1-7-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ”(లేదా...)“నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో”
పల్కిన పలుకు తప్పని వ్రతమునిలన నోఁచి పొందితిఁ గష్టముల్ ; నూతనముగకాపరిగనైతి కాటికి కాశి నగర వాకిటనసత్యము పలుకన్వసతికిపుడు...భారతీనాథ్ చెన్నంశెట్టి...
హరిశ్చంద్రుని స్వగతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వ్రతము నిలను" అనండి.
ధన్యవాదములండీ
ధనముసరితూగదాయెగధవునితోడమునికివశమయ్యెమరియాదనుండిమగఁడుభావమెంచినమనసునభామయనియెనోఁచిపోందితికష్టముల్నూతనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఖ్యాతి పొందెను దనుజుల జాతి నందుయాగ,తప, పూజలను హిర ణ్యకశ పుడునుమార్చ జాలక కొడుకును, మదిని తలచెనోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. హిరణ్యకశిపుడు... టైపాటు.
ధన్యవాదాలండిగురువుగారు
పిల్లలకొరకు పూజల విరివిగాను చేసి పొందితి గర్భమున్ శివుడ వినర పురిటి నొప్పుల తీవ్రత నెరుగ కుండనోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ.
సత్యభామతో ద్రౌపది సంభాషణధీమతులేవురౌ పతుల తీక్ష్ణతపంబున మంగళంబులౌనోములనోచి పొందితిని; నూత్నములౌ దురవస్థలెన్నియోధూమమువోలె గప్పిగొన దూ చను దప్పక స్త్రీలధర్మముల్ప్రేమగనాచరించుచును పెద్దలమెప్పును బొందితిన్గదా!
క్రొవ్విడి వెంకట రాజారావు: స్పస్టతయె వెలితిపడిన పదములనుచు దేవి బీజాక్షరములెల్ల తీరుగాని విధము బల్కి చిత్రముగ తప్పిదమగునటు నోచి పొందితి గష్టముల్ నూతనముగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'స్వస్థతయె' టైపాటు.
కె.వి.యస్. లక్ష్మి: పుణ్య ఫలము వలన గల్గు పుత్రులనుచు నోచి నోములెన్నింటినొ నొందె నొకని నేడు యెదుట నిల్చి యెదురు వాడు తిరుగనోచి పొందితి గష్టముల్ నూతనముగ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఏమని చెప్పదున్ సతము నెంతయొ శుద్ధ మనంబుతోడ మాక్షేమము గోరి భక్తిమెయి జేసితిబూజలు శాంతి హోమముల్నీమము లందునన్ మరియునిష్ఠలలో గల లోపమేమిటో?నోములు నోచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో.
ఆమనిరాకఁజూచియటహాయనడెప్పుడుభావహీనుడైకాముఁడుకోపమగ్నినటకాలెనుమూడవకన్నుదెర్వగామామకమంచులేదుగదమాయలలోంగడుమౌనితానయైనోములునోచిపోందితినినూత్నములౌదురవస్ధలెన్నియో(పార్వతిమనోగతము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మాయలలోఁ గడు... టైపాటు.
అభిమన్యుడు వీరస్వర్గమలంకరించిన తర్వాత అన్న శ్రీకృష్ణునితో సుభద్ర :తేటగీతిఅన్న! నీవు దీవింపంగ నంది విజయుఁగొమరు నభిమన్యుఁ గంటి, మనుమని గనకముందె సుతుని బాసితి, గతమందు నేమినోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ?ఉత్పలమాలసేమము గూర్చ నర్జునుని జేసితి భర్తగ, నీదు! దీవనన్గామిత భాగ్యమై సుతుఁడు గల్గెను, మన్మని గాంచకుండహో!మామక దోషమేమి యభిమన్యుడె పాసె! గదన్న! కాని వేనోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
వలపు జూపించు వాడు నా పతియు గాగ నోచి పొందితి : గష్టముల్ నూతన ముగ పుట్టె సంసార మందున పోర దొడగి రొండొరుల యందు నేకత లో ర్పు లేక
ఒక ఆఫీసరుగారి భార్య విలాపముధూమునధామునన్ బ్రజకు తోషమునిచ్చెడి కాన్కలెన్నియోభామల కన్నుకుట్టగను భారిగ బంచగ నోముపేరిటన్ఏమని చెప్పుదున్ దెలిసి ఏసిబి వారిలు సోదజేయగానోములనోచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో
వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏
భామయె పల్కెనిట్లు ప్రసవమ్మన నింతటి బాధయౌన? యయ్యో మరుజన్మమే సతికి, యోపగ లేను సదాశివా! భువిన్ బ్రేమను పంచువారలగు పిల్లలు లేరని వాంఛతోడ నే నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కుంతీదేవి విలాపము:ఆముని యత్రిసూనునకు నాదరమొప్ప సపర్యసేయగన్ప్రేమను చేరదీయుచును పిల్లడి నిచ్చెడు మంత్రమిచ్చినన్నామది యేల గోరె దిననాథుని కన్నెగ సంతతిమ్మెయిన్?నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!అత్రిసూనుడు-దుర్వాసుడుదిననాథుడు-సూర్యుడు
ఉ: ఏమదొ నాదు కర్మ మటు లెందుకు బూన్చితి లక్షలక్షలున్ సామి యనంగనే మగని చంకిలి బెట్టెడు నమ్మకమ్ముతో ? పాముకు పాలు బోయుటయె, వాస్తవమై యడుగంటె సర్వమున్నోములు నోచి పొందితిని నూత్నములౌ దురవస్త లెన్నియో సామి =దొంగ స్వామివై. చంద్రశేఖర్
ధన్యవాదములు
ఏమని చెప్పుదున్ నిరతమీతనిపై వినుమెన్ని కొండెముల్వేమరు జెప్పినన్ వినడు వెన్నలు దొంగిలి బంచి పెట్టుచున్కోమలులా నదీ తటిని కోకలనుంచగ దోచి వేచునేనోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
సంతతిని గోరి వ్రతములు సలిపతిగదనిన్నినాళ్ళుగ చేకూరె నీదినమునగాసి యధికమయ్యెను మరి కవలలేమొనోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...గద యిన్నినాళ్ళుగ.."
🙏🏽
ప్రేమను జూపి మోస మొన రించెడు దుష్టుని మాయమాటలన్భామిణి నమ్మి పెద్దలను ప్రక్కన బెట్టియు పెండ్లి యాడె నీయేమరపాటు తెచ్చె తన కిక్కట మంచును చెప్పె నిట్టు లన్నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
సమస్య :నోములు నోచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో ( బాలచంద్రుడు సబ్బాయి అనే వేశ్య వలలో పడి తన వద్దకు రానందుకు అతని భార్య మాంచాల ఆవేదన )ఉత్పలమాల ..................వేమరు గుండెలో నిలిపి వీరుని బాలు స్మరించుచుంటినే !ధీమతి బ్రహ్మనాయనికి దీవ్రపు దుర్యశమున్ గడించుచున్ సామపు బుద్ధినే విడిచి సాకుల జెప్పెడి యిట్టి భర్త నే నోములు నోచి పొందితిని ;నూత్నములౌ దురవస్థ లెన్నియో .
నీమము తోడ పూజలను నేను నిరంతము చేయుచుంటి శ్రీరాముని పొందు కోరుచు విరామము నొందక మానసంబునన్యేమిది తండ్రి తోడ సుతులీ దినమందు రణంబు సల్పి నాదేముని కాగ్రహంబునిడి తిప్పలు పెట్టుచు నుండి రంటివాక్షేమము కోరి సల్పితిని శీఘ్రముగా లలితాంబ పూజలన్నోములు నోచి బొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో,భూమిజ కేల బాధలని భోరున యేడ్చె కపీశు తెల్పగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సవరణలకు వాట్సప్ చూడండి.
పాములు కప్పలున్ తినెడు పాపపు భోజను చీని వాసులున్ప్రేమగ పంచె పుర్వులను, పేదలు పెద్దలు బేధమెంచకన్గ్రామపు వాసులందరికి రంజగు విందును పెట్టి, తోషమున్నీమము తప్పి చేరితిని నీచ కరోనల బాహు బంధమున్నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
శ్రీ గురుభ్యోనమఃఉ.స్వాముల నాశ్రయించితిని స్వల్పములైనటి బాధ లెంచగన్;స్తోమత మీరి విస్తరము సొమ్ములు ధారగ బోసినాను, నేధీమతినంచు స్వజనుల దీర్ఘపు యోచన తోసిపుచ్చుచున్,నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఐనట్టి' అనడం సాధువు. "స్వల్పములౌ పలు బాధ..." అందామా? మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురువుగారుసవరణ తో..ఉ.స్వాముల నాశ్రయించితిని స్వల్పములౌ పలు బాధ లెంచగన్;స్తోమత మీరి విస్తరము సొమ్ములు ధారగ బోసినాను, నేధీమతినంచు బంధువుల దీర్ఘపు యోచన తోసిపుచ్చుచున్,నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
భూమిధరమ్ము వాసమగు బోనము భిక్ష త్వగంబరమ్ము నెమ్మోమున చిచ్చుగంటి సెగ మూర్ధమునన్ సురగంగ మేన నుద్ధామవిభూతి, పుత్రి! బెడిదంపు మగండని జెప్ప వింటినే!నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!కంజర్ల రామాచార్య
ప్రణయకలహం లో శివునితో పార్వతి అన్నట్లు భావన.
సమస్య: నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియోఉ: మామ కుమారునిన్ వలచి మాన్యులు మెచ్చగ పెండ్లి యాడితిన్ కామన లన్నియున్ కరము కమ్మగ తీరెను తొల్లి , పిమ్మటన్ కోమలుడౌ కుమారునికి కూడెను హెచ్చుగ జన్యు లోపముల్ నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో(మేనరికం చేసుకున్న ఆమె వేదన)
ప్రేమయె మీరగన్ గనుచు బ్రీతిగ భర్తయె సాకుచుండగన్ నీమము తప్పకుండగడు నిండుగ బొందుగ బిడ్డలిర్వురన్నోములు నోఁచి పొందితిని; నూత్నములౌ దురవస్థ లెన్నియోలేమిని కల్గజేయుచును రేగెను వ్యాధియె లోకమంతటన్
సెనగ నోమును భక్తితో గనులలరగశాస్త్ర విధులను దప్పక శ్రద్ధ తోడనోచి పొందితి గష్టముల్ నూతనముగచిన్ని కొమరుడు మరణించ సెనగ వలన
ఎన్ని తీర్థముల్ వీక్షించి యెంతమందిసాధుజనులకు మ్రొక్కితి సంతు కొఱకుశోక హేతువుగా మార సుతుఁడు నోమునోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
దేవుఁ డెఱుఁగును ఫలితమ్ము లేవి యైనఁ జేయ నా పతి యప్పులు చింత తోడ నోము లెన్నియొ నే నిల నొచ్చు చుండి నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ నీమము తోడఁ బూజ లనునిత్యము సేసి కృశించి కన్న దాకోమలి పుత్రు దుష్టుఁ డయి ఘోరముగా నిడ వాఁడె దుఃఖముల్ సామజ తుల్య గామిని యశాంతి మనమ్మునఁ దల్చె నివ్విధిన్ నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
సాముల సేవజేసితిని సాగిల మ్రొక్కితి సంతు కోసమైనీమముతోడ దైవమును నిశ్చల భక్తితొ వేడ గల్గె నాధామమునందు పుత్రకుడు దారుణ మాతని తీరు చూడగన్నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
కామిత వస్తువెల్లయును గౌరిని గూరిచి నిష్ఠతో ధరన్ నోములునోచి పొందితిని,నూత్నములౌ దురవస్ధలెన్నియోమామకు మారునున్ వలచి మంచిగ బెండ్లియాడగాకామపిశాచియై పలువికారపు చేష్టల బొందితిన్ సుమా
ఉత్పలమాల:పాముల మ్రొక్కి,పుట్ట లను పాలిడి, నక్తము లుండి, నేలపైనీమముతో పరుండి ,పతి నీడనుఁ దప్పక సంచరించి నేనోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియోభూమినిదొర్లు పాపడికి! బుద్ధి పురోగతి పొందు నాటికిన్!!-కటకం వేంకటరామశర్మ. (మూడవ పాదము-ఇవ్వబడిన సమస్య)
అరక యెద్దులఁనంగడి కమ్మి ,క్రొత్త యినుప యంత్రము కొనితేగ ననుముచెడుచు మాటి మాటికి పట్నంపు బాటఁబట్టనోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ!
పూజలనుచేయనిధులను పొందవచ్చుననెడి వార్తమదినినమ్మి యాశ తోడవిడక చెప్పినవిధముగా వేగ నోమునోచి పొందితి కష్టముల్ నూతనముగ
పల్కిన పలుకు తప్పని వ్రతమునిలన
రిప్లయితొలగించండినోఁచి పొందితిఁ గష్టముల్ ; నూతనముగ
కాపరిగనైతి కాటికి కాశి నగర
వాకిటనసత్యము పలుకన్వసతికిపుడు
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
హరిశ్చంద్రుని స్వగతము
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వ్రతము నిలను" అనండి.
ధన్యవాదములండీ
తొలగించండిధనముసరితూగదాయెగధవునితోడ
రిప్లయితొలగించండిమునికివశమయ్యెమరియాదనుండిమగఁడు
భావమెంచినమనసునభామయనియె
నోఁచిపోందితికష్టముల్నూతనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఖ్యాతి పొందెను దనుజుల జాతి నందు
రిప్లయితొలగించండియాగ,తప, పూజలను హిర ణ్యకశ పుడును
మార్చ జాలక కొడుకును, మదిని తలచె
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహిరణ్యకశిపుడు... టైపాటు.
ధన్యవాదాలండిగురువుగారు
తొలగించండి
రిప్లయితొలగించండిపిల్లలకొరకు పూజల విరివిగాను
చేసి పొందితి గర్భమున్ శివుడ వినర
పురిటి నొప్పుల తీవ్రత నెరుగ కుండ
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్యభామతో ద్రౌపది సంభాషణ
రిప్లయితొలగించండిధీమతులేవురౌ పతుల తీక్ష్ణతపంబున మంగళంబులౌ
నోములనోచి పొందితిని; నూత్నములౌ దురవస్థలెన్నియో
ధూమమువోలె గప్పిగొన దూ చను దప్పక స్త్రీలధర్మముల్
ప్రేమగనాచరించుచును పెద్దలమెప్పును బొందితిన్
గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్పస్టతయె వెలితిపడిన పదములనుచు
దేవి బీజాక్షరములెల్ల తీరుగాని
విధము బల్కి చిత్రముగ తప్పిదమగునటు
నోచి పొందితి గష్టముల్ నూతనముగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'స్వస్థతయె' టైపాటు.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిపుణ్య ఫలము వలన గల్గు పుత్రులనుచు
నోచి నోములెన్నింటినొ నొందె నొకని
నేడు యెదుట నిల్చి యెదురు వాడు తిరుగ
నోచి పొందితి గష్టముల్ నూతనముగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమని చెప్పదున్ సతము నెంత
రిప్లయితొలగించండియొ శుద్ధ మనంబుతోడ మా
క్షేమము గోరి భక్తిమెయి జేసితి
బూజలు శాంతి హోమముల్
నీమము లందునన్ మరియు
నిష్ఠలలో గల లోపమేమిటో?
నోములు నోచి పొందితిని నూ
త్నములౌ దురవస్థలెన్నియో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆమనిరాకఁజూచియటహాయనడెప్పుడుభావహీనుడై
రిప్లయితొలగించండికాముఁడుకోపమగ్నినటకాలెనుమూడవకన్నుదెర్వగా
మామకమంచులేదుగదమాయలలోంగడుమౌనితానయై
నోములునోచిపోందితినినూత్నములౌదురవస్ధలెన్నియో
(పార్వతిమనోగతము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాయలలోఁ గడు... టైపాటు.
అభిమన్యుడు వీరస్వర్గమలంకరించిన తర్వాత అన్న శ్రీకృష్ణునితో సుభద్ర :
రిప్లయితొలగించండితేటగీతి
అన్న! నీవు దీవింపంగ నంది విజయుఁ
గొమరు నభిమన్యుఁ గంటి, మనుమని గనక
ముందె సుతుని బాసితి, గతమందు నేమి
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ?
ఉత్పలమాల
సేమము గూర్చ నర్జునుని జేసితి భర్తగ, నీదు! దీవనన్
గామిత భాగ్యమై సుతుఁడు గల్గెను, మన్మని గాంచకుండహో!
మామక దోషమేమి యభిమన్యుడె పాసె! గదన్న! కాని వే
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండివలపు జూపించు వాడు నా పతియు గాగ
రిప్లయితొలగించండినోచి పొందితి : గష్టముల్ నూతన ముగ
పుట్టె సంసార మందున పోర దొడగి
రొండొరుల యందు నేకత లో ర్పు లేక
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒక ఆఫీసరుగారి భార్య విలాపము
రిప్లయితొలగించండిధూమునధామునన్ బ్రజకు తోషమునిచ్చెడి కాన్కలెన్నియో
భామల కన్నుకుట్టగను భారిగ బంచగ నోముపేరిటన్
ఏమని చెప్పుదున్ దెలిసి ఏసిబి వారిలు సోదజేయగా
నోములనోచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో
వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిభామయె పల్కెనిట్లు ప్రసవమ్మన నింతటి బాధయౌన? య
య్యో మరుజన్మమే సతికి, యోపగ లేను సదాశివా! భువిన్
బ్రేమను పంచువారలగు పిల్లలు లేరని వాంఛతోడ నే
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికుంతీదేవి విలాపము:
రిప్లయితొలగించండిఆముని యత్రిసూనునకు నాదరమొప్ప సపర్యసేయగన్
ప్రేమను చేరదీయుచును పిల్లడి నిచ్చెడు మంత్రమిచ్చినన్
నామది యేల గోరె దిననాథుని కన్నెగ సంతతిమ్మెయిన్?
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
అత్రిసూనుడు-దుర్వాసుడు
దిననాథుడు-సూర్యుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిఏమదొ నాదు కర్మ మటు లెందుకు బూన్చితి లక్షలక్షలున్
సామి యనంగనే మగని చంకిలి బెట్టెడు నమ్మకమ్ముతో ?
పాముకు పాలు బోయుటయె, వాస్తవమై యడుగంటె సర్వమున్
నోములు నోచి పొందితిని నూత్నములౌ దురవస్త లెన్నియో
సామి =దొంగ స్వామి
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఏమని చెప్పుదున్ నిరతమీతనిపై వినుమెన్ని కొండెముల్
రిప్లయితొలగించండివేమరు జెప్పినన్ వినడు వెన్నలు దొంగిలి బంచి పెట్టుచున్
కోమలులా నదీ తటిని కోకలనుంచగ దోచి వేచునే
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంతతిని గోరి వ్రతములు సలిపతిగద
రిప్లయితొలగించండినిన్నినాళ్ళుగ చేకూరె నీదినమున
గాసి యధికమయ్యెను మరి కవలలేమొ
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...గద యిన్నినాళ్ళుగ.."
🙏🏽
తొలగించండిప్రేమను జూపి మోస మొన రించెడు దుష్టుని మాయమాటలన్
రిప్లయితొలగించండిభామిణి నమ్మి పెద్దలను ప్రక్కన బెట్టియు పెండ్లి యాడె నీ
యేమరపాటు తెచ్చె తన కిక్కట మంచును చెప్పె నిట్టు లన్
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండినోములు నోచి పొందితిని
నూత్నములౌ దురవస్థ లెన్నియో
( బాలచంద్రుడు సబ్బాయి అనే వేశ్య వలలో
పడి తన వద్దకు రానందుకు అతని భార్య
మాంచాల ఆవేదన )
ఉత్పలమాల
..................
వేమరు గుండెలో నిలిపి
వీరుని బాలు స్మరించుచుంటినే !
ధీమతి బ్రహ్మనాయనికి
దీవ్రపు దుర్యశమున్ గడించుచున్
సామపు బుద్ధినే విడిచి
సాకుల జెప్పెడి యిట్టి భర్త నే
నోములు నోచి పొందితిని ;
నూత్నములౌ దురవస్థ లెన్నియో .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినీమము తోడ పూజలను నేను నిరంతము చేయుచుంటి శ్రీ
రిప్లయితొలగించండిరాముని పొందు కోరుచు విరామము నొందక మానసంబునన్
యేమిది తండ్రి తోడ సుతులీ దినమందు రణంబు సల్పి నా
దేముని కాగ్రహంబునిడి తిప్పలు పెట్టుచు నుండి రంటివా
క్షేమము కోరి సల్పితిని శీఘ్రముగా లలితాంబ పూజలన్
నోములు నోచి బొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో,
భూమిజ కేల బాధలని భోరున యేడ్చె కపీశు తెల్పగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసవరణలకు వాట్సప్ చూడండి.
పాములు కప్పలున్ తినెడు పాపపు భోజను చీని వాసులున్
రిప్లయితొలగించండిప్రేమగ పంచె పుర్వులను, పేదలు పెద్దలు బేధమెంచకన్
గ్రామపు వాసులందరికి రంజగు విందును పెట్టి, తోషమున్
నీమము తప్పి చేరితిని నీచ కరోనల బాహు బంధమున్
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండిఉ.
స్వాముల నాశ్రయించితిని స్వల్పములైనటి బాధ లెంచగన్;
స్తోమత మీరి విస్తరము సొమ్ములు ధారగ బోసినాను, నే
ధీమతినంచు స్వజనుల దీర్ఘపు యోచన తోసిపుచ్చుచున్,
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఐనట్టి' అనడం సాధువు. "స్వల్పములౌ పలు బాధ..." అందామా? మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురువుగారు
తొలగించండిసవరణ తో..
ఉ.
స్వాముల నాశ్రయించితిని స్వల్పములౌ పలు బాధ లెంచగన్;
స్తోమత మీరి విస్తరము సొమ్ములు ధారగ బోసినాను, నే
ధీమతినంచు బంధువుల దీర్ఘపు యోచన తోసిపుచ్చుచున్,
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభూమిధరమ్ము వాసమగు బోనము భిక్ష త్వగంబరమ్ము నె
తొలగించండిమ్మోమున చిచ్చుగంటి సెగ మూర్ధమునన్ సురగంగ మేన ను
ద్ధామవిభూతి, పుత్రి! బెడిదంపు మగండని జెప్ప వింటినే!
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!
కంజర్ల రామాచార్య
ప్రణయకలహం లో శివునితో పార్వతి అన్నట్లు భావన.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య: నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
రిప్లయితొలగించండిఉ: మామ కుమారునిన్ వలచి మాన్యులు మెచ్చగ పెండ్లి యాడితిన్
కామన లన్నియున్ కరము కమ్మగ తీరెను తొల్లి , పిమ్మటన్
కోమలుడౌ కుమారునికి కూడెను హెచ్చుగ జన్యు లోపముల్
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
(మేనరికం చేసుకున్న ఆమె వేదన)
ప్రేమయె మీరగన్ గనుచు బ్రీతిగ భర్తయె సాకుచుండగన్
రిప్లయితొలగించండినీమము తప్పకుండగడు నిండుగ బొందుగ బిడ్డలిర్వురన్
నోములు నోఁచి పొందితిని; నూత్నములౌ దురవస్థ లెన్నియో
లేమిని కల్గజేయుచును రేగెను వ్యాధియె లోకమంతటన్
సెనగ నోమును భక్తితో గనులలరగ
రిప్లయితొలగించండిశాస్త్ర విధులను దప్పక శ్రద్ధ తోడ
నోచి పొందితి గష్టముల్ నూతనముగ
చిన్ని కొమరుడు మరణించ సెనగ వలన
ఎన్ని తీర్థముల్ వీక్షించి యెంతమంది
రిప్లయితొలగించండిసాధుజనులకు మ్రొక్కితి సంతు కొఱకు
శోక హేతువుగా మార సుతుఁడు నోము
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
దేవుఁ డెఱుఁగును ఫలితమ్ము లేవి యైనఁ
రిప్లయితొలగించండిజేయ నా పతి యప్పులు చింత తోడ
నోము లెన్నియొ నే నిల నొచ్చు చుండి
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ
నీమము తోడఁ బూజ లనునిత్యము సేసి కృశించి కన్న దా
కోమలి పుత్రు దుష్టుఁ డయి ఘోరముగా నిడ వాఁడె దుఃఖముల్
సామజ తుల్య గామిని యశాంతి మనమ్మునఁ దల్చె నివ్విధిన్
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
సాముల సేవజేసితిని సాగిల మ్రొక్కితి సంతు కోసమై
రిప్లయితొలగించండినీమముతోడ దైవమును నిశ్చల భక్తితొ వేడ గల్గె నా
ధామమునందు పుత్రకుడు దారుణ మాతని తీరు చూడగన్
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
కామిత వస్తువెల్లయును గౌరిని గూరిచి నిష్ఠతో ధరన్
రిప్లయితొలగించండినోములునోచి పొందితిని,నూత్నములౌ దురవస్ధలెన్నియో
మామకు మారునున్ వలచి మంచిగ బెండ్లియాడగా
కామపిశాచియై పలువికారపు చేష్టల బొందితిన్ సుమా
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిపాముల మ్రొక్కి,పుట్ట లను పాలిడి, నక్తము లుండి, నేలపై
నీమముతో పరుండి ,పతి నీడనుఁ దప్పక సంచరించి నే
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో
భూమినిదొర్లు పాపడికి! బుద్ధి పురోగతి పొందు నాటికిన్!!
-కటకం వేంకటరామశర్మ.
(మూడవ పాదము-ఇవ్వబడిన సమస్య)
అరక యెద్దులఁనంగడి కమ్మి ,క్రొత్త
రిప్లయితొలగించండియినుప యంత్రము కొనితేగ ననుముచెడుచు
మాటి మాటికి పట్నంపు బాటఁబట్ట
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ!
పూజలనుచేయనిధులను పొందవచ్చు
రిప్లయితొలగించండిననెడి వార్తమదినినమ్మి యాశ తోడ
విడక చెప్పినవిధముగా వేగ నోము
నోచి పొందితి కష్టముల్ నూతనముగ