పరమాత్ముడు రుక్మిణి వల్లభుండు కృ
    ష్ణుండని యెంచిరెవ్వరు? యశోద సుతుండెవనిన్ వధించె చక్రమున్ ?
    రండని రాజసూయమున వ్రజవరుండను పిల్చి రేల నో
    పాండవు లెంచినారు, శిశుపాలునిఁ, బొందఁగ నగ్రపూజకున్.

    రిప్లయితొలగించండి
  4. పాండవులపచితికై యు
    ద్దండుడగు మురారి యొకడె తగునని యెంచన్
    బండు సలుపగ బడితెతో
    పాండుసుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్

    రిప్లయితొలగించండి
  5. మెండగు కృష్ణుడు పొందెను
    పాండుసుతుల పూజను; శిశుపాలుఁడు పొందెన్
    దండనమా నిండు సభను
    గండము డాకొని మురారి ఖండింపంగా

    దండన సేయసిద్ధపడి తాండవమాడెను భీమసేనుడే
    పాండవు లెంచినారు శిశుపాలునిఁ బొందఁగ; నగ్రపూజకున్
    బాండవ పక్షపాతి యగు పావనమూర్తిని నిర్ణయింపగా
    మండనుడా సుదర్శనుడు మన్నిగొనెన్ శిశుపాలునచ్చటన్

    రిప్లయితొలగించండి
  6. నిండుసభాంగణముననొక
    దుండగుఁడు హరినికనుగొని దూఱు కథనమున్
    కొండొక సురాపుడిట్లనె
    పాండుసుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్

    రిప్లయితొలగించండి
  7. కం:ఖండించి కృష్ణభక్తుల
    పాండుసుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్”
    నిండు సభలోన శీర్షపు
    ఖండనమను శిక్ష పాప కర్ముం డౌటన్

    రిప్లయితొలగించండి
  8. ఉ:నిండు సభన్ బ్రసంగముల నీచపు రీతుల జేయుచుండ మూ
    ర్ఖుండని,పాపకర్ముడని,కుత్సితు డంచును కృష్ణ భక్తు లౌ
    పాండవు లెంచినారు శిశుపాలునిఁ -బొందఁగ నగ్రపూజకున్”
    మెండగు వాడు కృష్ణు డని మిక్కిలి ప్రేమను నిశ్చయించుకన్.

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. కం॥ మెండుగఁ గృష్ణుడు వడసెనె
      పాండుసుతుల పూజను, శిశు పాలుఁడు పొందెన్
      దండన శతాధికమ్మగు
      భండనల సయిచి యనఘుడు భరతముపట్టన్

      ఉ॥ బండఁడు చేదిరాజు మన బంధువు ధర్మమటంచుఁ జీఱఁగన్
      బాండవు లెంచినారు శిశుపాలునిఁ, బొందఁగ నగ్రపూజకున్
      నిండగు వాఁడు నెమ్మిఁగను నిత్యము నాతఁడు త్రుంచి కష్టముల్
      మెండుగఁ బ్రోచు వాఁడతఁడు మేటియటంచును గృష్ణు నెన్నిరే!

      భండన దుశ్చేష్ట, బండడు ఆకతాయి, చీఱు పిలుచు నిఘంటువు సహాయమండి

      తొలగించండి
  10. నిండు సభాంగణమ్మున ననేకులు జూచుచునుండ కృష్ణునిన్
    బండుగ చేదిరాజు శిశుపాలుడు దూఱుచునుండ రోసికృ
    ష్ణుండు వధించుఘట్టమును శుంఠుడు మత్తున బల్కె నిట్టులన్
    పాండవు లెంచినారు శిశుపాలునిఁ బొందఁగ నగ్రపూజకున్

    రిప్లయితొలగించండి
  11. మెండుగ నిందలు సేయగ
    దండించ గ కృష్ణుడ పుడు దన చక్రము తో
    ఖండించశిరము నయ్యె డ
    పాండవుల పూజను శిశు పాలుడు బొందె న్

    రిప్లయితొలగించండి
  12. మెండుగఁ బ్రబల నిజ యశః
    కండూతి వలదని యన్నఁ గంసారి కరో
    ద్దండారి విఘాతమ్మును
    బాండు సుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్

    [వలదని యన్నఁ బాండు సుతుల పూజను గంసారి కరోద్దండారి విఘాతమ్మును శిశుపాలుఁడు పొందెన్]


    నిండు సభాంతరమ్మున వినీతిని భీష్ముఁడు సెప్పి చూచినన్
    వెండియు నొల్లకున్న నెద ద్వేషమునూని కడింది సంతతం
    బండగ నిల్చి నట్టి పరమాత్మునిఁ గృష్ణు స భక్తి, నెన్నకే,
    పాండవు లెంచినారు, శిశుపాలునిఁ బొందఁగ, నగ్రపూజకున్

    [సంతతం బండగ నిల్చి నట్టి పరమాత్మునిఁ గృష్ణు నగ్ర పూజకున్ స భక్తి పాండవు లెంచినారు; నెన్నకే శిశుపాలునిఁ బొందఁగ (అగ్రపూజ)]

    రిప్లయితొలగించండి
  13. అండగనున్న హరిపడసె
    పాండు సుతుల పూజను: శిశుపాలుడు పొందెన్
    పండిత సభలో శిక్షను
    ఖండింప బడియె శిరమ్ము కన్నని చేతన్



    అండగ కృష్ణుడుండనట ఆదర మొప్పగ చేయగా మదిన్
    *“పాండవు లెంచినారు శిశుపాలునిఁ బొందఁగ నగ్రపూజకున్”*
    బండడటంచు నాఖలుని పాపము పండగ చంపెవెన్నుడే
    దండుగ మారికార్యములు తానొన రించసరైనవేళలో

    రిప్లయితొలగించండి