28-6-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్”(లేదా...)“దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో”
ఖలుకార్యములెలర నైతలమే ప్రాప్తించు ననగ ద్రాపుడు తెలిపెన్ గలదొకమార్గమటంచును తొలఁగు నఘము హుండినిడిన దోఁచిన సొమ్ముల్.
పురులను గోరినీవు కడు మూర్ఖుడవైతివి మానవత్వమున్ మరచితివోయి కూడదది మారుమటంచును పల్కినంతనే నరకుడు తెల్పెనిట్టుల ధనమ్మును పొందగ సల్పునట్టియా దురితము లెల్ల బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.
నరులకు చేయు సాయమది నాధుడు మెచ్చును పుణ్య ప్రాప్తినన్దురితములెల్లఁ బోవుఁ గద ; దోఁచిన సొమ్ముల వేయ హుండిలో”సిరులకు తల్లి నాధుకును చేపగ రూపము దాల్చు వానికిన్కరుణను చూపు మాధవుకు కల్గునె తోషము, దుష్ట మానవా...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ప్రాప్తినిన్... నాథునకు..' అనడం సాధువు.
త్వరితముగా ధనార్జనను వైభవరీతిని చేయు వాడునై,తిరుమల వెంకటేశ్వరుని దివ్యపదమ్ముల గాంచి ధర్మమున్నిరతిని బొందకన్ ధనము నెంతయు స్వామికి నీయ, కల్లనౌదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోలుపగు గంగను మున్గిన తొలగు నఘము : హుండి నిడిన దోచిన సొమ్ముల్ కలిగించును హాని మిగుల నిలలో నని నా ర్యులందు రెలమిన్ గదరా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు. '... నిలలో నని యార్యులందు రెలమిన్...' అనండి.
దురితదినమ్మెగాదె యిక దుర్దిన మాయెనుపన్నుగట్టకన్సరియగు నట్టిదేయనుచు సాధన జేయుచు కోర్టు నందునన్కరములు మోడ్చి వేడుచును కారణమెయ్యది యైన నేమిలేదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో!!
అలవైకుంఠపురముననుకలడనువిష్ణువునెపుడునుకాదనడెపుడున్కలిగినదానముసేయగతోలఁగునఘముహుండినిడినఁదోచినసోమ్ముల్
ఇలవైకుంఠము తిరుమలనిలచెను శ్రీహరి కొలువుగ నిత్యమతండేఅలయక దీర్చును కోర్కెలదొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్ ఇడినన్ తోచిన సుబ్బలక్ష్మిగారికి ధన్యవాదాలతోఎరుగరు పుణ్యపాపముల కీశుడు పెట్టిన న్యాయసూత్రముల్ తిరుగగ స్వర్గదుర్గతుల దీర్చగ దప్పదు వేరువేరుగన్త్వరపడి యెంచుచుందురిటు దానముపాపము దొల్గజేయు నాదురితములెల్ల బోవుగద దోచిన సొమ్మును వేయహుండిలో
పలువిధముల దారులలోవలుములు సలుపుచు ధనమును ప్రాణము గొనుచున్తలచుట హేయము మనుజులుతొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
కరము జనమ్ము నమ్ముదురు కాసులు కాంచన భూషణంబులున్మురిపముతోడ వేసినను పోవును జేసిన పాపమంచు నీనరులు నిజంబు గాంచకను నమ్ముచునుందురు వాక్కులిట్టివే''దురితములెల్ల బోవుగద దోచిన సొమ్ములు వేయ హుండిలో'''
పరులను మోసగించుచును పాపపు సొమ్మును మూటగట్టుచున్కరుణ యొకింత లేక ధనగర్వము కన్నులుగప్ప నెల్లరన్పరమ కిరాతకున్బగిది వంతల గూరుచుచున్ తలంతువాదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
ఖలులు దలంతురు గానెటుతొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్పొలుపుగ కష్టార్జితమునకలతలడఁచ దీనులకిల కరఁగునఘంబుల్
చం: సరియగు రీతి దెల్పితిరి సంభవ మివ్విధి నేటి రోజులన్మరి మరి మానసింతురట మార్గము జూపు మటంచు దైవమున్ పరిమితి కొంత భాగమును పంచగ దిట్టము నెంచి దల్పరే దురితము లెల్ల బోవు గద దోచిన సొమ్ముల వేయ హుండిలో !వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలోతిరుమల స్వామి మెచ్చునని తేలెదరూహలలోఖలుల్ సదాసరియగు దారిలో నడచి సక్రమ పద్ధతిలో గడించుచున్పరులకు మేలొనర్చుటయె పాపములన్ దొలగించునెన్నడున్
విలువలు మరచిన మూర్ఖులుపలు దుష్కృత్యమ్ములునెరపగ బడసిన సొమ్ములగాంచి తలంచిరకట!తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలోనిరతమటంచు దెల్పుచును నెమ్మి నటించుచు సాధువుల్వలెన్ నరులను జేరి మాయ వచనమ్ముల బల్కుచు సొమ్ము గుంజుచున్ సరగున జేకొనన్ ధరను ఛాత్రులుగా తమ వెంట ద్రిప్పరే !
గురువర్యులకు నమస్సులు, పై పద్యమును తొలగించి సవరించిన ఈ పద్యమును దీనిని పరిగణించ ప్రార్థన:దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలోనిరతమటంచు దెల్పుచును నెమ్మి నటించుచు యోగులన్నటుల్ నరులను జేరి మాయ వచనమ్ముల గొందరు సొమ్ము గుంజుచున్ సరగున జేకొనన్ ధరను ఛాత్రులుగా తమ వెంట ద్రిప్పరే
గురువర్యులకు నమస్సులు మొన్న ఇవ్వబడిన సమస్యకు నా పూరణను కూడా పరిశీలించ ప్రార్థన.సమస్య: చెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీథులన్.పద్యం: మక్కువ తోడ భూమి పయి మానవు డెన్నియొ వన్నె లందియున్ జుక్కల నాకసమ్మునను శోధన సల్పియు జ్ఞాన మందియున్ గ్రక్కున గాంచె వార్నిధి యగాధములున్! భళ, బ్రహ్మ తుష్టినిన్ జెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీథులన్
ఖలునికయిన నజుని దలచదొలగు నఘము ; హుండి నిడిన దోఁచిన సొమ్ముల్పలువురు పంచు కొనగ నదినలుపు ధదనమగుట నిజమని నమ్ముము సుకవీ
ఇలలో చేసిన పాపపుఫలమును తొలగంగ జేయు పరివర్తనయే!కలికాలములో " కొలదిగ "తొలఁగు నఘము ; హుండి నిడిన దోఁచిన సొమ్ముల్మరి మరి మీరి చట్టమును మంచిగ సొమ్ములు పోగు చేయుచున్పరి పరి రీతులన్ ధనము భద్రము చేయుట వీలుకాక నీమెరియుచు వెల్గు హారములు, మిక్కిలి స్వర్ణము నివ్వ పోవు నాదురితములెల్ల ? పోవు గద ! దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.
త్వరితముగా మనస్సునకు ప్రాణముకున్ శమమందు మార్గమైదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో, వరుసగ జేయ పూజలకు! వర్తక వర్గము నేతలెల్లరున్తిరుగుదురీ విధంబునను దేవునికీ తగు లంచమిచ్చుచున్౹౹
బలి వైరిని కొలువంగనుతొలఁగు నఘము ; హుండి నిడిన దోచిన సొమ్ముల్కలుగునె జలజా నాధునిసలలిత కరుణా కటాక్ష సదనపు వసతిన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
నిరతము దైవచింతయును నిర్మల చిత్తము లేకయుండుటన్దరఁదమభేదముల్గలిగిధర్మమువీడెడి స్వార్దబుద్దియున్దిరుమల వేంకటేషునికి దీర్చగ మ్రొక్కునునిల్వుదోపిడిన్దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలోకొరుప్రోలు రాధాకృష్ణ రావు
[సులువుగధనమార్జించుచునిలనక్రమసరణితోడనిమ్ముగకుజనుల్తలపోయుదురిటుమదిలోదొలగునఘము నుండి నిడిన దోచిన సొమ్ముల్
పరిమితి లేని పైకమును పంచుచునెన్నికలందు గెల్చుచున్,మరి తమవారినెల్లరికి మాన్యమురాజ్యము దోచి వెట్టుచున్,తిరుపమువోలె నాయకులు దేవుని కించుక యిచ్చి యెంచరే?దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.
సులువగు మార్గము సుగతికితెలిపిరి మనగురువుగారు తీయటి కబురున్ కలగా భావించక విను తొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్
తెలియుచు భగవత్తత్వముగలిగిన సిరులను పరోపకారమ్మందున్నిలిపిన మేలౌ నెటులన్దొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్?చంపకమాలనిరతము దైవతత్వమును నీమము దప్పక యాచరించుచున్గురుతుగ తోడివారలకు గూర్పగసాయము గల్గినంతలోహరి కరుణించి ముక్తినిడు హద్దులు మీరెడు వర్తనమ్ము నేదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో?
వెలయ వలయు నిడిన పిదప వలదు కలవర మర సున్నపడలే దకటా యిల దైవపేటి యనఁబడు,తొలఁగు నఘము, “హుండి” నిడిన దోఁచిన సొమ్ముల్ [ఇడిన పై నరసున్నపోకున్న “ఇడినఁ దోఁచిన యయి తోఁచిన సొమ్ము లని యర్థము] అరుగును వేసి నట్టి జనుఁ డా నరకమ్మున కెంచి చూడ నెవ్వ రిడిరి యన్న దెన్నఁడును బ్రశ్నము రాదిల దైవ దృష్టినిన్ సరి యగు భాషణంబ యిది సత్యము దోఁపిడి యైన వారివౌ దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ జేజెకై (దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో)
దురితము లెల్లబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలోనరయుము గొంతపాపమది యాక్షణమందున బోవు నిక్కమేయిరవుగ మంచికార్యమున కిచ్చుచు ఖర్చునుబెట్టగల్గుటన్ కరమును సంతసించుచును గాంక్షలుదీరగ బుణ్యమబ్బుటే
నిరత మసత్యముల్ బలికి నీమములన్ విడి తప్పుదారిలోసిరులనుఁ బొందగా విడిచి సిగ్గును నెగ్గును, సంచరించుచున్ మరణము నొందు వేళ హరి మన్ననఁ బొందగ నెంచి యందురే,దురితములెల్లఁ బోవుఁ గద, దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
రిప్లయితొలగించండిఖలుకార్యములెలర నై
తలమే ప్రాప్తించు ననగ ద్రాపుడు తెలిపెన్
గలదొకమార్గమటంచును
తొలఁగు నఘము హుండినిడిన దోఁచిన సొమ్ముల్.
రిప్లయితొలగించండిపురులను గోరినీవు కడు మూర్ఖుడవైతివి మానవత్వమున్
మరచితివోయి కూడదది మారుమటంచును పల్కినంతనే
నరకుడు తెల్పెనిట్టుల ధనమ్మును పొందగ సల్పునట్టియా
దురితము లెల్ల బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.
నరులకు చేయు సాయమది నాధుడు మెచ్చును పుణ్య ప్రాప్తినన్
రిప్లయితొలగించండిదురితములెల్లఁ బోవుఁ గద ; దోఁచిన సొమ్ముల వేయ హుండిలో”
సిరులకు తల్లి నాధుకును చేపగ రూపము దాల్చు వానికిన్
కరుణను చూపు మాధవుకు కల్గునె తోషము, దుష్ట మానవా
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రాప్తినిన్... నాథునకు..' అనడం సాధువు.
త్వరితముగా ధనార్జనను వైభవరీతిని చేయు వాడునై,
రిప్లయితొలగించండితిరుమల వెంకటేశ్వరుని దివ్యపదమ్ముల గాంచి ధర్మమున్
నిరతిని బొందకన్ ధనము నెంతయు స్వామికి నీయ, కల్లనౌ
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోలుపగు గంగను మున్గిన
రిప్లయితొలగించండితొలగు నఘము : హుండి నిడిన దోచిన సొమ్ముల్
కలిగించును హాని మిగుల
నిలలో నని నా ర్యులందు రెలమిన్ గదరా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'... నిలలో నని యార్యులందు రెలమిన్...' అనండి.
దురితదినమ్మెగాదె యిక దుర్దిన మాయెనుపన్నుగట్టకన్
రిప్లయితొలగించండిసరియగు నట్టిదేయనుచు సాధన జేయుచు కోర్టు నందునన్
కరములు మోడ్చి వేడుచును కారణమెయ్యది యైన నేమిలే
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో!!
అలవైకుంఠపురమునను
రిప్లయితొలగించండికలడనువిష్ణువునెపుడునుకాదనడెపుడున్
కలిగినదానముసేయగ
తోలఁగునఘముహుండినిడినఁదోచినసోమ్ముల్
ఇలవైకుంఠము తిరుమల
రిప్లయితొలగించండినిలచెను శ్రీహరి కొలువుగ నిత్యమతండే
అలయక దీర్చును కోర్కెల
దొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్
ఇడినన్ తోచిన
సుబ్బలక్ష్మిగారికి ధన్యవాదాలతో
ఎరుగరు పుణ్యపాపముల కీశుడు పెట్టిన న్యాయసూత్రముల్
తిరుగగ స్వర్గదుర్గతుల దీర్చగ దప్పదు వేరువేరుగన్
త్వరపడి యెంచుచుందురిటు దానముపాపము దొల్గజేయు నా
దురితములెల్ల బోవుగద దోచిన సొమ్మును వేయహుండిలో
పలువిధముల దారులలో
రిప్లయితొలగించండివలుములు సలుపుచు ధనమును ప్రాణము గొనుచున్
తలచుట హేయము మనుజులు
తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరము జనమ్ము నమ్ముదురు కా
రిప్లయితొలగించండిసులు కాంచన భూషణంబులున్
మురిపముతోడ వేసినను పోవు
ను జేసిన పాపమంచు నీ
నరులు నిజంబు గాంచకను న
మ్ముచునుందురు వాక్కులిట్టివే
''దురితములెల్ల బోవుగద దోచి
న సొమ్ములు వేయ హుండిలో'''
పరులను మోసగించుచును పాపపు సొమ్మును మూటగట్టుచున్
రిప్లయితొలగించండికరుణ యొకింత లేక ధనగర్వము కన్నులుగప్ప నెల్లరన్
పరమ కిరాతకున్బగిది వంతల గూరుచుచున్ తలంతువా
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
ఖలులు దలంతురు గానెటు
రిప్లయితొలగించండితొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
పొలుపుగ కష్టార్జితమున
కలతలడఁచ దీనులకిల కరఁగునఘంబుల్
చం:
రిప్లయితొలగించండిసరియగు రీతి దెల్పితిరి సంభవ మివ్విధి నేటి రోజులన్
మరి మరి మానసింతురట మార్గము జూపు మటంచు దైవమున్
పరిమితి కొంత భాగమును పంచగ దిట్టము నెంచి దల్పరే
దురితము లెల్ల బోవు గద దోచిన సొమ్ముల వేయ హుండిలో !
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
రిప్లయితొలగించండితిరుమల స్వామి మెచ్చునని తేలెదరూహలలోఖలుల్ సదా
సరియగు దారిలో నడచి సక్రమ పద్ధతిలో గడించుచున్
పరులకు మేలొనర్చుటయె పాపములన్ దొలగించునెన్నడున్
విలువలు మరచిన మూర్ఖులు
రిప్లయితొలగించండిపలు దుష్కృత్యమ్ములునెరపగ బడసిన సొ
మ్ములగాంచి తలంచిరకట!
తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
రిప్లయితొలగించండినిరతమటంచు దెల్పుచును నెమ్మి నటించుచు సాధువుల్వలెన్
నరులను జేరి మాయ వచనమ్ముల బల్కుచు సొమ్ము గుంజుచున్
సరగున జేకొనన్ ధరను ఛాత్రులుగా తమ వెంట ద్రిప్పరే !
గురువర్యులకు నమస్సులు, పై పద్యమును తొలగించి సవరించిన ఈ పద్యమును దీనిని పరిగణించ ప్రార్థన:
తొలగించండిదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
నిరతమటంచు దెల్పుచును నెమ్మి నటించుచు యోగులన్నటుల్
నరులను జేరి మాయ వచనమ్ముల గొందరు సొమ్ము గుంజుచున్
సరగున జేకొనన్ ధరను ఛాత్రులుగా తమ వెంట ద్రిప్పరే
గురువర్యులకు నమస్సులు మొన్న ఇవ్వబడిన సమస్యకు నా పూరణను కూడా పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండిసమస్య: చెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీథులన్.
పద్యం:
మక్కువ తోడ భూమి పయి మానవు డెన్నియొ వన్నె లందియున్
జుక్కల నాకసమ్మునను శోధన సల్పియు జ్ఞాన మందియున్
గ్రక్కున గాంచె వార్నిధి యగాధములున్! భళ, బ్రహ్మ తుష్టినిన్
జెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీథులన్
ఖలునికయిన నజుని దలచ
రిప్లయితొలగించండిదొలగు నఘము ; హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
పలువురు పంచు కొనగ నది
నలుపు ధదనమగుట నిజమని నమ్ముము సుకవీ
ఇలలో చేసిన పాపపు
రిప్లయితొలగించండిఫలమును తొలగంగ జేయు పరివర్తనయే!
కలికాలములో " కొలదిగ "
తొలఁగు నఘము ; హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
మరి మరి మీరి చట్టమును మంచిగ సొమ్ములు పోగు చేయుచున్
పరి పరి రీతులన్ ధనము భద్రము చేయుట వీలుకాక నీ
మెరియుచు వెల్గు హారములు, మిక్కిలి స్వర్ణము నివ్వ పోవు నా
దురితములెల్ల ? పోవు గద ! దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.
త్వరితముగా మనస్సునకు ప్రాణముకున్ శమమందు మార్గమై
రిప్లయితొలగించండిదురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో,
వరుసగ జేయ పూజలకు! వర్తక వర్గము నేతలెల్లరున్
తిరుగుదురీ విధంబునను దేవునికీ తగు లంచమిచ్చుచున్౹౹
బలి వైరిని కొలువంగను
రిప్లయితొలగించండితొలఁగు నఘము ; హుండి నిడిన దోచిన సొమ్ముల్
కలుగునె జలజా నాధుని
సలలిత కరుణా కటాక్ష సదనపు వసతిన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
నిరతము దైవచింతయును నిర్మల చిత్తము లేకయుండుటన్
రిప్లయితొలగించండిదరఁదమభేదముల్గలిగిధర్మమువీడెడి స్వార్దబుద్దియున్
దిరుమల వేంకటేషునికి దీర్చగ మ్రొక్కునునిల్వుదోపిడిన్
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
[
రిప్లయితొలగించండిసులువుగధనమార్జించుచు
నిలనక్రమసరణితోడనిమ్ముగకుజనుల్
తలపోయుదురిటుమదిలో
దొలగునఘము నుండి నిడిన దోచిన సొమ్ముల్
పరిమితి లేని పైకమును పంచుచునెన్నికలందు గెల్చుచున్,
రిప్లయితొలగించండిమరి తమవారినెల్లరికి మాన్యమురాజ్యము దోచి వెట్టుచున్,
తిరుపమువోలె నాయకులు దేవుని కించుక యిచ్చి యెంచరే?
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.
సులువగు మార్గము సుగతికి
రిప్లయితొలగించండితెలిపిరి మనగురువుగారు తీయటి కబురున్
కలగా భావించక విను
తొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలియుచు భగవత్తత్వము
తొలగించండిగలిగిన సిరులను పరోపకారమ్మందున్
నిలిపిన మేలౌ నెటులన్
దొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్?
చంపకమాల
నిరతము దైవతత్వమును నీమము దప్పక యాచరించుచున్
గురుతుగ తోడివారలకు గూర్పగసాయము గల్గినంతలో
హరి కరుణించి ముక్తినిడు హద్దులు మీరెడు వర్తనమ్ము నే
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెలయ వలయు నిడిన పిదప
రిప్లయితొలగించండివలదు కలవర మర సున్నపడలే దకటా
యిల దైవపేటి యనఁబడు,
తొలఁగు నఘము, “హుండి” నిడిన దోఁచిన సొమ్ముల్
[ఇడిన పై నరసున్నపోకున్న “ఇడినఁ దోఁచిన యయి తోఁచిన సొమ్ము లని యర్థము]
అరుగును వేసి నట్టి జనుఁ డా నరకమ్మున కెంచి చూడ నె
వ్వ రిడిరి యన్న దెన్నఁడును బ్రశ్నము రాదిల దైవ దృష్టినిన్
సరి యగు భాషణంబ యిది సత్యము దోఁపిడి యైన వారివౌ
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ జేజెకై
(దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో)
దురితము లెల్లబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలో
రిప్లయితొలగించండినరయుము గొంతపాపమది యాక్షణమందున బోవు నిక్కమే
యిరవుగ మంచికార్యమున కిచ్చుచు ఖర్చునుబెట్టగల్గుటన్
కరమును సంతసించుచును గాంక్షలుదీరగ బుణ్యమబ్బుటే
రిప్లయితొలగించండినిరత మసత్యముల్ బలికి నీమములన్ విడి తప్పుదారిలో
సిరులనుఁ బొందగా విడిచి సిగ్గును నెగ్గును, సంచరించుచున్
మరణము నొందు వేళ హరి మన్ననఁ బొందగ నెంచి యందురే,
దురితములెల్లఁ బోవుఁ గద, దోఁచిన సొమ్ముల వేయ హుండిలో