18, జూన్ 2021, శుక్రవారం

సమస్య - 3756

19-6-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్”
(లేదా...)
“కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే”

58 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అన్యోన్యతతో మెలగుచు
    ధన్యత గూడిన గుణముల తళుకారెడినౌ
    మాన్యత గలిగిన పుణ్యపు
    కన్యం గూడంగ దొలగు ఘనపాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  2. అన్యంబీయమకాదుగ
    పున్యంబునజననమందెపూచినకోమ్మై
    సన్యాసంబునఁజనకీ
    కన్యంగూడంగఁదోలఁగుఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి

  3. అన్యాయంబన బోకుడు
    మాన్యులు వచియించిరిగద మనకానాడే
    మాన్యుల నమ్మక మదియట
    కన్యంగూడంగ దొలఁగు ఘనపాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  4. అన్యోన్యంబుగజీవనౌకనికహాయంచుసాగింపనా
    పుణ్యంబందగజంటమేటిపరమానందాతిరేకంబునన్
    సన్యస్తంబగుభేదభావములతాసాగంగసద్గ్రాహమీ
    కన్యంగూడినఁబాపముల్దోలగిమోక్షప్రాప్తియౌనందురే

    రిప్లయితొలగించండి

  5. అన్యాయంబనకూడదోయి యదియే యజ్ఞానులే యుండెడిన్
    మాన్యంబందున మూఢ నమ్మకములన్ మాన్యుండ్రు వాచించిరే
    ధన్యంబౌనట యాడదాని బ్రతుకే దైవాని కర్పింప, నా
    కన్యంగూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే.

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అన్యోన్యంబగు పోడిమిన్ సతము నాహ్లాదమ్మునే గూడుచున్
    ధన్యంబౌనగు శీలసంపదలతో తళ్కొత్తునట్లుండుచున్
    మాన్యంబైన గుణమ్ములన్ నడరి సౌమ్యంబై ప్రకాశించునౌ
    కన్యంగూడిన బాపముల్ దొలగి మోక్షప్రాప్తియౌనందురే!

    రిప్లయితొలగించండి
  7. అన్యంబుగ యోచింపక
    మాన్యంబగు వర్తనమున మహిళా మణియై
    ధన్యత గాంచిన దౌ తత్
    కన్యం గూడంగ దొలగు ఘన పాపమ్ముల్

    రిప్లయితొలగించండి
  8. ~~~~~~~~~~~~~~~~~~~
    అన్యాయంబులజోలికేగ కెపు
    డున్నత్యంత సద్భక్తితో
    మాన్యుండా పరమేశు చింతన
    ముసమ్మానంబుతో జేయుచున్
    ధన్యంబొందిన సాధ్వి సద్గుణవ
    తిన్ దాతృత్వ పుణ్యార్తియౌ
    కన్యం గూడిన పాపముల్ దొల
    గి మోక్ష ప్రాప్తి గల్గందురే
    ~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  9. సమస్య :
    కన్యం గూడిన బాపముల్ దొలగి మో
    క్షప్రాప్తి యౌ నందురే

    ( కన్యాదాత పెండ్లికొడుకు సత్యమూర్తితో )

    అన్యంబైనవి యోచనల్ విడువు మ
    య్యా ! సత్యమూర్తీ ! కడున్
    ధన్యంబైనది మాదు వంశమిక ను
    ద్వాహంబు గావించెదన్ ;
    గన్యాలగ్నము ; పెండ్లియై సుఖములన్
    గణ్యంబుగా నందు ; మా
    కన్యం గూడిన బాపముల్ దొలగి మో
    క్షప్రాప్తి యౌ నందురే !!

    ( ఉద్వాహము - వివాహము )

    రిప్లయితొలగించండి
  10. పెనుగొండలో నాడు విష్ణువర్ధనుడు వివాహమాడనెంచగా నగరేశ్వరుని కంకితమగుటకై అగ్నిగుండం దూకి ప్రాణత్యాగము
    చేయనెంచిన వాసవీకన్యకతో కలిసి నూటయిబ్బండ్రు గోత్రముల వైశ్యులు ఆమెననుసరించు సందర్భముగా....

    కందం
    అన్యుండు విష్ణువర్ధనుఁ
    డన్యాయపు మనువు నెంచ నగ్నిని దూకన్
    కన్యక వాసవి దిగు! నా
    కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్

    శార్దూలవిక్రీడితము
    కన్యన్ దా నగరేశ్వరున్ గొలుచు శ్రీ గౌరీ స్వరూపమ్ము నా
    ధీన్యంబెంచఁగ విష్ణువర్ధనుఁడు సధ్రిన్దూకు సంకల్పమై
    మాన్యుండా పరమాత్మకంకితమునౌమార్గాన శ్రీ వాసవీ
    కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే!

    రిప్లయితొలగించండి
  11. కె.వి.యస్. లక్ష్మి:

    అన్యంబెరుగక నెపుడున్
    మాన్యుల గొలుచుచు మసలెడి మానిని తోడన్
    ధన్యంబగు జన్మము నా
    కన్యంగూడంగ దొలఁగు ఘనపాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  12. అన్యమునాలోచనమగు
    కన్యం గూడంగఁ, దొలఁగు ఘనపాపమ్ముల్
    కన్యాదానము గైకొన
    ధన్యుడనేగాన నింక దయగని వినుమా!

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కం:

    సన్యాసము పోవలదని
    కన్యను నిడుకొన వరుసకు కట్నము తోడన్
    పుణ్యము పురుషార్థంబును
    కన్యను గూడంగ దొలగు ఘన పాపమ్ముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శా:

      కన్యారాశిని జన్మ నొంది బహుధా గ్రాహాను కూలమ్ముగన్
      దైన్యంబింతయు బొందకుండగను తా ధైర్యంబు వెల్వుచ్చుచున్
      మాన్యంబైన గుణమ్ములున్ వధువు సమ్మానంబులే బొందనౌ
      కన్యం గూడిన బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  15. ధన్యతనొందె హరుడచల
    కన్యం గూడంగఁ; దొలఁగు ఘనపాపమ్ముల్
    మాన్యులు వారలిరువురన
    నన్యముగా మదిని నిరతమారాధింపన్

    రిప్లయితొలగించండి
  16. కన్యల నేడుగుర పిలిచె
    మన్యపు దొరగౌరి గొల్వ మలుపగనఘముల్
    కన్య నొకతె తగ్గె, తనుజ
    కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి
  17. అన్యాయాచరణోత్సుకాసుర సమూహద్వేష్ట! శ్రీనాథ! సా
    మాన్యంబే భవదీయ లీల లెఱుఁగన్ మాకెల్ల! గంగాఖ్యతో
    ధన్యంబౌ నది నీదు కూఁతురట పాదంబందుఁ బుట్టన్; భవ
    త్కన్యం గూడిన పాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌ నందురే.

    రిప్లయితొలగించండి
  18. కన్య సుభద్ర జితాత్మన్
    మాన్యుని దరిచేరి గొలువ మానినితో నా
    సన్యాసి చిలిపిగ పలికె
    కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి
  19. అన్యము పుణ్యము నెరుగని
    కన్యల తో సరసమేల; గంగను గూడన్
    సన్యసమున తొలగు, నెటుల
    కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి
  20. ధన్యుల జేయుటకై సా
    మాన్యుల దృష్టి నజునిపయి మరలగ జేయన్
    మాన్యుడు వ్రాసిన కవితా
    కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి


  21. కన్యను బెండ్లాడి వదిలి
    సన్యాసము స్వీకరింప సరికాదంటిన్
    మాన్యుడ విను నీ భార్య సు
    కన్యంగూడంగ దొలఁగు ఘనపాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  22. ధన్యంబు వరునిజన్మము
    కన్యాదానంబువడసి కడుగుణవతియై
    యన్యోన్యంబుగ మసలెడు
    కన్యం గూడంగఁ దొలఁగు ఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి
  23. అన్యాయమ్మగు మార్గమెంచి మదిలో నార్జింప నిత్యమ్ము పల్
    విన్యాసమ్ముల చేయువారు కొననౌ ప్రేతేశు లోకమ్మునే
    మాన్యుల్ మెచ్చు విధమ్ముగా చనుచు పద్మానాథు పాదోద్భవౌ
    కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే

    రిప్లయితొలగించండి
  24. వన్యేభేంద్రము రీతి దిర్గుచును దా వాల్గంటులన్ గోరుచున్
    మన్యంబెల్లను ఛీత్కరించుగద, సన్మార్గంబునే యెంచి, తా
    నన్యస్త్రీలను వీడియేకసతి, జాయన్, సంతతిన్ గోరుచున్
    కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే.

    రిప్లయితొలగించండి
  25. అన్యుల వోలెం బలుకగ
    మన్యంబున నుంటెయమల! మాన్యత లేమిన్
    గన్యల గూరిచి యిట్లన
    కన్యంగూడంగ దొలగు ఘన పాపమ్ముల్?

    రిప్లయితొలగించండి
  26. ధన్యత నొందు వివాహము
    కన్యం గూడంగ, దొలగు ఘనపాపమ్ముల్
    అన్యంబెరుగని భక్తిని
    పుణ్యాత్ముల సేవజేయ పుడమి జనులకున్

    సన్యాసాశ్రమ ధర్మముల్ మనము నాస్వాదించుచున్
    మోదమున్
    ధన్యాత్ముండగు దేశికున్ గొలుచుచున్ తత్త్వంబు దెల్యంగ తా
    నన్యంబైన విచారముల్ విడచి యాత్మానందమున్
    ప్రజ్ఞయన్
    కన్యంగూడిన పాపముల్ దొలగి మోక్షప్రాప్తి యౌనందురే

    రిప్లయితొలగించండి
  27. కన్యంగూడిన బాపముల్ దొలగిమోక్ష ప్రాప్తియౌ నందురే
    కన్యంగూడిన వచ్చు గర్భము గదా కాదందురా మీరుభో
    మన్యంబందున నుండు వారల వలెన్ మాట్లాడన్యాయంబు నే?
    కన్యంగోరుట ధర్మమారవి!యికన్ గౌరింగ భావింపుమా

    రిప్లయితొలగించండి

  28. కన్యాశుల్కమునిచ్చి మానవతితో కళ్యాణమున్ జేసినన్
    సన్యాసమ్మును స్వీకరించి యదియే సత్కార్య మంచెంచి నీ
    వన్యాయంబొనరించి నావుగద గార్హస్త్యమ్మునే వీడి, యా
    కన్యంగూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే.

    రిప్లయితొలగించండి
  29. అన్యమ్ము లుండఁగా సా
    మాన్యమ్ముగ జాతకమున మహిమం జెపుమా
    మాన్యా యేయే గ్రహములు
    కన్యం గూడంగఁ దొలఁగు ఘన పాపమ్ముల్


    మాన్యంబే మన సాంప్రదాయ మిల ధర్మం బందు నిల్చుం దగన్
    ధన్యంబై నిజవంశ మింపుగను, సంతా నార్థమై ప్రీతి మా
    నిన్యౌఘ ప్రవరం గటంకట సుసాన్నిధ్య ప్రదత్తాంగనం
    గన్యం గూడినఁ, బాపముల్ దొలఁగి మోక్ష ప్రాప్తియౌ నందురే

    రిప్లయితొలగించండి


  30. మాన్యులమాటలనువినుచు
    ధన్యముచేసుకొననెంచిధరలో విడకన్
    నన్యంబెంచక మోక్షపు
    కన్యంగూడంగదొలగుఘనపాపమ్ముల్

    రిప్లయితొలగించండి