14-6-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్"(లేదా...)"జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్"
విపులముగాగనుపరమునుసఫలముఁజెందుచుతపసునసాధకుడంతన్వపువునుమరచుచుభౌతికజపతపయోగములువిడువసద్గతిదక్కున్
కపటము విడి శరణార్థులప్రపదనమిచ్చిననుచాలు పరమాత్ముడు మెచ్చు పరుల వంచింప కుటిలజపతప యోగములు విడువ సద్గతి దక్కున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చపలతలేక నిత్యమును చక్కని మట్టివియౌ సుమమ్ములన్ నిపుణత గొల్చుచుండు కడునిమ్నపు జాతికిజెందు భీముడానృపుడగు తొండమానుడట నివ్వెరవోవగ జాటెభక్తినిన్జపతపముల్ ద్యజించిచను సాధకు డందును సద్గతిన్ వెసన్
అపమార్గమ్మున నడచుచువిపరీతపు ధోరణులను విచ్చలవిడిగాకపటపు చర్యల తాంత్రిక జపతపముల విడుచువాడు సద్గతి నందున్
శంకరయ్యగారికి నమస్సులుతపోయోగములు సకారాంతశబ్దం (తపస్) అవుతుంది కదండితపము అకారాంతపుంలింగమైనచో వేడి అనే అర్థం వస్తుంది, (ఆతపకాలము) కదా! అనినా అనుమానం.
సమస్య :జపతపయోగముల్ విడిచి సాధకు డందెను సద్గతిన్ వెసన్ ( నారదమహర్షి తన శిష్యునికి కంచెర్ల గోపన్న రామభక్తి వైభవాన్ని వివరిస్తున్నాడు )ఉపగతమైన యంశమది యోర్పుగ శ్రద్ధగ నాలకింపుమా !అపగత మందనట్టి పర మాత్మపరంబగు భక్తి చాలులే !కపటము లేని గోపనయె కంజదళాక్షుని మీది భక్తిచే జపతపయోగముల్ విడిచి సాధకు డందెను సద్గతిన్ వెసన్ .( ఉపగతమైన - అంగీకరింపబడిన ; అపగతము - అంతరించెడిది )
తపుడే చెప్పిన వీడకుజప తప యోగములు ; విడువ సద్గతి దక్కున్కపి రాజ నాధుని దురితరిపుండు రావణుని సేవలించుక తెలివిన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
కపటపు యోగియై సతము కల్లల నాడుచు తానొకండె దివ్యపదము చూపువాడనని పల్కు వివర్ణుడు మారి బీదకున్ ప్రపదన మందజేసి యనవద్యపు కార్యము జేయ నాలియౌ జపతప యోగముల్ విడిచి సాధకుడందెను సద్గతిన్ వెసన్.
అపవర్గము గోరు జనమువిపరీతములెంచబోరు విశ్వమునందున్,కృప గలిగి, మనిషి కపటపుజప తపములవిడుచువాడు సద్గతినందున్
అపురూపపు భక్తుండై కృప జూపు మటంచు వేడి కీర్తన తోడన్ విపరీతపు దైన కపట జప తప యోగములు విడువ సద్గతి దక్కున్
చపలముగానిభావనలసన్నుతశక్తినిమానసంబునన్అపరములేకయూపిరినియన్నిటబంధనఁజేయుకార్యమాతపననుయోగ్యమంచుననుతాఁజరియించునాత్మతజపతపయోగముల్విడిచసాధకుడందెనుసద్గతిన్వెసన్
నాత్మతో3వపాదంచివర
కందంవిపులమ్ముగ కౌశికుఁడున్దపసి వశిష్ఠునెదిరించ దక్కెనె బ్రహ్మర్షి పథము? కోప సహితమగుజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్చంపకమాలకుపిత పరత్వ కౌశికుడు క్రుంగె నశించి తపోబలమ్మునున్తపసి వశిష్ఠునిన్ దొడరు దారిన బ్రహ్మ సహోరుడయ్యెనే?యుపశమనాన సాధ్యపడె నున్నతి! కోప సమేతమయ్యెడున్జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
కందంకపట మెఱుంగని తిన్నడుయపరాజితుఁ బుక్కిలించు నర్చన ముక్తిన్,సుపథిఁగొనె! మూఢ భక్తినిజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్చంపకమాలవిపినము నందు తిన్ననికి వేడుక జిక్కఁగ లింగరూపుడున్కపటము లేక తా నశుచి గాహన మాంసపుటారగింపులన్సుపథమనంగ ముక్తిఁగనె చోద్యము 'కన్నప'!మూఢ భక్తిమైజప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
సపరిజనముగా నిత్యముచపల మనస్కులగుచు కొనసాగించగ నాకపటపు రీతిన సలిపెడుజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
తపముని విశ్వామిత్రుడుచపలతతో దేవకన్య జతకూడగ నెంచి పరిపరి విధముల దలచెజప తప యోగములు విడువ సద్గతి దక్కున్
కపటపు మిషతో మేనక,జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్,అపసవ్య ము నీ తపమని,చపలత కౌశికునిజేరి సంతస పరిచెన్
కృప భగవంతుడే నిడుగ కృష్ణుని నామజపమ్ము చేసినన్అపరిమితంబె ధ్యానమున ఆపరమాత్మ సమింపజేసెడిన్చపలమనోవికారములు, సాధనచేయవలెన్ ,యభాగ్యులేజపతపముల్ ద్యజించి చను, సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
ఈనాటి శంకరాభరణం వారి సమస్యజపతప యోగములు విడువ సద్గతి దక్కున్ఇచ్చిన. పాదము కందము నా పూరణ సీసములోగ్రీష్మ ఋతువున యగ్ని నలు దిశలలోన నుండగా జపము చేయుచుంటివి నడుమ కూర్చుండి యీవు, శిశిర ఋతువులోనజివ్వున చలిగాలులు వీచ నగ్నమ్ముగ తపమును వీడక సల్పుచు వేడ చుంటివి గదా విరించిని, సొగసుగ నిను కోరివచ్చితిని వసంత మొచ్చెనుగ సహోరుడా,జపతప యోగ ములు విడువ సద్గతి దక్కున్, నిజమిది వినుముగాధి తనయుడా, యీ మేనక యడు గిడెను,రతిసుఖమ్ము నిచ్చెదనుగా రమ్య గతినితాపమును తీర్చు ము రయమున్ తపము నాపియనుచు మేనక పలికెను మునిని గాంచివిశ్వామిత్రుని గాంచి మేనక పలుకులు
ఈనాటి శంకరాభరణం వారి సమస్యజపతపములు విడుచువాడు సద్గతి పొందున్ఇచ్చిన. పాదము కందము నా పూరణ సీసములోగ్రీష్మ ఋతువున యగ్ని నలు దిశలలోన నుండగా జపము చేయుచుంటివి నడుమ కూర్చుండి యీవు,శిశిర ఋతువులోన జివ్వున చలిగాలులు వీచ నగ్నమ్ముగ తపమును వీడక సల్పుచు వేడ చుంటివి గదా విరించిని, సొగసుగ నిను కోరివచ్చితిని వసంత మొచ్చెనుగదపరికించగ,జపతపములు విడుచువాడుసద్గతి పొందున్నిజమిది వినుముగాధి తనయుడా, యీ మేనక యడు గిడెను,రతిసుఖమ్ము నిచ్చెదనుగా రమ్య గతినితాపమును తీర్చు ము రయమున్ తపము నాపియనుచు మేనక పలికెను మునిని గాంచివిశ్వామిత్రుని గాంచి మేనక పలుకులు
విపణుల ప్రాణ వాయువును పేరిమి చిక్కక గాలి సాక్షిగన్శపధము చేసి మానవుల సాంబుని చెంతకు చేర్చు బాటలా కపటపు వైద్య శాలలను కాలుని శాలల చేరి కోరికన్జప తప యోగముల్ విడిచి సాధకుఁ డందెను సద్గతిన్ వెసన్"...భారతీనాథ్ చెన్నంశెట్టి...
కపటంబదివేషమునైచపలపుజిత్తమునఁదానుజంచలమగుచున్నపరాధపుజపమాలలజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్కొరుప్రోలు రాధాకృష్ణరావు
అపగతమోహచిత్తుడయి యందరినిన్ సమదృష్టి జూచుచున్గృపగొని దీనమానసుల కీడును మాన్ప నిరంతరమ్ముగా కపటము లేక సాగగల కర్మఠుడై యవకాశశూన్యుడైజప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
తపములు క్లిష్టయోగజపతర్పణముల్ విపరీతసాధనల్చపలత జేసెనే పరమసాధ్వి పలమ్ముల నమ్ము ధర్మయక్తపథచరుండు నట్లు? సరికావవి చాలును శీలవర్తనన్జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్.కంజర్ల రామాచార్య
చపలత లేని చిత్తమున సన్నుతి చేయుచు శ్రీనివాసునిన్విపులపు భక్తి, దుర్బలుల వృద్ధికి నిత్యము ప్రాపునిచ్చుచున్కపటము లేని ప్రేమ నిజ కాంతకు పంచుచునున్న నింటిలోజప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
అపకారికి సహితము తానుపకారము సేయు నట్టి యోచన తోడన్నుపమించక సేయుచు నాజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
మల్లెల.నాగరాజచపలత వీడి మానసము సజ్జన బుద్ధిని జేర్చి సాగుచోవిపినములందు నిల్చిన పవిత్ర చరిత్ర గడించు కోర్కె నిష్కపట నిరంజనాకృతి సఖా! పెరవారికి సేవ చేయుచోజపతపముల్ త్యజించి చను సాధకుఁ డందును సద్గతుల్ వెసన్!
కుపితుడు వేధయైన తన కోపపు చేష్టల చేత వ్యర్థుడైనుపగతి పొందలేడతడు, యూరక నుండక, జీవకోటికిన్నుపకర మైనసేవలొక యున్నత రీతిని చేసి ధన్యుడైజప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
చపలత్వమె పొందునెపుడుజప తపముల విడుచువాఁడు; సద్గతి నందున్కపటము లేక మది పరంతపునే ధ్యానించు వాడు ధర్మపరుండున్
అపమార్గమ్మున నడువకఉపకారము జేయబూని నోపగ కష్టంబుపమార్గంబెంచుకొనగజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్!!
అజామిళుడు ఎంత నీచుడై నప్పటికిని అంత్య కాలమందు 'నారాయణా' అని తలచినపుడు సద్గతిని పొందుతాడు. ఆ సందర్బంగా నా ప్రయత్నము: చం: అపశదుడైన వాడనుచు నా యమదూత లజామిళాఖ్యునిన్తపనము నంద జేతుమన ధర్మము కాదన విష్ణుదూతలై కపటము లేక శ్రీ హరిని, కాలము తీరుట నెంచి, గొల్వనైజపతపముల్ ద్యజించి చను సాధకు డందును సద్గతిన్ వెసన్ఆపశదుడు= నీచుడువై. చంద్రశేఖర్
అపవిత్రు డగును బృధివికిజపతపములు విడుచువాడు,సద్గతినందున్ చపలత భావము వీడుచుజపతపములు సేయునతడు శంకరు కృపచేన్
అపకారమ్ములు సేసెడునెపమునఁ జేయకుమ మేదినిని నే పూజల్ విపరీతమ్ములు ఘోర కుజపతపముల విడుచు వాఁడు సద్గతి నందున్ విపుల దయాగుణుండు నగు వెన్నునిఁ గొల్వ సతం బపారపుం గృప నొసఁగంగ మాధవుఁడు హీన భవౌఘము నాశ మందఁగా నృపవర! యింద్రి యార్థముల నెల్లను నిష్ఠను, మానకుండఁగాజప తపముల్, ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
కుపితుడు గాక యెప్పుడును గూర్మిని నెల్లరి మానసంబులన్ గపటము లేని పద్ధతిని గర్మఠు వోలెను జూరగొన్నచోనపగత మత్సరంబునన నందఱి సేమముజూడగల్గుచోజపతపముల్ త్యజించి చను సాధకుడందును సద్గతిన్ వెసన్
విపినమున మౌని వోలెనుజపముసలుపనేల ముక్తి సాధింపంగానుపకారముచేయగతనజపతపముల విడుచువాఁడుసద్గతి నందున్
కపటపు బుద్ధి నిపూనుచు విపరీతముగా నితరుల వేధించక తాతపమును పేరును తాంత్రిక జప తప యోగములు విడువ సద్గతి కలుగున్
అపరిమితంపు కాలమున నాకృతి దాల్చెడి జీవరాశిలోనుపమితు లేల జీవనము నుత్సుకత న్గమియింప జేయు నాకృపనిడు దేవదేవుని సకీన ప్రభాద్యుతి నందు బంధమున్జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్!
విపులముగాగనుపరమును
రిప్లయితొలగించండిసఫలముఁజెందుచుతపసునసాధకుడంతన్
వపువునుమరచుచుభౌతిక
జపతపయోగములువిడువసద్గతిదక్కున్
రిప్లయితొలగించండికపటము విడి శరణార్థుల
ప్రపదనమిచ్చిననుచాలు పరమాత్ముడు మె
చ్చు పరుల వంచింప కుటిల
జపతప యోగములు విడువ సద్గతి దక్కున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచపలతలేక నిత్యమును చక్కని మట్టివియౌ సుమమ్ములన్
తొలగించండినిపుణత గొల్చుచుండు కడునిమ్నపు జాతికిజెందు భీముడా
నృపుడగు తొండమానుడట నివ్వెరవోవగ జాటెభక్తినిన్
జపతపముల్ ద్యజించిచను సాధకు డందును సద్గతిన్ వెసన్
అపమార్గమ్మున నడచుచు
తొలగించండివిపరీతపు ధోరణులను విచ్చలవిడిగా
కపటపు చర్యల తాంత్రిక
జపతపముల విడుచువాడు సద్గతి నందున్
శంకరయ్యగారికి నమస్సులు
రిప్లయితొలగించండితపోయోగములు సకారాంతశబ్దం (తపస్) అవుతుంది కదండి
తపము అకారాంతపుంలింగమైనచో వేడి అనే అర్థం వస్తుంది, (ఆతపకాలము) కదా! అని
నా అనుమానం.
సమస్య :
రిప్లయితొలగించండిజపతపయోగముల్ విడిచి
సాధకు డందెను సద్గతిన్ వెసన్
( నారదమహర్షి తన శిష్యునికి కంచెర్ల గోపన్న
రామభక్తి వైభవాన్ని వివరిస్తున్నాడు )
ఉపగతమైన యంశమది
యోర్పుగ శ్రద్ధగ నాలకింపుమా !
అపగత మందనట్టి పర
మాత్మపరంబగు భక్తి చాలులే !
కపటము లేని గోపనయె
కంజదళాక్షుని మీది భక్తిచే
జపతపయోగముల్ విడిచి
సాధకు డందెను సద్గతిన్ వెసన్ .
( ఉపగతమైన - అంగీకరింపబడిన ; అపగతము - అంతరించెడిది )
తపుడే చెప్పిన వీడకు
రిప్లయితొలగించండిజప తప యోగములు ; విడువ సద్గతి దక్కున్
కపి రాజ నాధుని దురిత
రిపుండు రావణుని సేవలించుక తెలివిన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
రిప్లయితొలగించండికపటపు యోగియై సతము కల్లల నాడుచు తానొకండె ది
వ్యపదము చూపువాడనని పల్కు వివర్ణుడు మారి బీదకున్
ప్రపదన మందజేసి యనవద్యపు కార్యము జేయ నాలియౌ
జపతప యోగముల్ విడిచి సాధకుడందెను సద్గతిన్ వెసన్.
అపవర్గము గోరు జనము
రిప్లయితొలగించండివిపరీతములెంచబోరు విశ్వమునందున్,
కృప గలిగి, మనిషి కపటపు
జప తపములవిడుచువాడు సద్గతినందున్
అపురూపపు భక్తుండై
రిప్లయితొలగించండికృప జూపు మటంచు వేడి కీర్తన తోడన్
విపరీతపు దైన కపట
జప తప యోగములు విడువ సద్గతి దక్కున్
చపలముగానిభావనలసన్నుతశక్తినిమానసంబునన్
రిప్లయితొలగించండిఅపరములేకయూపిరినియన్నిటబంధనఁజేయుకార్యమా
తపననుయోగ్యమంచుననుతాఁజరియించునాత్మత
జపతపయోగముల్విడిచసాధకుడందెనుసద్గతిన్వెసన్
నాత్మతో3వపాదంచివర
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండివిపులమ్ముగ కౌశికుఁడున్
దపసి వశిష్ఠునెదిరించ దక్కెనె బ్రహ్మ
ర్షి పథము? కోప సహితమగు
జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
చంపకమాల
కుపిత పరత్వ కౌశికుడు క్రుంగె నశించి తపోబలమ్మునున్
తపసి వశిష్ఠునిన్ దొడరు దారిన బ్రహ్మ సహోరుడయ్యెనే?
యుపశమనాన సాధ్యపడె నున్నతి! కోప సమేతమయ్యెడున్
జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
కందం
తొలగించండికపట మెఱుంగని తిన్నడు
యపరాజితుఁ బుక్కిలించు నర్చన ముక్తిన్,
సుపథిఁగొనె! మూఢ భక్తిని
జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
చంపకమాల
విపినము నందు తిన్ననికి వేడుక జిక్కఁగ లింగరూపుడున్
కపటము లేక తా నశుచి గాహన మాంసపుటారగింపులన్
సుపథమనంగ ముక్తిఁగనె చోద్యము 'కన్నప'!మూఢ భక్తిమై
జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసపరిజనముగా నిత్యము
రిప్లయితొలగించండిచపల మనస్కులగుచు కొనసాగించగ నా
కపటపు రీతిన సలిపెడు
జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
తపముని విశ్వామిత్రుడు
రిప్లయితొలగించండిచపలతతో దేవకన్య జతకూడగ నెం
చి పరిపరి విధముల దలచె
జప తప యోగములు విడువ సద్గతి దక్కున్
కపటపు మిషతో మేనక,
రిప్లయితొలగించండిజప తపముల విడుచువాఁడు సద్గతి నందున్,
అపసవ్య ము నీ తపమని,
చపలత కౌశికునిజేరి సంతస పరిచెన్
కృప భగవంతుడే నిడుగ కృష్ణుని నామజపమ్ము చేసినన్
రిప్లయితొలగించండిఅపరిమితంబె ధ్యానమున ఆపరమాత్మ సమింపజేసెడిన్
చపలమనోవికారములు, సాధనచేయవలెన్ ,యభాగ్యులే
జపతపముల్ ద్యజించి చను, సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
ఈనాటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండిజపతప యోగములు విడువ సద్గతి దక్కున్
ఇచ్చిన. పాదము కందము నా పూరణ సీసములో
గ్రీష్మ ఋతువున యగ్ని నలు దిశలలోన నుండగా జపము చేయు
చుంటివి నడుమ కూర్చుండి యీవు, శిశిర ఋతువులోన
జివ్వున చలి
గాలులు వీచ నగ్నమ్ముగ తపమును వీడక సల్పుచు వేడ చుంటి
వి గదా విరించిని, సొగసుగ నిను కోరి
వచ్చితిని వసంత మొచ్చెనుగ స
హోరుడా,జపతప యోగ ములు విడువ సద్గతి దక్కున్,
నిజమిది వినుము
గాధి తనయుడా, యీ మేనక యడు గిడెను,
రతిసుఖమ్ము నిచ్చెదనుగా రమ్య గతిని
తాపమును తీర్చు ము రయమున్ తపము
నాపి
యనుచు మేనక పలికెను మునిని గాంచి
విశ్వామిత్రుని గాంచి మేనక పలుకులు
ఈనాటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండిజపతపములు విడుచువాడు సద్గతి పొందున్
ఇచ్చిన. పాదము కందము నా పూరణ సీసములో
గ్రీష్మ ఋతువున యగ్ని నలు దిశలలోన నుండగా జపము చేయు
చుంటివి నడుమ కూర్చుండి యీవు,శిశిర ఋతువులోన
జివ్వున చలి
గాలులు వీచ నగ్నమ్ముగ తపమును వీడక సల్పుచు వేడ చుంటి
వి గదా విరించిని, సొగసుగ నిను కోరి
వచ్చితిని వసంత మొచ్చెను
గద
పరికించగ,జపతపములు విడుచువాడు
సద్గతి పొందున్
నిజమిది వినుము
గాధి తనయుడా, యీ మేనక యడు గిడెను,
రతిసుఖమ్ము నిచ్చెదనుగా రమ్య గతిని
తాపమును తీర్చు ము రయమున్ తపము
నాపి
యనుచు మేనక పలికెను మునిని గాంచి
విశ్వామిత్రుని గాంచి మేనక పలుకులు
విపణుల ప్రాణ వాయువును పేరిమి చిక్కక గాలి సాక్షిగన్
రిప్లయితొలగించండిశపధము చేసి మానవుల సాంబుని చెంతకు చేర్చు బాటలా
కపటపు వైద్య శాలలను కాలుని శాలల చేరి కోరికన్
జప తప యోగముల్ విడిచి సాధకుఁ డందెను సద్గతిన్ వెసన్"
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
కపటంబదివేషమునై
రిప్లయితొలగించండిచపలపుజిత్తమునఁదానుజంచలమగుచున్
నపరాధపుజపమాలల
జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
అపగతమోహచిత్తుడయి యందరినిన్ సమదృష్టి జూచుచున్
రిప్లయితొలగించండిగృపగొని దీనమానసుల కీడును మాన్ప నిరంతరమ్ముగా
కపటము లేక సాగగల కర్మఠుడై యవకాశశూన్యుడై
జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
తపములు క్లిష్టయోగజపతర్పణముల్ విపరీతసాధనల్
రిప్లయితొలగించండిచపలత జేసెనే పరమసాధ్వి పలమ్ముల నమ్ము ధర్మయ
క్తపథచరుండు నట్లు? సరికావవి చాలును శీలవర్తనన్
జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్.
కంజర్ల రామాచార్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచపలత లేని చిత్తమున సన్నుతి చేయుచు శ్రీనివాసునిన్
రిప్లయితొలగించండివిపులపు భక్తి, దుర్బలుల వృద్ధికి నిత్యము ప్రాపునిచ్చుచున్
కపటము లేని ప్రేమ నిజ కాంతకు పంచుచునున్న నింటిలో
జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
అపకారికి సహితము తా
రిప్లయితొలగించండినుపకారము సేయు నట్టి యోచన తోడన్
నుపమించక సేయుచు నా
జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్
మల్లెల.నాగరాజ
రిప్లయితొలగించండిచపలత వీడి మానసము సజ్జన బుద్ధిని జేర్చి సాగుచో
విపినములందు నిల్చిన పవిత్ర చరిత్ర గడించు కోర్కె ని
ష్కపట నిరంజనాకృతి సఖా! పెరవారికి సేవ చేయుచో
జపతపముల్ త్యజించి చను సాధకుఁ డందును సద్గతుల్ వెసన్!
కుపితుడు వేధయైన తన కోపపు చేష్టల చేత వ్యర్థుడై
రిప్లయితొలగించండినుపగతి పొందలేడతడు, యూరక నుండక, జీవకోటికిన్
నుపకర మైనసేవలొక యున్నత రీతిని చేసి ధన్యుడై
జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
చపలత్వమె పొందునెపుడు
రిప్లయితొలగించండిజప తపముల విడుచువాఁడు; సద్గతి నందున్
కపటము లేక మది పరం
తపునే ధ్యానించు వాడు ధర్మపరుండున్
అపమార్గమ్మున నడువక
రిప్లయితొలగించండిఉపకారము జేయబూని నోపగ కష్టం
బుపమార్గంబెంచుకొనగ
జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిఅజామిళుడు ఎంత నీచుడై నప్పటికిని అంత్య కాలమందు 'నారాయణా' అని తలచినపుడు సద్గతిని పొందుతాడు. ఆ సందర్బంగా నా ప్రయత్నము:
చం:
అపశదుడైన వాడనుచు నా యమదూత లజామిళాఖ్యునిన్
తపనము నంద జేతుమన ధర్మము కాదన విష్ణుదూతలై
కపటము లేక శ్రీ హరిని, కాలము తీరుట నెంచి, గొల్వనై
జపతపముల్ ద్యజించి చను సాధకు డందును సద్గతిన్ వెసన్
ఆపశదుడు= నీచుడు
వై. చంద్రశేఖర్
అపవిత్రు డగును బృధివికి
రిప్లయితొలగించండిజపతపములు విడుచువాడు,సద్గతినందున్
చపలత భావము వీడుచు
జపతపములు సేయునతడు శంకరు కృపచేన్
అపకారమ్ములు సేసెడు
రిప్లయితొలగించండినెపమునఁ జేయకుమ మేదినిని నే పూజల్
విపరీతమ్ములు ఘోర కు
జపతపముల విడుచు వాఁడు సద్గతి నందున్
విపుల దయాగుణుండు నగు వెన్నునిఁ గొల్వ సతం బపారపుం
గృప నొసఁగంగ మాధవుఁడు హీన భవౌఘము నాశ మందఁగా
నృపవర! యింద్రి యార్థముల నెల్లను నిష్ఠను, మానకుండఁగా
జప తపముల్, ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్
కుపితుడు గాక యెప్పుడును గూర్మిని నెల్లరి మానసంబులన్
రిప్లయితొలగించండిగపటము లేని పద్ధతిని గర్మఠు వోలెను జూరగొన్నచో
నపగత మత్సరంబునన నందఱి సేమముజూడగల్గుచో
జపతపముల్ త్యజించి చను సాధకుడందును సద్గతిన్ వెసన్
విపినమున మౌని వోలెను
రిప్లయితొలగించండిజపముసలుపనేల ముక్తి సాధింపంగా
నుపకారముచేయగతన
జపతపముల విడుచువాఁడుసద్గతి నందున్
కపటపు బుద్ధి నిపూనుచు
రిప్లయితొలగించండివిపరీతముగా నితరుల వేధించక తా
తపమును పేరును తాంత్రిక
జప తప యోగములు విడువ సద్గతి కలుగున్
రిప్లయితొలగించండిఅపరిమితంపు కాలమున
నాకృతి దాల్చెడి జీవరాశిలో
నుపమితు లేల జీవనము
నుత్సుకత న్గమియింప జేయు నా
కృపనిడు దేవదేవుని స
కీన ప్రభాద్యుతి నందు బంధమున్
జప తపముల్ ద్యజించి చను
సాధకుఁ డందును సద్గతిన్ వెసన్!