3, జూన్ 2021, గురువారం

సమస్య - 3741

4-6-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్”
(లేదా...)
“సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్”

65 కామెంట్‌లు:

  1. బాకులబోలెడుమాటల
    తేఁకువమీరగమనసునుతెగినవిధముగా
    సోకినచెవులకువినకను
    సాకుల్వచియించితోలఁగుసజ్జనుడెపుడున్

    రిప్లయితొలగించండి
  2. ఏకాకిని జేసి కవిని
    మూకుమ్మడిగా తలపడి పొల్లుల వెదుకన్
    వాకాటును తొలగింపగ
    సాకుల్ వచియించి తొలగు సజ్జను డెపుడున్

    వాకాటు = తగవు

    సీతాదేవి

    రిప్లయితొలగించండి
  3. భీకరమౌ యుధ్ధమునన్
    లోకేశుని వైరి సేనలు విడుట క్షేమం

    బౌ , కడు యోచన చేసిన్

    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేసిన్' అన్న ప్రయోగం సాధువు కదు. "యోచన చేతన్" అనవచు కదా?

      తొలగించండి
  4. కందం
    ఏ కోశంబున లేదన
    యాకర్ణింపఁగ సుజనుల, నవగుణులనుచున్
    దూకుడుఁ గని వారి చెలిమి
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

    ఉత్పలమాల
    సూకరమొప్పదే బురదఁ జూచి హిమాంబువు సెంత నుండినన్!
    శ్రీకరమౌ హితోక్తుల వచించెడు నయ్యనవద్యశీలురన్
    దూకుడుతో సహింపరన దుష్టుల సంగతి వీడనెంచుచున్
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "లేదన నాకర్ణింపఁగ..." అనండి.

      తొలగించండి
    2. కందం
      ఏ కోశంబున లేదన
      నాకర్ణింపఁగ సుజనుల, నవగుణులనుచున్
      దూకుడుఁ గని వారి చెలిమి
      సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

      ఉత్పలమాల
      సూకరమొప్పదే బురదఁ జూచి హిమాంబువు సెంత నుండినన్!
      శ్రీకరమౌ హితోక్తుల వచించెడు నయ్యనవద్యశీలురన్
      దూకుడుతో సహింపరన దుష్టుల సంగతి వీడనెంచుచున్
      సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

      తొలగించండి
  5. చేకోంటిన్వ్రతమంచుతానునిజమున్ఁజెప్పంగఁజాలండులే
    సోకన్దోంగలమాటలున్చెవులకున్శూలంబులైబాధతో
    మూకల్బారినబడ్డగోవునికతానోర్మిన్గనెన్రక్షకై
    సాకుల్ఁజెప్పితప్పుకనుసజ్జనుడెల్లరుమెచ్చురీతిగన్

    రిప్లయితొలగించండి
  6. సమస్య :
    సాకుల జెప్పి తప్పుకొను
    సజ్జను డెల్లరు మెచ్చు రీతిగన్

    ( బాలమురళీకృష్ణుని లీలాహేల )

    ఆకులపాటు జెంద ; డెపు
    డమ్మ చెరంగున దాగియుండెడిన్ ;
    వాకొనరాని నిందలను
    భామలు వైచిన లెక్కసేయ ; డా
    శ్రీకరమూర్తి ; మాధవుడు ;
    చిన్మయమోహనవేణుగీతికన్
    సాకుల జెప్పి తప్పుకొను
    సజ్జను ; డెల్లరు మెచ్చు రీతిగన్ .

    రిప్లయితొలగించండి

  7. లోకుల చిత్తము గెలుచుచు
    జేకొని వదనమ్ము నందు చిరునగ వెపుడున్
    దూకక తగవుల మధ్యన
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్!

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. లోకపు పోకడంచు పెనురొంపిని దించగ స్నేహబృందమే
    చీకుల పేకలన్ దొరలి చీకటి చేష్టల జిందులాడగా
    తేకువ హేళనల్ సయిచి తెల్విని వారిని దూరముంచగన్
    సాకుల జెప్పి తప్పుకొను సజ్జనుడెల్లరు మెచ్చురీతిగన్

    చీకులు = మాంసము

    రిప్లయితొలగించండి
  10. చీకటి మనుగడ సేసెడు
    లోకులతో మైత్రి నెవడు
    లోకములోనన్
    బ్రాకటముగ జేయడు తా
    సాకులు వచియించి తొలగు
    సజ్జను డెపుడున్

    రిప్లయితొలగించండి
  11. భీకర మగు మాటలతో
    తేకువగా నింద జేసి ధీయుతుఁ నొకరిన్
    శోకము గల్గించు తరి తా
    సాకుల్ వచియించి తొలగు సజ్జను డపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. మూడవ పాదంలో శోకము గల్గించు తరిని అని సవరణ చేయడమైనది

      తొలగించండి

  12. ధూకుడొకడు తా చెప్పిన
    యా కార్యము చేసినంత యధిక ధనమ్మే
    చేకురు ననుచును చెప్పిన
    సాకుల్ వచియించి తొలగు సజ్జను డెపుడున్.


    ధూకుడు హెచ్చు రూకలును తోషము గూర్చెడు హారహూరమున్
    నీకిపుడంద జేసెద ననిష్టపు కార్యమటంచు నెంచకన్
    జీకటి కార్యమొక్కటిని చేయమటంచు వరింప నేమిరా
    సాకుల చెప్పి తప్పుకొను సజ్జను డెల్లరు మెచ్చు రీతిగన్.

    రిప్లయితొలగించండి
  13. మా కొడుకు పెళ్ళికి తమరు
    రాకు న్న కలుగు తగవులు రాదు కరోనా!
    మీకని బావ పిలువగా!
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

    నిన్నటి దినమున ఆ సజ్జనుడు నేనే....
    ఈ పద్యాన్ని చదివి మా బావ ఏమంటాడో....
    భయమేస్తోంది.....




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కరోనా సాకుతో తప్పించుకున్న కార్యక్రమాలు నాకూ ఉన్నాయి.

      తొలగించండి
  14. చీకటి యందు జీవనముచేయుద
    చు నుండెడు వారి గూడియున్
    లోకమునందు స్నేహమును
    లోకులు జేయరు, మంచిమాటతో
    సాకులు జెప్పి తప్పుకొను సజ్జ
    నుడెప్పుడు మెచ్చలోకులున్
    ప్రాకట జీవితంబుగడుపన్
    దగు మార్గములోనసాగిలన్

    రిప్లయితొలగించండి
  15. ఉ:

    నూకలు చాలు నాకనుచు నోచిన వారలు మీరటంచు తా
    లోకువ గాని ఠీవి గొని లోకుల కింపగు మాటలాడుచున్
    మీ కిక సాటిలేరనుచు మిక్కిలి మక్కువ నొల్కబోయ నై
    సాకులు జెప్పి తప్పుకొను సజ్జను డెల్లరు మెచ్చు రీతిగన్

    నూకలు చాలు ఆనట=ప్రతికూల పరిస్థితులలో ఎదుటి వారి మెప్పు కై మాట్లాడుట గా గమనించగలరు.

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. వేకువ బోలుచుండి మది
    విస్మయ మంద సహాయమిచ్చి యా
    చీకటి శోకమున్దునిమి
    స్నిగ్ధ విశుద్ధ వికాస వైభవో
    త్సేకమునన్చరించి తన
    చింతనయం దభిమాన మాన్యతన్
    సాకులఁ జెప్పి తప్పుకొను
    సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్!

    రిప్లయితొలగించండి
  17. లోకులు పలుగాకులవలె
    చీకాకులు కలుగజేయు స్థితియెదురైనన్
    వ్యాకులపడకన్ తనవగు
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

    రిప్లయితొలగించండి
  18. కె.వి.యస్. లక్ష్మి:

    పోకిళ్ళమారి సోకుగ
    సాకుల్ వచియించి తొలగు; సజ్జను డెపుడున్
    లోకము మెచ్చెడి పనులను
    ప్రాకటముగ జేసి పొందు పదుగురి మెప్పున్.

    రిప్లయితొలగించండి
  19. ఆకొనగ సాకుదమనిన
    మూకుమ్మడిగ నెదిరించు పోకడ జూపన్
    మాకేల యనుచు నేవో
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

    రిప్లయితొలగించండి
  20. ఆకలిగొన్న మా నవుని నాదుకొనంగనె వచ్చిరందరువ్
    మూకగ , చేయవద్దనిరి పోకిరి మాటల తోడనే వినన్
    నాకిక శక్తిలేదనుచు నాటక రీతిన లెక్కలేని యా
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  21. శ్రీకరమైనకార్యములశిష్టులసన్నిధిఁగోరిజేరుచున్వాకొనిదైవభక్తినటువాడలవాడలజాటిజెప్పుచున్
    మేకొనదుష్టశక్తులనుమేలనియెంచకదూ‌రముంచెడి
    న్సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  22. ఆకులపాటునుగూర్చెడు
    లోకుల వ్యవహారమందు లోపములున్నన్
    తేకువ జూపుచు నేవో
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

    రిప్లయితొలగించండి
  23. కోకలు దొంగిలించి యట కొమ్మల నెక్కి హసించు వేళలో
    చేకొని మృత్తికం దినినఁ జీకులు వెట్ఝి గృహమ్ము లందుఁ దా
    దూకొని కుండ లోని నెయి దుందుడు చేష్టలఁ ద్రావినప్పుడున్
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. దూకుడు మానసమ్మునను దుష్టుల సంగతి నుండరెప్పుడున్
    రూకలపైన కోర్కెగొని రోయరు వారలు దొడ్డిదారిలో
    పోకిరి నేతలన్ తనిపి పొందక మోదము, కీడుకల్గుచో
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  25. వేకువ నందునుండితను విందులు చేయుచు డబ్బు పోవ వా
    పోక చరించుచున్ బ్రతుకు, బొత్తిగ బాధ్యత లేనివానికిన్
    రూకలు పోకలే నిజము రోయక తప్పదు డబ్బులిచ్చినన్
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  26. సాకగ బ్రేమతో జనని చక్కగ బువ్వ గ్రహింపబోక తా
    నాకొనినట్లు గోపికల నారడి బెట్టును పాల వెన్నలం
    దేకువ దోచుచుండి నిలదీయగ కృష్ణు డవేవొ కుంటివౌ
    సాకుల జెప్పి తప్పుకొను సజ్జను, డెల్లరు మెచ్చు రీతిగన్.

    రిప్లయితొలగించండి
  27. మూకలు మూకలుగను దా
    పేకాటను నాడుచుండీ భీకరముంగాన్
    గేకలు వేయగ నేవో
    సాకుల్ వచియించి తొలగు సజ్జను డెపుడున్

    రిప్లయితొలగించండి
  28. రాకలు పోకల వలనం
    జేకుఱు నెల్లరకు హాని శీఘ్రమ యంచున్
    వీఁకను నీ చాత్ములకున్
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్


    ఆఁకలి గొన్న వాని కిల నన్నము మేలొన రించు రీతినిన్
    వ్యాకుల చిత్త మానవుని నారసి జాలిగ మూర్ఖ చిత్తు జ్ఞా
    నాకరుఁ డెల్లఁ దాఁ దలఁచి నట్టిది యింపుగ, నాలకింప కే
    సాకులఁ, జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  29. పేకల నాడు చోట నొగి పీకలఁ దాకెడు మద్యపానముం
    గైకొను చోట పందెములు గాయుచు హేళనఁ జేయు చోటులన్
    దూకుడు పెచ్చరిల్ల జనదూషితకృత్యము లందు మెచ్చకన్
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  30. పోకిరి వ్యర్థవాదముల పూర్తిగ నాశము జేసి కాలమున్
    సాకులఁ జెప్పి తప్పుకొను; సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్
    చేకొనినట్టి కార్యమును జేయు సకాలమునందు మిన్నగా
    సూకరమెట్లు నేర్చు వడి జూపగ నశ్వము రీతి నాజినిన్

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. పోకిరి వాండ్రు కొందఱట భూమియె దద్దరి లంగగానొగిన్
    గేకలు వేయుచున్ గీరుచు ఱక్కుచు నుండయత్తఱిన్
    సాకులు జెప్పి తప్పుకొనుసజ్జనుడెల్లరు మెచ్చురీతిగన్
    శోకిల డెంద మప్పుడు,నుసూరన బ్రాణము నొక్కమాటుగన్

    రిప్లయితొలగించండి
  33. కందం
    సోకులతో నూర్వశి నరుఁ
    దాకిన మది నిగ్రహించి తప్పించు కొనెన్
    లోకమున పరస్త్రీలన
    సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్

    ఉత్పలమాల
    సోకుల నూర్వశీ లలన సొంపుగఁ జిందుచు పాండునందనున్
    దాకఁగ జూచినన్ దొలఁగి దాల్చె బృహన్నల రూపునోర్మితో
    లోకమునందు మోహమున లోబడ కుండ పరాయి స్త్రీలనన్
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  34. ఆకులపాటునొందక మహామహితాత్మునివోలె నెట్టి చీ
    కాకులు మానసంబును కకావిక జేయనిరీతి మెల్గుచున్
    తేకువజూపి కార్యముల దీరులు నచ్చకయున్న నేవియో
    సాకులఁ జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  35. 2వ పూరణ
    బాల కృష్ణుని లీలలను తెలిపే ప్రయత్నము :

    ఉ:

    ఏకము జేసి గొల్లడుల నింతియ వీడక పాలు పెర్వులన్
    పీకల దాక గ్రోలుచును పిల్లిని బోలిన తీరు సాగనై
    కేకలు వేసినన్ వినక గేలగు మాటల మాయ చేయుచున్
    సాకులు జెప్పి తప్పుకొను సజ్జను డెల్లరు మెచ్చు రీతిగన్

    గేలి+అగు=గేలగు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. మూకలుగాచేరిజనులు
    కేకలువెట్టుచుసతతముగేలినిచేయన్
    వ్యాకులమొందకనిమ్ముగ
    సాకులు వచియించితొలగుసజ్జనుడెపుడున్

    రిప్లయితొలగించండి